17, జనవరి 2012, మంగళవారం

చందమామలో కుందేలు;
;
బుద్ధదేవుడు ప్రాణికోటి పట్ల,
జంతువుల పట్ల అనురాగము కల మహామనీషి.
కావుననే ఆయన జంతువుల రూపములలో అవతారములను దాల్చాడు.
అలాగే ఒకసారి కుందేలుగా అవతారము పొందాడు.
అలాగ కుందేలు రూపంలో తారాడసాగాడు.
గౌతమబుద్ధుని వద్దకు ఆప్యాయతతో వచ్చిన జంతువులలో,
నాలుగవది కుందేలు.
అందుచేత చీనా కేలండర్ (Zodiac)లో
నాలుగవ స్థానము ఈ కుందేలుకు దక్కినది.
(చైనా దేశంలో కేలండరును ఈ పంథాలో నిర్మించుకున్నారు)
“చెవులపిల్లి”- అనే తమాషా పేరు కూడా దీనికి ఉన్నది.

***********************************************************,

బాల బాలికలారా!
మీరు ఆకాశంలోని చంద్రుని జాగ్రత్తగా పరిశీలిస్తూ చూడండి.
ఒకప్పుడు – చందమామ కేవలం తెల్లగా ఉండేవాడు.
ఆ ఇనబింబమునకు మధ్యలో
ఒక చిన్న జంతువు మీకు అగుపడుతుంది.
ఆ బుల్లి కుందేలమ్మ,
జాబిల్లి ఒడిలోనికి ఎలాగ వచ్చి చేరిందో తెలుసుకుందామా!!?

***********************************************************,

బుద్ధ జాతక కథలలో- మన హిందూ దేశ గాథలు,
ఈ క్రమంలో వ్యాప్తిలో కొన్ని ఉన్నవి.
బుద్ధుడు అనేక అవతారములను దాల్చాడు.
“సర్వ జీవాళి పట్ల ప్రేమ, అనునయ, కరుణలను కలిగి ఉండాలన్నదే “
ఆ మహనీయుని అభిమతము.
ఈ తాత్పర్యాంశాల గాథలు భారతదేశంలో ఉన్నవి.

***********************************************************,

బుద్ధుడు కుందేలుగా అవతారము పొందాడు.
అలాగ ఆతను కుందేలు రూపంలో తారాడసాగాడు.
బుద్ధుడు కోతి, నక్క లు భక్తితో అనుసరిస్తూండగా,
వాటితో కలిసి ప్రయాణిస్తూన్నాడు.
“బుద్ధ దేవుని సహనశీలతలో నిజాయితీ ఎంత ఉన్నది”?-
అనే అనుమానం ఒకసారి సుర రాజు ఇంద్రునికి కలిగింది.
బుద్ధ దేవుడు సుర రాజు సురేంద్రునికి ఒకసారి doubt కలిగింది.
ఇంకేముంది, బుర్రకు పుట్టిన బుద్ధి, doubt కలిగి
అట్లాంటి ఆలోచన వచ్చిందే తడవుగా బయలుదేరాడు.
చదువరీ! పాఠకులారా!
అంత గొప్ప ఇంద్రుడు ఏ వేషముతో,
ఎలాగ వచ్చేసాడని మీరు అనుకుంటున్నారు?
సురేంద్రుడు బిక్షం అడుక్కునే వాడి వేషంలో కదిలాడు.
శుష్కించి, నీరసంగా బిచ్చగాడు
“పక్షం దినాలుగా ఏమీ భుజించలేదు.
మాదా కబళం అనుగ్రహించండి”
అంటూ వేడుకున్నాడు.
బుద్ధుని వెంట ఉన్న జంతువులు
” యాచకునికి తినడానికి ఏమైనా తెస్తాము” అని తలచినవి,
అవి తలా ఒక దిక్కుకు వెళ్ళాయి.
అది మహేంద్రజాలము-
కాబట్టి వాటికి ఏమీ దొరకలేదు.
రిక్త హస్తాలతో డీలా పడి, వెనక్కు వచ్చినవి.
కుందేలు కూడా శూన్య హస్తాలతో మరలి వచ్చింది.
“ఈ బీదవానికి నేనే ఆహారము ఔతాను,
నా మాంసం తో ఆకలి తీరును” అనుకున్నది.
వెంటనే నిప్పు చేసి, కుందేలు ఆ మంటల్లో దూకింది.
దేవేంద్రుడు హఠాత్ ఘటనతో ఉలిక్కిపడ్డాడు.
“అనుకోకుండా, కుందేలు చేసిన ఇంతటి త్యాగము— ఔరా!”
నిర్ఘాంతపోయాడు ఇంద్రుడు.
“బుద్ధుని పరిసరములలో మెలిగే అల్ప ప్రాణులలో కూడా
ఎనలేని త్యాగసంపద ఉన్నది.
అలాంటప్పుడు ఈ నేత వ్యక్తిత్వము మరెంతటి ఔన్నత్యమైనదో కదా!”
లజ్జతో సురరాజు పశ్చాత్తప్తుడైనాడు.
“ఓ మిత్రమా! కుందేలూ ! నీ రూపమును ప్రజలందరూ
అనేక పర్యాయాలు వీక్షిస్తూ ఆనందిస్తారు.
ఈ నాటి నుండీ- నింగిలోని చందమామ ఒడిలో నీవు అగుపిస్తూ,
అందరినీ అలరింపజేస్తావు” అంటూ సురేంద్రుడు వరమొసగినాడు.
అప్పటినుండీ, గగనంలోని జాబిల్లి నడుమ కుందేలు కూడా -
అందముగా ఒదిగి జనులను ముగ్ధులను చేస్తూన్నది.

చందమామలో కుందేలు (Link: For KIDS; web magazine)
Published On Thursday,
December 29, 2011
By ADMIN. Under: విజ్ఞానం, వ్యాసాలు.

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...