24, ఆగస్టు 2010, మంగళవారం

చదరంగము - గుర్రము నడక
























"మన హిందూ దేశము చదరంగము ఆటకు పుట్టినిల్లు"
అని లోక విఖ్యాతమే కదా! " విజయ నగరము సంస్థానము ప్రభువు పూసపాటి ఆనంద గజపతి "చదరంగములో గుర్రము నడకను తేలిక
పద్ధతిలో సూత్రీకరణ చేయండి."
అని కొలువు కూటంలో అన్నారు.
వడ్లమాని కృష్ణమ్మ శాస్త్రి గారు పద్యాలను క్రీడా రంగంలో
అన్వయించి, చెప్ప గలిగిన మేధావి.

వడ్లమాని కృష్ణమ్మ శాస్త్రి గారు ఆస్థానములో ఒక పద్యాన్ని ఉల్లేఖించారు.
మహా రాజు కోరిక మీద నుడివిన ఆ పద్యం తలా తోకా లేకుండా ఉన్నది.

" అ తః ప్ర క్ర న న ప్త డ్గే ;


రే మా నే హ సు నో త దే ;


శి స్వా సి నా మ్య పుం ఖ స్వ ;


ఖా త ర త్ర ప వః ప వః || "

*******************************

1 30 9 20 3 24 11 26 ;

16 19 2 29 10 27 4 23 ;

31 8 29 10 27 4 23 ;

18 15 32 7 28 13 22 5

++++++++++++++++++++++++

“ అనేన తవ పుత్రస్య! ప్రసుప్తస్య వనాంతరే!
శిఖా మాక్రమ్య పాదేన! ఖడగ్గేనోప హతః శిరః.|| ”


క్రీడలోని అశ్వ గమనము - ప్రకారము అనుసరిస్తూ........
1, 2, 3, 11 - ..................
ఈ విధంగా ............
ఆ యా గడులలో అక్షరాలను పేర్చుకుంటూ చదివితే,
అర్ధవంతమైన శ్లోకం అవతరిస్తుంది.

{సుమారు 15 సంవత్సరాల క్రితము ఒక వీక్లీ లో ఈ ఆర్టికల్ ను
వేదుల పరిచయం చేసారు; వారికి కృతజ్ఞతలు.}


=================================

























[నేటి సంచలన వార్త ;;;;;;

Kapil Sibal apologises to Viswanathan Anand ;

విశ్వ నాథన్ ఆనంద్ చదరంగము క్రీడలో విజేతగా,
మన దేశం పక్షాన ఆడుతూ, Indiaకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు.
అతనికి అవార్డు ఇవ్వ బోతూ అనేక సందేహాలను లేవ నెత్తి,
సదరు నిర్వాహకులు ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యేట్లు చేస్తున్నారు.
కపిల్ సిబాల్ రంగంలోకి వచ్చి,
ఆనంద్ విశ్వ నాథ్ ఆనంద్ కు క్షమార్పణలు చెబుతున్నారు.
ఇదండీ సంగతి.]

23, ఆగస్టు 2010, సోమవారం

20 వేలు
























ఇవాళ ఆగస్టు 23, 2010 ;
నా బ్లాగు వ్యూయర్స్ (viewyers) కరెక్టుగా 20 వేలు;
అందుకే సంతోషాన్ని బంధు మిత్ర సపరివారముల మెంబర్సుకూ, బ్లాగ్మిత్రులకూ .............
ఇలాగ నా ఆనందాన్ని చెప్పటము.
వాస్తవానికి 1000 పోస్టులను నా ఈ “ కోణ మానిని బ్లాగు”లో ప్రచురించినప్పుడు,
ఇలాంటి టపా వేద్దామనీ, “వెయ్యి పోస్టులు” ఐతే, ఈ konamanini.blogను ఆపేద్దామనీ అనుకున్నాను.

మొత్తానికి, "ఇరవై సహస్ర పఠనా వీక్షణ క్షణముల " హర్ష ద్యుతీ సంపుటి;

కాబట్టి మరల మరల

చదువరులకూ,
బ్లాగుల సంధాన కర్తలైన

"జల్లెడ"

"కూడలి"

"హారము "

"మాలిక"

మరియు
నా మాతృభాషనూ, తెలుగు లిపినీ సునాయాసంగా
నా కన్నుల నిండా నింపుకొన గల భాగ్యానికి హేతువు ఐనట్టి
" లేఖిని" లిపి కర్తలకూ ఎన్ని సార్లు ధన్యవాదాలను చెప్పుకున్నా తక్కువే కదా!!!!!!!
అలాగే ఎన్నెన్నో అందమైన ఫొటోలు, బొమ్మలూ, పెయింటింగ్సూ లభ్యమౌతూన్న - గూగుల్ , యాహూ, మున్నగు సీమలకు వందన సహరములు!!!!!

{ పనిలో పనిగా _ ఈ ఫొటో లింకు _ లో
ఉన్న మేటరు కూడా కొంచెం intrest ఐనదే!
కాబట్టి వీలైతే చదవండి. }

16, ఆగస్టు 2010, సోమవారం

పక్షి ప్రేమికుడు Allan Octavian Hume

















అలెన్ ఆక్టేవియన్ హ్యూం (1829-1912);
"The Father of Indian Ornithology";
"the Pope of Indian ornithology."[2]గా కీర్తి పొందిన వ్యక్తి.

1849 నుండీ బ్రిటీష్ పాలిత ఇండియాలో ఉద్యోగాలు చేసాడు.
మెడిసిన్ చదివిన ఎల్లెన్ ఐ.పి.ఎస్.అధికారిగా పనిచేసాడు.
1857లో సిపాయి మ్యూటినీ ఆతడు నివసిస్తూన్న ఎటావా కు దగ్గరలోనే జరిగింది.
"భారతీయులను విద్యావంతులుగా మార్చితే, తిరుగుబాట్లు ఉండవని" అతడి అభిప్రాయం.

1859 లో ఇండియన్ స్టూడెంట్సుకు స్కాలర్ షిప్ లను ప్రవేశ పెట్టిన ఘనత ఆతనిదే!
అలాగే 181 స్కూళ్ళను బాల నేరస్థుల కోసం ఏర్పరిచాడు కూడా!
Juvenile Homesకు నాంది పలికాడు Allan Octavian Hume.

1882 వరకు British Indiaలో వివిధ పదవుల్లో పనిచేసిన హ్యూం,
ముఖ్యంగా పక్షి ప్రేమికుడు.
ఆసియాలోనే మొదటి పక్షి శాస్త్రాన్నినిర్మించాడని చెప్పవచ్చును.
పాతిక సంవత్సరాలలో భారతదేశములోని పక్షుల వివరాలను సేకరించడానికై,
తన స్వంత సంపాదన నుండి వేల డబ్బును ఖర్చు పెట్టాడు.
India, Sri Lanka, Burma దేశాలలో -
క్రీడా పక్షుల గురించి చేసిన పరిశోధనలు అమూల్యమైనవి.
65 వేల bird feathers, nests, 19 వేల గుడ్లను సేకరించాడు.
ఈ బృహత్కార్యం కోసం మనుషులను నియమించి,
తన ఆదాయం నుండి అనేక పౌండ్లు వెచ్చించాడు.
ఇండియాలోని ప్రథమ ప్రకృతి విజ్ఞాన సంబంధమైన పత్రిక,
అతని ( 1872 లో )"The Stray Feathers"అని చెప్ప వచ్చును.
1873 లో "Nests and Eggs of Indian Birds",
1879 లో The Game Birds of India"మున్నగు గ్రంధాలను వెలువరించాడు.
అలెన్ హ్యూం సేకరణలను సింలాలో
"Rothney Casle"ను నిర్మించుకుని భద్రపరచాడు.
ఐతే ఆతని కృషికి విఘాతం కలిగింది. 1884 లో కొందరు మత్సరగ్రస్తులు,
అసూయతో Shimla లోని అతని స్వప్న సౌధాన్ని దోచుకున్నారు.
కొన్ని సేకరణలు వర్షపాతాల వలన దెబ్బతిన్నాయి.
82 వేల పక్షులలో, కొసకు 76 వేల విహంగాలు మాత్రమే మిగిలాయి.
ఎంతో మనోవేదన పడిన హ్యూం
తతిమ్మా సేకరణలను ""British Museum"కు అప్పజెప్పాడు.
అలెన్ ఆక్టేవియస్ హ్యూం - భారతీయ భోజన రుచులను ఎంతో ఇష్టపడేవాడు.
హ్యూం బైబిల్ ని, అలాగే భగవద్గీతను కూడా శ్రద్ధా భక్తులతో ఇష్టంగా చదివేవాడు.
భారతీయులకు ఆప్యాయమైన స్నేహితులు.
ఎందరో ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య ఆకాంక్షావాదులు బాలగంగాధర
తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, దాదా
భాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా మున్నగు వారు ఆతని ఆప్తమిత్ర
వర్గంలో ఉన్నారు.

Share My Feelings


By kadambari piduri,
Aug 1 2010 7:11PM

14, ఆగస్టు 2010, శనివారం

దీన్ని కూడా ఇచ్చేయాలా?


















మహా వీర్ త్యాగి ( 1899 – 1980 ) స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొని,
చెరసాల పాలై, అనేక కష్టాలను అనుభవించిన దేశ భక్తుడు.
ఎన్నో రాజకీయ పదవులను సమర్థవంతంగా నిర్వహించి,
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రశంసలను పొందాడు.
స్వతంత్ర భారతావనిలో పార్లమెంటులో స్థానాన్ని ఆర్జించి,
భరత మాతకు తన వంతు సేవలను అందించుటలో ఆయన నిర్విరామ కృషి పేర్కొన దగినది.
మాతృ భూమి పట్ల ఎన లేని ప్రేమ, ఉప్పొంగే మమతానురాగాలు,
అనేక ఉద్విగ్న భరిత సంభాషణలకు ఆలవాలం ఔతూండేవి.

1962 లోని Sino-Indian Warమన సరిహద్దులలో రేపిన అలజడి చేదు జ్ఞాపకం.
(జవహర్ లాల్ నెహ్రూ ఈ మనో క్షోభతో 1964లో పరమ పదించారు.).
చైనా హిమాలయాలలో లడఖ్, మున్నగు ప్రాంతాలను దౌర్జన్యంగా ఆక్రమించింది.

నాటి ప్రధాన మంత్రి (14 November 1889–27 May 1964 ) చాచా నెహ్రూ -
"హఠాత్తుగా ఎదురైన యుద్ధం వలన, “మనము ఏ మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకో లేద”ని
అన్ని వైపుల నుండీ విమర్శనాస్త్రాలు తాకాయి.
ఆ ఇబ్బందులలో అందరికీ సమాధానం చెప్పుకొన వలసిన దుస్థితి ఆయనది!
తల వంపులుగా సతమతమౌతూన్నఆ పరిస్తితులలో
అందరినీ సమాధాన పరచటం అనేది తలకు మించిన భారమే నెహ్రూది.
“ చైనా ఆక్రమించిన ప్రంతాలు ఎందుకూ పనికి రాని భూమే!
అక్కడ గడ్డి పరక కూడా మొలవని హిమాలయ పర్వత ప్రాంతాలలోని సీమలు అవి.”

( "Not a blade of grass grows in Aksai Chin") "

రాజీ ధోరణిలో చెప్పుకున్నా ఆ జవాబు అటు ప్రతిపక్షాలకే కాదు,
ఇటు స్వ పార్టీ కాంగ్రెస్ వారిలోనూ తిరస్కారం ఎదురంది.
1962-64 Chairman of the Public Accounts Committee of Parliament గా
మహా వీర్ త్యాగి ఉన్నారు.
జవహర్ లాల్ నెహ్రూజీ అంటేMahavir Tyagi కి వాత్సల్యం ఉన్నది.
అందు చేత కొంత చనువుతో చటుక్కున ఇలా అన్నారు

“అలాగైతే నెహ్రూజీ! !......” అంటూ తన బట్ట తలను చూపిస్తూ మళ్ళీ అడిగారు
“ఇక్కడ ( అనగా త్యాగి బట్ట తల పై) ఏదీ పెరగడం లేదు......
మరైతే ......... దీనిని నరికేయాలా,
లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైనా దీన్ని ఇచ్చేసేయాలని అంటారా!???”
( "Nothing grows here ............
should it be cut off or given away to somebody else?")
అంత సీరియస్ కండిషన్లలో కూడా - వాడిగా వేడిగా సాగుతూన్న వాదోపవాదాలలో ,
పార్లమెంటు హాలులో నవ్వులు ప్రతిధ్వనించాయి.

11, ఆగస్టు 2010, బుధవారం

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!












...............
లోక మందిరమునకు పునాది రూపాన్ని
అన్వేషించ యత్నించిన భావుకుడు మన దేవుల పల్లి క్రిష్ణ శాస్త్రి.

ఆ అన్వేషణా భారంతో ఎంతగా డస్సి పోయాడో కదా
పాపం! ఆ భావ కవీంద్రుడు.
"భావనా" గవేషణా లాలిత్య లయలతో
సాగిన ఆయన గీతం ఇది.

( లైబ్రరీలలో 4 నెలల పాటు గాలించీ ........ గాలించీ .......
హమ్మయ్య! ఇప్పటికి దొరికింది నాకు, ఈ పాట! )
పాఠక మిత్రులకై ఇదిగో! స్వీకరించండి! )

****************************************

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!
ప్రాంగణమ్మున గంట పలుక లేదోయీ!
దివ్యశంఖము గొంతు తెరవ లేదోయి
పూజారి గుడి నుండి పోవ లేదోయి!

చిత్ర చిత్రపు పూలు – చైత్ర మాసపు పూలు
ఊరూరా, ఇంటింట ఊరకే పూచేయి -
శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు
పూజారి కొకటేని పువ్వు లేదోయి

వాడ వాడల వాడె, జాడలన్నిట వాడె
వీడు వీడున వాడె, వీటి ముంగిట వాడె
శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు
పూజారి వానికై పొంచి ఉన్నాడోయి

************************************

SithilaalayammulO SivuDu lEDOyi
praaMgaNammuna gaMTa paluka lEdOyI!
divyaSaMKamu goMtu terava lEdOyi
pUjAri guDi nuMDi pOva lEdOyi!

chitra chitrapu pUlu – chaitra mAsapu pUlu
UrUrA, iMTiMTa UrakE pUchEyi -
SithilaalayammulO Sila kedurugaa kunuku
pUjAri kokaTEni puvvu lEdOyi

vADa vADala vADe, jADalanniTa vADe
vIDu vIDuna vADe, vITi muMgiTa vADe
SithilAlayammulO Sila kedurugaa kunuku
pUjAri vaanikai poMchi unnaaDOyi

***************************************

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
ఎంతో పట్టుదలతో ఈ కావ్య మల్లికా సుమ హారాలను -
1965 వ సంవత్సరంలో పుస్తక రూపంలోకి తెచ్చారు.

ఓరియంట్ లాఙ్మన్ లిమిటెడ్
3-6-272,
Hyderabad - 29 ;

వారు అచ్చు వేసారు.

7, ఆగస్టు 2010, శనివారం

Montague మెచ్చిన టాగూర్ పాటలు

























లండన్ లో “చిత్ర”(“చిత్రాంగద) అనే భారతీయ నాటకాన్ని ప్రదర్శించారు.
అచ్చట మాంటేగ్(Mr. Montagu/Montague)ఈ సంఘటనను వివరించాడు.
ఆ నాటి - State for India కు జనరల్ సెక్రటరీగా ఉన్న మాంటేగ్ తెలిపిన వివరములు ఇవి.
ఒక రోజు రాత్రి వేళలో భారత దేశంలో అడవిలో గుండా మాంటేగ్ వెళ్తున్నాడు.
అడవిలో గుర్రముపై స్వారీ చేస్తూ అతడు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు.
అక్కడ చలి మంట కాచుకుంటూ,మువ్వురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.
మాంటేగ్ మార్గాయాసముతో బాగా డస్సి పోయి ఉన్నాడు.
మనుష్యుల సముదాయాన్ని చూడగానే అతనికి ప్రాణం లేచి వచ్చినది.
గుర్రం కూడా అలిసి ఉన్నది. తన తురగాన్ని ఆపి నిలిపి, వారి వద్దకు వెళ్ళాడు.
నెగడు చుట్టూ కూర్చున్న వారిని చేరాడు మాంటేగ్.
వాళ్ళందరూ చిరిగిన దుస్తులతో బీదరికం మూర్తీభవించినట్లుగా ఉన్నారు.
మాంటేగ్ వారి చెంతకు చేరి ఆసీనుడయ్యాడు.
ఆ గ్రూపులోని నేత (Leader) పాట పాడుతున్నాడు,
తక్కిన వారు ఆతనిని అనుసరిస్తూ,
ఆ పాటను అందుకుని రిపీట్ చేస్తూ గానం చేస్తున్నారు.
("breadth of India.") ఆ సముదాయంలోని
ఒక పిల్ల వాడు మిగిలిన వారి కంటే బాగా పాడుతున్నాడు.
ఆ అబ్బాయి గళములో పదాలూ, సంగీతమూ – తతిమ్మా వారి కన్నా ఎక్కువ శ్రావ్యంగా చిందులు వేస్తున్నవి.

మాంటేగ్ వారిని ప్రశ్నించాడు” ఈ songకు సంగీతాన్ని ఎవరు సమకూర్చారు?”

ఆ బాలుడు, స్నేహితుల ముక్త కంఠంతో అన్నారు
" పాట కట్టిన వాళ్ళు ఎవరో మాకు తెలీదు గానీ మాకు నచ్చింది కాబట్టి పాడుకుంటున్నాము.”

“ చిత్ర " అనే ఈ Dramaలోని గీతములు అవి.
మాంటేగ్ ఆ శ్రావ్యమైన గీతాలను విని మంత్ర ముగ్ధుడు ఐనాడు.
"రవీంద్ర నాథ్ టాగూరు రచనలు బెంగాల్ ప్రజలను, ప్రపంచాన్నీ
అంత గొప్పగా ప్రభావితం చేసాయి."
అని ఆ State for India జనరల్ సెక్రటరీకి అతనికి బోధపడింది.

" శాంతి నికేతన్ వ్యవస్థాపకుడు,
గీతాంజలి రచయిత,
నోబుల్ బహుమతి విజేత,రవీంద్ర నాథ టాగూర్ వర్థంతి "

{ Montague మెచ్చిన టాగూర్ పాటలు ;;;;;;; }

2, ఆగస్టు 2010, సోమవారం

గిరిజన వనిత చిత్రకళ


















==========
వంగారి మాతై అనే కెన్యా దేశ వనిత
"the Green Belt Movement"ను స్థాపించినది.
(Wangari Muta Maathai (born April 1, 1940 ) ,
వృక్ష సంపద పెంపుదలకొరకు అత్యద్భుతమైన కృషి చేసినది.
ఆమె శ్రమకు గుర్తింపు కలిగినది,
ఫలితంగా ప్రపంచ స్థాయిలో అనేక అవార్డులూ,
నోబుల్ బహుమతి మున్నగునవి ఆమెను వరించినవి.

***************************************
మన దేశంలో - తరు సంపద పట్ల, వన వాసీల చిత్ర కళల పట్ల
ఒక గిరిజన యువతికి ఎన లేని మక్కువ ఇలాంటి వార్తా విశేషమే!

మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని గిరిజన యువతి భూరీభాయ్ tribal artist,
ఆ భిల్లు జాతి వనిత పేరు హఠాత్తుగా వార్తా పేపర్లలో ప్రధాన శీర్షికలలో చోటు ఆర్జించింది.
ఆదివాసీ చిత్రకళ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.
అడవి పుత్రులు ‘ తమ తమ ఇళ్ళకు , గోడలకు,మట్టితోనూ, పేడతోనూ అలుకుతారు.
ఆ మట్టి లేపనాలు ఆరాక, పిండి , ఆకు పసరు మున్నగు వానితో
లతలు, పూవులు, దేవతల బొమ్మలు, జంతువులు, పక్షులు, ప్రకృతి బొమ్మలను చిత్రిస్తారు.
అవి లెక్క ప్రకారం శ్రద్ద్ధాసక్తులతో తీర్చి దిద్దిన రంగ వల్లులకు మల్లె చూపరుల చూపులను త్రిపుకోనియ్యవు.

భూరీ భాయ్ రమా రమిగా 30 ఏళ్ళ నుండీ –
తన ఇంటిని ఈ బొమ్మలతో అలంకరించుకుంటూన్నది.
గృహ సీమా పరిధులనుండి బయటి ప్రపంచానికి
ఈ వన చిత్ర కళ పరిచయం అయ్యినది.
భోపాల్ లోని భరత్ భవన్ లో
1980 వ సంవత్సరంలో ఆమె చిత్రాలు ప్రదర్శన చేయ బడినవి.

ఇందుకు కృషి చేసిన వ్యక్తి జగదీష్ స్వామి నాథన్ .
అతను రూపాంకర్ ఆర్ట్ సెంటర్
(under the tutelage of Jagdish Swaminathan, the art centre Roopanker ) లో
ఈ ఎగ్జిబిషన్ జరిగిందీ అంటే అందుకు జగదీష్ స్వామి నాథన్ కృషి ఎంతైనా ఉన్నదనే చెప్పుకోవాలి.
భూరీ భాయ్ “ కుడ్య చిత్ర కళ” ,
పేపర్ మీదకూ, కాన్వాస్ మీదకూ చేర గలిగినది.
ఆమె హస్త కళా వైదుష్యము లోకానికి వెల్లడి కావడానికి ,
క్రొత్తగా నేర్చుకున్న ఇలాంటి మెళుకువలు – చాలా దోహద పడినవి.
“తొలుత నేను ఆది వాసీ కళా కారిణిని ;
canvas ,paper ల మీద water, oil, acrylic colours తో ఇప్పుడు బొమ్మలను సునాయాసంగా వేయ గలుగుతున్నాను;
ఐనప్పటికీ సాంప్రదాయక, ప్రాచీన, నైతిక మార్గాల బాటలలోనే నా కళలు పయనిస్తాయి.” అని అన్నది.
ఆమె అనుసరిస్తూన్న రేఖా చిత్రముల రీతి పేరు ('parampara pithora' canvases )"పిథోరా పరంపర".
దేవతల పెళ్ళిళ్ళు , వాని వలన ఇహ లోక , సుర లోక సంబంధమైన
ఆత్మానంద , అతీత భావనా ఆనంద అనుభూతులను పొందడమే ఈ కళా
మార్గము పరమార్ధము.
('parampara pithora' canvases - an art
form depicting joyous life on heaven and earth woven around
the wedding of deities Pithoro and Pithori - incomplete
because 'as a woman, I have no right to draw both heaven and
earth. A complete pithora fresco is the sole right of man.')

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

జభువా జిల్లాలోని అటవీ ప్రాంతములలో నివసిస్తూన్న కొండ జాతి వాళ్ళు
పూజించే వన దేవత పేరు(Titki Mata , who protects the forests of
Jhabua district in Madhya Pradesh ) తిట్కీ మాత. ( 'I was the
first tribal artist to paint with a brush on canvas and paper with
water, oil and acrylic colours. But I cannot let go of ethnic
traditions,' Bhuri Bai said.)
" నేను నా వన దేవత తిట్కీ మాతను ఆరాధిస్తాను. ఆ దేవత రూపాలను
వేస్తూంటాను, స్త్రీ ప్రకృతిని పరి రక్షించే శక్తి స్వరూపిణి కదా! నేను – ప్రకృతిని,
భిల్లు తెగలు కొలిచే దేవుళ్ళును, దేవతలనూ వేస్తూంటాను. అనేక
యుగాలకు పూర్వం నుంచీ ప్రాచీన నమ్మకములతోనూ, పురాతన
విశ్వాసాలతో మిళితమైన మా ఆధ్యాత్మిక చింతనలతోనూ మా bhil arts
పెన వేసున్నాయి. కాబట్టి నా పెయింటింగ్సు కూడా అలాటి భావాలనే
ప్రతిబింబిస్తూంటాయి.” అని వివరించింది ఆమె.
సొగసైన (ఆధునికుల దృష్టిలో “ superstitions ) విశ్వాసాలతో ముడిపడి
ఉన్న “ భిల్ల మహిళ భూరీ భాయ్ ద్వారా విదేశీయులకు కూడా India
లోని ఒకానొక మారుమూల కారడవిలోని కొండ జాతి వారి చిత్ర లేఖన కళ
సుపరిచితము ఔతూన్నది. ఇది ముదావహమే కదా!

Share My Feelings


By kadambari piduri,
May 9 2010 6:51AM

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...