తెలుగు దనానికి మళ్ళీ శ్రోతల వీనులను పర్ణ కుటీరములుగా మలచి,కమ్మనైన భావాలకు ఛత్రములుగా తన గీతములను నిలిపినవేటూరి సుందర రామ మూర్తికి నివాళి! ,***************************************వేటూరి సుందర రామ్మూర్తి సినీ రంగంలో"పాటల రచయిత"గా కాలూని, లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు.గీత రచయితగా అనేక అవకాశాలుఇబ్బడి ముబ్బడిగా వేటూరికి రా సాగాయి."మనసు కవి"గా సుప్రసిద్ధులు ఐనఆత్రేయ గారికి అవకాశాలు సన్నగిల్లాయి.==================================దీపావళి పండుగ వస్తూన్నది.అంతటా హడావుడి సందడిగా ఉన్నది.మార్కెట్టులో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు.పరస్పరమూ పలకరించుకున్నారు.ఆత్రేయ కావలసిన బాణసంచా కొనేసి,నిండు సంచీతో ఇంటిముఖం పట్టారు."టపా కాయలు కొనేసారా?" స్నేహ పూర్వకముగాఅడిగారు వేటూరి సుందర రామ్మూర్తి."నా 'పాట కాయ'లన్నీ మీకే వస్తున్నాయి గదా!అందుకే ఊరికే ఖాళీగా ఉండట మెందుకు లెమ్మని,ఇదిగోండి!ఇలాగ 'టపా కాయలు' తెస్తున్నాను."అన్నారు ఆత్రేయ స్నేహ పూర్వకంగానే ,================================="ఆత్రేయ పాటలలో ఆత్మ ఉంటుంది.నా పాటలలో భావాలకు మాటల మేళవింపు మాత్రమే ఉంటుంది.ఆత్రేయ గారు నా కన్న గొప్ప గేయ రచయిత." అన్నారు వేటూరి.తమ సమ కాలీనుల రచనలను మెచ్చుకొన గల సహృదయత కల వాడు వేటూరి.====================================
By kadambari piduri, Apr 17 2009 5:16PM
5 కామెంట్‌లు:
బాగుంది.
Kusuma Kumari గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Thank you, కొత్త పాళీ గారూ!
కృతజ్ఞతలు భావన గారూ!
హారం నిర్వాహకులకు కృతజ్ఞతలు.
మీరు నిచ్చిన లింకులను follow అవడానికి ప్రయత్నిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి