ఈ సినిమాలో కృష్ణ, జమున, జానకి, నాగ భూషణం, ధూళిపాళ, ఇత్యాది తారాగణం ఉన్నారు.
సంఘమునకు పునాది కుటుంబము. కుటుంబీకులు అందరూ క్రమశిక్షణతో, ఏక తాటిపై నడవాలి;
సామరస్యంగా, సౌభ్రాతృత్వ, అనురాగాలకు అగ్రాసనం ఇవ్వాలి;
నీతి నియమాలకు జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యత
పూలదండలో దారమువలె అంతర్లీనంగా ఉండేటట్లుగా
వెండి తెరపై జరిగిన చిత్రీకరణ, దర్శకుని ఉత్తమ అభిరుచికి, ప్రతిభకు అద్దం పడుతున్నది.
ఆ చలన చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాట
“ చాలులే. జాబిలి కూనా!........"
_____________________________
+++++++++++++++++++++++++++
( పల్లవి ) ;;;;;
_______
చాలులే నిదరపో జాబిలి కూనా!
ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా
ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా ||చాలులే||
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా ,
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా
1. అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా
ఓసీ! వేలెడేసి లేవు బోసి నవ్వుల దానా || అంత ||
మూసే నీ కనుల-
ఎటుల పూసేనే నిదర- అదర- జాబిలి కూనా!
ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా
ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా
2. అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే
కానీ,చిట్టి తమ్ముడొకడు నీ తొట్టి లోకి రానీ !
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే
కానీ,చిట్టి తమ్ముడొకడు నీ తొట్టి లోకి రానీ !
( జమున);;;;
_________
ఔరా ! కోరికలు, కలలు -
తీరా నిజమైతే,
ఐతే జాబిలి కూనా!
ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా
ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా
++++++++++++++++++++++++++++++++++++++++
ఈ గీతాన్ని మొదట పి.సుశీల పాడింది.
కానీ, ఆ పాటకు జానకి చేత గానం చేయిస్తే, ఇంకా బావుంటుంది.” అని అనుకున్నారు.
మర్నాడే ఎస్. జానకిని పిలిచారు.
ఎస్.జానకి గాత్ర మాధుర్యంతో ఆ పాట మరింత వీనుల విందుగ తయారైనది.
&&&&&&&&&&&&&&&&&&&&
“ భావ కవీంద్రా! క్రిష్ణశాస్త్రి గారూ!
మీ గేయానికి ఇద్దరి గొంతులు అవసరం అయ్యాయి కదండీ!”
అన్నారు “
వెంటనే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక పేపరుపై గబగబా ఏదో రాస్తున్నారు;
కారణం – Throat కు వ్యాధి .
కేన్సరు కారణంగా గళములోని స్వర పేటికను, డాక్టర్లు తొలగించారు,
ఆయన మూగవారు అయ్యారు.
భావకవి కలం కాగితంపై చిలికిన ముత్యాలు ఇవిగో !....
“ ఒక మూగపాటకు
ఎన్ని మంచి గొంతులు !! “
సున్నిత మనస్కులైన కవుల వేదనకు కూడా
సుందర అక్షర మాలా పుష్పాలుగా విరబూస్తూంటాయి కదా!
“శిధిలాలయమ్ములో శివుడు లేడోయీ!
ప్రాంగణమ్మున గంట మోగ లేదోయీ!!!.....”
ఈ లలిత గీతములోని లాలిత్యాన్ని వర్ణించడానికి
ఎన్ని వివరణలు సరిపోతాయి?
జమున, క్రిష్ణల అభినయముతో చిత్రించ బడిన
ఆ పాట ఇదిగో! చదవండి;
ఆనక శ్రవ్య యంత్రాల ద్వారా ఆలకించండి.
&&&&&&&&&&&&&&&&&&&&&
నాకు ఎంతో ఇష్టమైన ఈ దేశ భక్తి గీతమును,ఇక్కడ పొందుపరుస్తున్నాను .
భావ లాలిత్యమును సంస్కృత పద భూయిష్టమైన గీతంలో చిత్రించడములో,
భావ కవి కృష్ణ శాస్త్రి అసమాన ప్రతిభను ఈ పాట ప్రతిబింబిస్తూన్నది.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
( పల్లవి )
జయ జయ జయ ప్రియ
భారత జనయిత్రీ - దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి
1.జయ జయ సస్యామల
సు - శ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా
చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయ సయ
లాక్షారుణ పద యుగళా
2.జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరి తోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణా
=========================
Pramukhula Haasyam
ఒకే పాటకు ఇద్దరు
By kadambari piduri, May 1 2010 12:59AM
3 కామెంట్‌లు:
ee paata naku kudaa chalaa estam naa chinnappudu baaga paadedaanni
ఈ చిత్రంలోని ఈ పాటతో పాటు మరో రెండు పాటలు నాకెంతో ఇష్టం.
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
పాతాళ గంగమ్మా రా రా రా
ఎన్నాళ్ళయ్యిందండీ శిధిలాయంలో శివుడు లేడోయి ప్రాంగణమ్మున గంట మోగ లేదోయి.. పూజారి కొకటైన పూయలేదోయి... చిత్ర చిత్రపు పూలు చైత్ర మాసపు పూలు ఇంటింట వూరూర వూరకే పూచాయి.. పూజారి కొకటైన పూయలేదోయి.. రెండో చరణం ఎవరికైనా గుర్తు వుంటే చెప్పరా ప్లీజ్. ఆ పాట ఎక్కడైనా వినటానికి దొరుకుతుందా? నాకు అత్యంత ఇష్టమైన పాటలలో అది ఒకటీ. నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నా ఇప్పటీకి అలానే గుర్తు వుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి