30, మే 2010, ఆదివారం

శకుంతలా దేవి - గణితశాస్త్ర విదుషీమణి

“Human Computer” అని ప్రసిద్ధికెక్కిన గణిత శాస్త్ర మాయా జాలము – శకుంతలా దేవి.
Maths whiz శకుంతలా దేవి మణిపాల్ యూనివర్సిటీలో,
దుబాయ్ కాంపస్ (Dubai campus) లెక్కల గురించి,
వానిలోని సులువు మార్గాలను గురించి ఉపన్యసిస్తూన్నారు.
గణిత ప్రజ్ఞా నిధి ఐన ఆమె వాగ్ధారలో
ప్రేక్షకులు యావన్మందీ లీనమైనారు .
ఆ demonstration లో ఇటీవల తనకు ఎదురైన అనుభవాలను ఆమె ఇలాగ వివరించారు.
“నేను New Jersy కి వెళ్ళాను. అక్కడ ఒక High School లో గణితము యొక్క ప్రాముఖ్యతను చెప్ప సాగాను. ఆ పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్ధులు ఉన్నారు.
వారిని మీలో ఎంత మందికి లెక్కలు అంటే ఇష్టము?“ అని అడిగాను

ఆ ప్రశ్నకు ఒక్క వ్యక్తి మాత్రమే చెయ్యి ఎత్తారు, ఆ ఒక్క మనిషి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. "
శకుంతలాదేవి అక్కడి స్టూడెంట్సును చైతన్య పరిచేటందుకు ఇలాగ అన్నారు
“ఇక్కడ ఉన్న students group మరీ అంత నిరుత్సాహమయంగా ఉండరని అనిపిస్తూన్నది.”
అప్పటికీ ........అచ్చట సభికులలో ఉన్న faculty member తన చెయ్యిని పైకి ఎత్త లేదు;
ఇదీ కొస మెరుపు!
=================================
శకుంతలాదేవి 1939 నవంబర్ 4 వ తేదీన బెంగుళూరు లో జన్మించి0ది.
ఆమె తండ్రి ”Brahmin circus" లో trapeze and tightrope and a human cannonball గా ప్రదర్శనలను ఇస్తూండేవారు.

ఆమె మూడవ ఏటనే, అనుకోకుండా లెక్కలలో శకుంతలా దేవి మేధా నైపుణ్యాన్ని
ఆమె తండ్రి అనుకోకుండా గుర్తించాడు. ప్రాధమిక దశలో తాతయ్య వద్ద mathematics చిట్కాలను నేర్చుకున్నది.

ఐదేళ్ళ వయసుకే complex mental arithhmeic లో ఎక్స్ పర్ట్ అయినది.
6 సంవత్సరాలప్పుడు" మైసూర్ యూనివర్సిటీ"లో ఆమె talents ను వేదికపై చూపినది.
8 ఏళ్ళకి _ " అన్నామలై యూనివర్సిటీ "వారి ఆహ్వానాన్ని పొందగలిగినది.
అత్యంత క్లిష్టమైన లెక్కలకు - చిటికెలో సమాధానాలను చెప్పగలగడము భగవద్దత్తమైన వరముగా శకుంతలా దేవికి లభించినది.
ఆమె ఎన్నో Workshops ను నిర్వహిస్తూ, ప్రజలలో గణిత శాస్ర అభిరుచిని పెంపొందించే కృషిని అసిధారా వ్రతంగా కొన సాగించారు.
లెక్కలు నేర్చుకోవడానికి సులభ మార్గాలను, కిటుకులను బోధపరుస్తూ
అనేక గ్రంధాలను రచించారు.
దుబాయిలోని కర్ణాటక సంఘము వారు ఆమె ప్రదర్శనను నిర్వహించినప్పుడు,
ఆసక్తి గల వారు సంప్రదించుటకై ఇచ్చిన కాంటాక్ట్ నెంబరు: +050 6599375 (Tantry)
==================================
January 1977 సంవత్సరములో , డల్లాస్ లోని దక్షిణ మెథడిస్టు విశ్వవిద్యాలయములో శకుంతల ఇచ్చిన demanstration వార్తలో ఆకర్షణీయమైన అంశమైనది.

“మానవుల మేధా సంపత్తి ముందు కంప్యూటర్లు అతి కొలది మాత్రమువే!”
అని ఆమె ప్రగాఢ విశ్వాసము.
ఆమె మేధా శక్తికి జనులు జేజేలు పలికారు.
అనేక ప్రదర్శనలను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసారు
* In 1977, Devi mentally calculated the 23rd root of a 201 digit number.
* On June 18, 1980, Devi gave the product of two, 13-digit figures in 28 seconds.
* She multiplied 7,686,369,774,870 with 2,465,099,745,779.
* The numbers were picked at random by the Computer Department of Imperial College, London. Her correct answer –18,947,668,177,995,426,462,773,730 –

లండన్ లో ఈ సంఘటన ద్వారా , 1995 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనికిశకుంతలా దేవి పేరు చేరి, భారతదేశానికే గర్వ కారణమైనది.
By kadambari piduri, Apr 29 2010 12:38AM

24, మే 2010, సోమవారం

వేటూరి ,ఆత్రేయల ఆట పాట కాయలు







తెలుగు దనానికి మళ్ళీ శ్రోతల వీనులను పర్ణ కుటీరములుగా మలచి,
కమ్మనైన భావాలకు ఛత్రములుగా తన గీతములను నిలిపిన
వేటూరి సుందర రామ మూర్తికి నివాళి! ,
***************************************

వేటూరి సుందర రామ్మూర్తి సినీ రంగంలో
"పాటల రచయిత"గా కాలూని, లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు.
గీత రచయితగా అనేక అవకాశాలు
ఇబ్బడి ముబ్బడిగా వేటూరికి రా సాగాయి.
"మనసు కవి"గా సుప్రసిద్ధులు ఐన
ఆత్రేయ గారికి అవకాశాలు సన్నగిల్లాయి.

==================================

దీపావళి పండుగ వస్తూన్నది.
అంతటా హడావుడి సందడిగా ఉన్నది.
మార్కెట్టులో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు.
పరస్పరమూ పలకరించుకున్నారు.
ఆత్రేయ కావలసిన బాణసంచా కొనేసి,
నిండు సంచీతో ఇంటిముఖం పట్టారు.

"టపా కాయలు కొనేసారా?" స్నేహ పూర్వకముగా
అడిగారు వేటూరి సుందర రామ్మూర్తి.

"నా 'పాట కాయ'లన్నీ మీకే వస్తున్నాయి గదా!
అందుకే ఊరికే ఖాళీగా ఉండట మెందుకు లెమ్మని,
ఇదిగోండి!ఇలాగ 'టపా కాయలు' తెస్తున్నాను."

అన్నారు ఆత్రేయ స్నేహ పూర్వకంగానే ,

=================================

"ఆత్రేయ పాటలలో ఆత్మ ఉంటుంది.
నా పాటలలో భావాలకు మాటల మేళవింపు మాత్రమే ఉంటుంది.
ఆత్రేయ గారు నా కన్న గొప్ప గేయ రచయిత." అన్నారు వేటూరి.

తమ సమ కాలీనుల రచనలను మెచ్చుకొన గల సహృదయత కల వాడు వేటూరి.


====================================
By kadambari piduri, Apr 17 2009 5:16PM

16, మే 2010, ఆదివారం

పెంకి పెళ్ళాం





















ఈ ఫొటో చూస్తూంటే
నాకు ఈ హాస్య, చమత్కారమైన శ్లోకం గుర్తుకు వచ్చింది.
"అనేక శత భాండాని - భిన్నాని మమ మస్తకే
అహో! చితశ్నయ నారీ - భాండ మూల్యం న యాచతే! "

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

గయ్యళి భార్య - కోపం వచ్చినప్పుడు
తన భర్త నెత్తి మీదికి కుండలను విసిరేది.

ఐనప్పటికీ అతనికి తన ముద్దుల భార్య అంటే - ఎంతో ప్రేమ.
కనుకనే జీవితంతో సమాధాన పడ్డాడు అతను.

అందుకనే ఇలాగ సమాధానం చెప్పాడు

"నా తల మీద అనేక భాండాలను పగలగొట్టింది ఆమె!
అహో!అంత కోపంలోనూ ............
పగిలిన కుండలకు
పరిహారమును, విలువను చెల్లించమని అడగలేదు, చూసారా!
నా సతి ఎంత మంచిదో!"


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

11, మే 2010, మంగళవారం

ఒకే పాటకు ఇద్దరు

ఉండమ్మా బొట్టు పెడతా” సినిమా 1968 లో release ఐనది.
ఈ సినిమాలో కృష్ణ, జమున, జానకి, నాగ భూషణం, ధూళిపాళ, ఇత్యాది తారాగణం ఉన్నారు.
సంఘమునకు పునాది కుటుంబము. కుటుంబీకులు అందరూ క్రమశిక్షణతో, ఏక తాటిపై నడవాలి;
సామరస్యంగా, సౌభ్రాతృత్వ, అనురాగాలకు అగ్రాసనం ఇవ్వాలి;
నీతి నియమాలకు జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యత
పూలదండలో దారమువలె అంతర్లీనంగా ఉండేటట్లుగా
వెండి తెరపై జరిగిన చిత్రీకరణ, దర్శకుని ఉత్తమ అభిరుచికి, ప్రతిభకు అద్దం పడుతున్నది.

ఆ చలన చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాట

“ చాలులే. జాబిలి కూనా!........"
_____________________________

+++++++++++++++++++++++++++

( పల్లవి ) ;;;;;
_______

చాలులే నిదరపో జాబిలి కూనా!
ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా
ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా ||చాలులే||
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా ,
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా

1. అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా
ఓసీ! వేలెడేసి లేవు బోసి నవ్వుల దానా || అంత ||
మూసే నీ కనుల-
ఎటుల పూసేనే నిదర- అదర- జాబిలి కూనా!
ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా
ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా


2. అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే
కానీ,చిట్టి తమ్ముడొకడు నీ తొట్టి లోకి రానీ !
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే
కానీ,చిట్టి తమ్ముడొకడు నీ తొట్టి లోకి రానీ !

( జమున);;;;
_________

ఔరా ! కోరికలు, కలలు -
తీరా నిజమైతే,
ఐతే జాబిలి కూనా!

ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా
ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా
తుమ్మెదలాడేనా తూనీగలాడేనా

++++++++++++++++++++++++++++++++++++++++

ఈ గీతాన్ని మొదట పి.సుశీల పాడింది.

కానీ, ఆ పాటకు జానకి చేత గానం చేయిస్తే, ఇంకా బావుంటుంది.” అని అనుకున్నారు.
మర్నాడే ఎస్. జానకిని పిలిచారు.
ఎస్.జానకి గాత్ర మాధుర్యంతో ఆ పాట మరింత వీనుల విందుగ తయారైనది.

&&&&&&&&&&&&&&&&&&&&


“ భావ కవీంద్రా! క్రిష్ణశాస్త్రి గారూ!
మీ గేయానికి ఇద్దరి గొంతులు అవసరం అయ్యాయి కదండీ!”
అన్నారు “

వెంటనే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక పేపరుపై గబగబా ఏదో రాస్తున్నారు;
కారణం – Throat కు వ్యాధి .
కేన్సరు కారణంగా గళములోని స్వర పేటికను, డాక్టర్లు తొలగించారు,
ఆయన మూగవారు అయ్యారు.

భావకవి కలం కాగితంపై చిలికిన ముత్యాలు ఇవిగో !....

“ ఒక మూగపాటకు
ఎన్ని మంచి గొంతులు !! “

సున్నిత మనస్కులైన కవుల వేదనకు కూడా
సుందర అక్షర మాలా పుష్పాలుగా విరబూస్తూంటాయి కదా!

“శిధిలాలయమ్ములో శివుడు లేడోయీ!
ప్రాంగణమ్మున గంట మోగ లేదోయీ!!!.....”

ఈ లలిత గీతములోని లాలిత్యాన్ని వర్ణించడానికి
ఎన్ని వివరణలు సరిపోతాయి?

జమున, క్రిష్ణల అభినయముతో చిత్రించ బడిన
ఆ పాట ఇదిగో! చదవండి;
ఆనక శ్రవ్య యంత్రాల ద్వారా ఆలకించండి.

&&&&&&&&&&&&&&&&&&&&&

నాకు ఎంతో ఇష్టమైన ఈ దేశ భక్తి గీతమును,ఇక్కడ పొందుపరుస్తున్నాను .
భావ లాలిత్యమును సంస్కృత పద భూయిష్టమైన గీతంలో చిత్రించడములో,
భావ కవి కృష్ణ శాస్త్రి అసమాన ప్రతిభను ఈ పాట ప్రతిబింబిస్తూన్నది.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

( పల్లవి )

జయ జయ జయ ప్రియ
భారత జనయిత్రీ - దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి
1.జయ జయ సస్యామల
సు - శ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా
చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయ సయ
లాక్షారుణ పద యుగళా

2.జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరి తోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణా
=========================
Pramukhula Haasyam

ఒకే పాటకు ఇద్దరు

By kadambari piduri, May 1 2010 12:59AM

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...