పలుకుబళ్ళు:::
,,,,,,,,,,
1)కిల్టాశు =చీటి:::
2)ఆకాశ రామన్న ఉత్తరం =సంతకం  లేకుండా ,అజ్ఞాత వ్యక్తి రాసే ఉత్తరము.
3)ఆకాశ  రామన్న అర్జీలు = సంతకం లేని ఉత్తరములు   
4)పుక్కిటి పురాణము ,=ఆకాశ పంచాంగము /
లోకాభి రామాయణము/పోచికోలు కబుర్లు/ 
 చెప్పుగో దగిన విశేషాలు గానీ,విషయాలు గానీ లేని కబుర్లు.   
5)అమ్మలక్కల ముచ్చట్లు = స్త్రీలు
 ఒకచోట కూడి చెప్పుకునే కబుర్లు
6)అచ్చట్లు ముచ్చట్లు 
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)చెవులు కొరుకు కొనుట:::
 కర్ణే జవుడు= గుస గుసలు ఆడే వాడు  =
కొండేల మారి (చాడీలు చెప్పుట,
కొండెములు చెప్పుట):::
2)నాలుక కొరుక్కొనుట = 'పొర పాటు 'తెలుసుకొని,.../
 3)నాలిక పై బీజాక్షరములు =విద్య అనుగ్రహము లభించుట :::
4)"నన్ను అంత మాట క్రూరంగా అన్నవు !అది నాలుకా? తాటి బద్దా?" :::
5)నరం లేని నాలుక ,ఎన్నైనా మాట్లాడును.":::
6)పుల్ల విరుపు మాటలు /సూటీ పోటీ మాటలు :::
'పుల్ల విరిచి పొయ్యిలొ బెట్టినట్లుగా మాట్లాడుట ,నిక్కచ్చిగా...../
7)కర్ణ కఠోరముగ = విన సొంపు లేని  స్వరము/(పాట పాడుట) 
8)"విన సొంపైన సంగీతము "
   వీనులకు విందైన సంగీతము :::
  'చెవులకి ఇంపుగా మాట్లాడుట '
9) కన్నుల పండుగ /కన్నుల పండువుగా /నయన పర్వము /
నేత్ర పర్వముగా /నయనాభిషేకము /నయన మనోహరముగా 
10)కన్నుల ముత్యములు =ఆనంద బాష్పములు :::
ఆనందాశ్రువులు /
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
- 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
- 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి