30, నవంబర్ 2008, ఆదివారం
సుపరిచితమైన వాక్కు ;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"శిశుర్వేత్తి ,పశుర్వేత్తి;
వేత్తి గాన రసం ఫణీ ;
స ఏవ శ్శంకరో వేత్తి
సమగ్రం వేత్తి నాపరః
శిశువులను , పశువులను ,సర్పములను కూడా" సంగీతము" పరవశింప జేయును। (అలాంటి సంగీత సారము సర్వమును) పరమేశుడు ఒక్కడే దానిని తెలిసి ఉన్న వాడు।(ఈశునికన్నను ఎక్కువగా , ఇతరులకు ఎరుక ఉండదు।)
"గాజు కుప్పెలోన కదలక దీపంబ;
"గాజు కుప్పెలోన కదలక దీపంబ;
దెట్టులుండు,"జ్ఞాన మట్టులుండు ;
తెలిసినట్టి వారి దేహంబు లందున;
విశ్వదాభి రామ వినుర! వేమ! "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,
"స్థిరా శైలీ గుణవతాం ; ఖల బుద్ధ్యా న బాధ్యతే ;
రత్న దీపస్య హి శిఖా వాత్యయాపి న బాధ్యతే ;"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మంచి గుణములు గల వారి స్థిరమైన ప్రవర్తన
దుష్ట బుద్ధి కలవారి వలన బాధింప బడదు.
ఎట్లనగా , 'రత్న దీపము 'యొక్క దీప శిఖ '(వెలుగు)
గాలికి(వీచినా కూడా)ఆరి పోదు కదా!"
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
ఐదు "వ" కారములు
,,,,,,,,,,,,,,
"వస్త్రేణ ,వపు షా,వాచా,విద్యయా,వినయేన చ :::
వకారైః పంచభి ర్యుక్తః నరో భవతి పూజితః ."
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""
తాత్పర్యము ;;;
,,,,,,,,,,,
దుస్తులు ,స్వరూపము, మాట తీరు, వినయము -
ఐదు "వ" కారములతో కూడిన మానవుడు గౌరవించ బడతాడు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
29, నవంబర్ 2008, శనివారం
,,,,,
" ఆశా నామ మనుష్యాణాం కాచి దాశ్చర్య "శృంఖలా" ;;;
యయా బద్ధాః ప్రధావంతి ; ముక్తా స్తిష్ఠంతి పఙ్గువత్ ."
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మానవులకు ఆశ్చర్య కరమైన సంకెల " ఆశ".
ఆశ అనే సంకెల తో బంధింప బడిన వాళ్ళు విపరీతముగా పరుగులు పెడుతూంటారు.
ఆశా విముక్తులు, దానిని విప్పుకున్న వాళ్ళు
కుంటి వాళ్ళ(పంగుం) వలె ఒకే చోట పడి ఉంటారు.
;(;;; శృంఖల =సంకెల ;;; ధావనము =పరుగు ;;; )
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
సూక్తి
,,,,,,,,,
" కోహి భారః సమర్ధానాం ;
కిం దూరం వ్యవ సాయినాం ;
కో విదేశః సు విద్యానాం ;
కః పరః ప్రియ వాదినాం ; "
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
,,,,,,,,,,,
1)కన్ను తెరిచి/కళ్ళు తెరచుట=
జన్మించుట ;
2)"కళ్ళు తెరవరా!నరుడా! "
(= " లోక జ్ఞానమును సంపాదించుము!" అని ఉద్బోధించుట.)
3)"కంటి పాపలాగా కాపాడు కొనుట."
4)కన్ను,మిన్ను కాననంతటి అహంకారము ;
5)"కన్నారా? కను గొన్నారా?"
6)కంటి మీద కునుకైనా లేకుండా పని చేసారు.
7)కంటికి నిద్ర కరువు ఐనది.
8)కంటికి రెప్ప దూరమా?(= అనుబంధములు,ఆప్యాయతలు)
9)"కలలు కనే వేళ ఇది, కన్నయ్యా!"
10)కంటి కాటుక( అలంకారము)
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
11)కంటికీ,మంటికీ ఏక ధారగా
ఏడ్చుట .
12) కన్నీరు; కన్నీళ్ళు ;
ఆనంద బాష్పములు ;ఆనందాశ్రువులు ;
13)కన్ను,కన్ను /కళ్ళు కలిసినవి=ప్రేమ కలుగుట,
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1)కను దోయి;కన్ను దోయి;కన గవ ;
"నయన ద్వయము ;నయనములు ;
నేత్రములు/నేత్ర ద్వయము ;
లోచనములు ;::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
విశాల నేత్రి ;పద్మ నయని ;కమల లోచని ;హరిణ లోచని ;;;
"కంటికి చారెడు కళ్ళు ఉన్నాయి."
పద్మ నయనుడు ; కమల లోచనుడు/
కువలయ నయనములు ; కురంగ నేత్రములూ;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సూరదాసు - పోతన
;;;;;;;;;;;;;
"కైధేరీ బస్ బేలి కహు; తుమ దేఖీ హై నంద నందన్ ;
బూఝుహు మాలతి కిధే తై పాయే హై తను చందన్ ;;
కైధే కుంద కదంబ ఆకుల వట చంపక లతాల మాల్ ;;
కైధే కమల కహో కమలా పతి సుందర నయన విసాల్ ;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" ఓ లతా,వృక్షములారా! మీరెక్కడైనా శ్రీ కృష్ణుని చూచితిరా?
ఓ మాలతీ! చందన చర్చిత గాత్రుని నీ వెచటనైనా జాడలు అరసితివా?
ఓ కమలమా! కమలా కాంతుని నీ వెచట నైనా పొడ గాంచినావా?
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇది"సూర దాసు " రచన!
:::::::::::::::::
ఇట్లే , బమ్మెర పోతనామాత్యుడు విరచించిన పద్య మాధుర్యమును గ్రోల గలము.
"నల్లని వాడు ,పద్మ నయనంబుల వాడు, కృపా రసంబు పై ;
చల్లెడి వాడు, మౌళి పరి సర్పిత పింఛము వాడు , నవ్వు రా ;
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దెచ్చెనో ;
మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్మ ,చెప్పరే! "
'''''''''''''''''''''''''''''""""""""""""""'''''
డబ్బు,దస్కం
,,,,,,,,,,
1)బేరం చేయుట ::: "మారు బేరానికి వస్తువును తెచ్చుట :::
2)బయానా ఇచ్చుట ;అడ్వాన్సు ఇచ్చుట ;
సంచకారి -ముందస్తు అడ్వాన్సులో కొంత ఇచ్చుట;సొమ్ము చెల్లించి ;;; గుడ్ విల్ ;
3)రాయల్టీని "పే"చేయుట;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
4)బేరం కుదుర్చుకుని ;గీసి,గీసి బేరం చేసి ;
5)రిబేటు ;కన్సెషన్ ; డిస్కౌంటు ;
6)"భలే మంచి చౌక బేరము...";
కారు చౌక గా అమ్ముట;
" చీప్!"; "చీప్ అండ్ బెస్ట్"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
7)అంగడి ; షాపు; దుకాణము; కిరాణా కొట్టు;
మార్కెట్టు ;విపణి వీధి ;కిళ్ళీ కొట్టు ;'డబ్బా'కొట్టు;
సూపర్ బజారు; బిగ్ బజార్లు ;
సంత ; (కూర గాయల సంత)
("చేపల మార్కెట్టు లా ఉంది,ఇల్లంతా ఒకే గోల!")
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
8)వ్యాపారం చేసుకుంటూ ; వ్యాపారము,వ్యవహారము;;;
వ్యాపారి ; బేహారి;బేర గాడు;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
9)కొనుట; కొనుగోలు శక్తి;
10)అమ్ముట;అమ్మకము :
("పండుగ నాళ్ళలో అమ్మకములు భారీగా జరిగాయి.")
11)ఎగుమతి,దిగుమతి :ఎగుమతులు,
దిగుమతులు ;;;ఎక్స్ పోర్టు,ఇంపోర్టు ;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,
12)ద్రవ్య వినిమయము ;
13) ద్రవ్యము చలామణి అగుట
(అణ ,బేడ నాణాలు పాత కాలం నాటివి,నేడు అవి చలామణీ అవవు.")
14)వినియోగ దారుడు ; కస్టమరు;
కొనుగోలు దారుడు ;
15) వస్తు మారకం; వస్తు మార్పిడి పద్ధతి ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తూనికలు, కొలతలు :
,,,,,,,,,,,,,,,,,,,,
1)తూనిక రాళ్ళు ;తరాజు; త్రాసు ;తుల ;తులా దండము;
కాంటా; ధర్మ కాటా;
2)మానిక ,కుంచము ;శేరు గిద్ద;
3) కొల బద్ద; మాన దండము;
స్కేలు ;మీటరు బద్ద; టేపు;;;;;
మూర, జాన ;బార;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
3)గోరంత(గోరు) దీపం ;
"నాకు నీ అండ ఉంటే,కొండంత ధైర్యం(కావల్సినంత/ఎంతో);;;
"వేలెడంత(వ్రేలు;అంగుళి;ఫింగర్)లేడు ,నాకే ఎదురు చెబుతున్నావు,
భలే గడుగ్గాయివే!"
బెత్తెడు(బెత్త)ముగ్గు ;
మూరెడు పూలు;
జానెడు నడుము; బారెడు పొడుగు జడ;;;
పిడికెడు బియ్యము ;గుప్పెడు చక్కెర; దోసెడు తేనె;;;
చిటికెడు పసుపు ,కుంకుమలు ;చెంచాడు నెయ్యి;
స్పూనుడు" టీ" పొడి ; సీసాడు కాఫీ పొడి ;
గరిటెడు పెరుగు ;చిట్టెడు(=చిన్న గిన్నెడు) నేయి ; ;;
మిల్లి గరిటె; చిట్టాముదము ;పుడిసెడు నీళ్ళు;(పుక్కిలి=పుక్కిలించుట);;;
3)తూచుట; కొలుచుట ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"ధన ధాన్యాలతో,భోగ భాగ్యాలతో వీరు తుల తూగు చున్నారు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
దూరము :కిలో మీటరు:కూత వేటు దూరము //ఇత్యాదిగ పదములు కలవు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ద్రవ్యోల్బణము ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"మనీ లెండర్సు ";"అప్పు ఇచ్చు వాడు...";ఋణ దాత ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఋణ గ్రస్తుడు;అప్పు పుచ్చుకున్న వాడు;మిత్తి; చే బదులు ;"బదులు ";
చంద్ర గుడి
,,,,,,,,,
1)ఇల్లు కట్టి చూడు,పెళ్ళి చేసి చూడు.
2)కనుమకి 'కాకర ',భోగికి పొట్ల.
3)కామ ధేనువు,కల్ప వృక్షము.
13)ఉంటే లిక్కి,పోతే కొడవలి.
4)కార్తీకం కలకాశా,వైశాఖం పులకాశా.
5)"కార్తీక మాసాన కదురంత ఉంటినా,
మాఘ మాసంలో నా మహిమ చూపుతా!"(అన్నది చిక్కుడు తీగ)
6)కార్తీకంతో వర్షం, కర్ణునితో యుద్ధం.
7)కార్తీక మాసంలో కడపటి వానలు.
చంద్ర పరి వేషం వర్ష యోగం.
(చంద్రుని చుట్టూ "గుడి" వేయుట)=
" చంద్ర గుడి " జాబిలికి దగ్గరలో ఈ వలయం ఏర్పడితే,
వర్షం దూరంగానూ ,అంటే ఆలస్యముగా కురుస్తుంది ;
దూరముగా "గుడి" కట్టితే ,దగ్గరగా ,తొందరలో వర్షించును.
8)తూనీగలాడితే తూమెడు వర్షం.
9)చీమలు చెట్లెక్కితే భూములు
సస్య శ్యామలం.(బాగా పండును.)
10)చీమ బలం,దోమ చప్పుడు. (వాడు బక్కగా అగుపిస్తాడు కానీ....//
11)పిల్ల పదిలం, ముల్లె పదిలం.
12)అశోకుని సామ్రాజ్యంలో పశువైతేనేమి? ("మేలే!")
14)"అనూరాధ"లో అడిగినంత పంట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీకృష్ణ దేవరాయల కోర్కె-పెద్దన ప్రబంధము
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"సప్త సంతానములో ప్రశస్తి గాంచి ;
ఖిలము గాకుండునది ధాత్రి" కృతియ"గాన ;
కృతి రచింపుము మాకు "శిరీష కుసుమ ;
పేశల సుధామ యోక్తుల పెద్దనార్య!"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"ధరిత్రిపై "సప్త సంతానముల "లో కావ్యము శశ్వతమైనది.
ఖిలము కానిది సారస్వతము,
కావున అట్టి"దిరిసెన పూవు రేకు వలె
సుకుమారమైన సుధామయములైన పదములతో వ్రాయుము,పెద్దనార్య!"
:::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::
నిఘంటు వివరణ :
,,,,,,,,,,,
సప్త సంతానములు ;;;
,,,,,,,,,,,,,,,,,,
తనయుడు; తటాకము;
కావ్యము; నిధానము; కోవెల;
వనము,తోట;భూదేవ స్థాపనము;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సప్త కవులు :::
,,,,,,,,,,,,,,
వివేకి; వాచకుడు; రౌచికుడు; అర్థి;
శిల్పకుడు; భూషణార్థి; మార్దవానుగతుడు;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మాటలు , పలుకులు
,,,,,,,,,
ధనదుడు =కుబేరుడు :::
,,,,,,,,,,,,,,,,
కుబేరుడు;నర వాహనుడు ;కిన్నరేశుడు;యక్ష రాజు;మహేశ సఖుడు;గుహ్యకేశ్వరుడు:
(గుహ్యకులు=నిధులను రక్షించే వారు):::
పౌలస్త్యుడు;:::
కుబేరుని తల్లి "ఇళ బిల";
తమ్ముడు"ఇడ బిట్టు".
విశ్రావస్సు తనయుడు,శ్రీదః":శ్రీ/ధనదుడు=భాగ్యములను ఇచ్చు వాడు;
"పుణ్య జనేశ్వరు"లకు ప్రభువు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
::::::::::::::::::::::::::::::::::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మాటలు :::(డబ్బు:విభాగము)
,,,,,,,,,,,,,,,,,,,,,,
1)వడ్డికాసుల వాడు; ఆపద మొక్కుల వాడు;శ్రీ శ్రీని వాసుడు :
2)సంపత్తి; ముల్లె;;;
2)డబ్బు మూటలు;డబ్బుల సంచులు ;
3)నిధి; నిధులు ;నిధి ,నిక్షేపములు :::
"లంకె బిందెలు";లంకెల బిందెలు;
4)రత్న రాసులు;మణుల,మాణిక్యములు
5)ధనేశుడు/ధనాధిపుడు/(కుబేరుడు)::: భాగ్యశాలి ,భాగ్య వంతుడు;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1)కోశాగారము (:కోశాధికారి= క్యాషియర్ ;)
2)ఫైనాన్సు(ఫైనాన్షియర్)
3)(తాకట్టు వ్యాపారి)డబ్బును వడ్డీకి త్రిప్పుట:::/వడ్డీలకు తిప్పుట:::/ఇంటెరెష్టు /
4)వస్తువులను తాకట్టు పెట్టుట/కుదువ పెట్టుట
5)అప్పు ఇచ్చుట;మిత్తికి ఇచ్చుట=వడ్డికి ఋణ సదుపాయములను కల్పించుట;
6)వస్తు మారకము/
మారకము సేయుట=ఒక వస్తువును తీసుకుని, బదులుగా ఇంకొక వస్తువును ఇచ్చుట;
7)మదుపు పెట్టుట/పెట్టుబడి పెట్టుట/"బిజినెస్సులో పెట్టుబడులను పెట్టి,"భాగ స్వామి"(=షేర్ హోల్డర్)గా అయ్యెను."
1)ఆదాయము=రాబడి;ఇన్ కం; ఐవేజు; సాలీనా ఆదాయము=సంవత్సరమునకు .../నికర ఆదాయము ;(పంటపై కౌలు/పాలి/గుత్త/
8)పెట్టు బడి::: బిజినెస్సులో పెట్టు బడులు పెట్టుట;/మూల ధనము;
ఆదాయ,వ్యయములు; జమా బందీలు; రాబడి,ఖర్చులు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుండ మార్పిడి పద్ధతి=అన్నా చెల్లెళ్ళకు,వేరొక ఇంటిలోని సోదర సోదరీలతో పెళ్ళి జరుగుట:::
28, నవంబర్ 2008, శుక్రవారం
శ్రీ కృష్ణ సన్నుతి
,,,,,,,,,,,
" కువలయ రక్షా తత్పర :
కువలయ దళ నీల వర్ణ -కోమల దేహా :
కువలయ నాథ శిరో మణి!:
కువలయ జన వినుత విమల- గుణ సంఘాతా!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(కువలయము=కలువ పువ్వు:భూమి: )
భూమిని రక్షించుట యందు ఆసక్తి కల వాడా!
కలువ రేకుల వంటి నీల వర్ణ దేహము కల వాడా!
ధరణీ నాథులలో శిరోమణి వంటి వాడా!
వసుధపైన ఉన్న అనేక జనులచే వినుతించ బడుచున్న వాడా!
స్వచ్ఛమైన గుణ సముదాయము కల వాడా!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజ లోకమున ఆనందము
,,,,,,,,,,,,,,,,,,
"హరి పెండ్లికి 'కైకేయక,:
కురు,సృంజయ, యదు,విదర్భ- కుంతి నరేంద్రుల్ ' :
పరమానందము పొందిరి:
ధరణీశులలోన గాఢ తాత్పర్యములన్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కైకయక,కురు,సృంజయ,యదు,విదర్భ,కుంతి దేశ చక్రవర్తులు
"శ్రీ కృష్ణుని పరిణయము"నకు పరమానందమును పొందిరి. భూపాల
లోకము గొప్ప శ్రద్ధానందములు పొందెను."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
27, నవంబర్ 2008, గురువారం
రుక్మిణీ కళ్యాణము
,,,,,,,,,,,,,,,,,,,,,,
రుక్మిణీ దేవి ,రహస్యముగా పంపిన "వినతి "ని విని ,
శ్రీ కృష్ణుడు చేస్తూన్న ప్రతిజ్ఞ :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"వచ్చెద విదర్భ భూమికి ;
జొచ్చెద భీష్మకుని పురము - సురుచిర లీలన్ ;
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి ;
వ్రచ్చెద నడ్డంబు రిపులు - వచ్చిన బోరన్."
(ఇది కంద పద్యము )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
విదర్భ రాజ పుత్రిక రుక్మిణీ దేవి వివాహమును ,
ఆమె అన్న రుక్మి,తండ్రి భీష్మకుడు నిర్ణయించిరి.
శిశుపాలునితో ఆ వైదర్భి పెళ్ళి నిర్ణయమైన సందర్భముగా
రాజ్యమున ఉల్లాసము వెల్లివిరిసినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(సీసము, ఆట వెలది)
"రచ్చలు,క్రంతలు-రాజ మార్గములు :
విపణి దేశంబులు-విశదములుగ :
చేసిరి చందన- సిక్త తోయంబులు
కలయంగ జల్లిరి- కలువడములు:
రమణీయ వివిధ తో-రణములు గట్టిరి;
సకల గృహంబులు-సక్క జేసి
కర్పూర కుంకుమా-గరు ధూపములు వెట్టి;
రతివలు,పురుషులు-నన్ని ఎడల;"
"వివిధ వస్త్రములను-వివిధ మాల్యాభర;
ణాను లేపనముల-నమరి యుండి;
రఖిల వాద్యములు,మ-హా ప్రీతి మ్రోయించి;
రుత్సవమున నగరమొప్పి యుండె."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుండిన పుర ప్రజలు రచ్చలు/ కూడళ్ళు,అడ్డ త్రోవలు(క్రంతలు),
రాజ మార్గములు, మార్కెట్లు,విశదముగా ,పరిశుభ్రముగా చేసిరి.
చందన /గంధ సిక్తములైన జలములను కలయ చల్లి ఉన్నారు.
రమణీయమైన (కలువడములు=) కలువ పూవులు, మున్నగు
వివిధ తోరణములను కట్టిరి.
సకల గృహములను చక్కగా చేసి,
కర్పూర, కుంకుమ,అగరు ధూపములను పెట్టిరి.
అతివలు/స్త్రీలు, పురుషులు వివిధ మాలలను ధరించి,
(అను లేపనములు) మై పూతలతో ఒప్పి ఉండిరి.
అఖిల వాద్యములను మహా ప్రీతితో మోగించ సాగిరి.
విదర్భ రాజధాని యైన కుండిన పురము
ఉత్సవములతో విలసిల్లుచున్నది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"రుక్మిణీ కల్యాణము "
అబలల తోడ వి-య్యంబులందు :
గుజ్జన గూళ్ళను-గొమరొప్ప వండించి:
చెలులకు పెట్టించు-చెలువు మెఱయు:
రమణీయ మందిరా-రామ దేశంబుల:
పువ్వు తీగెలకును-ప్రోది సేయు:
సదమల మణిమయ -సౌధ భాగంబుల :
లీలతో భర్మ డో-లికల నూగు :
బాలికల తోడ చెల రేగి- బంతులాడు:
శారికా ,కీర పంక్తికి- చదువు చెప్పు:
బర్హి సంఘములకు మురి-పములు గఱపు :
మద మరాళంబులకు-జూపు మంద గతులు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రుక్మిణి దేవి పేరు ,పేరున "బొమ్మల పెండ్లిండ్లు" చేయుచు,
తన చెలి కత్తెలకు ,"వియ్యములు ,ఇచ్చి పుచ్చు కొనుటల"ను నేర్పెను.
ఆటల 'గుజ్జన గూళ్ళను ' వండించి,
ఆ బాలికలకు చెలువు మీరగా,అందముగా వడ్డించెను.
రమణీయ మందిరముల పెరటి తోటలలో/ఆరామ దేశములందు ,
పూ లతలకు పోషణకై' పాదులు ' చేసి ,పట్టు కొమ్మలను ఏర్పరచును.
స్వఛ్చమైన(సదమల) మణి మయ సౌధ భాగములలో లీలా విలాసములొప్పగా ,
భర్మ(బంగారు)డోలికలందు ఊగు చుండును.
చెలిమి కత్తెలతో బంతులాట లాడును.
గోరు వంకల,చిలుకల గుంపులకు "చదువులు " చెప్పు చుండును.
నెమళ్ళ(బర్హి) గుంపులకు మురిపములను నేర్పును.
మద మరాళములకు(మదించిన హంసలు)
వయ్యారముతో నెమ్మదిగా నడచు పద్ధతిని నేర్పును.
.::::::::::::::::::::::::::::::::::::::::::::::
"రుక్మిణీ కల్యాణము "లోని ఈ సొగసరి కబ్బములు
సీస.తేట గీతి ఛందస్సులలో పోతన రచించెను.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
26, నవంబర్ 2008, బుధవారం
మాటలు
,,,,,,,,,,
1)పర్యవసానము , రిజల్టు:
2)క్లైమాక్సు ,పరాకాష్ఠ :::
"సినిమలో/నాటకములో క్లైమాక్షు
3)పర్యవసాయి ,పర్యవసించు .
4) దరిమిలా : ఆ మీద/ఆ మీదటను /ఆ పైన /ఆ వెనుక /ఆ తరువాత ,
అటు తరువాత ,తర్వాత,
" చెప్పడమే తరువాయి , హనుమంతుడు 'సంజీవనీ పర్వతముణు
పెకలించి తెచ్చెను."
5) పిదప,పిమ్మట , అటు పిమ్మట
" పిదప కాలం,పిదప బుధ్ధులు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)రమారమి :దాదాపు :ఇంచు మించు గా :
2)సరా సరిగా : ఖనా ఖనిగా :
బరా బరి :::
"అత్తెసరు మార్కులతో ఈ క్లాసును గట్టెక్కించెను." :::
"బొటా బొటి మార్కు"లు :
3)మట్టసము=పొదుపు,
"అతగాడు డబ్బును మట్టసంగా వాడుతాడు,దుర్ఖర్చును చేయడు. పొదుపు చేసిన మనీని,బ్యాంకులో జమ చేసి,నిశ్చింతగా ఉన్నాడు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)బహుశ: 2)"ఔను,కామోసు!"
3)"అంతే కాబోలు!"/కాబోలును!/
4)ఐ ఉండ వచ్చును."
5)ఐతే,గియితే,
6)"అట్లాగైతే,మీరు ఇక్కడికి బదిలీ చేయించుకుని, వస్తారన్న మాట!"
అయినచో/ఐతే/
7)"ఐనా సరే,నేను, ఇంజనీరునే ఔతాను"
8)"గొల్ల భామలు,పాలు వెన్నలను ఉట్టి మీద దాచారు.ఐనా గానీ,
బాల క్రిష్ణమ్మ మీగడ వెన్నలను కాజేసి ,శుభ్రంగా ,నేస్తాలతో కలిసి,కూర్చుని, త్రాగేశాడు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పలుకులు
(మనీ:విభాగము )
,,,,,,,,,,,,,,,,,,
1)తూకము :::బారువా ,మణుగులు
2) "కోవెలలో తన ఎత్తు(=బరువు) నాణెములను 'తులా భారము 'ను మ్రొక్కి ,తీర్చుకొనెను."
3)కాసులు: "కనక వర్షము కురిసి, మా ఇల్లు సిరులతో నిండినది.":
కాసుల పేరు '=నగ :
"కాసులు గల గల మంటూన్నవి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
4)అణా=6 పైసలు :16 అణాలు=రూపాయితో సమానం:
అర్ధణా= 3 పైసలు:
5) దమ్మిడీ,దమ్మిడీలు,కాణీలు
:::::::::::::::::::::::::::::::::::
బాకీ:::1)బాకీ,' బకాయి పడిన బిల్లులు ': 2)ఋణము : 3)అప్పు:మిత్తి :
4)అసలు,వడ్డీ: చక్ర వడ్డీ,బారు వడ్డీ: అసలు ఫాయిదాలతో సహా,బాకీని తీర్చేసి,హాయిగా,కులాసాగా,(నిష్పూచీగా, రికామీగా) దర్జాగా' కాలు మీద కాలు వేసుకుని, కూర్చున్నారు."5)'బ్యాంకులో తీసుకున్న లోనుతో ఇల్లు కట్టుకున్నారు.' :6)ఫండ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1_జీతము :జీతము,నాతము ":జీతంకన్న పీతం ఎక్కువ,: వేతనము,శాలరీ,భత్యము (దారి భత్యము:దినసరి కూలీ,దినసరి భత్యము : కరువు భత్యము) :
2)విద్యార్ధుల చదువులు నిరాటంకముగా కొన సాగుటకు ,స్కాలర్ షిప్పులు
(=ఉపకార వేతనములు:ఫెలో షిప్స్ )
3)పెన్షను,పింఛను, పింఛనీ,వృద్ధాప్యపు పెన్షను : భరణము :
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) పన్నులు,టాక్సులు : కప్పము,సుంకము ;
2)ప్రభుత్వ ఖజానా: కోశాగారము : ధనాగారము :
(ధాన్యా గారము,భాండారము)
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1) లక్ష్మీ దేవి అనుగ్రహము ' :లక్ష్మీ కటాక్షము ,సిరి ,
"లచ్చింతల్లి చల్లని చూపు తాకి,ధన ధాన్య సమృధ్ది లభించినది."
భూ దేవి
"సముద్ర వసనే దేవి,
పర్వత స్థన మండలే :
ఆపో అస్మాన్ మాతరః . :
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భూ దేవి ,కడలి వసనముతో ,
పర్వత స్థన మండలములతో అలరారుతూన్నది.
నదులకు తల్లి వంటిది" భూ మాత".
(ఆపోః =జలములు,నీరు)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" మూలతో బ్రహ్మ రూపాయ ,
మధ్యతో విష్ణు రూపిణే ,
అగ్రతః శివ రూపాయ ,
వృక్ష రాజాయ నమః."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రుక్మిణీ కల్యాణము
,,,,,,,,,,,,,,,,,,
"బాలేందు రేఖ తోచిన :
లాలిత యగు నపర దిక్కు- లాగున ధరణీ :
పాలుని గేహము మెరసెను :
బాలిక జన్మించి ,ఎదుగ -భాసుర మగుచున్. "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(పోతన ,కంద పద్యము,దశమ స్కంఢము,10 )
"రాజు భీష్మకుని గృహము ,
బాలిక రుక్మిణి జన్మించి, ఎదుగుచుండగా,
పాడ్యమి నాటి నెల వంక వలన అందముగా ఉన్న "పడమటి దిక్కు" వలె, కాంతివంతము అయ్యెను."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సూక్తి
,,,,,,,
" మాతా శత్రః ,పితా వైరి ,
యే న బాలో సపాఠిథః :
న శోభతే సభా మధ్యే
హంస మధ్యే బకో యథా."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
హుండీ
,,,,,,,,,,,
1)ధన మూలం ఇదం జగత్.
2)డబ్బుకు లోకం దాసోహం.
3)ధనమేరా అన్నిటికీ మూలం.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) పైసాకు ఠికాణా(/గతి)లేదు గానీ ఆడంబరాలకు తక్కువ లేదు,అన్నీ కావాలంటాడు."
2)గవ్వ రాకడ లేదు,ఘడియ రికాం (/పుసరత్తు)లేదు,:::
/క్షణం తీరిక లేదు,దమ్మిడీ ఆదాయం లేదు.
3)"కుబేరుని మనుమడు అతను,బహు భాగ్య వంతుడు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పలుకు బళ్ళు :::
,,,,,,,,,,,,,
1)పర్సు, మనీ పర్సు,బ్యాంకు లాకరు ,బ్యాంక్ లోని లాకర్ రూము.
:::::::::::::::::::::::::::::::::::
పెట్టె :::
""""""""""""""
1)భోషాణము, భోషాణంపెట్టె ,
2) హుండీ ,డబ్బుల పెట్టె/భరిణె/భరిణ.
3) హుండీ ,డిబ్బీ,డిబ్బెన,దిబ్బీ
4)దేవళములో "హుండీ';;;
తిరుపతి కోవెలలో "పరకా మణి "
(=తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి కోవెలలో,హుండీలో వచ్చిన రాబడిని లెక్కించుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
25, నవంబర్ 2008, మంగళవారం
కలిమి
2)లక్ష్కాధికారులు, కోటీశ్వరుడు/లు :
మిల్లియనీర్స్ ,మిలియనీర్లు ::: వాళ్ళు జమీందారులు."
3)"వాడికేం, భాగ్యశాలి.బొడ్డులో బంగారంతో పుట్టాడు ."
4)నోట్ల కట్టలు=రూపాయిల బండిల్సు:
"నా దగ్గర ఏదైనా మిషను ఉందనుకున్నావా?
అడగంగానే ,నోట్లు ప్రింటువేసి ఇవ్వడానికి,/నోట్లు అచ్చు వేసి ఇవ్వడానికి."
5) హస్తము= ఐదు రూపాయల నోటు.
6) వంద నోటు/నూరు రూపాయలు,హండ్రెడ్ రుపీస్ ,పెద్ద నోటు, పచ్చ నోటు
7) మింటు కాంపౌండు = డబ్బులు అచ్చు వేసే ప్రభుత్వ కర్మాగారము
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)పరసు వేది= ఇనుమును బంగారముగా మార్చు 'విద్య '/రాయి.
"అతగాడికేం,మహా రాజు!అరి చేతిలో పరసు వేదిని ఉంచుకుని పుట్టాడు./
"వాడి జీవితం 'అన్ని వడ్డించిన విస్తరి."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ధనము (విభాగము):::
,,,,,,,,,,,,,,,,,,,,,,
1)ధనము,ద్రవ్యము ,విత్తము ,విత్తు
2)నాణెము ,నాణ్యములు ,
కాయిన్స్ ,కాయిన్లు,"బొమ్మ,బొరుసు"లు.
3)రూప్యములు, నినిష=108 సువర్ణములు ::: రూపాయి ,రూపాయిలు,రూపాయలు:::
"పచ్చ నోటు"=నూరూ రూపాయల నోటు ,రుపీస్ :::
రూకలు ,
4) కార్షా పణములు,నిష్కములు
''''''''''''''''''''''''''''''''''
1)భాగ్యము=సంపద,పణము ,
" భోగ భాగ్యములతో తుల తూగుట ":::
సిరి ,సిరులు ,సిరి సంపదలు , సంపద ,సంపదలు ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)ధనవంతుడు/లు :,ధనికుడు/లు : భాగ్య వంతుడు/లు : సంపన్నులు :::
2)సంపన్న వర్గము ::: "ఉన్న వారు/ఉన్న వాళ్ళు/ కలిగిన వాళ్ళు
పలుకులు
,,,,,,,,,
1)డబ్బు ,ధనము, శుల్కము,
పైసా,పైసలు,సొమ్ము .సొమ్ములు, సొత్తు,
సంపద ,సంపదలు ,
2)కాన్ డబ్బులు ,కాణీ,కాణీలు,
దమ్మిడీలు,దుడ్లు,గవ్వలు ,అణా,అణా పైసలతో ,
(పదహారణాలల తెలుగు దనము ఉట్టి పడుతూన్నట్లున్నది
వేష భాషలలో ఆ కన్నె పిల్ల.")
ఉదా// "చిల్లి గవ్వకు కొరగాడు." //
3) కాణీ, "కాణాచి"
(ఉదా// కథలకు కాణాచి."=నిలయము, ఆకరము,నెలవు)
4)" అణా పైసలతో సహా బాకీని కట్టినాడు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)వరహాలు,దీనారములు, దీనార టంకములు ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
2)డబ్బు,దస్కం, దభ్భు,డుబ్బు,
("డబ్బు లేని వాడు డుబ్బుకు కొర గాడు, ")
3)కట్న కానుకలు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)కట్నము , కట్న కానుకలు ,
2) కన్యా శుల్కము ,ఓలి .
3) అరణము (ఉదా// "సత్యభామకు, వెంట
ముక్కు తిమ్మన 'అరణపు కవి 'గా వచ్చెను. ")
3)భరణము :::
ఉదా//" ఇందిరా గాంధీ,రాజ వంశీకులకు ఇస్తూన్న 'భరణము 'లను
రద్దు చేస్తూ ,చట్టమును చేసెను."
4)ఋణము ,బాకీ ,అరువు ,అప్పు,
చే బదులు ,బదులు పుచ్చుకొనుట.
పోతన
,,,,, ,
"మంతనములు సద్గతులకు :
పొంతనములు ఘనములైన పుణ్యముల, కి :
దానీంతన పూర్వ మహాఘ ని :
కృంతనములు రామ నామ కృతి చింతనముల్."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భాగవతము,నవమ స్కంధము,262 :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ రామునికి అంకితములైన కథలు ,
రామ వర్ణనలు కలిగిన కావ్యములు సద్గతులను ఉపదేశించును.
గొప్ప పుణ్యములను ప్రసాదించును.
ఈ క్షణము వరకు చేసిన పాపములను ఖండించే ఉపకరణములై
అవి మనలను సముద్ధరించును.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
23, నవంబర్ 2008, ఆదివారం
పోతన
విల్లును దాల్చు వాడు, కడు విప్పగు వక్షము వాడు,మేలు పై :::
జల్లెడు వాడు,నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులం :::
జల్లెడు వాడు నైన రఘుసత్తము డీవుత మా కభీష్టముల్ ."
( పోతన )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పోతన,నవమ స్కంధము ,250 వ పద్యము
శ్రీ రామచంద్రుని,ప్రజలను ఆనందములో ఓలలాడించసాగెను.కుశీ లవ కుమారులపై ఎల్లరకు వాత్సల్య ,అనురాగములు జనియించగా వారి కన్నుల నుండి ఆనంద బాష్పములు కార
సాగెను.
(పోతన,నవమ స్కంధము ,250 వ పద్యము)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" వట్టి మాకులు పల్లవింప ,నవారియై మధు ధార దా :
నుట్ట పాడిన ,వారి పాటకు నుర్వరాధిపుడున్,ప్రజల్ :
బిట్టు సంతస మంది రయ్యెడ, ప్రీతి కన్నుల బాష్పముల్ :
దొట్ట నౌదల లూచి ,వారల తోడి మక్కువ పుట్టగాన్. "
(పోతన) :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పోతన
తండ్రుల మఱపించి ప్రజల తా రక్షింపన్ :
తండ్రుల నందఱు మఱచిరి :
తండ్రి కదా రామ చంద్రు ధరణిపు డనుచున్ ."
(పోతన) :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పోతన పద్యము
,,,,,,,,,,,,
ఒక మున్నూఱు కదల్చితెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు, బా :
ల కరీంద్రంబు సులీల మై చెఱకు కోలన్ ద్రుంచు చందంబునన్
సకలోర్వీశులు సూడగా విఱిచె దోశ్శక్తిన్, విదేహ క్షమా :
పక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్ .
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భూతల నాధుడు రాముడు :
ప్రీతుండై పెండ్లి యాడె పృధు గుణ మణి సం :
ఘాతన్ భాగ్యోపేతన్ :
సీతన్ ముఖకాంతి విజిత సిత ఖద్యోతన్ .
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
('భాగ వతము 'నందలి
నవమ స్కంధము లోని 261 ,262 పద్యములు)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నాసికా వర్ణనము
,,,,,,,,,,,,,
(రామ రాజభూషణుని ప్రబంధము " వసు చరిత్రము")
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే :
లా నన్నొల్ల దటంచు గంధ ఫలి బల్కాకం దపంబంది, యో
షా నాసాకృతి చూచి, సర్వ సుమన స్సౌరభ్య సంవాసమై :
పూనెం ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజము నిర్వంకలన్ .
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సూక్తి :
,,,,,,,,,,,,,,,,,,,
కార్పాసం కటి నిర్ముక్తం :
కౌశేయం భోజనావధి :
ఊర్ణ వస్త్రం సదా శుద్ధం :
ఊర్ణా వాతేన శుద్ధ్యతి .:
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నూలు వస్త్రము కట్టి ,విడిచే దాకా మడి:
పట్టు బట్ట భోజనము చేసేంత వరకూ మడి:
ఉన్ని బట్ట సదా మడియే !
ఇందుకు కారణమేమనగా ,
ఉన్ని గాలి వలన పరిశుభ్ర మౌతున్నది గదా!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కబీర్ దాసు
,,,,,,,,,,,,,,,,
"మాలా ఫేరత్ జుగ్ భయా :
ఫిరాన మన్ కాఫేర్ :
కర్ కా మన్ కా డారికే :
మన్ కా మన్ కా ఫేర్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అనేక సంవత్సరములుగా చేత
తావళమును త్రిప్పుచున్ననూ ప్రయోజనము అగు పడ లేదు.
మనస్సునే మాలగా చేసినచో,భగవానునికి చేరువ అగును.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
22, నవంబర్ 2008, శనివారం
బమ్మెర పోతన
ప్రాకట లక్ష్మీ కళత్ర భవ్య చరిత్రా :
లోకాతీత గుణాశ్రయ :
గోకుల విస్తార నంద గోప కుమారా!"
(బమ్మెర పోతన)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
20, నవంబర్ 2008, గురువారం
పలుకులు
,,,,,,,,,,,,,,
1) కాలికి వేస్తే మెడకు వేస్తాడు.
=సమస్యకు పరిష్కారం చెప్పడు,ఒకటే సాగదీస్తాడు."
2)కాలు,చెయ్యి ఆడినంత కాలం
మనిషన్నాక ,ఏదో ఒక పని చెయ్యాల్సిందే! ఊరికే కూర్చుండలేను."
3)"హంస నడకలు రాక పోయె,ఉన్న(తన) నడకలు మరిచి పోయె!"
4)"కాలు సాగనీ! కొంచెం కష్టమైనా ,నీ అంతట నువ్వే నడువు!"
5)నలుగురు నడిచిన బాటలో ,మనమూ నడిస్తే తంటాలు(=రిస్కు) ఉండదు.
/"గతాను గతికో లోకః."
6)నడవడికలు చక్క దిద్దేది నాటకము.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) హంస నడకలు/నడలు /
:::"హంస గమన"=స్త్రీ/గ గామిని/గజ గమన/మరాళ గమన
2) పిల్లి నడకలు=చప్పుడు లేకుండా నడచుట.
3)"ఏమిటా పెళ్ళి నడకలు? ,త్వరగా నడవండి!"
4)పాము నడకలు=వంకర టింకర నడకలు/ఒకే పార్టి వైపు స్థిరంగా తీర్పును ఇవ్వ లేక పోవడం.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
జాతీయములు
,,,,,,,,,,,,,
1)కాలికి బలపం కట్టుకుని తిరుగుట/చెప్పులు అరిగేలా తిరిగి /
అరి కాళ్ళు మోకాళ్ళు అయ్యేలా తిరిగారు./
2)"ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో!"అంటూ ,
ఆతని చేతులు పట్టుకుని ఎంతగానొ బ్రతిమాలాడు./కాళ్ళు,గడ్డాలు పట్టుకుని బతిమాలుతూ/కాళ్ళు,కడుపు పట్టి/ కాళ్ళు,చేతులూ పట్టుకుని /
3)"అతని అరి కాలిలో చక్రం ఉన్నది,
అందుకే పొద్దస్తమానము తిప్పాయిలాగా తిరుగుతూనే ఉంటాడు."
4)మోచేతి నీళ్ళు త్రాగుట=ఆధార పడి ఉండుట
5) కావేరీ గుర్రాలు =స్పీడుగా,వడి వడిగా ,కాలి కొద్దీ పరుగులెత్తుట/
6) కాలు గాలిన పిల్లిలా (బాధలు ఓర్వలేక)తిరుగుట
7) కాలికి బుద్ధి చెప్పుట/పిక్క బలం కొద్దీ పరుగెత్తి,పారి పోయారు./దౌడు తీయుట
8)కయ్యానికి కాలు దువ్వుట /కాలు దూయుట
9)ఇక నా వల్ల కాదనీ కాళ్ళు (బార) చాచుకుని ,చతికిల పడి.
10)'ముసలయ్యా! కాళ్ళు సాచుకుని,కృష్ణా! రామా! అనుకుంటూ
మూల కూర్చోక ,నీకు ,అనవసరపు ఆసక్తి ఎందుకు?"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని )
,,,,,,,,,,,,,,,
" తేటలుగా జిగి ముత్యపు :
పేటలుగా,పంచదార వూటలుగా,పూ :
తోటలుగా, రా చిలుకల :
మాటలుగా ,కంస వైరి మాటలు తనరున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"కావి కాదది, విడి కెంపు దీవి కాని :
దీవి కాదది అమృతంపు బావి కాని :
బావి కాదది కపురంపు తావి కాని :
తావి కాదది శౌరి కెమ్మోవి కాని."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
19, నవంబర్ 2008, బుధవారం
పలుకులు
,,,,,,,,
1)చేతులు కట్టుకొనుట= వినయముగా ; శ్రద్ధాళువులై ఆలకించుట.
2)చేతులు ముడుచుకు కూర్చొనుట =
ఉదాసీనులై,ఏమీ తోచక ,ఉండుట.
3)"తన కూతుర్ని ,ఓ అయ్య చేతిలో పెట్టి,నిశ్చింతగా ఉండ గలనని"అన్నాడు.
(=బాధ్యతలను పూర్తిగా అప్ప జెప్పుట)
4)"ఇక్కడెవరూ చేతులకు గాజులు తొడుక్కో లేదు."
('అసమర్ధులము కాదు 'అనుట)
5)అర చేత ఉసిరిక /
"వానికి అన్నీ తెలుసు,అన్ని విద్యలు అతనికి 'కర తలామలకములే!"
(అమలకము=ఉసిరిక కాయ)
6)"ఈ వ్యవహారాన్ని తేల్చ లేము.ఇక మా వలన కాదు."
అనేసి ,చేతులు ఎత్తేసారు.
7)'చేయి ,చేయి కలిపి ' ,ఐకమత్యంతో
ముందుకు కదిలారు.
8)ఈ చేత్తో ఇచ్చినది,ఆ చేతికి తెలియ కూడదు.
(=ప్రతి ఫలమును కోరకుండా గుప్త దానము)
9)చేతులు కాలాక ,ఆకులు పట్టుకున్నట్లు.(నష్టం కలిగాక వగచుట వ్యర్ధం.)
10) "అతను చేతి బారు మనిషి,ధారాళంగానే దాన ధర్మాలను చేస్తాడు."/
' చేతికి ఎముక లేదు ...' :::
11) అర చేతి వేళ్ళు/ చేతి వ్రేళ్ళు అందరికీ ఒకేలా ఉంటాయా?
(బుద్ధి విశేషాలలో/డబ్బు దస్కములలో
అందరూ సమాన స్థాయిలో ఉండరనుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
11)చే బదులు/చే బదుళ్ళు= హామీ పత్రాల వంటివి అక్కర లేని చిన్న పాటి అప్పులు.
12)చేవ్రాలు ,చేతి దస్తూరి మొదలైనవి.
13)చే పాటి కర్ర /(ఊత కర్ర )
14)చేతి సంచీ::;
చేతిపనులు/చేతి వృత్తులు(కుమ్మరి,కమ్మరి వగైరా) = హస్త కళలు ,బొమ్మల తయారీ మున్నగునవి.
15) చేం తాడు ::: "చేంతాడు కురుచ ఐతే ,బావిని పూడ్చు కుంటారా?"
16)"అతను చేతి వాటం మనిషి,
అతను గనక వచ్చి నట్లైతే ,మీ ఇంట్లో వస్తువులు జాగ్రత్త,సుమీ!"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పోతన ,పద్యము
,,,,,,,,,,,,,,,,
"ఇందిందిరాతి సుందరి :
ఇందిందిర చికుర యున్న,దిందిందః శుభం :
బిం,దిందు వంశః యను క్రియ :
నిందీవర వీధి మోసె నిందిందిరముల్."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
దుష్యంతునికి తుమ్మెదలు ఈ రీతిగా చెప్పినట్లుగా అనిపించినది.
"ఈ సుందరి ఇందిరా దేవి కన్నా అందమైనది.
ఆమె చుబుకము 'తుమ్మెద ' వాలినట్లుండును.
చంద్ర వంశ పురుషుడా! ఇక్కడిక్కడే ఆమె ఉన్నది."
అనుచూ భ్రమరములు ఝుంకారములతో పలికినట్లే అనిపించినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వసు చరిత్ర(పద్దెము)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్లేక రాకా నిశా :::
రాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి,ఆ :::
రాజీవానన ఏడ్చె ,కిన్నర వధూ రాజత్కరాంభోజ కాం :::
భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబుగన్. "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రామ రాజ భూషణుని "వసు చరిత్రము "లోనిది ,ఈ పద్యము.
మిథ్య
,,,,,,,
" జ్యోతిషం జలదే మిథ్యా ; మిథ్యా శ్వాసని వైద్యకం ;
యోగో బహ్వశనే మిథ్యా ; మిథ్యా జ్ఞానం చ మద్యపే!::: "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తా// మేఘము విషయములో జ్యోతిష్యము పని చేయదు.
శ్వాస రోగమునకు వైద్యము మిథ్య.
అతిగా తిండి తినే వానివద్ద 'యోగము ; వృధా.
త్రాగు బోతునందు జ్ఞానము మిథ్య,హుళక్కి. "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
18, నవంబర్ 2008, మంగళవారం
పోతన పద్యము :(903)
,,,,,,,,,,,,,,
లలితాయతాష్ట భుజ మం :::
డల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీ :::
లలనా కాంతి స్ఫర్ధా :
కలిత లసద్ వైజయంతికా శోభితుడున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మేరు పర్వ శిఖరము వంటి నీల దేహముతో ,
నీల మేఘ ఛాయ కల స్వామి ,గరుడ వాహనుడు వచ్చెను.
కమనీయమైన దేహ కాంతితో దిక్కుల చీకట్లను విచ్ఛిన్నము చేసెను.
ఎనిమిది ఆయుధములు ధరించి,
ముని జన పరివేష్టితుడైన నరాయణుడు,
మెరిసే చెవుల కుండలముల కాంతులు చెక్కిళ్ళ మీద ప్రతి ఫలించ సాగెను.
నవ రత్నములు తాపడము చేసిన కిరీటమును,
వక్ష స్థలమున కౌస్తుభమును,పచ్చని పట్టు పీతాంబరములతో ,భాసిల్లుచుండెను.
నారాయణ మూర్తి హారములను, బాహు పురులను ,
కంకణములను, ఘల్లు టందెలను ధరించెను.
(903)
మనోహరమైన ఎనిమిది బాహువుల నడుమ వక్ష స్థలమునందున :శ్రీ లక్ష్మీ దేవి ప్రకాశించు చున్నది. ఆమె కాంతులతో స్పర్ధ వహించుచూ "వైజయంతీ మాల " తళుకులీనుచున్నది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భాగవతము,(పంచమ స్కంధ,902,903)పద్యము
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(సీస పద్యము) :::
,,,,,,,,,,,,,,,,,
"ఘన మేరు శృంగ సంగత నీల మేఘంబు :
నెరి గరుడ స్కంధ నివసితుండు :::
కమనీయ నిజ దేహ కాంతి విపాటితా :
భీలాఖిలా శాంతరాళతముడు:
సు మహితాష్టాయుధ సుమనో మునీ:
శ్వర సేవక పరిజన సేవితుండు :
మండిత కాంచన కుండల రుచిరోప :
లాలిత వదన కపోల తలుడు :::
(తేట గీతి) :::
" జారు నవ రత్న దివ్య కోటీర ధరుడు :
కౌస్తుభ ప్రవిలంబ మంగళ గళుండు :
లలిత పీతాంబర ప్రభాలంకృతుండు :
హార కేయూర వలయ మంజీర యుతుడు. :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(కందము):::
,,,,,,,,,,,,,,,
" లలితాయతాష్ట భుజ మం : డల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీ : లలనా కాంతి స్పర్ధా : కలిత లసద్ వైజయంతికా శోభితుడున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వేమన పద్యము
,,,,,,,,,,,,,
కనగ సొమ్ములెన్నొ, కనకం బదొక్కటె :::
పసుల వన్నెలెన్నొ, పాలొక్కటియే!
పుష్ప జాతు లెన్నో ,పూజ యొక్కటె :::
విశ్వ దాభి రామ !వినుర వేమ! "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పోతన పద్యము
,,,,,,,,,,,,,,,,,,
సీసము://
"ఏ బాము లెరుగక యేపారు మేటికి :
పసుల కాపరి ఇంట బాము కలిగె:
నే కర్మములు లేక యెనయు నెక్కటికి :::
జాత కర్మంబులు సంభవించె :
నే తల్లి చను బాలు నెరుగని ప్రోఢ:
యశొద చను బాల చొరవ నెరిగె:
నే హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు :
పొదిగిటిలో వృద్ధి పొంద జొచ్చె :::
ఆట //
నే తపములనేని నెలమి పండని పంట :
వల్లవీ జనముల వాడ పండె :
నే చదువులనైన నిట్టిట్టి దన రాని :
అర్ధ మవయవముల నందమొందె! "
...................................
కష్టమే ఎరుగని శ్రీ కృష్ణునికి
పసుల కాపరి ఇంట సంక్లిష్టతలను అనుభవించ వలసి వచ్చినది.
కర్మలే అంటని దైవమునకు ,జాతక కర్మలు జరగాల్సి వచ్చినది.
యశోద చను పాలను కుడువ వలసి వచ్చెను.
హాని,వృద్ధులు తెలియని బ్రహ్మము,
తల్లి ఒడిలోన పెరుగ వలసెను.
ఎట్టి తపస్సులకును సాధ్య మవని
కన్నుల పంటలు ,వ్రజ వాసులకు దక్కినది.
ఎలాంటి చదువుల ద్వారానైనా
" ఇలాంటిదీ" అనివర్ణించ లేని అర్ధము
క్రమముగా వృద్ధి నొందుచున్న అవయవముల
అంద చందములు అలరారు వాడు అయ్యెను . "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వసుధైక కుటుంబకం
,,,,,,,,,,,,,,,,,
" అయం నిజః ,పరో వేతి గణనా లఘు చేతసా:::
ఉదార చరితానాం తు "వసుధైక కుటుంబకం ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" వీరు నా వారు, వారు పరాయి వాళ్ళు"
అనే భావాన్ని సంకుచిత మనస్కులు కలిగి ఉంటారు.
ఉదార స్వభావులకు " ఈ జగమంతా ఒకే కుటుంబముగా " గోచరిస్తుంది.
పుస్తకము
" తైలాద్రక్షే, జ్జలా ద్రక్షే ,ద్రక్షే చ్చిధిల బంధనాత్ :
మూర్ఖ హస్తే న దాతవ్య "మేవం వదతి పుస్తకం."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పుస్తకము ఇట్లు తలచును,
"నన్ను నూనె తగలకుండా రక్షించ వలెను,
నీళ్ళు తగల కుండా రక్షించ వలయును,
కట్టి ఉంచిన త్రాడు(=బంధనము) శిధిలము అవకుండా కాపాడ వలసినది,... ఇంకా ,నన్ను మూర్ఖుని కరములలో ఉంచ వలదు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పదములు,జాతీయములు
,,,,,,,,,,,,,,,,,,,,,,
1)ఘుణాక్షర న్యాయము= నుసి పురుగు ,కాండమును తొలిచినప్పుడు,
ఆ రూపంలో అనుకోని రీతిలో ,అక్షరముగా ప్రత్యక్షమగుట.
(ఒక పనిని చేస్తూ ఉండగా,అనుకోని తీరులో వేరే పనులు కూడా పూర్తి అగుట.)
2)జల కతక రేణు న్యాయము= చిల్ల గింజ వంటి దినుసులను వేసి,
తేట నీటిని సాధించి త్రాగుదురు.
అలాగే,అభ్యాసము,కృషి వలన,మనిషి విద్యా,విజ్ఞానములను ఆర్జిస్తాడు.
3)యధా సంఖ్య న్యాయము= క్రమ పద్ధతిలో,వరుసగా నేర్చుకోవాలి.
::: ("అన్న ప్రాసన నాడే ఆవకాయ పెడ్తున్నట్లు.")
4)విద్య లేని వాడు వింత పశువు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
5)అన్న(అన్నము)దీక్షయే కాని,అక్షర దీక్ష లేదు.
6) "అ,ఆ"లు రావు,గానీ అగ్ర తాంబూలం మాత్రం కావాలి.
7)చదువు చారెడు ,బలపములు
దోసెడు.
8_చదవేస్తే ఉన్న మతి పోయిందంట.
9)చదవా లేదు,మరువా లేదు.
10)తెలిసే వరకు బ్రహ్మ విద్య,తెలిసిన తర్వాత కూసు విద్య.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
17, నవంబర్ 2008, సోమవారం
పాయసము = తిరు గణీ మధు , తిరు పణ్యారము
,,,,,,,,
1)భోజనము,భోజనాదికములు ,భోజనానంతరము తాంబూల సేవనము,
2)ఆహారము,ఆహార సముపార్జనము,
::: ఆహార వ్యవహారములు ,ఆహారాన్వేషణ,
3)విందు, విందు భోజనములు,పెళ్ళి వారి విందు,
"పప్పన్నము ఎప్పుడు పెడతావు?"
(=పెళ్ళి ఎప్పుడు చేసు కుంటావు?):::
4) పప్పు,ధప్పళము, నవ కాయ
పిండి వంటలు,షడ్రసోపేత భోజనము/విందు ,(షడ్రుచులు),
5)"భోజనము అమృతోపమానంగా ఉన్నది."
6)ప్రసాదము,దేవుని నైవేద్యము,
అవసర నైవేద్యము ,మహా నైవేద్యము ,::
తిరు పణ్యారము= శ్రీ విష్ణు మూర్తికి ఒసగే నైవేద్యము. క్షీరాన్నము,పాయసము,పాలన్నము,
పాల పాయసము,పాయసాన్నము::: పొంగలి.
7)పొంగలి ,కట్టె పొంగలి ,కిచిడి
8)గోరు ముద్దలు పిల్లలకు తినిపించుట.
9) = పాయసము = తిరు గణీ మధు
10)మధురాన్నము,మధు భక్ష్యములు,
భక్ష్యములు ,భోజ్యములు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
11) కూడు,తిండి, తిండీ తిప్పలు,
12)(చలివేంద్రము=వేసవి కాలములో బాటసారులకు మంచి నీళ్ళు ఇచ్చు సెంటర్),:::
చల్ది అన్నము,
చద్దన్నం మూట,చద్ది మూట,
13)పెరుగన్నము,పెరుగన్నం మూట,దధ్యన్నము :::దద్ధోజనము,పులిహార
14)టిఫిన్ చేయట =అల్పాహారము తినుట,
పార్టీ ఇచ్చుట, తేనీటి విందు,::: అల్పాహార విందు :::
15)బ్రేక్ ఫాస్టు,లంచ్ ,డిన్నరు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సుభాషితములు
సుభాషితములు :::
,,,,,,,,,,,,,,,,,,,,
"రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా,
పాపే పాప పరాః సదా:
రాజాను మను వర్తంతే,
"యధా రాజా,తధా ప్రజా".
...................................
రాజు ధర్మ వంతుడు ఐతే ప్రజలు ఔతారు.
రాజు పాపాత్ముడు ఐతే,ప్రజలు అంతే!
రాజును ప్రజలు అనుసరిస్తారు.
"రాజు ఎలాగో ,ప్రజలూ అంతే!."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సుభాషితములు
సుభాషితములు :::
,,,,,,,,,,,,,,,,
"సులభాః పురుషా లోకే సతతం ప్రియ వాదినాః :
అప్రియస్య చ పథ్యస్య వక్తా,శ్రోతా చ దుర్లభః."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కమ్మని కబుర్లు చెప్పేవాళ్ళు దొరుకుతారు.
కానీ ,మేలును చేకూర్చే మాటలు,
అవి కటువుగా ఉన్నప్పటికీ ,
చెప్పే వాడు(=వక్త), వినే వాడు తటస్థ పడటమనేది ,దుర్లభము.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప్రొవెర్బ్స్
2)రసం ముదిరితే రాగం,పాకం ముదిరితే పాట.
3)" రహస్యం! వడ్ల గింజలో బియ్యపు గింజ!"
4)"సంద్రంలో అలలు అణిగాక,స్నానం
చేస్తాను!"అన్నాడట.
5)సముద్రంలో కాకి రెట్ట చందం.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)"పూజా పునస్కారాలు లేక ఇల్లాగ బూజెక్కి ఉన్నాను గానీ,
నైవేద్యం పెట్టు!నా మహిమలు
చూపిస్తాను!"అన్నాడంట.
7)పైన పటారం ,లోన లొటరం .
8)"అరుంధతీ,గిరుంధతీ అగుపడటం లేదు గానీ,
ఆరు నూరుల అప్పు మాత్రం కనపడుతూన్నది."
9)అయ్య సామెల్లా ఇంట్లో మాత్రమే!
10)మహారాజు గారని మనవి చేయ బోతే ,
మరి రెండు (కొరడా దెబ్బలు) వడ్డించ మన్నారంట!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పసిడి పలుకులు
,,,,,,,,,
1)బంగరానికి తావి అబ్బినట్లు.
2)పలుకే బంగారమయ్యేనా?!
3)బంగారు బొమ్మ.=చక్కని చుక్క=అందాల భరిణ=అపరంజి బొమ్మ.
4)"శ్రీరాముడు మంచి బాలుడు. అతడు మేలిమి బంగారం."
5)ఆమె బంగారు పూలతో పూజ చేసుకున్నది,అందుకే అంత మంచి మొగుడు లభించాడు."
6)ముంగొంగు పసిడి=కొంగులో కట్టు కున్న బంగారం వలె,"కోరికలన్నీ తీర్చేది."
7)"బంగారం బంకలు సాగుతుంది."
భాగ్య వంతులు,అదృష్ట వంతులు)
8)పసిడి వన్నె చాయ(ఆమె మేను బంగారు రంగు.)
9)వడ బోసిన బంగారం.=నిఖార్సు ఐన స్వర్ణం(=వాడి ప్రవర్తనకు వంకలు పెట్టొద్దు,వాడికేం?,వడబోసిన//మేలిమి బంగారం.)
10)బొడ్డులో బంగారంతో పుట్టాడు./బొడ్లో వరాలు పోసుకుని పుట్టావా?
11) "పట్టిందల్లా బంగారమౌతున్నది."
12)ఎక్కడైనా ,ఎవరైనా బంగారం తింటారా?
13)బంగారు గుడ్లను పొదిగే బాతు .
14)స్వర్ణాంధ్ర ప్రదేశము మనదే!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సామెతలు
,,,,,,,,,,
1) భోజుని వంటి రాజు ఉంటే,కాళి దాసు వంటి కవి అప్పుడే పుడతాడు.
2) కట్టిన ఇంటికి 'వంకలు '(=పణుకులు) చెప్పే వారు వెయ్యి మంది.
3)ఇల్లు కట్టి చూడు,పెళ్ళి చేసి చూడు.
4)ఇంటి కంటె గుడి పదిలం.
5)ఇంటి కొక పూవు,ఈశ్వరుడికి దండ.
6)ఇంటింటి రామాయణము.
7)ఇంట్లో పిల్లి,వీధిలో పులి.
8)తిన్న ఇంటి వాసాలను లెక్క పెట్టినట్లుగా!
9)ఇంటికి ఒకటే సింహ ద్వారము.
10)"మీ ఇంట్లో తిని,మా ఇంట్లో చెయ్యి కడుక్కోమని "అన్నట్లు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మధు సూదన సరస్వతి ,తులసీదాసును పొగడుట
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"ఆనంద కాననే హ్యస్మిన్:జంగమస్తులసీ తరుః :::
కవితా మంజరీ యస్య రామ భ్రమర భూషితా.":::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మధు సూదన సరస్వతి గొప్ప పండితుడు,భక్తుడు.
మహా కవి 'తులసీ దాసు 'ను,
ఈ పద్యములో ప్రశంసించిన నిగర్వి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పోతన పద్య రత్నములు
,,,,,,,,,,,,,,,,,,,,,,,
పాపనికి నూనె తల యంటి,పసుపు పూసి :::
బోరుకాడించి,"హరి రక్ష!పొమ్మ"టంచు:::
జలము లొక కొన్ని చుట్టి రా చల్లి,తొట్ల:::
నునిచి ,దీవించి ,పాడి రయ్యువిద లెల్ల!
" జో జో కమల దళేక్షణ!:
జో జో మృగ రాజ మధ్య!జో జో కృష్ణా! :::
జో జో పల్లవ కర పద!:
జో జో పూర్ణేందు వదన !జో జో యనుచున్."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
12, నవంబర్ 2008, బుధవారం
సామెతలు ,పలుకు బడులు
,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) "ఈ చెవిని విని,ఆ చెవిలో(నుండి) వదిలేయాలి."
2)"'కర్ణా కర్ణిగా వినీ ,ఆ విన్నది నీకు చెప్పాను."
3)చెవిని (=చెవిలో) ఇల్లు కట్టి ,పోరుట.(=చెప్పదలుచుకున్న విషయాన్ని ,
ఎదుటి వారి మనసుకు ఎక్కే దాకా ,విడువకుండా చెప్పుట)
4)'నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి నేనీమైనా "చెవిలో
పువ్వు "పెట్టుకుని కనిపిస్తున్నానా?'
5)చెవిలో గుస గుసలు (=రహస్యాలు)
6)'చెవులు మూసి,చేతి కిస్తా!'
(=బాగా తన్నుట)
7)చెవిటి వాని ముందు శంకు (=శంఖము) ఊదినట్లు .
8)చెవులు పట్టి ఆడించుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)చెవులు మెలి పెట్టుట.(=ధాష్ఠీకము)
2) చెవుల పిల్లి=కుందేలు.
3)"నీకు ప్రమోషన్ వచ్చిందనీ మాట నాకు
"చెవుల పండుగ"గా ఉన్నది.(/"వీనుల విందు")
4)"చెవులు కొరుక్కొంటున్నారు," ఏమిటో,ఆ రహస్యాలు?,
కాస్త మా చెవిలో కూడా వేయొచ్చును కదా!."
(/చెవులు కరచుట)
5)చెవిలో సొంఠి కొమ్ము ఊదుట. (=పరుషంగా ,కటువుగా మాట్లాడుట)
6)కర్ణేజవుడు=కొండెములను,చాడీలను చెప్పే వాడు.
7)కర్ణా కర్ణిగా వినుట=పుకార్లు మున్నగునవి.
8).వింటి నారిని పార్ధ సారధి
"ఆ కర్ణాంతము" లాగి,సంధించెను.
9)కర్ణ రసాయనము=చెవులకు ఇంపైనది.
10)శ్రుత పాండిత్యము =కేవలము వినుట తోడనే ,పట్టు బడిన విద్య.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) శ్రోత =వినేవాడు.
2) వినికిడి,("అతణ్ణే నాయకునిగా ఎన్నుకుంటున్నారని 'వినికిడీ .")
3)"ఈ పురాణ గాధలను"విన్నా,కనినా' పుణ్యము లభిస్తుంది."
/'విన్న వారూ ,కన్న వారూ తరిస్తారు.'.
4)"ఇలాంటి వింతలూ,విడ్డూరాలనూ ఎన్నడైనా విన్నామా!కన్నామా!"
5)"విన్నారా,కనుగొన్నారా?"
6) "ఫ్లైయింగు సాసర్లూ అనేవి ఉంటాయని 'విన్న వాళ్ళే గాని ,చూసిన (/కన్న వాళ్ళు)లేరు."
7)'విన్నది విన్నట్లుగా చెప్పూట.'
8)"నా మాట విను!" (= ఆచరించు/పాటించు! )
9)అధికారులకు 'విన్న వించుకొనుట.'
10)వినతి, 'వినతి పత్రము 'ను సమర్పించుకొనుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)'శ్రీకారములాంటి చెవులు.
2)చెవుల పోగులు ,చెవి కుండలాలు .
3)కర్ణ భూషణాలు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఊరక రారు మహాత్ములు
అలతి అలతి పదములలో తెలుగు పదముల శోభలు ,ఇవి!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వసు దేవుడు ,"గర్గ మహర్షి"ని వ్రేపల్లెకు పంపెను.
అచ్చట నందుడు ఆ మునివర్యునికి సత్కారములు చేసి ,ప్రశ్నించెను.
( గర్గ మహర్షి "శ్రీ కృష్ణుడు" అనీ,
"బల రాముడు"అనిన్నీ,
వారికి నామ కరణములు చేసిన భాగ్యశాలి! )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" ఊరక రారు మహాత్ములు :::
వారధముల ఇండ్ల కడకు వచ్చుట లెల్లన్ :::
కారణము మంగళములకు :::
నీ రాక శుభంబు మాకు నిజము ,మహాత్మా! "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తా// ::: "ఊరికే రారు గదా మహాత్ములు!
తమ వంటి వారు మా వంటి చిన్న వారి వద్దకు రావడమే
మాకు ఎన్నో శుభములను కలిగించును.
మీ రాక మాకు నిజముగానే శుభ దాయకము,మహాత్మా! "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
8, నవంబర్ 2008, శనివారం
గురువు
,,,,,,,,,,,,
1) "ఆచార్య దేవో భవ!" (తైత్తిరీయం )
2) "ఆచార్యవాన్ పురుషో వేద!" (ఛాందోగ్యోపనిషత్ )
3)'గు 'శబ్ద స్త్వంధ కారాభ్యో: 'రు 'శబ్ద స్తన్నిరోధక :::
అంధకార నిరోధిత్వాద్గురు రిత్య భిధీయతే!"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గు=అజ్ఞానము :::
రు= ఆ అజ్ఞానమనే అంధ కారమును తొలగించువాడు :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజ్జన శలాకయా :::
చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః :::
"'అజ్ఞానమును తొలగించి,జ్ఞానము 'అనే
అంజనమును పూసి,కన్నులను తెరిపించే వాడే 'గురువు '."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"గురు ర్బ్రహ్మ!
గురుర్విష్ణో
గురుదేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పరం బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః ! "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మయూరుడు,"సూర్య శతకము"
రచించిన "సూర్య శతకము"నకు :::
శ్రీ దాసు శ్రీ రాములు" (1846 -1908)
తెలుగులో లావణ్య పదానువాదము చేసారు.
శ్రీ దాసు శ్రీ రాములు గారి
ఆంధ్రీకరణలో ఒక పద్యము ఇది!
" వెలుగొకడే కనుం గవయి ,పేర్చు జగత్త్రయి నల్వ నాల్గు మో:::
ముల నుతి కెక్కి,పంచమసుభూతము నా దగి యారు కార్ల ని :::
చ్చలు పలు రీతుల న్నెగడి సప్తముని 'స్తుతి ' నష్ట దిగ్రతిన్ :::
బొలయు నవార్క దీ ధితులు,నూరు పదుల్ శుభ శోభ మీ కిడున్. "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఒకటే వెలుగై,,
రెండు కళ్ళకు చూపులను ఇస్తూ ,,
మూడు జగత్తులలోనూ నిండి ఉండి,,,
నాలుగు మోములు గలిగిన బ్రహ్మ చేత స్తుతించ బడుతూ ,,,
ఐదు భూతములలో వ్యాపించి,,,
ఆరు ఋతువులను కలిగిస్తూ,,,
ఏడుగురు ఋషుల పొగడ్తలను స్వీకరిస్తూ ,,,
ఎనిమిది దిక్కులను(తన 'నవ '=)
తొమ్మిది కాంతులతో వెలిగించే,
సూర్య దేవుని సహస్ర కిరణములు మీకు శుభములను కలిగించును గాక! "
/////////////////////////////////////////////////////////////////////////////
7, నవంబర్ 2008, శుక్రవారం
ఆకాశ రామన్న ఉత్తరం
,,,,,,,,,,
1)కిల్టాశు =చీటి:::
2)ఆకాశ రామన్న ఉత్తరం =సంతకం లేకుండా ,అజ్ఞాత వ్యక్తి రాసే ఉత్తరము.
3)ఆకాశ రామన్న అర్జీలు = సంతకం లేని ఉత్తరములు
4)పుక్కిటి పురాణము ,=ఆకాశ పంచాంగము /
లోకాభి రామాయణము/పోచికోలు కబుర్లు/
చెప్పుగో దగిన విశేషాలు గానీ,విషయాలు గానీ లేని కబుర్లు.
5)అమ్మలక్కల ముచ్చట్లు = స్త్రీలు
ఒకచోట కూడి చెప్పుకునే కబుర్లు
6)అచ్చట్లు ముచ్చట్లు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)చెవులు కొరుకు కొనుట:::
కర్ణే జవుడు= గుస గుసలు ఆడే వాడు =
కొండేల మారి (చాడీలు చెప్పుట,
కొండెములు చెప్పుట):::
2)నాలుక కొరుక్కొనుట = 'పొర పాటు 'తెలుసుకొని,.../
3)నాలిక పై బీజాక్షరములు =విద్య అనుగ్రహము లభించుట :::
4)"నన్ను అంత మాట క్రూరంగా అన్నవు !అది నాలుకా? తాటి బద్దా?" :::
5)నరం లేని నాలుక ,ఎన్నైనా మాట్లాడును.":::
6)పుల్ల విరుపు మాటలు /సూటీ పోటీ మాటలు :::
'పుల్ల విరిచి పొయ్యిలొ బెట్టినట్లుగా మాట్లాడుట ,నిక్కచ్చిగా...../
7)కర్ణ కఠోరముగ = విన సొంపు లేని స్వరము/(పాట పాడుట)
8)"విన సొంపైన సంగీతము "
వీనులకు విందైన సంగీతము :::
'చెవులకి ఇంపుగా మాట్లాడుట '
9) కన్నుల పండుగ /కన్నుల పండువుగా /నయన పర్వము /
నేత్ర పర్వముగా /నయనాభిషేకము /నయన మనోహరముగా
10)కన్నుల ముత్యములు =ఆనంద బాష్పములు :::
ఆనందాశ్రువులు /
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సామెతలు :::
సామెతలు :::
,,,,,,,,,,,,,
1)చుట్టంచూపుగా వచ్చినారు।
2)చూడబోతే చుట్టాలు,రమ్మంటే కోపాలు.
3)బంధువుడవు,సరే! గాని,పెసర చేను పైన చేయి వేయొద్దు.
4)ఎక్కడైనా 'బావ 'గాని వంగ తోట వద్ద కాదు.
5)బంధు బలగము వారికి చాలానే ఉన్నది
.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)దశమ గ్రహము(=అల్లుడు).
7)అత్త లేని కోడలు ఉత్తమురాలు,కోడలు లేని అత్త గుణమంతురాలు.
8)అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు.
9)అత్తా ఒకింటి కోడలే!
10)"అవ్వ కావాలి,బువ్వ కావాలి"అంటే ఎలాగ? అన్ని నీకేనా/నేనూరుకోను,అంతే!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
11)"అమ్మ తోడు! నేను చెప్పింది నిజం!:
12)అటక ఎక్కిన అల్లుడు(=మూర్ఖుడు).
13)అయ్యవారిని(=మాస్టారు/పంతులు) చెయ్య బీతే కోతి అయ్యిందట!
14)"అయ్య గారి పని కొయ్యలొకి వస్తుంది. వంత ఇంకా అవనే లేదా?త్వరగా వడ్డించు!"
15)అయ్య వారికి చాలు ఐదు వరహాలు! పిల్ల వాళ్ళకు చాలు,పప్పు బెల్లాలు.
16)అయ్య, ముగ్గురు,తొమ్మండుగురు.(సర్వేశుడు,త్రిమూర్తులు ,నవ గ్రహాలు:::లెక్క మారదు.
)అయ్య వారి గుర్రం(దానికి అన్నీ అవ లక్షణాలే!,చెప్పినట్లు నడవదు.)
17)అయ్యవారు ఆకులు నాకాక ,దాసరి ప్రసాదమడిగినట్లు.
18)"అమ్మా! నీ అల్లుడు వచ్చడు!"అంటే ,"నన్నేమి చేస్తాడమ్మా!నిన్నే తీసికెళ్తాడ"న్నదిట.
19)అల్లుడికి ఐశ్వర్యం వస్తే,"అర్ధ రాత్రి గొడుగు పట్టమ"నాడట!
20)అల్లుడికి చేసిన అప్పు,అతిథికి కూడా పనికి వచ్చినట్లు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6, నవంబర్ 2008, గురువారం
భావ వ్యక్తీ కరణ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)ఎలుగెత్తి చాటుట ,చాటించుట,
(చాటింపు వేయుట ,=దండోరా వేయుట),టముకు వేయుట)
2) కేక::: కేక వేయుట,కేకలు పెట్టుట ,గావు కేకలు, గావు కేకలు పెట్టి ,
పేడ బొబ్బ , పెడ బొబ్బలు పెట్టి ,
3)అరచుట ,అరిచి,'గట్టిగా అరిచాడు.'::'గాండ్రించి అరిచి.'
ఉదా:// "నువ్వు ఎంత అరిచి 'గీ'పెట్టినా ,ఒక్క బొమ్మ కూడా వేయను,"
అని ఆ విద్యార్ధిని , భీష్మించుకు కూర్చున్నది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
4)తెలుపుట ,"తేట తెల్లముగా వివరించుట",వివరణాత్మకముగా చెప్పి ,"అన్నీ నాకే తెలుసుననే అహంభావము వాడికి." :::
5)వ్యక్త పరచుట ,వ్యక్తీకరణ,
భావ వ్యక్తీకరణ,
(అవ్యక్త భావము=మాటలతో చెప్ప లేనట్టి మనోజ్ఞ భావము.):::
భావ వ్యక్తీ కరణ,భావ వ్యక్తీకరణము :::
6)భావించుట,భావములు,
భావనా బలము ,
ఉదా:// "అన్యధా భావించ వలదు.",, "అలా భావించకండి ,మనము అందరమూ ఒక్కటే!" ,,తలచుట ,తలంపులు,తలపులు:::
"తలిచినదే తడవుగా ,చేసేసాడు/అనుకున్నదే తడవుగా...
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
7) నత్తి::: "నత్తి నత్తిగా మాట్లాడుతూ..." ,,,
తడ బడుతూ ,అడిగి,,తడబాటుతో అడిగి,
తొట్రు పడుతూ మాట్లాడుట ,,,
8)ముద్ద ముద్దగా మాట్లాడుతూన్న ,
ముద్ద మాటలు ,"వాని నాలుక మందము ,బండగా మాట్లాడుతాడు."
9) మృదు భాషణలు,సరస సల్లాపములు ఆడుట ,కేరింతలు కొట్టుట,
"సన్నాయి నొక్కులు నొక్కుట"
10)సన్న సన్నగా చీవాట్లు పెట్టుట:::
11)తిట్టుట ,అరచుట .....//
12)కబుర్లు ,ముచ్చట్లు ,ముచ్చట్లాడుట ,ముచ్చటలు పెట్టుకుని .....//
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
చర్చించుట
,,,,,,,,,,,,,
1)"పలికితే ముత్యాలు రాలుతాయా?" (= మిత భాషి):::
2)వాగుడు కాయ ,వస పిట్ట (ఎక్కువగా మాట్లాడే వారు):::
3)ద్వి భాషి ,దుబాసీ,బహు భాషా వేత్త ,
4)ప్రశ్న ::: ప్రశ్నలు వేయుట, ప్రశ్నించుట, ప్రశ్నార్ధకములు ,
5)పృచ్ఛకులు=ప్రశ్నించే వాళ్ళు:::
6)జవాబు:::"అది ప్రశ్న, ఇది జవాబు." :::, సమాధానము ,ఆన్సర్ ,బదులు ఇచ్చుట,బదులు పలికి ,
7)అడుగుట ,కోరుట ,,,'కోరికల కోరుట,'।
"అడిగిందే తడవుగా ,భక్తులకు వరములను ఇచ్చే దేవుడు"
8)చిలక పలుకులు వల్లించుట =ఎదుటి వ్యక్తి చెప్పింది చెప్పినట్లుగా పలుకుట.:::
9)వాదన,వాదించుట,తర్కము,తర్కించుట ,తర్క వితర్కములు,
మొండి వాదన ,మొండిగా వాదించుట ,
వాద ప్రతి వాదములు,వాగ్వాదములు,వాగ్విలాసములు,:::
చర్చలు,చర్చించుట ,చర్చా వేదిక :::
10)చమత్కరించుట,చమత్కారములు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
చేతి రాత
1)అక్షరాభ్యాసము :::
2)"ఓం నమశ్శివాయ!" :::
3) మంచి పనికి శ్రీకారము చుట్టుట :::
4) అక్షరమే పరబ్రహ్మ!" :::
5) "ఓం కారమిత్యేకాక్షరం ." :::
6)మేలు బంతి = 'కాపీ బుక్కు 'లో విద్యార్ధి చూచి రాసి,నేర్చుకోవడానికై ,
మొదటి పంక్తి అక్షరముల వరుస :::
7)గుంట ఓనమాలు = నేలపై న అక్షరములను దిద్దించుట .:::
(మొదటి మెట్టు పైన ఉండుట,ప్రారంభ దశ):::
8)ఒజ్జల బంతి =గురువుల ఒరవడి పంక్తి :::
9)డొక్క శుద్ధి కల వాడు= బాగా విద్యలు తెలిసిన వాడు.:::
10)గుండ్రని అక్షరములు ,
"ఆమె చేతి వ్రాత 'ముత్యముల కోవ.'/ముత్యాల క్రోవ:::
11)" వాడి చేతిరాత 'బ్రహ్మ రాత 'అసలు అర్ధము కాదు.":::/
అతడు రాసినది,కోడి గెలికినట్లుగా ఉన్నది.":::/తిక్కిరి బిక్కిరి రాత
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,
1)మాటలు,పలుకులు,భాషణలు,సంభాషణలు :::
2)పలుకుట,పలికించుట,మాట్లాడుట
ఉదా://"పలికెడిది భాగవతమట!,,
పలికించెడివాడు రామభద్రుండట...."
"పలుకే బంగారము."
3)అనుట, అన్నది/అన్నాడు/అన్నారు
ఉన్న మాటే అన్నాను." /"అనీ,అనిపించుకోరా!ఓఅత్త గారా! అని..."/
'అదన్న మాట సంగతి!' /
"అలాగని నేను అన్నానా?,చెప్పండి!"?
"ఏదో పెద్ద వాణ్ణి ,ఓ మాట అన్నా తప్పు లేదు."
4)ఉక్తి ,ఉక్తి వైచిత్రి :::/
సూక్తి ,సూక్తులు ,సూక్తి ముక్తావళి ,/
పునరుక్తి=చెప్పిన దానిని మళ్ళీ చెప్పుట/
5)చెప్పుట,చెప్పేసి ,చెప్పుకుని, /చెప్పాడు,చెప్పింది,చెప్పారు ,
6)"పలికించిన చిలక" ,మాట్లాడించి, చెప్పించి
ఉదా:// "ఒకరి చేత చెప్పించుకునే రకాన్ని కాను నేను!" /
కథను చెప్పించి/ "కథ చెప్పే దాకా ఊరుకోలేదు."///
"అనగానే సరా? అన్న మాటలను నిరూపించి ,చూపించండి."
మధురా నగరము
,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"గగనోన్నతంబులై-కనక కవాట స్ఫ:::
టిక మయ ద్వార కు-ట్టిమ వితర్ది :::
చంద్ర శాలా గవా-క్ష ప్రపాట్టాంతః పు:::
రంబులు గల భవ-నంబుల,రధ:::
గజ ఘోటక,భట దు-ర్గముల గాంచుచు వాద్య:::
నిక్వణంబులు విని- నివ్వెర బడి:::
పరిఖలుం ,బురుజులుం-పడగలుం ,గోపురం:::
బులు,ధనంబులు,ధాన్య-ములను జూచి::: "
"రత్నముల కొణిగల మయూ-రముల గాంచి:::
మాధురీ పూర్ణమైన దీ- 'మధుర 'యనుచు :::
మాటి మాటికి నిద్దియ-మానుషమని:::
ముచ్చటించుచు జను చుండ్రి-ముందు జూడ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
బల రామ కృష్ణులు మధురా నగరమును తిలకిస్తూ,
అబ్బుర పడుచూ ,వర్ణించు కొనిరి.
ఈ "సీస ,గీత "పద్యములు ,పోతనార్యుని విరచితము.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ముఖ్య పదముల అర్ధములు ::::::
,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)వితర్ది=అరుగు :::
2కవాటము=తలుపు:::గవాక్షము=కిటికీ
3)చంద్ర శాల= పై అంతస్థు :::
4)ప్రపా= పందిరి:::
5) కుట్టిమము=రాతి కట్టడపు నేల గల పెద్ద హాలు :::
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
4, నవంబర్ 2008, మంగళవారం
ఏనుగు, గాడిద
2)గాడిద బరువు ',(అతిగా బాధ్యతలు) మోయుట.:;;;/=మోత.:::
3)గాడిద గత్తర:::(చాలా గోల.)
..................................
4)గజ కర్ణం.(సదా కదులుతూ ఉండేది.):::
5)గున్నకు గున్న.(బొద్దుగా,ముద్దుగా ఉన్న పిల్లలు):::
(గున్న ఏనుగు=ఏనుగు పిల్ల):::
6)గాడిదకు గడ్డి వేసి,ఆవును "పాలు ఇమ్మన్న"ట్లు.
7)గాడిదకు భోగి పళ్ళు పోస్తే, బూడిద లో పొర్లిందట్.... (వృధా)...
8)గుడ్డెద్దు (గుడ్డి ఎద్దు)చేలో పడ్డట్టు. :::
9)గుడ్డివాళ్ళు నలుగురు,ఏనుగు కొలతలు తీసినట్టు. ;;;
10)ఏనుగు పాడి (=పాలు/పాడి సంపద సమృధ్ధిగా ఉండుట)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
11)ఏనుగు దాహము.(అత్యాశ).:::
12)హస్తి మశకాంతరము.
=(ఏనుగుకూ,దోమకూ ఉన్నంత భేదము ).
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
13)ఏనుగు కాళ్ళు/బోద కాళ్ళు. ......
14)కరి (ఏనుగు)మ్రింగిన వెలగ పండు.(లోన ఏమి లేకుంట.)......
...................................
15)గజ కర్ణుడు(పెద్ద చెవులు కల వాడు.)/చేట చెవులు.
16)ఏనుగు తిండి.(అతి తిండి).....
17) గజ కర్ణ ,గో కర్ణ ,టక్కు టమార విద్యలు.
(చిట్టి మోసాలు./సర్వమూ తెలసినట్లుగా)..
:::::::::::::::::::::::::::::::::::
బ్రహ్మర్షి
::::::::::
1)బ్రహ్మ దేవుడు= =చతుర్ముఖుడు ,
విరించి ,విధాత ,బ్రహ్మ భార్య "
సరస్వతీ దేవి.
బ్రమ ,విష్ణు ,పరమేశులు త్రిమూర్తులు
2) బ్ర హ్మ జ్ఞానము :::బ్రహ్మ జ్ఞాని :::
3) బ్రహ్మర్షి:::
4)బ్రాహ్మీ ముహూర్తము :::
:::::::::::::::::::::::::::::::::::
5)"అహం బ్రహాస్మి!"
6)"ఆనందో బ్రహ్మ!!!
:::::::::::::::::::::::::::::::::::
1)"వాడికి 'బ్రహ్మ చెవుడు.'
2)'బొమ్మ జెముడు చెట్టు ' ,'బ్రహ్మ దండి చెట్టు '
3)"బ్రహ్మ కమలము "పూవులు .
:::::::::::::::::::::::::::::::::::
3, నవంబర్ 2008, సోమవారం
రామ రాజ భూషణుని వర్ణన
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
చిగురు కెంగేలు సాచె రసాల వల్లరి :::
తేటి చూపుల చూచె తిలక లతిక :::
పిక గీతి పాడి, చూపె ప్రియాళు లత పల్కె :::
కర భాషల కర్ణికార శాఖ :::
ముఖ రక్తి నింపె నింపు గల సంపగి కొమ్మ:::
వన్నెగా నగియె లే(లేత) పొన్న తీగె :::
సురభిళశ్వసనంబు వెరపె సింధుక వల్లి :::
గ్రుచ్చె తావులు సోక క్రోవి రెమ్మ :::
ఆత్మ రుచిరో పచారంబు లధిక కల్ప :::
కంబునకు,తత్త దామోద గరిమ బెనుప :::
నంగనా నిత్య కలిత దోహద విశేష :::
సన్నుతాచారముల సడి సన్న కతన .
::::::::::::::::::::::::::::::::::
వృక్ష దోహదములు"గా
రమణీ మణుల సున్నిత చర్యలు ,
ప్రకృతికి గిలిగింతలు.
సృజనాత్మ కతలను ,పరిఢవిల్లజేసే ,
ఈ మనోజ్ఞ కల్పనలతో ,
మన కవుల ఘంటములు,
సారస్వత స్వర్ణ ద్వార బంధమునకు ,పూల తోరణము లను కట్టి,
రసజ్ఞ హృదయాలకు "స్వాగతములు"పలుకు చున్నవి.
::::::::::::::::::::::::::::::::::
proverbs
"అదేమైనా బ్రహ్మ విద్యా?,నేర్చుకో లేక పోవడానికి." :::
2)స్వామి వారి బ్రహ్మోత్సవములు
3)"అక్షరం పర బ్రహ్మ,"
4) "అన్నం పర బ్రహ్మ. " ,
అన్నము 'పర బ్రహ్మ 'స్వరూపము." :::
5)బ్రహ్మ సూత్రములు,బ్రాహ్మ్యము లు.
6)బ్రహ్మ జ్ఞాని(అన్నీ తెలిసిన వాడు.):::
7)బ్రహచారి ముదిరినా ,బెండ కాయ ముదిరినా దండగ. ...
8)బాల వాక్కు ,బ్రహ్మ వాక్కు.
9)"అహం బ్రహ్మాస్మి! అంతా మనకే రానీ! "
10)బ్రహ్మాస్త్రము (తిరుగు లేనిది.)/
రామ బాణము .
11)"బ్రహ్మ కడిగిన పాదము."
12) తెలిసే వరకు బ్రహ్మ విద్య,తెలిసిన తర్వాత కూసు విద్య.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; s
పోతన ప్రకృతి పరిశీలన
కమల సంపూర్ణమై- కమఠ ,మత్స్య :::
కమల ఛదములకు -కమనీయముగ నుండె :::కల హంసా లలర,వి -కాసముగను :::
గర్జనల్ చెల రేగ -కప్ప లరచు చుండె :::
పరివేషములు దివిం-పరిడవిల్లె :::
నిట్లు ప్రావృట్కాల -మేపు మీరగ నుండ :::
బల రామ కృష్ణ ,గో-పాల సుతులు :::
కొండ గుహలందు చల్దులు-కుడుచుచుండి:::
రావులున్ ,మృదు ఘాసమిల్ - "హాయి"మేసి:::
దీప్తమగు దుగ్ధ సంపద-తృప్తి దీర :::
నిచ్చు చుండెను నవ్వర్ష -ఋతువునందు.:::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కమలములకు(-నీరు /తామర పూలకు ) నిలయము ఐనది 'సరస్సు :::
కమలఛదము- "చులువ"అనే పక్షి,
ఇది నీళ్ళలో బుడుంగున మునిగి ,చాలా దూరము ,లోపలే వెళ్ళి ,పైకి లేచు చుండును.
'కమల ఛదము ' బాతు పిల్ల కంటె చిన్న పరిమాణము(=సైజు)లో ఉండును.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
బమ్మెర పోతన ప్రకృతి పరిశీలన ku
'నిలువు టద్దములు ' ,ఈ పద్యములు.
వర్ష ఋతువు వర్ణనము ఇది.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
2, నవంబర్ 2008, ఆదివారం
వృక్ష దోహదములు :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
స్త్రీల స్పర్శ వలన చెట్లు పూయునని ,
లోక ప్రసిద్ధ మృదు అభిప్రాయము.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
:అశోకశ్చరణాహత్యా, వకుళో ముఖ సీధునా:::
ఆలింగనాత్ కురువకః ,తిలకో వీక్షణేన చ :::
కర స్పర్శేన మాకందో,ముఖ రాగేణ చంపకః:::
సల్లాపతః కర్ణికార,స్సింధు వారో ముఖానిలాత్ :::
గీత్యా ప్రియాళుర్నితరాం న మేరు ర్హసితే న చ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అశోక వృక్షము పాద తాడనము చేతను;
పొగడ చెట్టు ఉమ్మి ఊయుటను;
ఎర్ర (పూల)గోరింట రమణుల కౌగిలి వలన;
తిలక వృక్షము పద్మ నయనల చూపుల చేతను;
మామిడి చెట్లు అతివల చేతి స్పర్శ తోటి;
సంపెంగ చెట్లు వనితల ముఖ రాగము తోడను;
కొండ గోగు చెట్టు(=కర్ణికారము)విలాసినుల సల్లాపములచే;
వావిలి చెట్టు మహిళల ముఖ శ్వాసలతోటి;
ప్రేంఖణము పాదపము;
సుర పొన్న నవ్వుల వలన (బాగుగా) పుష్పించును.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
నానుడి
,,,,,,,
1) నారు,నీరు,నోరు ,ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒకటే!:::
2)నిండు కుండ తొణకదు.:::
3)నాదముంటే గంట,వాదముంటే తంటా!:::
4)"తూటు"పేరే చిల్లి.(అల్పజ్ఞాని ,తనకే అంతా తెలుసునన్నట్లు ).
5)బండ మీది రాత.=శిలా శాసనం./వేద వాక్కు/
తిరుగు లేని మాట("ఆయన మాట ఇస్తే అక్షరశః "ముమ్మాటికీ నెర వేరుస్తాడు.")
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)నూరు పూసలకు ఒకటే కొలికి .
(కొలికి పూస"=పూసల దండకు ఆఖరున ,ఒక పెద్ద పూసను దారంలోనికి ఎక్కిస్తారు ,
దాని వలన పూసలు జారకుండా ఉంటాయి,దండ పూర్తి ఔతుంది.)
7)పాతది పనికి రాదు,కొత్తది కొర గాదు.:::
8)ఎల్లయ్య, మల్లయ్య చదువు/అత్తెసరు చదువులు/
వానా కాలం చదువులు/'చాకలి పద్దులు రాసే టంత చదువు వస్తే చాలు!' నంటూ>
(=అక్షర పరి జ్ఞానము కొద్దిగా ఉంటే చాలున 'నుట.):::
9)బంగారు చెప్పులైనా కాళ్ళకే తొడుక్కోవాలి.:::
10)బెల్లం పారేసి,ఆకును నాకినట్లు.:::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పోతన పద్య రత్నము:::"వర్ష ఋతువు "
,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,
(సీసము):::
"హాయి నిచ్చెడివాన-లప్పుడప్పుడు పడి:::
తుంపర ల్వెద జల్లి-దురుసు లేక :::
కాళింది నిర్మలో-ఘము సాంతముగ పారు:::
చును కర్షకుల తొలి-పనులు నడచు:::
పచ్చని పచ్చిక -భరితమౌ బీడులం:::
దింద్ర గోపంబులు-సాంద్రముగను :::
గాన్‌పించు ,మృదుకర-ఘాసంబులం దిని :::
బాగుగా నావులు-పాలు నిచ్చు:::
మృదు కుముద కంజ కింజల్క-మిళిత సురభి:::
మంద మలయా నిలము వీచి-బృంద వాసు:::
లకు మనోహరముగను వి-లాసముగను:::
నుండె,శ్రమ లేని యాతపం-బుండు కతన.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
అర్ధములు :::
,,,,,,,,,,,,,,
కుముదము=కలువ పువ్వు:::
కంజము=తామర పువ్వు:::
కింజల్కము=పూవులోని పుప్పొడి దారములు(filament in flower )
సురభి=వసంత ఋతువు:::
:::::::::::::::::::::::::::
ఇంద్ర గోపము=ఆరుద్ర పురుగు:::
ఇవి మిధున జ్యేష్ఠమున వచ్చు "ఆరుద్ర కార్తె "నందు ఉద్భవించును,
అందుచేత వానికి 'ఆరుద్ర పురుగులు 'అని పేరు వచ్చెను.
::::::::::::::::::::::::::::::::
సామెతలు
,,,,,,,,,,
,,,,,,,,,,
1) ఎక్కడ పొర్లినా ,మన మందలో ఈనితే సరి!:::
2)ఏట్లో వేసినా ,ఎంచి (లెక్క పెట్టి) వేయాలి . :::
3)"ఓబీ! ఓబీ! నువ్వు దంచు ,నేను పక్కలు ఎగరేస్తాను.":::
4)నరం లేని నాలుక (ఏదైనా మాట్లాడుతుంది). :::
5)చెట్టు ముందా?విత్తు ముందా? :::
6)ఎక్కమంటే ఎద్దుకు కోపం,దిగమంటే 'కుంటి '(=కుంటివాదు)కి కోపం.:::
7)కరవమంటే కప్పకు కోపం ,విడవమంటే పాముకు కోపం.:::
8)ముందు చూస్తే నుయ్యి ,వెనక్కెళితే గొయ్యి.:::
9)ఎగదీస్తే గో హత్య,దిగ దీస్తే బ్రహ్నత్య......
10)పొరుగింటి పుల్ల కూర(రుచి).:::
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1, నవంబర్ 2008, శనివారం
సామెతలు
,,,,,,,,,,,
,,,,,,,,,,,
1)"పాలు పొంగినట్లు మన ఇంటిలో సిరులు ఉప్పొంగుచున్నవి."
2)'పాల ముంచినా నీట ముంచినా నీదే భారము,స్వామీ! '
3)'పాలు చూడనా? ,భాండాన్ని చూడనా?'
4)పొంగే పాలూ ,వెలిగే దీపమూ.
5)పండు జారి పాలలో పడినట్లు.
6)'ఎక్కడైనా పొదుగు కోసి పాలు తాగుతారా?
ఇదెక్కడి చోద్యమమ్మా!!!!! '
...............................
.................................
పలుకు బడులు :::
,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,
1) పాల వెన్నెల :::
2) పాల పళ్ళు ,,, పాలు గారే బుగ్గలు ,,,
3) "చిదిమితే పాలు కారే చెక్కుటద్దముల వాడు ....."అని
దశరధుడు ,తన తనయుడు శ్రీ రామ చంద్రుని గూర్చి అనెను.
4) "పాలైన గారవే 'బంగారు చెక్కిళ్ళు..."
5)' పాలు ,వెన్నల లాగా ,పాలూ తేనెల్లాగ అన్యోన్యంగా ఉన్నారు."
6)" హంస వలె పాలు,నీరులను వేరుచేయ గలిగిన సమర్ధుడు ,
మన మర్యాద రామన్న !"
7)'పాల కాయలు '(=పిండి వంటలు )
8) క్షీరాన్నము = పాలతో చేసిన 'పరమాన్నము ',:::
పాల పొంగలి ,పాల కోవా ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
9) పాల కడలి =క్షీర సాగరము ,క్షీరంబుధి ,
10)పాలిండ్లు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గో వత్సములు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"భాగీరధీ!గంగ!- భారతీ!మహా లక్ష్మి!
గౌతమీ!క్షీర సా-గర!శుభాంగి!
మందాకినీ!సర్వ-మంగళా!ధేనుకా!! :::
మంద మారుతి!శుభా-నంద!విమల!
కామ ధేనువ!సుర-భీ!మేఘ మాలికా!:::
చింతా మణీ!యంచు-చిత్ర ముగను
వేర్వేరు పేరుల-ప్రేమతో పిల్వగా:::
కడు దూరమున నున్న-కదుపు లపుడు
గీ // చెంగు చెంగున గంతు ల-చ్చెరువు గలుగ :::
వేయుచున్ వచ్చి,కృష్ణుని-చేతి ప్రీతి:::
నాకుచుండెను మురియు చా-నందముగగను:::
దాని కని, గోప సుతులు మో-దమును గొనిరి."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈ ' సీసము ' ఛందస్సులోని పద్యము ,"పోతనామాత్యుని" అందమైన 'ఆంధ్రీకరణము '.
"కదుపులు " = గో వత్సములు ,లేగ దూడలు.::::::::
బాల కృష్ణుడు ,'చెంగు చెంగున ' గంతులేస్తూ ఆడు చున్న ఆవులను ,(తాను వాటికి పెట్టుకున్న ముద్దు పేరులతో )పిలుస్తూన్న "రమణీయ ఘట్టము "ఇది.)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ కృష్ణా!
,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,
"సువృక్ష మూల శాయినం :::
మృగారి మోక్ష దాయినం ::
స్వకీయ ధామ యాయినం :::
నమామి ! రాధికాధిపం ::: "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప్రకృతికీ ,మానవులకూ అవినాభావ ఆపేక్షా, సంబంధములు ఉన్నాయి.
పరమేశుడు నిరంతర సంచారి . మునులు " ప్రకృతి గవేషణ "చేసి ,
ఎన్నో అమూల్య విషయములను మనకు అందించారు.
" శ్రీ కృష్ణుని గురించి వేరే చెప్పాలా?
ఆ ' వట పత్ర శాయి ' ,బృందా వన విహారి ,మురళీ గాన లోలుడు ,
'సు వృక్ష మూల శా యి ,గోపాల బాలూడు ,
అడుగడుగునా ప్రకృతి అంద చందాలతో పెన వేసుకున్న జీవితము కదా ,ఆతనిది!!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...