3, సెప్టెంబర్ 2011, శనివారం

గుడిలో European మనిషి శిల్పము

Tanjavore,3rd floor window



తంజావూరు బృహదీశ్వరాలయము – 
టూరిస్టుల కళా  స్వర్గధామము. 
1000 సంవత్సరముల చరిత్ర ఉన్న 
ఈ గుడి పర్యాటక రంగంలో ఉన్నత స్థానాన్ని ఆర్జించింది. 


విభిన్న సంస్కృతుల మేళన శిల్పాల అద్భుతం 
ఇక్కడ అగుపడుతుంది.
యునెస్కో వారసత్వ సంపద- గా గుర్తింపు పొందిన 
మహా దేవాలయ నిర్మాణ విన్నాణము ఇది.


The World Heritage వారి పట్టికలోని 936 సాంస్కృతిక సంపదలలో/ 
ఆస్థులలో ఈ గుడి కూడా స్థానం ఆర్జించుకున్నది. 
క్రీ||శ|| 1004 నుండి 1010 వఱకూ కొనసాగిన 
అగణిత కళా కర్షక శ్రమ సోయగాలను నిలిపిన దృశ్య సీమ ఇది.
అనేకమంది శ్రద్ధాళువుల ఆసక్తి, జిజ్ఞాసలకు 
దక్కిన అందమైన ప్రపంచం ఈ మహా కోవెల.
ఈ తంజావూరు బృహదీశ్వరాలయములో 
ఒక వింత శిల్పము ఉన్నది.
("karu voorar" - In Tanjore big temple tower 
on the northern side of the tower, 
just above 3rd floor window, 
there will be picture of Englishman with the hat.
this is how "karu voorar" 
who has built the temple considered to be the holy man.)
 3 వ అంతస్థు తోరణ గవాక్షము పైన – 
టోపీ ధరించిన ఇంగ్లీషు మనిషి బొమ్మ చెక్కబడినది. 
ఒక రకంగా ఇది మురల్, 3-డి చిత్ర శైలి అని చెప్పవచ్చును.
భారతీయ శిల్ప విధానంలో –  
మరెక్కడా ఇలాటి పాశ్చాత్య శిలా విగ్రహాన్ని – 
ఆలయములలో  చెక్కి ఉంచే ఆస్కారం లేనేలేదు.
అందుకనే – రాయిలో చెక్కబడిన ఈ ఆంగ్లేయుని బొమ్మ 
చూపరుల దృష్టికి ఆలోచనలను రేకెత్తిస్తుంది.
ఇంతకీ ఈ శిల్పం ఎవరిది? 
తంజావూరు కోవెలను  దర్శించే కొద్దీ 
అనేక  mysteries తో అబ్బురపరుస్తూంటుంది.
స్థానికుల కథనం ప్రకారం -  అది ఒక డేనిష్ వ్యక్తిది.
వ్యాపార నిమిత్తమని - తమిళ్ నాడు రాష్ట్రములోని tranquebar కు  
చేరిన డెన్మార్క్ వర్తకుని బొమ్మ అది.
(ట్రాన్ బార్ లో Dansborg నిర్మాణం ఉన్నది)  
18 వ శతాబ్దంలో శరభోజీ మహారాజు వంశస్థులు 
Tanjore సామ్రాజ్యాన్ని పరిపాలించారు.
యూరప్ వాణిజ్య సంస్థలు ఆ పాలకుల వద్ద నుండి- 
తంజావూరులో లాంగ్ లీజు (long lease) కి తీసుకుని, 
తమ బిజినెస్సును చేసుకోవడానికి అనుమతి తీసుకున్నారు.
1800 వ సంవత్సరములలో – 
బ్రిటిష్ వారి వలన, వారి పాలన వలన,
 ఆధునిక యుగ ప్రభావం వలన దేశ, ప్రపంచ సమాజములలో 
పెను మార్పులు ప్రభంజనంలా జొరబడినవి. 
హిందూ దేశ సామాజిక, చారిత్రక రంగములలో 
కొత్త ఆవిష్కరణలకు ఈ పరిణామములు మార్గం సుగమం చేసాయి.
1800 వ సంవత్సరములలో – 
బ్రిటిష్ వారి వలన, వారి పాలన వలన, 
ఆధునిక యుగ ప్రభావం హిందూ దేశ సామాజిక, చారిత్రక రంగములలో 
కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేనది.
ఇండియా యొక్క గణిత, భౌగోళిక చిత్ర రచన అవసరమైనది. 
ఈ బృహత్కార్య భారాన్ని భుజస్కంధాలపైనిడుకున్న వాడు లాంబ్టన్.
Lambton హిమాలయ పర్వత శిఖరముల నుండి - కన్యాకుమారి అగ్రం వరకు 
సర్వే చేయసాగాడు. 
The Giant Theodolite


అప్పటి నుండి లాంబ్టన్ కృషి అవిరళంగా సాగింది.
అతడు  a mathematical and geographical survey  చేసాడు.
తంజావూరు జిల్లా యొక్క నైసర్గిక, జియోగ్రాఫిక్ కొలతలను కొలిచే – 
తలకు మించిన భారాన్ని తలకెత్తుకున్నాడనే చెప్పాలి. 
ఇండియా యొక్క గణిత, భౌగోళిక చిత్ర రచన అవసరమైనది. 
ఈ బృహత్కార్య భారాన్ని భుజస్కంధాలపై నిడుకున్న వాడు లాంబ్టన్.
William Lambton 1808 లో 
హిమాలయ పర్వత శిఖరముల నుండి - కన్యాకుమారి అగ్రం వరకు 
సర్వే చేయసాగాడు. 
అప్పటి నుండి లాంబ్టన్ కృషి అవిరళంగా సాగింది.
అతడు  a mathematical and geographical survey  చేసాడు.
తంజావూరు జిల్లా యొక్క నైసర్గిక, జియోగ్రాఫిక్ కొలతలను కొలిచే బృహత్తర విధిని – 
తలకు మించిన భారాన్ని తలకెత్తుకున్నాడనే చెప్పాలి.
అక్షాంశరేఖలు,  the arc of the meridian near to Equator, 
కేంద్ర బిందువు ఇత్యాది అగణిత అంశాలను ఆధారం చేసుకుని, 
గణితశాస్త్ర పరిజ్ఞానముతో అమేయ కృషి చేసాడు లాంబ్టన్.
అట్లాసు పటముల తయారీకి కనీస మౌలిక సదుపాయాలూ కూడా 
లేని దశ అది. అలాగా, ఆ పరిస్థితులలో,  పరిసర  జ్ఞాన విజ్ఞానములకు 
పునాదులను ఏర్పరచవలసిన పరిస్థితి అది.
ప్రాధమిక స్థితిలో ఉన్న భూగోళ, ఉపరితల శాస్త్ర అవగాహనతో 
 భూమి, భూగోళం కొలతలను తీసుకోవడమంటే మాటలు కాదు.
in 1808 Lambton mentions that the country was so flat 
that he had difficulty in locating any natural prominence for sighting.  
భూమి ఉపరితలమును – టైలర్ కుట్టాల్సిన వస్త్రానికి తీసుకునేటంత సులభం కాదు.
ఆ తరుణంలో లాంబ్టన్ తనకు అనువు ఐన వింత పద్ధతిని అనుసరించాడు.
భారత దేశంలో దాదాపు ప్రతి మారుమూల గ్రామాలలో కూడా దేవాలయాలు ఉన్నవి. 
కుగ్రామాలలో సైతం ఉన్న ఆలయ సంపద – అతడికి పరికరములుగా ఉపకరించినవి.
కోవెల గోపురములు ఆధారం చేసుకున్నాడు లాంబ్టన్.
దరిమిలా ఆతని పరిశోధనకు  Temple gopurams మూలములు ఐనవి. 
ఇట్లా ఆలయ శిఖరములు మౌలికమైన ఉపకరణములుగా చేసుకుని,
పృధ్వీ తల చిత్ర పటమును గీయడం,  
survey methods లలో బహుశా ఇదే మొదటిసారేమో!
ఇలాగ విభిన్నతను కలిగిన ఈ సంఘటన ప్రజలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొనేలా ఉన్నది.
అర్ధ టన్ను బరువు ఉన్న ఒక పరికరమును ఈ సర్వే కార్య నిమిత్తం వాడాడు లాంబ్ టన్. 
The Giant Theodolite  అనే ఆ ఇన్ స్ట్రుమెంట్ ను గోపురముల పైన, 
ఎత్తైన ప్రదేశాలలో అమర్చి, కొలుస్తూండేవాడు.
అలాగ తంజావూర్ గుడిలో మెజర్ మెంట్సును తీస్తూండగా 
ఆ ప్రాంతంలోని ఒక శిల్పం కింద పడి, విరిగిపోయింది.
అలాగ డామేజ్ ఐన బొమ్మ స్థానాన్ని భర్తీ చేయాల్సిన కర్తవ్యం అతనిదే ఐనది. 
కలోనేల్ విలియం లాంబ్ టన్ (Colonel William Lambton)
కొత్త విగ్రహాన్ని శిల్పి చేత, దగ్గర ఉండి చెక్కించాడు. 
ఆతని ఎదుట ఉండి, చేస్తూ, శిల్పకారుడు చేయడంతో , 
తనకు తెలీకుండానే ఆ బొమ్మలో లాంబ్ టన్ పోలికలతో చేసాడు.
లాంబ్ టన్ ప్రభావం ఈ పాశ్చాత్యుని ప్రతిమా నిర్మాణం పై ప్రసరించింది. 
తంజావూరులోని ఆ European  బొమ్మలో, 
లాంబ్ టన్ చెక్కిళ్ళ పోలికలు సుస్పష్టంగా అగుపిస్తున్నాయని, 
తంజావూరు నగర వాసులు అనుకుంటూంటారు. 

             [వ్యాసము :- కాదంబరి ]

@@@@@@@@@@@@@@@



In Tanjore big temple tower 
on the northern side of the tower, 
just above 3rd floor window, 
there will be picture of Englishman with the hat.
this is how "karu voorar" 
who has built the temple considered 
to be the holy man with the future vision! 



@@@@@@@@@@


http://www.sidharism.com
......................................…
Worldy Meaning for sidhar


siddhu Kat_Ravar = siddhar


Siddhu = Magical Playings / Mystics
Kat_Ravar = Who had Learnt Magics / playing
magics


......................................…
Actual Real Meaning for sidhar


siddhu Att_Ravar = siddhar


Siddhu = Magical Playings / Mystics
Att_Ravar = ... Aruthavar / Who had cutted / Left playing
magics
......................................…
http://www.sidharism.com/sidhars.html
......................................…


General Worldly Meaning for karuwoorar
Karuwoorar = Karu Voorar


Karur = Place near Trichy
woorar = person belonging to that particular place/ origin


......................................…
Real Actual meaning
Karuwoorar = Karuvil Voorathavar
(కరూర్- మున్నగు- ఊరిలో నివసించే వారు)


Karu = embryo (జననీ గర్భ కోశము)
voorathavar = wont come again in embryo


Person having first and last birth
There wont be a second birth / rebirth for him
Who wont come again in EMbryo
......................................…
Source(s):
http://www.sidharism.com/sidharPaadal.html


http://www.sidharism.com/sidhars.html


&&&&&&&&&&&&&&&&&&&&&&&


యునెస్కో వారసత్వ సంపద (Link 1 )
 [Great Living Chola Temples]

2 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

great information !!

kadambari చెప్పారు...

Thank you ఆత్రేయ గారూ!

(గుడిలో European మనిషి శిల్పము
శనివారం 3 సెప్టెంబర్ 2011 )

kadambari
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...