శ్రీ కృష్ణుని నాట్యము
ముగ్ధ మనోజ్ఞం//
1)సిగలో పింఛము మిల మిలలూ, జారి
వీక్షణముల నలరారినవి
2)కన్నుల చూపుల మిల మిలలు
నాసాభరణము చేరినవి
3)ముంగెర ముత్తెపు మిల మిలలు
లోలకులందున ఊయల లూగెను
4)కర్ణాభరణము మిల మిలలు
కౌస్తుభ మాలను చేరినవి
5)హార పతకముల మిల మిలలు
మొల దండలను తొణికినవి
6)జల జల కాంతులు మువ్వ లందియల
మంజీరముల ఎగసినవి
7)ఇన్నిన్నిగ భాసించిన ఆ తళ తళలు
ఏక మొత్తముగ భాసించగ గాంచిన భాస్కరుడు
"ధరాతలమున తనకు పోటీగా
వేరొక సూర్యుడు,వెలసెనేమొ"యని
భీతిలు చందము కనుగొనినంతనె
గోపికలందరు ఫక్కున నవ్విరి.
(బమ్మెర పోతనామాత్యునికి కృతజ్ఞతలతో)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) ::: ,,,,,,,,,,,,,,, " తేటలుగా జిగి ముత్యపు : పేటలుగా,పంచదార వూటలుగా,పూ : తోటలుగా, రా చిలుకల : ...
-
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
2 కామెంట్‌లు:
జయశ్రీక్రిష్ణా!
miiru naa bloglOni bhakti saMbaMdha vishayaalanu
aasaktitO chaduvutunnaMduku
many many thanks you sir!
కామెంట్‌ను పోస్ట్ చేయండి