అధ్యాయ శాఖ ;- 30 A ;- తాటాకుల కవిలె కట్ట సేకరణ ;;
; లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?
లేఖక్ 2 ;- ఎవరో చారుదత్తుడట - అతని బండి వద్ద చందనకునితో వీరకుని లడాయి,
ఉగ్రంగా - మన న్యాయ శాలకు వెళ్తున్నాడు ....
లేఖక్ 1 ;- ముందు మన వస్తువుల సేకరణ, ముందు పని అది,
'తాటాకుల - కవిలె కట్ట సిద్ధం చేసారా? -
అని పై అధికారులు మనల్ని రొక్కిస్తారు. పద, ఆ బుద్ధ విహారంలో పరివ్రాజకుడు,
అడగగానే కరుణతో ఆప్యాయంగా ఇస్తున్నారు. పద,తెచ్చుకుందాం ;
లేఖక్ 2 ;- వైద్య సేవిక [= నర్సు] రోజూ విహారానికి వెళ్తున్నది, ఎవరికైనా సుస్తీ చేసి ఉంటుంది,
లేఖక్ 1 ;- మాటలలో పడి మనం వచ్చిన పని మరుస్తాము, నడు.
లేఖక్ 2 ;- స్వామీ, శ్రమణక స్వామీ!
[ బౌద్ధ సంవాహకుడు బైటికి వచ్చాడు]
లేఖకుడు ;- స్వామీ, నేను లేఖకుడిని, కొంచెం సుద్ద రాయి ఇస్తారా!?
బౌద్ధ సంవాహక ;- ఇదిగో నాయనా, సుద్ద బలపం, తీసుకో,
ఆ రావి చెట్టు వెనుక తాటాకులు ఉన్నవి,
జాగ్రత్తగా కట్టి తీసుకుని వెళ్ళు.
వసంత సేన ;- వెళ్ళిన ఆ ఇరువురు - వాళ్ళెవరు??
బౌద్ధ సంవాహక ;- అధికరణ మండపంలో లేఖకులు.
న్యాయస్థానంలో నేరముల గురించి శోధిస్తారు.
న్యాయ పరిశోధకుల చర్చోపచర్చలు, వాదోప వాదములు,
ముఖ్యాంశాలను వీరిద్దరు లిఖిస్తారు.
ముందుగా నేల మీద బలపం రాయితో వ్రాస్తారు.
వేగంగా రాసే ఆ చిత్తు రాతల నుండి,
ప్రధానాంశములను - రెండవ వ్యక్తి - తాళ పత్రములలో వ్రాస్తాడు.
ఈ లేఖనములను పునఃశ్చరణ - చేసి, న్యాయాధికార గణం తీర్పును వెలువరిస్తారు.
వైద్య సేవిక - ఔషధాదులను మీకు సవ్యంగా ఇస్తున్నది కదా.
వసంతసేన ;- ఆమె శ్రద్ధగా వైద్యం చేస్తున్నారు. నా గాయాలు- త్వరగా తగ్గుతున్నవి.
శరణాగతులకు ఇంత గొప్ప ఆశ్రయం దొరుకుతున్నది. ఇది ఊహించని నా అదృష్టం.
; [ తాటాకుల కవిలె కట్ట సేకరణ ]
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣
2, జనవరి 2018, మంగళవారం ;-
30 B ;- చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు ;-
లేఖక్ 1 ;- న్యాయశాలకు అందరూ వచ్చారు. ధర్మాధిపతి, ధర్మాసనంలో ఉపవిష్ఠులైనారు.
న్యాయ హెచ్చరికల ఉద్యోగులు - ఆరుగురు వచ్చారు.
లేకక్ - 2 ;- శ్రేష్ఠి, కాయస్థులు, విషయ లేఖకులం మనము,
నేర అభియోగదారులు, ఇంతమందితో - మన అధికరణ మండపము నిత్య కోలాహలము.
శోధనకుడు ;- శోధనకుడు ఎలుగెత్తి చెబుతున్నాడు - నిశ్శబ్దం, నిశ్శబ్దం ;
న్యాయాధిపతి ;- ఈ రోజు ఏ కక్షిదారుల అంశములు - పరిశీలన చేయవలెను!?
శోధనకుడు ;- వారం దినముల నుండి నడుస్తున్నది వీరక, చందనకుల తగాదా.
అంతే గాక, రాజ బంధు శకారుల వ్యాజ్యం అనివార్యం.
శ్రేష్ఠి ;- కాయస్థుల వారూ! శకారుడు - అడుగు పెట్టాడంటే - ఎవరికో మూడిందన్న మాట.
కాయస్థులు ;- ఎందరో మంచివాళ్ళను, నిర్దోషులను శిక్షల పాలు చేసాడు, ఈ శకారుడు.
శోధనకుడు ;- శోధనక్ ఉవాచ, నిశ్శబ్దం, నిశ్శబ్దం.
అమ్మా, వసంతసేన తల్లిగారూ, మీకు పిలుపు వచ్చేదాకా - ఇటు పక్కన కూర్చోండి.
న్యాయాధిపతి ;- అధికరణ మండపంలో కొత్త వ్యక్తి, తమరెవరు?
చారు ;- చారుదత్తుడు మమ నామధేయం.
న్యాయాధిపతి ;- [లేచి నిలబడి] తమకు నమస్సులు.
దానధర్మములకు మారు పేరు - నేడు మీ ప్రత్యక్ష దర్శన భాగ్యం లభించింది, ధన్యుడినై తిని.
[ గదిలో అందరూ నిలబడి - నమస్కరించారు ]
శకార ;- ఇతనికి బహు మర్యాదలు చేస్తున్నారే - ఇతగాడే నేరస్థుడు,
ఈతనికి అనుకూలంగా తీర్పును ముందే నిశ్చయించుకున్నారు కదూ.
కాయస్థు ;- పొరబాటు, న్యాయ పరిశీలకులం - ఐదుగురం -
నిశితం మా దృష్టి - నిష్పక్షపాతం మా తీర్పు.
శకార ;- కళ్ళకు కట్టినట్లు - కనబడుతూనే ఉన్నది [ హుంకరించి, కూర్చున్నాడు]
చారు ;- కొత్త వ్యాపారం కోసం - పనుల మీద - పాటలీపుత్రం వెళ్ళాను. వారం తర్వాత వచ్చాను.
నా ఇంటికి వచ్చాను. నా భార్య ధూత, నా కుమారుడు రోహణుడు -
ప్రహరీ ద్వారం వద్దకు వచ్చి. సంతోషంగా నన్ను పలకరిస్తున్నారు.
ఇంతలో అదాటున రాజ భటులు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చారు.
ఏ వివరములు చెప్పకుండానే తెచ్చారు నన్ను ;
న్యాయ ;- క్షంతవ్యులం, మేము నిమిత్తమాత్రులం.
శకారుల అభియోగం మీరు వసంతసేన అనే వేశ్యను - హత్య చేసారని.
చారు ;- క్రిష్ణ క్రిష్ణా! అంత అభాండం నా మీదనా!?
శకారుడు ;- ముమ్మాటికీ నిజం. సాక్షులను తెచ్చుకున్నాను.
ఈ వీరకుడు, చందనకులు - నీ శకటంలో శివార్ల తోటకు వచ్చింది - వీరు చూసారు.
చందనకు ;- ఔను, లోపలికి తొంగి చూడ లేదు, గానీ - ఆర్యకుని కోసం గాలిస్తున్నాము - వీరి బండి -
సారధి - లోపల వసంతసేన ఉన్నారని చెప్పాడు.
వీరక్ ;- ఈ చందనకుడు చారుదత్తుని పేరు వినగానే వదిలేసాడు, దక్షిణాది మ్లేచ్ఛుడు ....
చందనక్ ;- చూస్తునారు కదా అందరూ, వదరుబోతు తనం ఇక్కడ ఎవరిదో ....
చారుదత్ ;- ఆ రోజు ఆమెను తీసుకురావడానికి - నా బండిని పంపాను.
కానీ ఆమె రాలేదు, వేరొకరు ఉన్నారు.
న్యాయ ;- ఆమె ఎవరు?
చారుదత్ ;- ఆమె కాదు, అతను - [తటపటాయిస్తూ] ఆర్యకుడు ....
శకార్ ;- ఐతే ఇద్దరిని, వసంత - ఆర్యకునికి కల్పించావన్న మాట 'శకట భద్రత'.
ఐతే ఇతగాడు రాజద్రోహి కూడా - తక్షణమే శిక్షించండి,
చారుదత్ ;- శివ శివా,
భటులు ;- నగల మూటతో పట్టుకున్నాము, ఇతని పేరు మైత్రేయుడు.
మైత్రేయుడు ;- చారుదత్త స్వామీ - మీరు ఇక్కడ ఉన్నారెందుకు?
వసంతమ్మ ఆభరణాలను ఆమెకు తిరిగి ఇవ్వమని మీరు ఇచ్చినవి.
వసంత సేన గృహమునకు - నగలను ఇవ్వడానికి -
నేను వెళుతుండగా - మార్గ మధ్యంలో భటులు అటకాయించారు,
నిష్కారణంగా పట్టుకున్నారు.
న్యాయ ;- శకారా, వసంతసేన తల్లిని పిలిపించాము.
ఆమె వచ్చింది. అమ్మా, ఈ నగలు మీ కుమార్తెవేనా?
తల్లి ;- వీరకుడు తోటలో కుమార్తె దేహాన్ని చూపించాడు. దుఃఖంలో మునిగిపోయాను.
ఆ ... ఇవి నా వసంత సేనవే.
న్యాయ ;- ఐతే శకారుని ప్రకారం, నీ తనూజ హత్య -
చారు దత్తుడు చేసాడని మీరు అనుకుంటున్నారా?
తల్లి ;- మునుపు నా వసంత ఇతని వద్ద తన నగలను దాచింది.
ఈ శకారునికి భయపడిన కారణాన ఆమె పారిపోతూ -
చారుదత్తుని ఇంట్లో ఆభరణాలను దాచింది.
కానీ వారి ఇంట దొంగ పడి, వసంత ఆభరణాలను దొంగిలించాడు.
ఐతే ఆ చోరుడు, అనుకోకుండా దోచిన సొత్తును - తిరిగి మా వద్దకు తెచ్చాడు.
న్యాయ ;- ఐతే నగలు పోగొట్టిన చారుదత్తులు చర్య?
తల్లి ;- అవకతవక పనుల మైత్రేయుడు ఇతనే, ఆ రోజు మా ఇంటికి వచ్చాడు -
చారుదత్తుల భార్య ధూతమ్మ. ఆమె తన ఒంటి మీద నగలను వలిచి ఇచ్చారట.
భార్యా భర్తలు ఇద్దరూ నిజాయితీపరులు.
ఇంటి మర్యాద కాపాడుకోవడం కోసం సర్వం ఇచ్చే త్యాగధనులు.
చాలా ఎక్కువ విలువనే మింజు - మింజుధనం గా మాకు అప్పజెప్పిన
త్యాగమూర్తులు ఇద్దరున్నూ. [= మింజు శుల్కం ] ;
శకార ;- దేశంలోని వజ్ర వైఢూర్యాలన్నీ మీ ఇళ్ళలోనే ఉంటాయి.
ఈ సారి - వేశ్యా వర్గాలకు కొత్త పన్నులను విధిస్తాం.
మా బావకు మంచి రాబడి, నవ్య సుంకం.
న్యాయ ;- శకటంలో వసంతసేన ప్రయాణం, ఈ నగలు, తోటలో స్త్రీ దేహం,
అన్ని మీకు వ్యతిరేకంగా సాక్ష్యీభూతాలై నిలిచాయి -
ఆర్యా, మమ్మల్ని క్షమిచు. ఇతనికి అంత్య శిక్షను విధించుట
జరిగినది. భటులారా, ఎల్లుండి శిక్ష అమలు వరకూ, చెరసాలలో చారుదత్తుల వారిని ఉంచండి.
తల్లి ;- చారుదత్త దేవా, మిమ్మల్ని ప్రధమంగా చూస్తున్నాను.
ఇంత అద్భుత సౌందర్య, సౌజన్య మూర్తిని, ఉదారవర్తనుని
నా వసంతసేన ప్రేమించి, ధన్యురాలైనది.
చారు ;- నేను నిర్దోషిని అమ్మా.
తల్లి ;- మీరు క్రూర హంతకులంటే - అంగుళిమాలుడు సైతం నమ్మడు.
సమయం ఇంకా ఉన్నది కదా, మిమ్మల్ని రక్షించే ప్రయత్నాలను విరమించము.
మైత్రేయా, త్వరగా నడవండి, ముందు ధూతమ్మను సముదాయించి, కర్తవ్యం ఆలోచిద్దాం.
మైత్రేయ ;- ఆర్యకుని సహాయం అన్వేషిద్దామ్మా?
తల్లి ;- అదే ప్రయత్నం, నీ నోట్లో 'నువ్వుగింజ' నానదు కదా, మౌనం విభూషణం.
********************************************************** ;
;
జయ జయ జయహో ;-
[ బౌద్ధారామము ] ;-
వసంతసేన ;- లేఖకులు పరుగెత్తుతూ వస్తున్నారు.
లేఖక్ 1 ;- అమ్మా వసంతసేనా! వైద్య సేవిక వలన కాకతాళీయంగా మాకు తెలిసింది,
మీరు ఇక్కడ ఉన్నారని. స్వామీ, మీరే ఆపద్బాంధవులు.
లేఖక్ 2;- చారుదత్తులను శివారు బండ వద్దకు భటులు తీసుకెళ్తున్నారు.
దారిలో అన్నీ చెబుతాము, వేగిరం రండి.
లేఖక్ 1 ;- మీ జననికి, మైత్రేయులకు కబురు పంపాము.
ధూతా దేవి అగ్నిప్రవేశం ప్రయత్నం నుండి విరమింప జేయడానికి.
వసంత ;- శివారు బండ ఏమిటి, ఎవరికి నిర్దాక్షిణ్య శిక్షను అమలు చేస్తున్నారు?
లేఖక్ 2 ; - ఆర్య చారుదత్తులకు ..........
బౌద్ధ ;- దారిలో బండి దొరికితే మీరు ఎక్కవచ్చును.
వసంత ;- అయ్యయ్యో - బండి వద్దులెండి, త్వరగా .................
బౌద్ధ ;- కొండ దిగువన వెలుగు ....
వసంత ;- బాల రోహణుని కంఠ ధ్వని అది, ఏడుస్తు న్నాడు. ....
అడుగో - నాయనా, రోహణా!
ధూతా ;- వసంతసేన .... కల కాదు కదా
వసంత సేన యొక్క తల్లి ;- నా బంగారు తల్లి, నా భాగ్య రాశీ,
నువు జీవించి ఉన్నావా, ముందు మీరు ఆ కొండ కొమ్ముకు సత్వరం చేరండి.
ధూతాంబా, ఈ అగ్గి మీద వాన కురవనీ ;
ఎందరు చెప్పినా మిమ్మల్ని ప్రాయోప వేశం నుండి విరమింప జేయ లేక పోయారు.
ఆ భగవంతుడే మిమ్మల్ని,
మీ ..... కుమారుని కాపాడాడు. మైత్రేయా ........ ఏడీ?
[ నవ్వి] పరుగు పోటీలో ప్రధమస్థుడు.
''''''''''''''''''''';
వసంత ;- ఆగండి, ఆ కత్తుల్ని దించండి. నేనే వసంత సేనను.
శకార్ ;- వసంత సేన పిశాచి - దయ్యం - హమ్మయ్యో.
వసంత సేన ;- నోరు ముయ్యి. నీచుడు ఇతను.
ఈ శకారుడే నా గొంతు నులిమి, చంపబోయాడు.
బౌద్ధ సంవాకుడు నన్ను రక్షించాడు. [ప్రజలు శకారుని కొట్టసాగారు] ;
చారుదత్తు ;- నాకు సుదినం. వసంత సేన ఆగమనం
నన్ను జీవితాన్ని ప్రసాదించింది.
ధూతాంబ ;- వసంత సేన రాక, నాకు దేవుని అనుగ్రహం.
నా పూజాఫలం - నాకు ఆమె వరమొసగిన నిండు బ్రతుకు.
లేఖకుడు ;- అదిగో కొత్త జెండా;
వసంత సేన ;- నవ్య పతాకం రెపరెపలాడుతున్నది.
తల్లి ;- చారుదత్తులు భార్యా పిల్లలను కలిసారు.
వసంత సేనా, ఇక మన గూటికి మన వెళ్దామా!?
ధూత ;- వసంత సేనా, నాకు మాంగల్యభాగ్యం - ప్రసాదించిన దేవత నీవు. నాదొక విన్నపం.
నాకు సోదరివి ఔతావా!?
వసంత సేన ;- అంటే? ...
ధూత ;- నా భర్తను వివాహం చేసుకొనమని నాఅభ్యర్ధన.
తల్లి ;- మహద్ భాగ్యం ఇస్తుంటే కాదనే వెఱ్ఱివాళ్ళు లోకంలో ఉండరు.
నా కుమార్తెకు కులకాంత గౌరవ స్థానం - ఆనంద భాష్పాలు నిండుతున్నవి
నా కళ్ళల్లోనూ, నా గుండెల్లోనూ ..... ;
ధూతాంబ ;- రోహణా, ఇక నుండి ఈమె నీకు పిన్ని కాదు,
అమ్మ - అమ్మా అని పిలువు.
రోహణ్ ;- కొత్త అమ్మా! [ అందరూ నవ్వారు]
ఆర్యక్ ;- చారుదత్తా, సత్యమేవ జయతే.
చారు ;- దైవం అందరినీ కాపాడింది.ధర్మం జయం.
మైత్రేయ ;- సాహసివి ఆర్యకా, నీ పరివారం అగణితంగా కనిపిస్తున్నారు.
ఆర్య ;- ధర్మ పరిరక్షణకై అవిశ్రాంతంగా పరిశ్రమించిన ఎల్లరికీ సుస్వాగతం.
చారుదత్తా, విపత్తుకు వెరవక నన్ను - ఆనాడు కాపాడారు.
మీరు నాకు ముఖ్య సలహాదారులు.
చారు ;- వీరందరిని - వారి వారి వర్గాలకు - అధిపతులుగా
నియమించుట సమంజసం కదా.
ఆర్యక్ ;- అవశ్యం, మీ యోచనను అమలు చేస్తున్నాము.
రదనిక ;- ఇదిగో మంగళసూత్రం.
ప్రజలందరి ఆశీస్సుల తొలకరి జల్లులు కురిపించండి.
కుశావతి, రేభిల్ ;- మా చెల్లెలు ఉజ్జయినికి - ఆర్యకుల చల్లని నీడ లభించాలని కూడా
ప్రజలందరూ దీవించండి.
ఆర్యక్ ;- [నవ్వుతూ] జనుల ఆనతియే నాకు మకుటం.
బౌద్ధ పరివ్రాజక ;- నేడు నవ శకానికి నాంది.
నవీన పరిణామాలకు సుముహూర్తం.
రోహణుడు ;- జయహో జయ జయ జయహో .......... ;
;
********************************************************** ;
© ® © ® © ® © ® © ® © ® © ® © ® © ®
********************************************************** ;
;
▼ ▼ ▼ 2018 (7) ;- ▼ January (7) ;-
30] చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు ; 31] తాటాకుల కవిలె కట్ట సేకరణ ;
32] జయ జయ జయహో ; & +
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 4
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 3
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 2
సంపూర్ణ వసంతసేన నాటకము ; part - 1
వసంతసేన - ఎందుకు రాసాను?
;
వసంతసేన వసంత సేన కోణమానిని, నాటకం తెలుగు, Drama, దృశ్య తిలకము, ప్రాచీన రత్న మాల,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి