[కుశావతి, ఉజ్జయిని - పొలంలో పని చేస్తున్నారు.
పాటను అందుకుని పాడుతున్నారు స్త్రీలు.
పొలం గట్టున రేభిల్లుని గాత్రం - జతగా కొనసాగుతున్నది.]
మార్గుడు ;- రేభిల్లుడా, నీ గాత్ర మాధుర్యానికి ప్రకృతి పరవశిస్తున్నది.
నీ అక్క చెల్లెళ్ళ రేల పాటలు - రైతులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నవి.
రేభిల్ల ;- క్రిందటి ఏడాది - ఎడ్ల బండి పందాలు జరిగాయి కదా.
మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరుగుతున్నవా?
మార్గ్ ;- అప్పటి బళ్ళ పోటీలలో తుందిలుడు, నేను గెలిచాం కదా.
పరుగుపందాలలో రేభిల్లా!
నీ గానం మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది.
రేభిల్ ;- తుందిలుడు పురంలో - వసంతసేన వద్ద పనికి కుదిరాడు.
యజమానుల అనుమతి తీసుకుని పండగ కోసం వచ్చాడు.
మార్గ్ ;- ఇంకేం, ఈ పర్యాయం కూడా బళ్ళ బాట కళ కళలాడుతుంది.
& [ బళ్ళ పోటీలు - రేభిల్ల గానం, మార్గ, తుందిలులు - సై సై - అంటూ గెలిచారు. ]
;
*******************************; ;
;
1] ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు ; 2] రోహణుడు son of చారుదత్త ;
3] వసంత రేఖ నాట్య ఉత్సవ్ ; 4] కోవెలలో నర్తకి ; 5] కుశావతి -శర్విలకుడు , వసంతసేన ;
6] సంవాహకుడు - శర్విలకుడు ; 7] ధన్వంతరి వాక్కు, నేర్పు ;
;
ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు ; అధ్యాయ శాఖ - 1 ;;
ఆర్యకుడు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. వర్తమాన విషయాలు, సంఘంలోని ప్రజల ఈతిబాధలు -
వివిధ విషయాల పైన చర్చలు చేసుకుంటున్నారు.
అసమర్ధ రాజు, దుష్టుడైన రాజు యొక్క బావమరది ఆగడాలు, పన్నుల భారంతో
ప్రజలు విలవిల - సంభాషణలలో సాగుతూండగా - రాజభటులు, శకారుడు వచ్చారు.
పల్లీయుడు -1 ;- యువరాణి - పెంపుడు పిల్లి పుట్టిన రోజు - కనుక పన్నులు కట్టండి. అన్నారు. విడ్డూరపు సుంకాలు వేస్తున్నారు.
ప్రజలపై పన్నుల భారం, రాజా వారి బొక్కసం నింపడానికే కదూ.
ఆర్యకుడు, ఇతరులు - "క్రిందటి వారమే - ఇంట్లో స్త్రీల నగలు , అమ్మి మరీ మీకు - సుంకం చెల్లించాము. మా వల్ల కాదు.
శకారుడు ;- [ఆగ్రహంతో] "ఆర్యకుడా! నిన్ను చెరసాలలో వేసి, కొరడా దెబ్బలు కొట్టిస్తాను." [అంటూ వెళ్ళిపోయాడు. ]
పల్లీయుడు - 2 ;- రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా - అని పెద్దలు అన్నారు, ఇందుకే.
ఆర్యకుడు ;- సంవాహకా! మూట ముల్లె సర్దుకుని, ఎక్కడికి వెళ్తున్నావు?" అడిగాడు .
సంవాహకు ;- మా మేనమామలు పాటలీ పుత్రంలో ఉన్నారు.
వీలైతే పాటలికి వెళ్తాను. మన పల్లెలో భుక్తి లేదు.
ఆర్యకుడు ;- ఐతే భుక్తి ముక్తి కోసం పట్నం వెళ్తున్నావన్న మాట. ఐనా చెడి చుట్టాల
దరికి చేరకూడదు.
[ రచ్చబండ మీద కూర్చున్న వారిలో నుండి లేచి, నిలబడ్డాడు శర్విలకుడు ]
శర్విలకుడు ;- ఆగు, సంవాహకా! నేను కూడా వస్తున్నాను.
పనీ పాటా లేకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావని -
ఇంటా బయటా నన్ను - అందరూ ఆడిపోసుకుంటున్నారు.
అక్కడైతే ఏదో ఒక పని దొరికితే, నా తిప్పలేవో నేను పడతాను. [అందరూ నిర్ఘాంత పోతారు]
మిత్రులందరూ ;- అరె, శర్విలకా! ఎంతైనా మనం పుట్టిన గడ్డ ఇది, ఈ నేల మన కన్నతల్లి.
పురిటి గడ్డని విడిచి పోవచ్చునా!? ఆగు, శర్విలకుడా, నిలు నిలు, సంవాహకుడా!
సంవాహక ;- ఇక్కడే ఉండి పస్తులు ఉండమంటున్నారే!? భలే వాళ్ళే!
[ ఇద్దరూ ఎడ్ల బండిని ఎక్కారు. వారితో పల్లీయులు కొందరు కూడా ఎక్కేసారు.
బండి చక్రాలు తిరుగుతూ ఉన్నవి.]
; ;
**********************************************************; ;
; © ® ™ Ω Ω Ω Ohm ; © ® ™ Ω Ω Ω Ohm sign ;

[ రోహణుడు son of చారుదత్త ; ఇంకో చిన్న *CART WHEEL కనబడుతున్నది -
అది బాలుడైన రోహణుడు ఆడుకుంటున్న **బొమ్మ బండి. ; రోహణుడు చారుదత్తుని కొడుకు.]
చారుదత్త ;- కుమారా, రోహణా! ఉత్సవానికి వెళ్తున్నాను. నువ్వూ వస్తావా!?
రోహణుడు ;- నేను రాను, నాన్నగారూ! బండి ఆట ఆడుకుంటున్నాను కదా!
ధూతాంబ ;- తండ్రి గారితో అట్లాగ మాట్లాడ వచ్చునా, తప్పు కదూ?? లెంపలు వేసుకో కుమారా!
రోహణుడు ;- క్షమించు అమ్మా! ఇదిగో, గుంజీలు కూడా తీస్తున్నాను సరేనా!!
చారుదత్తుడు ;- అయ్యో, నా చిన్ని తండ్రి చెంపలు ఎంత వాచిపోయాయో.
ధూతమాంబా, పసివానికి ఇన్ని దండనలా, హన్నా! [నవ్వుతూ చెప్పాడు]
ధూతమాంబ ;- ఇప్పటి నుంచీ దండనకు, శిక్షణలకు దేహం అలవాటు పడడం మంచిదే,
పెద్దవాడు ఐనాక - జీవితంలో ఢక్కా మొక్కీలను ధైర్యంగా ఎదుర్కొంటాడు.
మైత్రేయా! రదనికా! బండిలో పూజా సామగ్రి అంతా సర్దారా!?
రదనిక ;- సామాను అంతా పెట్టాము, అమ్మా! .... రోహణ బాబూ! రండి. ...
అరె, ఈ ఆట బండి - మన తోటి ఎందుకు?" ఇంటి లోపల పెడ్దాము. [అంటూ తీసుకున్నది రదనిక ]
రోహణుడు ;- వద్దు. బొమ్మ బండి - లేకుండా నేను రాను. రానంటే రాను, అంతే!
మైత్రేయుడు ;- ఈ మైత్రేయుని మాట శిలా శాసనం.
మనం మీ బుల్లి బండితోనే బయలు దేరుతున్నాం, సరేనా బాబూ! మైత్రేయ మిత్రుని వాక్కు వేద వాక్కు ,
పదండి. ఆలస్యం చేస్తే - రాహుకాలం వస్తుంది. అదిగో సందడి, ఉత్సవం మొదలైనది. ;
; *******************************************:
;
కోవెలలో నర్తకి ;- & వసంత రేఖ నాట్య ఉత్సవ్ ;-
వసంతసేన నాలుగు కాళ్ళ మండపంలో - నృత్యం చేస్తున్నది.
ఆమె కాలి గజ్జెలలోని ఒక మువ్వ జారి, దొర్లుతూ కింద పడింది.
రోహణుడు ;- మీ మువ్వ [ అంటూ -తన ముందు పడిన మువ్వను ఇచ్చాడు రోహణుడు ]
వసంతసేన - చమత్కారంగా - నాట్య రూపకంలో సంభాషణను మలిచి, కలిపేస్తూ
వసంతసేన ;- ఆర్యుల నామధేయములు తెలుసుకొనవచ్చునా!? ......
ఆ ప్రశ్నకు బాల రోహణుడు సమాధానం ఇచ్చాడు.
రోహణుడు ;- నా పేరు రోహణుడు, ఆర్య చారుదత్తుల కుమారుడిని,
మా జనని నామం ధూతమాంబ.
నవ్వుతూ అటు చూసిన వసంతసేనకు చారుదత్తుడు కనిపించాడు. -
వసంతసేన ;- ఆహా, ఎంత రూపసి. ధూతా దేవి ఎంత భాగ్యశాలి. [అనుకున్నది ]
వసంతసేన నాట్యం పూర్తి ఐనది. వసంతసేన పై వ్యామోహం కలవారు ముందుకు వస్తున్నారు.
వసంతసేన తల్లి ;- [ వారిని నిలుపుతూ ] కన్నెరిక శుల్కం ఎవరు ఎక్కువ కట్టగలరో తెలుపండి.
రాబోయే శ్రావణ మాసం, పౌర్ణమి నాడు ఏర్పాటు చేస్తున్నాము .......
వేలం పాటను, 12 లక్షల వరహాలు చెల్లించగల వారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి రావొచ్చును.
; [ఆ ప్రకటన విని అందరు జారుకున్నారు. & శకారుడు, మరి కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటూ నిలబడ్డారు. &
వసంతసేన కళ్ళు మాత్రం -అక్కడి నుండి వెళ్ళి పోయిన చారుదత్తుని కోసం అన్వేషిస్తున్నవి]
కుశావతి ;- అమ్మా వసంతా దేవీ, చారుదత్తులు, కుటుంబం వెళ్ళిపోయి, చాలాసేపు ఐంది.
వసంత సేన ;- ఆ, నువ్వు అసాధ్యవు.
కుశావతి ;- నెచ్చెలిని, ఈ దాసీకి - మీ మనసును కనిపెట్టేయడం వెన్నతో పెట్టిన విద్య.
[ కిసుక్కున నవ్వుతుంది]
వసంత ;- నాపై కరుణ చూపు, మా జననికి తెలియనీకు.
కుశావతి ;- వేరే చెప్పాలా అమ్మా. సుందరేశులు,
చారుదత్తులు - మీ జత - స్వర్ణంలో పొదిగిన కౌస్తుభ మణి కదూ.
**************************************;
;
[వసంత రేఖ నాట్య ఉత్సవ్ ;- కుశావతి ;- next ;- ] ;-
;
**************************************;
కుశావతి -శర్విలకుడు , వసంతసేన ;-
కిటికీలో నుండి కోకిల పాట వినిపిస్తుంది. కుశావతి అటు వెళ్ళబోతుంది.
వసంతసేన ;- కుశావతీ! ..... [ యజమానురాలి కంఠధ్వని వినీ వినగానే,
పరిచారిక కుశావతి లో తత్తరపాటు; ]
వసంతసేన ;- మదనికా! వేళ గాని వేళలలో - ఋతువు గాని ఋతువులలో -
ఈ పిక గానం ఏమిటి?, తరచుగా వినిపిస్తూన్నది!?
[నవ్వుతూ ప్రశ్నించింది వసంతసేన. కుశావతి ఉలిక్కిపడి ఆగింది]
కుశావతి ;- అబ్బె, ఏం లేదమ్మా! .........
మన ఆవరణలో మామిడి చెట్లు చిగురులు వేశాయి.
ఉజ్జయినిలో అందానికి తలమానికం ఐన ఈ మా వసంతసేన ప్రతి రోజూ -
ఆ చెట్టును నిమురుతూ ఉన్నారు కదా ,
ఆ ఆకులతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా!
ఇంత దోహదం లభిస్తున్నది కాబట్టే ఆ ఆమ్ర తరువు పల్లవిస్తున్నది.
చిగురులు వేసిన కొమ్మల గుబురులలో కోకిలలు దాక్కోవడం సహజమే కదమ్మా!
వసంతసేన ;- ఏమో అనుకున్నాను. భలే చమత్కారివే.
కుశావతి ;- ఈ వసంతసేన గారికి ఇష్ట దాసి కదా ఈ కుశావతి ,
అంత తావిలో ఇంత, గోరంత తావి అంటుకున్నది, - నాపై విరజిమ్మింది మరి.
వసంతసేన ;- సరే నేను మిద్దె పై గదికి వెళ్తున్నాను.
[ఓరగా కిటికీ బైట వంగి దాక్కుంటూ నిలబడిన మనిషిని గమనిస్తూ,
మెట్లు ఎక్కసాగింది వసంతసేన ]
"హుష్, నీకు బుద్ధి లేదు శర్విలకా!"
మెట్ల మీది వసంతసేన ;- ఓహో, ఈతని పేరు శర్విలకుడన్న మాట.
కుశావతి ;- ఈ కుశావతిని తెగ ఇరకాటంలో పెడ్తున్నావు శర్విలకా!
ఇట్లాగ - మాటి మాటికీ - దొంగతనంగా కలుసుకోవడం కుదరదు.
యజమాని వసంతసేన మనల్ని పసికట్టినట్లు ఉన్నారు."
శర్విలకుడు ;- మరెట్లాగ, ఇట్లాగ తప్పడం లేదు మరి!?
నిన్ను విడిపించాలంటే పరిహారం చెల్లించాలి కదా.
ఆ శుల్కం పెద్ద మొత్తం ఆయిరి, నువ్వు చెప్పినట్లు ఇక నేను దొంగతనాలు చేయాల్సిందే!
కుశావతి ;- మీ ఊరు నుండి ఇంత దూరం వచ్చింది, చోరునిగా మారడానికా,
అదిన్నీ ఈ కుశావతి కోసం. నా మూలాన్న ఒక పల్లెటూరి బైతు - అమాయక చక్రవర్తి -
చోరునిగా మారితే, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, పైగా మాకు అప్రదిష్ట కూడానూ.
[వసంతసేన తల్లి అందర్నీ పిలుస్తూ వచ్చింది]
వసంతసేన తల్లి ;- వసంతసేనా! ఎక్కడున్నావు? కుశావతీ, కుశావతీ! ఎవరూ కనబడరేం,
సమయానికి దాసీలు - ఒక్కరూ అందుబాటులో ఉండరు కదా!?
కుశావతి ;- అమ్మో, దొడ్డ యజమాని వస్తున్నట్లు ఉన్నారు, వెళ్తున్నాను. -----
శర్విలకుడు ;- ఈ కుశావతి మహారాణి గారి మళ్ళీ పునర్దర్శనం - ఎప్పుడో ఏమో!?
కుశావతి ;- ఎవరో వస్తున్నారు. సద్దు సద్దు, ఇక మరలిపో!
*************************************************************; ;

*************************************************************;
సంవాహకుడు - శర్విలకుడు ;; అధ్యాయ శాఖ ;- 6 + ;-
; సంవాహకుడు - శర్విలకుడు ;-
;
శర్విలకుడు ;- సరే, ఇక సెలవు, మళ్ళీ పున్నమికి
కుశావతి, శర్విలకుల సమావేశం. సరేనా!?"
[ బయట వ్యక్తి కేకలు ] ;
సంవాహకుడు ;- ఒళ్ళు మర్దన చేస్తాం. మీ మేనికి మిసమిస, ఒళ్ళు మర్దన చేస్తాం.
[ వీధిలో అరుస్తూ చెబుతూ, వెళుతున్నాడు సంవాహకుడు ]
శర్విలకుడు ;- ఓ సంవాహకుడా ....... నేను శర్విలకుడిని. సంవాహకుడా! బాగున్నావా,
మన పల్లెలో అందరూ కుశలమా, త్వరగా చెప్పు చెప్పు."
సంవాహకుడు ;- ఇంకా మన పల్లెసీమ గురించి తలుచుకుంటూనే ఉన్నావా,
నేను మళ్ళీ వెనకకు వెళ్ళనే లేదు కదా.
"ఔరా, ఐతే మనకు పుట్టిన నేలకూ ఋణం తీరినట్లేనా [నిట్టూర్చాడు శర్విలకుడు]
శర్విలకుడు ;- అది సరేగాని, సంవాహకుడా!
మర్దన క్రియలు - ఈ కొత్త పనిని ఎప్పుడు నేర్చుకున్నావు!?"
సంవాహకుడు ;- చారుదత్తుల దగ్గర చేస్తుండే వాడిని. ఆయన చాలా మంచివారు.
గొప్ప దాత. దాన ధర్మాలు చేసి, నిర్ధనులైనారు.
ఇక నాకు గత్యంతరం ఏమున్నది, ఇదిగో - పొట్ట చేత పట్టుకుని,
వీధులలో పడ్డాను. నీకు ఒళ్ళు పట్టమంటావా!?
[నవ్వుతూ అడిగాడు సంవాహకుడు ]
శర్విలకుడు ;- జోగీ జోగీ రాసుకున్నట్లున్నది. ఎర్ర ఏగాణీ లేని వాణ్ణి అడుగుతున్నావు.
నాకు శుశ్రూష చేస్తే నీకు ఏమివ్వగలను, శూన్యహస్తాలు .....
సంవాహకుడు ;- ఫర్వా లేదులే. మిత్ర శర్విలకుని నుండి ప్రతిఫలం అక్కర లేదులే.
హాయిగా మన చిన్ననాటి ముచ్చట్లు అన్నీ నెమరేసుకుందాం.
అవే మన ఉభయులకు ప్రస్తుత పారితోషిక నిధులు. ఏమంటావు!?
శర్విలకుడు ;- అంతకంటేనా, ఇన్నాళ్ళకి నా మనసు సేద దీరున్నది.
సంవాహకుడు ;- అది సరే గాని మిత్రమా, శర్విలకా,
ప్రఖ్యాత నర్తకి వసంతసేన ఇంటి నుండి వస్తున్నావు,
ఏదైనా రహస్యం గానీ ఉన్నదా!?
శర్విలకుడు ;- మదనిక వసంతసేన వద్ద ఉన్నది.
ఆమె పరిచారిక కుశావతి, చాలా మంచి కన్యక,
బహు ఓరిమి కలిగిన పడుచు. ........... "
సంవాహకుడు ;- బోధపడింది, ఈ సంవాహకుడు -
ఇక నుండీ నీకు బోధ గురువు నీకు అండ దండ .....
శర్విలకుడు ;- ఐతే నాకిక బెదురు, బెరుకు లేవు. ఇంత మంచి స్నేహితుడు
కుడి భుజంగా ఉన్నపుడు నాకిక ఎదురేమున్నది .....
[ అనేసి నవ్వాడు ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నారు.]
;
**************************************;
ధన్వంతరి వాక్కు, నేర్పు ;- ధన్వంతరి వాక్కు, నేర్పు ;-
వసంత సేన తల్లి ;- వసంత సేనా, మొన్న ఉత్సవంలో నీ నాట్య కళ మసకబారింది,
మొదట్లో బాగానే చేసావు, అదేంటోగాని, ఆఖర్న అస్తవ్యస్తంగా చేసేసావు.
అప్పటికీ శత పోరుతూనే ఉన్నాను కదా, ఈ తూరి బాగా చెయ్యాలి సేనా - అంటూ.
ఆలాంటిలాంటి వాళ్ళు కాదు, హేమాహేమీలు నీకు కన్నెరికం చేయాలీ అని. ......
[తల్లి ధోరణి సాగి పోతూనే ఉన్నది. వసంత సేన మాత్రం పరధ్యానంగా ఉన్నది.]
వసంత సేన తల్లి ;- హూ, ఏదో గాలి సోకింది. లేకుంటే ఏమిటీ పిల్ల,
వైద్యునికి కబురంపాను, అరుగో, రానే వచ్చారు, ......
దయ చేయండి ధన్వంతరి మహాశయా!
మొన్న ఉత్సవంలో నాట్య ప్రదర్శన ఇచ్చింది, అప్పటి నుండీ .......
ధన్వంతరి ;- [నాడి చూస్తూ] తెలుసు తెలుసు, నాకన్నీ తెలుసు.
ముందు మంచి నీళ్ళను సావకాశంగా మరిగించి, తీసుకు రండి ...... [ తల్లి లోనికి వెళ్ళింది ]
ధన్వంతరి ;- వసంత మణీ! ఆ రోజు నువ్వు ప్రేక్షక జనంలో ఉన్న
చారుదత్తుని ప్రేమిస్తున్నావు, ఔనా. [ తెల్లబోయింది వసంత సేన]
వసంత సేన ;-మీకు తెలుసా, తెలిసిందా!?
ధన్వంతరి ;- "ఈ ధన్వంతరివి నాడిని పసికట్టడమే నా విధి కదా. పసికట్టాను. ........ "
వసంత సేన ;- ప్రస్తుతానికి ఇది రహస్యంగా ఉంచండి, ముఖ్యంగా మా అమ్మ దగ్గర.
[ సిగలోని నగను ఇచ్చింది. ]
ధన్వంతరి ;- సరే సరే [అంటూ, మందుల పెట్టెలో - అడుగున దాచాడు. &
తల్లి, కుశావతి - వేణ్ణీళ్ళ గిన్నె పట్టుకుని వచ్చారు]
ధన్వంతరి వైద్యుడు ;- అమ్మాయీ మణిగారికి ఈ చూర్ణం ఉష్ణ జలంలో కలపండి,
బాగా కాపడం పెట్టండి, ఉష్ణం ఉష్ణేన శీతలం - అన్నారు పెద్దలు."
[ నర్మగర్భంగా నవ్వుతూ అన్నాడు ; వసంత సేన సైగను అర్ధం చేసుకున్నాడు వైద్యుడు ]
ధన్వంతరి ;- అమ్మా! మీ పెరట్లో తమలపాకులు ఉన్నాయా!?
తల్లి ;- మా పెరటి తోటలో లేవు. ఊరి బైట ఉద్యానంలో ఉన్నవి.
వాటినే విపణి వీధిలో అందరూ కొంటారు. ఐనా, మాకు కొనే దుర్గతి ఏమీ పట్ట లేదు......
ధన్వంతరి ;- [గతుక్కుమని] ఔనౌను, మరిచాను కదండి.
అందరూ - మీకు దండిగా ధనం, స్వర్ణం -
అన్నింటినీ - తాంబూలంలో పెట్టి మరీ ఇస్తూంటారు కదా!
తల్లి ;-ఈ మోహిని లోగిలి స్థాన మహత్మ్యం ఘనత అదే!
ధన్వంతరి ;- తమాల పత్రములను - అదేనండీ, తమలపాకులకు
పిసరంత తైలం రాయండి, కుంపటి రాజేసి,
కొంచెం వెచ్చ జేసి తీసుకు వస్తారూ!?
[వాళ్ళు అటు కేసి వెళ్ళాక, వసంత సేన అడిగింది]
వసంత సేన ;- చారుదత్తుడు నిష్ఠాగరిష్ఠుడట.
ఏదైనా మందు, వశీకరణం ఔషధం - ఇవ్వ గలరా!?
ధన్వంతరి ;- నా వృత్తి అదే కదా! .....
[ అతని చూపుల అర్ధాన్ని గ్రహించింది వసంతసేన ]
వసంత సేన ;- మీ మేలు మరిచి పోను, ప్రతిఫలం భారీగానే ఇస్తాను లెండి.
[వాడ్చిన తమలపాకులు తెచ్చారు తల్లి, కుశావతి]
ధన్వంతరి ;- వీలు కలిగినప్పుడల్లా, అంటే అమ్మాయి అడిగినప్పుడు -
ఈ ఆకులను మేనుపై వేస్తూండండి. మళ్ళీ రేపు ఈ ఝాముకు వస్తాను .
ధన్వంతరి ;- [వెళుతూ] వశీకరణం మందు తెచ్చి ఇస్తాను. [అని వసంత సేనకు సైగ చేసి, నిష్క్రమించాడు]
**********************************************************

8] మీ గృహమున మా నగలు మీ భద్రం ;; 9] అక్కడే దోబూచి ;;
10] తప్పించుకుందిరా తాబేటి దవ్వ! ; 11] దౌర్జన్య శకార ;; 12] సారధి - ఊరి వాళ్ళతో యోచన ;-
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
సారధి - ఊరి వాళ్ళతో యోచన ;-
;
మేడమీద కిటికీలో నుండి - మామిడి చెట్టు కనిపిస్తున్నది. వసంత సేన
వసంత సేన ;- మదనికా! పిక గానం బాగుంది కదూ!
కుశావతి ;- చారుదత్తుల వారి ఇంటిలో గానం చేసి,
ఆ కోకిల ఇక్కడికి వచ్చినట్లుంది దొరసానీ!
అందుకే దాని పాట బహు బాగున్నది." [ నవ్వింది]
"ష్! అమ్మ వింటుంది."
కుశావతి ;- చిత్తం. [ముసిముసి నవ్వులతో
కిటికీ తోరణాల దుమ్ము దులుపుతున్నది కుశావతి, &
ఇద్దరికీ గతం గుర్తుకు వచ్చింది.]
&
నెల రోజుల క్రిందట జరిగింది ................
; FLASH BACK = నేపథ్యం :- పౌర్ణమి నాట్యం చేయుటకై వసంత సేన ;ఉద్యానవనములోనికి పరిచారిక మదనికతో వెళ్ళినది.
బైట నిలబడి ఉన్నది వసంత సేన బండి. ఆ బండిని తోలే వాని పేరు తుందిలుడు. &
ఇంతలో సారధికి కోలాహలం కనిపించింది. –
వ్యక్తి 1 ;- మన గ్రామంలో ప్రజలందర్నీ రాజ భటులు కొట్టారు. ఇట్లాగ ఎన్నాళ్ళని, ఈ హింసలను భరిస్తాం?
వ్యక్తి 2 ;- ఆర్యకుని బంధించారు, హింసలు పెడ్తూ, తీసుకెళ్ళారు, చెరసాలలో వేసారు.
మన రాజ్యంలో - నిజం మాట్లాడితే తప్పు, న్యాయం కోసం ప్రశ్నిస్తే ఆ దండన ఒక్కటే .. అందరికీ తెలిసిందే!
తుందిలుడు ;- ఏమిటీ, మన ఆర్యకుని చెరసాలలో వేసారా!?"
వ్యక్తి 1 ;- నువ్వెవరవు?
తుందిలుడు ;- నేను తుందిలుణ్ణి. మన ఊరు నుండి పట్టణం చేరాను. ఇక్కడ ఒకరి వద్ద - శకట సారధిని. యజమానులకు చెప్పి వస్తాను. మన ఊరి ప్రజలు చాలామందిని ఆ శకారుడు - ఈ రీతిగా చెప్ప నలవి కాని రీతులలో బాధిస్తున్నాడు. పేనుకు పెత్తనం ఇచ్చాడు - అసమర్ధ ప్రభువు. రాజా వారి బావమరది ఐనంత మాత్రాన విచక్షణ మరచిపోవాలా? స్థాన బలమె కాని తన బలము కాదయా - అని పెద్దలు అన్నారు అందుకే!
వ్యక్తి 2 ;- తుందిలా, ఇప్పుడేం చేయగలం?
తుందిలుడు ;- మనం అందరం సమైక్యతతో ఉండాలి. కష్ట కాలంలో - ఐకమత్యమే మన బలం -
కలిసి ముందుకు కదులుదాం. ................
తుందిలుడు ;-నా స్నేహితుడు చెరసాలలో కాపలా కాస్తాడు.
కోటలో వెనుక మూల చీకటి కొట్టు ఉన్నది. బందీలను అక్కడ ఉంచుతారు.
అక్కడికి చేరే ఉపాయాన్ని అలోచన చేద్దాం.
రాత్రికి మనం ఊరి శివార్ల వద్దగుడిలో కలుద్దాము. మంచి ప్రణాళికను ఆలోచిద్దాం.
వ్యక్తి 3 ;- సరే తుందిలుడా, అందర్మూ ఈ బాట వద్ద ఇట్లాగే గుమిగూడి కనిపిస్తే తంటాలు.
అడుగో, శకారుడు వస్తున్నాడు. సెలవు.
వ్యక్తి 4 ;- సంతోషంగా ఉంది. అనుకోకుండా మాకు - నీ వంటి ధీరుని సహకారం లభించింది.
మళ్ళీ మాకు పైనున్న ఆ భగవంతుని పై నమ్మకం పాదుకొంటున్నది.
; అటుగా బౌద్ధ సన్యాసులు కొందరు వెళ్తున్నారు. ;
"బుద్ధం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి,
ధర్మం శరణం గచ్ఛామి||
[ బౌద్ధ బిక్షువులు వెళ్ళేదాకా అందరూ కాస్సేపు ఆగారు.
ఊరి వాళ్ళు తుందిలునికి వీడ్కోలు చెబుతూ, వేగంగా వెళ్ళి పోయారు.
తక్కిన వాళ్ళు వేరే దిశగా వెళ్ళగా,
తుందిలుడు కూడా తోట దగ్గరికి బయలుదేరాడు. ]
; REF : తుందిలుడు, ఊరి వాళ్ళతో యోచన ;
అధ్యాయ శాఖ ;- 8 ;- సారధి - ఊరి వాళ్ళతో యోచన ;
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
;
దౌర్జన్య శకార ; అధ్యాయ శాఖ ;- 9 ; ;- [FLASH BACK = నేపథ్యం :-
క్రిందటి మాసంలో జరిగింది ....... పౌర్ణమి చేయుటకై వసంతసేన తన దాసి కుశావతితో వెళ్ళింది. ] ;
కుశావతి ;- అమ్మా! ఇవాళ సరసు ఒడ్డున మీరు నాట్యం అద్భుతంగా చేసారు.
వసంతసేన ;- ప్రతి పౌర్ణమి కదూ - అక్కడ ఉన్న సరస్వతీ దేవి ప్రతిమ ఎదుట నేను నర్తించాలి.
కుశావతి ;- అవును కదండీ, మీ జన్మ నక్షత్రం ప్రకారం -
ప్రతి పున్నమి రాత్రికి ఈ నర్తన కార్యక్రమం దొడ్డమ్మ గారు,
మీకు విధించిన నియమం కదా!
[ ఉద్యానవనములో పున్నమి నాట్యం పూర్తి ఐనది.
నాట్య అభినయ సంపూర్ణం తర్వాత .........
తోట నుండి వసంతసేన, కుశావతిలు వస్తున్నారు.
; నందనం ముంగిలి వద్ద భామలు ఇద్దరు ఆగారు.
ఆగి, నిలబడి, తమ శకటం కోసం చుట్టూ చూసారు.
నలు వైపులా పరకాయిస్తూ అన్నది వసంతసేన. ]
వసంతసేన ;- అరె, మన శకటం ఏది, తుందిలుడు ఏడి, ఎక్కడ?
కుశావతి ;- అమ్మా, ఆ అలికిడి, శకారుడు వస్తున్నాడు, పదమ్మా!
స్త్రీలు కంటబడితే వదలని కామాంధుడు. వేగం, వేగం.
; [ఇద్దరిదీ పరుగు వంటి నడక. శీఘ్ర గమనంసాగిస్తున్నారు.
ఇంతలో శకారుడు వారిని చూడనే చూసాడు. ]
శకారుడు ;- భళీ, ఆమె వసంత సేన లా ఉన్నది."
శకారుడి అనుయాయి విటుడు -
వినయంగా తల ఊపుతూ అన్నాడు.
విటుడు ;- ఔనౌను దేవరా! ఆమె వసంత సేనయే."
శకారుడు ;- భళీ, ఇవాళ మన పంట పండింది.
ఓహో వసంత సేనా! నిలు నిలు.
[ ధాష్ఠికంగా అన్నాడు శకారుడు. ]
విరటుడు ;- ఆ జంట ఆగకుండా పరిగెడుతున్నారు, దేవరా.
[తాన అంటే తందాన అనే రకం మనిషి విరటుడు. ]
శకారుడు ;- ఇద్దరూ స్త్రీలే ఐనప్పుడు, జంట - అనరు,
ఒక మగ, ఒక ఆడ ఐతేనే అట్లాగ పిలుస్తారు. నీకేమీ తెలీదు.
ఉత్తి మట్టి బుర్ర నీది! అనుసరిద్దాం పద! ఓ వసంతసేనా! నిలు నిలు .
[ అప్పటికే సంజె చీకటి పడుతున్నది. భీతితో ఉక్కిరిబిక్కిరి ఔతూ, ఇరువురు వనితలు
మసక చీకటిలో - తాము ఎటు పరిగెడుతున్నారో తెలీని అయోమయ అవస్థలో దౌడు తీస్తున్నారు. ]
;
**************************************;
; ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
అధ్యాయ శాఖ ;- 10 ;- తప్పించుకుందిరా తాబేటి దవ్వ! ;-
[+ అప్పటికే సంజె చీకటి పడుతున్నది. భీతితో ఉక్కిరిబిక్కిరి ఔతూ, ఇరువురు వనితలు

కుశావతి ;- వసంతమ్మా! ఆ ఇంటి ఆ ముందరి - లఘు ద్వారం తెరచి ఉన్నది.
పదండి. తోటలో పొదలు ఉన్నవి. పొదల మాటున దాక్కోగలుగుతాం. శీఘ్రం.
[ ఆ జవ్వనులు లోనికి ఉరికి, ఒక పొద మాటున వంగి, కూర్చున్నారు. ]
శకారు ;- ఎక్కడ? ఎక్కడ? వసంతసేనా! ఎక్కడ?
ఎక్కడికి పోయినా నిన్ను వదలను, వసంతా!
ఈ శకారుని బారి నుండి వేళ తప్పించుకున్నావు, సరే చూసుకో,
మళ్ళీ నిన్ను దొరక బుచ్చుకుంటాను. ......
విరటుడు ;- ;- తప్పించుకుందిరా తాబేటి దవ్వ! హమ్మయ్య, ఇప్పటికి ఆమె క్షేమం.
శకారుడు ;- విటూ, అక్కడి జూద మండపంలోనికి దూరుదాం, పద!
విరటుడు ;- ;- దేవరా! ఆ జూదశాల యజమాని విసుక్కుంటున్నాడు.
శకారుడు ;- ఏం, ఎందుకంట, ఏం తీపరమట!? …………
విరటుడు ;- ;- ఏం తీపరం - అని మీరు అడిగితే ఏం చెప్పగలను?
మీరు అసలు పైకం కట్టనే కట్టరనిన్నీ, దండగ బోణీ హస్తం తమదనీ, ఆ...... చిత్తం .... ఆ .....
శకారు ;- ఆ! రాజా వారికి స్వయానా బావ మరదిని. నన్నే శుల్కం అడుగుతున్నాడా,
వాడికి మన రాజ్యంలో మంచి నీళ్ళు పుట్టకుండా చేస్తాను, చూస్తుండు.
విరటుడు ;- ;- ఇక్కడ ఉప్పు నీళ్ళు, తాగడానికి పనికి రావంట.
పొరుగు సీమలో ఐతే - అమృత తుల్య జలం లభిస్తున్నది ...... అని .....
శకారు ;- ఆ, దుష్టుడు, అంత కావరమా, వాడి జుట్టు పట్టుకుని, గుమ్మానికి వేలాడ దీస్తాను. పద.
విరటుడు ;- ;- ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగనే - ఎవరి ముఖం చూసాడో, పాపం! ఆ జూదశాలుడు. పదండి దేవరా!

అధ్యాయ శాఖ ;- 11 ;- అక్కడే దోబూచి ;- 11, అక్టోబర్ 2017, బుధవారం ;
; [వసంతసేన, కుశావతిలు గుబురు చెట్టు వెనక - నక్కి ఉన్నారు, గజగజా వణుకుతూ.
చారుదత్తుడు అప్పటికే తోటలో పని చేస్తున్నాడు. అతను తమ ఆవరణలోకి - వసంతసేనా ద్వయం - ప్రవేశించడం - గమనించ లేదు.
వసంతసేన చారుదత్తుడిని చూస్తూ, సంతోషంలో మునిగిపోయింది.]
; కుశావతి ;- అమ్మా! ఇవాళ మీకు అదృష్ట యోగం పట్టింది.
మరీ అంత తన్మయంలో మైమరచి పోకండి.
వెదక బోయిన తీగ కాలికి తగిలింది.
చారుదత్తు ;- రోహణా! ;- [ చారుదత్తుడి పిలుపును ఆలకించి, అతని సుపుత్రుడు బైటికి వస్తున్నాడు. ]
రోహణ ;- వస్తున్నా, నాన్నగారూ!
చారుదత్తు ;- ఉసిరిక చెట్లకు పాదులు చేయండి. వచ్చే కార్తీక మాసంలో వన భోజనాలు చేయాలి కదా.
అందరూ హుషారుగా "హాయ్ హాయ్" అంటూ నవ్వారు.]
చారుదత్తు ;- వర్ధమానకుడు, మైత్రేయుడు గొప్పులు తవ్వుతున్నారు కదా,
నీళ్ళు సరిగ్గా పారేటట్లు చూడు రోహణా!
రోహణ ;- సరే, నాన్నగారూ! [ ధూతాదేవి అక్కడికి - రదనికతో వచ్చింది.]
ధూతా దేవి ;- వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తూనే ఉన్నాను,
మీరు కాస్త సేదదీరండి. బడలిక తగ్గుతుంది, ముందీ పానీయాలను అందరూ త్రాగండి.
రదనిక ;- తేనె, నిమ్మ రసం కలిపి తయారు చేసాను. తీసుకోండి,యజమానీ!...
ఓహో, పని దొంగల్లారా!
వర్ధమాన ;- ఎవర్నీ, మమ్మల్నే!
రదనిక ;- ఆహా, మిమ్మల్నే. తీరుబడి లేనంత పని చేస్తున్నట్లుగా నటించడంలో బహు నిపుణులు.
వర్ధమానుడు ;- ఇక్కడికి వచ్చి ఇవ్వవచ్చునుగా.
రదనిక ;- మరే, పాపం. నోటికి అందివ్వమని ఆజ్ఞాపించ లేదు.
ఇక్కడ పెట్టేసాను, వేం చేసి గ్రోలండి.
[ ఆ గ్లాసులను చెట్టు వెనక దాక్కుని ఉన్న వసంతసేన, చెలికత్తె కుశావతి -
జాగ్రత్తగా తీసేసుకున్నారు, గుట్టుగా త్రాగేసారు.
అప్పటికే దాహంతో వాళ్ళ గొంతులు తడారి పోయి ఉన్నవి.
నెమ్మదిగా తాగి, దాహం తీర్చుకున్నారు. ]
మైత్రేయా ;- వర్ధమానుడా! రదనిక పానీయ చషకములు ఏవీ?
రదనిక ఇక్కడే పెట్టానన్నది.
వర్ధమాన ;- సరిగా చూడు మైత్రేయా!
మైత్రేయ ;- ఈ మైత్రేయునికి చత్వారం రాలేదులే.
నువ్వు కూడా వచ్చి, శ్రద్ధగా పరికించు, పరిశీలించు.
ఏమైపోయాయబ్బా! ఇది మయసభ కాదు కదా.
కనికట్టు మటుమాయం అవడానికి.
చారుదత్తు ;- రదనిక పరాకున ఇంట్లోకి తీసుకుపోయి ఉంటుంది, గానీ -
ఇంక పని ఆపి, మీరూ వెళ్ళండి. కాస్త విశ్రాంతి తీసుకుని, భోజనాలు చేద్దాం.
[ అందరూ గృహంలోనికి వెళ్ళారు. గృహస్తు చారుదత్తుడు - కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాడు.
లోనికి వెళ్ళబోతూన్న చారుదత్తుడు - ]
చారుదత్తుడు ;- ఏదో అలికిడి. [అనుకుంటూ పరిశీలనగా చూస్తుండగా -
అతనికి కనిపించారు, అక్కడే ఉన్న వనితలు.]
చారుదత్తుడు ;- ఎవరు మీరు? [ఆశ్చర్యంతో అడిగాడు.]
కుశావతి ;- మా యజమానిని, ప్రఖ్యాత నర్తకీమణి వసంతసేన.
[ కుశావతి బెరుకుగానే పరిచయం చేసింది.]
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
31, అక్టోబర్ 2017, మంగళవారం ;- మీ గృహమున మా నగలు మీ భద్రం ;-
;
[ చెట్ట వెనక నుండి చారుదత్తుని ఎదట
బిడియపడుతూ నిలిచారు వసంతసేన, కుశావతి. ]
చారుదత్తు ;- ధూతాంబా! [ భర్త పిలుపు విని ఇంట్లో నుండి బైటకు వచ్చింది భార్య.]
ధూతాంబ ;- సందె దీపం గూట్లో పెట్టి వస్తాను. [ చెప్పింది ఆమె. ]
చారుదత్తు ;- ఇవాళ వీరిద్దరు మన అతిథులు.
ధూతాంబ ;- అరె, దుస్తులు మాసినవి. రండి. అలసట తీర్చుకుందురు గాని.
రదనికా! మన ఇంటికి కొత్తవారు వచ్చారు.
వీరి స్నానపానాదులకు తగిన ఏర్పాట్లు చేద్దాం.
[ ఇంటి లోపలి నుండి వచ్చిన రదనిక - ]
రదనిక ;- అమ్మా, దయ చేయండి.
ధూతాంబ ;- అటు వెనుక వేపు స్నానశాల ఉన్నది.
వేణ్ణీళ్ళు ఉంచాము. రదనికా! వీరి అభ్యంగనం పూర్తి ఐనాక
ఈ కొత్త దుస్తులను ఇవ్వి. ఈ లోపు నా వంట పూర్తి ఔతుంది.
కుశావతి ; - చెల్లీ! రదనికా! మా అమ్మగారి పరిచర్యలు
నేను చూస్తాను గానీ - నీవు వంట గదిలో మీ అమ్మగారికి సాయం చేయి. సరేనా!?
రదనిక ;- సరే, అట్లాగే! [రదనిక వెళ్ళింది.]
కుశావతి ;- వసంతసేనమ్మా! ఎదురు చూడని అదృష్ట యోగం.
మీ నగలను 'భద్రపరచండి,'అని మీ స్వామికి ఇవ్వండి.
వసంతసేన ;- కానీ వారి భార్యకు కోపం వసుందేమో!?
కుశావతి ;- మీ మనోహరుని మళ్ళీ కలిసి, మీ మనసు విప్పి చెప్పాలంటే, మనకు వీలౌతుందా!?
మీరు ధూతమ్మ గారికి సోదరి గానీ, వారి చుట్టం కానీ కాదు కదా.
మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం మీకు కలగదు కదా,
ఇప్పటికి నాకు తోచింది ఇదే మరి!
వసంతసేన ;- ఔనౌను, నీ యోచన కూడా బాగున్నట్లే ఉన్నది.
కుశావతి ;- మీ తర్వాత నేను చేస్తాను లెండి. మీ కురులు ముడి వేస్తాను.
వసంత సేన ;- కుశావతీ, మా జాతి స్త్రీలకు ప్రేమ భావాలు ఉండదంటావా!?
కుశావతి ;- ఏమోనమ్మా, అవన్నీ పెద్ద వాళ్ళు ఎప్పుడో చేసిన నియమాలు కదా.
ఏం చేయగలం. కొత్త దారి వేయాలంటే మన బోటి వాళ్ళకు సాధ్యమా!?
రదనిక ;- [వచ్చి] స్నానాదులు ఐతే వేగిరం రండి. విందులు సిద్ధం.
& **************************;
ధూతాంబ ;- మా వంట మీకు రుచించిందా? లోపం ఏమీ పొరపాటున - జరుగలేదు కదా.
అన్నట్లు మీ నామధేయములు తెలుసుకొనవచ్చునా? ...........
అట్లాగ తటపటాయిస్తున్నారు. చెప్పకూడనుకుంటే చెప్పకండి.
కుశావతి ;- అబ్బే, అదేం లేదు, రదనికా! మా స్వామిని పేరు వసంతసేన,
నేను కుశావతి.
చారుదత్తుడు ;- వర్ధమానుడా! వీరిద్దరినీ క్షేమంగా - వారి గృహమునకు చేర్చు.
ధూత ;- ఆర్యా! చిన్న మనవి. ఈ కారుచీకటిలో -
విలువైన ఆభరణములతో ....ప్రయాణించడమంటున్నారా!?
చారుదత్త ;- ఔను, అదీ నిజమే. నా భార్య కూడా సంశయాన్ని వెలిబుచ్చుతున్నది.
సరే, మరి ఏమి చేయాలి?
మైత్రేయ ;- కిం కర్తవ్యం, మిత్రమా!
కుశావతి ;- మా అమ్మగారి నగలను మీ వద్ద దాచిపెట్టి, ఉంచండి దేవరా!
వీలు చూసుకుని, మేమే వచ్చి, తీసుకుని వెళ్తాం.
శకారుని వలన మాకు ముప్పు పొంచిఉన్నది. పరిస్థితులు చక్కబడిన తర్వాత - తీసుకుంటాము.
అంతవరకూ- కరుణతో ఈ భూషణములను మీ వద్ద భద్రపరుస్తారా!?
మైత్రేయ ;- ఔనౌను, అదీ సత్యమే. ఈ వనితల ఉవాచ కూడా నిజమే అనిపిస్తున్నది.
చారుదత్తుడు ;-మైత్రేయా! రత్నాభరణములను మూట కట్టండి.
ఈ మణిభూషణముల మూటను
పగలు వర్ధమానుడు, రాత్రి నువ్వు వేయి కన్నులతో కాపాడవలెను!
వసంతసేన ;- అమ్మయ్య, నాకు ఇంక నిశ్చింత, కుశావతీ!
కుశావతి ;- స్వామి ఇంట గృహమున మన నగలు మీ పదిలం కదా!
ధూతాంబ ;- రదనికా! బండి వానిని పిలువు.
రదనిక ;- మార్గా! ఓ మార్గుడూ! వేగిరం బండి కట్టు.
మార్గుడు ;- చిత్తం, అమ్మా, బయలుదేరండి. "
;
**************************************; ;
వసంతసేన వసంత సేన కోణమానిని, ప్రాచీన రత్న మాల, నాటకం తెలుగు, Drama,

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి