24, ఫిబ్రవరి 2015, మంగళవారం

చింతామణి

 మణి మాణిక్యాలు, వాటికి కల మహిమలు - అనేక ప్రలోభాలకు హేతువులు ఔతున్నాయి.
మన హిందూదేశ వాసులకు అత్యంత ప్రాచీనకాలం నుండీ నవరత్నాల గురించి తెలుసును. చూడామణిని ధరించినది సీతమ్మ తల్లి. 
భద్రాద్రిరాములవారికి కంచర్ల గోపన్న - అనగా భక్త రామదాసు - 
తాను చేయించిన నగల పట్టికకు సాక్ష్యంగా ప్రజలందరికీ అందిన మంచి కీర్తన - ఉన్నది; 
'కీర్తన' - అని చెప్పకూడదేమో!? - ఎందుకంటే - జైలులో పడి, 
దెబ్బలకు తాళలేక చేసిన ఆక్రందన ప్రతిరూపం కదా.
భక్త రామదాసు పాట :-  

"ఇక్ష్వాకకులతిలక ఇకనైనా పలుకవా?రామచంద్రా!  ........
భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా! 
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా! 
సీతమ్మకు చేయిస్తి చింతాకుపతకము, రామచంద్రా!
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా!  
కలికితురాయి నీకు మెలకువగ చేయిస్తి  ......" 

-            అంటూ  రేట్లు కూడా అప్పజెప్పాడు. 

శ్యమంతక మణి సంరంభం :- - మనకు "వినాయక చవితి పండుగ" ను ఏర్పరచింది. 
సముద్రాలు దాటి నేటికీ విదేశీయుల మ్యూజియాలలో, ధనవంతుల మందిరములలోనికి చేరిన కోహినూర్ వంటివి ఎన్నో లెక్కలేదు.మణి మాణిక్యాలు, వాటికి కల మహిమలు - 
అనేక ప్రలోభాలకు హేతువులు ఔతున్నాయి.
శ్యమంతక మణి సంరంభం - మనకు "వినాయక చవితి పండుగ" ను ఏర్పరచింది. 
సముద్రాలు దాటి నేటికీ విదేశీయుల మ్యూజియాలలో, 
ధనవంతుల మందిరములలోనికి చేరిన కోహినూర్ వంటివి ఎన్నో లెక్కలేదు.
చింతామణి - అటువంటి లిస్టుకి చేరి ఉన్నది. 

******************************;
చింతామణి - అటువంటి లిస్టుకి చేరి ఉన్నది.మహారాష్ట్రలో - అష్ట విధ వినాయకులు
अष्टविनायक కొలువుతీరి ఉన్నారు.
1) చింతామణి గణపతి  अष्टविनायक) :- thEyuuru ;  (Chintamani, Theyur)::::: 
2) విఘ్నహర వినాయక , ఓఝర్ :(#wighnahara winaayaka , Ojhar : #
3) బళ్ళాలేశ్వర ;పాళీ:  '''''''
4) గిరిజాత్మజ, లేన్యాద్రి  (Girjatmaja, Lenyadri):  '''''''''
5) మహా గణపతి, రాజన్ గావ్ (Mahaa GaNapati, Rajan gaaw):  '''''''
6) మోరేశ్వర కోవెల, mOrgaaw (Moreshwar Temple):  '''
7)  సిద్ధివినాయక ఆలయ (Siddhiwinayaka dewalay, Siddhtek): ''''''''''                  
8) వరదవినాయక్, మహాద్ (Varada Vinayaka, Mahaad);      
చింతామణిగణపతి వెలసిన కథ ఆసక్తికరమైనది.
చింతామణి గణపతి స్థలగాథను తెలుసుకుందాము. 
కపిల ముని వద్ద చింతామణి ఉన్నది. ఈ చింతామణి మహర్షికి అవసరం వచ్చినప్పుడల్లా, 
ఆతను కోరినవన్నీ ఇస్తుంది. కారడవులలోని తాపసి, కనుక గొప్ప వాంఛలు లేనివాడు కావడాన 
తన పర్ణ కుటీరమునకు వచ్చిన బాటసారి, ప్రయాణీకులకు సదుపాయములను మాత్రమే 
ఆ మణిని కోరేవాడు.    
కపిలుడు 'తన ఆశ్రమానికి వచ్చిన అతిధులకు విందు భోజనాలు ఇచ్చేవాడు. 
ఋషి తన ఆధీనంలోని చింతామణి వలన అవసరపడినప్పుడల్లా కేవలం ఆహారపదార్ధాలను కోరే వాడు.  ఈ ప్రకారంగా కపిలముని కామితార్ధఫలప్రదాయిని ఐన చింతామణి వలన అతిథి అభ్యాగతులకు సంతృప్తిగా సత్కరించగలుగుతూ, తన జీవనసాఫల్యతతో సంతోషంగా రోజులు గడుపుతున్నాడు. 

ఆ సీమ ప్రభువు అభిజిత్తు, అతని భార్య గుణవతీదేవి. 
ఇరువురి సత్పరిపాలనలో దేశమునందు సుఖశాంతులు నెలకొని ఉన్నవి. 
వారి పుత్రుడు గుణవర్ధనుడు. ఒక రోజు గుణవర్ధన రాజకుమారుడు అటవీప్రాంతంలో వేటకై వెళ్ళాడు. కాననమునకు వచ్చిన యువరాజ్, మిట్టమధ్యాహ్నం ఆలస్యం కావడంతో దగ్గరలో కానవచ్చిన కపిలాశ్రమమునకు వచ్చాడు. అంగరక్షకులు, భటులుపరివారసమేతంగా కపిలుని ఇంట సేదదీరాడు. అంతమందికీ ఒక బవిరిగడ్డం సన్యాసి అద్భుత భోజనాదులతో 
నిముషాలలో వసతి సౌకర్యాలను అందించాడు. 
"ఇది ఎట్లాగ సంభవమైనది?" విస్మిత యువరాజుకు ,
మౌని "నా వద్ద అభీష్ఠ వర ప్రదాయిని ఐన చింతామణి అనుగ్రహము వలన 
నేను ఈ పనులను చేయగలిగాను." అని చెప్పాడు. 
ఇంకేమున్నది? గుణవర్ధన్ కు లాలస పుట్టింది. 
"అరణ్యవాసివి, నీకెందుకు? ఆ మణిని నాకు ఇవ్వు." అన్నాడు. 
"జమదగ్ని ముని వద్ద కామధేనువును హైహయ వంశ రాజు ఐన కా
ర్తవీర్యుడు అడిగినందువలన, పరిస్థితులు అతలాకుతలం ఐనవి. 
ఇప్పుడు అట్లాంటి విధ్వంసానికి 
నీవు మూలకారకుడివి అవవద్దు రాజకుమారా!" 
అని కపిలమిని శిష్యులు, తోటి ఆశ్రమవాసులు హితవు పలికారు. 
కానీ అభిజిత్తు కుమారుడైన "గుణవర్ధనుడు "ససేమిరా!" 
అందరి మాటలను పెడచెవిని పెట్టాడు. 
దౌర్జన్యంగా చింతామణిని లాక్కుని, వెళ్ళబోయాడు. 
గత్యంతరం కానరాక, కపిలుడు "విఘ్నవినాయకుని" ప్రార్ధించినాడు. 
భక్తుని వేదన వినగానే గజవదనుడు ప్రత్యక్షమైనాడు. రాజకుమారుని ఓడించినాడు. 
ఆతని తండ్రి అభిజిత్తు "మహర్షీ! ఈ మణిని స్వీకరించండి." అని కపిలమౌనికి తిరిగి ఇవ్వబోయాడు. 
కానీ ఆ జడధారి సున్నితంగా తిరస్కరించాడు. "ప్రభూ! ఇన్ని కల్లోలాలకు కారణమైనది సంపద. 
కావున నాకు వలదు. ఐతే నాదొక విన్నపం. తమరు గజాననునికి పూజావిధులను ఏర్పాట్లు చేయించండి. అంతే నాకు చాలు." అన్నాడు.  
అక్కడ కదంబ వృక్షము క్రింద వినాయక స్వామి వెలిసి ఉన్నాడు. 
పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు గణాధిపతి వెలసిన ఊరు 
పేరు "దేవూర్", పూనా సమీపమున దేవూరు ఉన్నది. 
కడిమి చెట్టు ఛాయలో వెలిసిన చల్లని స్వామి "చింతామణి గణపతి" ప్రజలకు ప్రత్యక్షదైవము.  

******************************;

#maNi maaNikyaalu, waaTiki kala mahimalu - anEka pralOBAlaku hEtuwulu autunnaayi.
mana himduudESa waasulaku atyamta praachiinakaalam numDI nawaratnaala gurimchi telusunu. chuuDAmaNini dharimchinadi siitamma talli. bhadraadriraamulawaariki kamcharla gOpanna - anagaa bhakta raamadaasu - taanu chEyimchina nagala paTTikaku saakshyamgaa prajalamdarikii amdina mamchi kiirtana - unnadi; kiirtana - ani cheppakUDadEmO!? - emdukamTE - jailulO paDi, debbalaku taaLalEka chEsina aakramdana pratiruupam kadaa.

bhakta raamadaasu :- 
ikshwaakakulatilaka ikanainaa paluka waa?raamachamdrA! bharatunaku chEyisti pachchalapatakamu raamachamdrA!  aa patakamunaku paTTe padiwEla warahAlu raamachamdrA!  siitammaku chEyisti chimtaakupatakamu raamachamdrA! kalikituraayi niiku melakuwaga chEyisti raamachamdrA!   

Syamamtaka maNi sam rambham - manaku "winaayaka chawiti pamDuga" nu Erparachimdi. 
samudraalu daaTi nETikii widESiiyula myuujiyaalalO, dhanawamtula mamdiramulalOniki chErina kOhinuur wamTiwi ennO lekka lEdu.
chimtaamaNi - aTuwamTi lisTuki chEri unnadi.
kapila muni wadda chimtaamaNi unnadi. ii chimtaamaNi maharshiki  awasaram wachchinappuDallaa, aatanu kOrinawannii istumdi. kaaraDawulalOni taapasi, kanuka goppa waamCalu lEniwaaDu kaawaDAna kapiluDu 'tana aaSramaaniki wachchina atidhulaku wimdu bhOjanaalu ichchEwaaDu. Rshi tana aadhiinamlOni chimtaamaNi walana awasarapaDinappuDallaa kEwalam aahaarapadaardhaalanu kOrE wADu. ,,,,,,,,, ii prakaaramgaa kapilamuni kaamitaardhaphalapradaayini aina chimtaamaNi walana atithi abhyaagatulaku samtRptigaa satkarimchagalugutuu, tana jiiwanasaaphalyatatO samtOshamgaa rOjulu gaDuputunnaaDu. 

******************************;

okarOju abhijittu puruDu guNawardhanuDu - anE raajakumaaruDu aTawiipraamtamlO wETakai wachchi, miTTamadhyaahnam aalsyam kaawaDam tO daggaralO kaanawachchina kapilaaSramamunaku wachchaaDu. amgarakshakulu, bhaTulupariwaarasamEtamgaa kapiluni imTa sEdadiiraaDu. amtamamdikii oka bawirigaDDam sanyaasi adbhuta bhOjanaadulatO nimushaalalO wasati saukaryaalanu amdimchaaDu. "idi eTlaaga sambhawamainadi?" wismita yuwaraajuku mauni "naa wadda abhiishTha wara pradaayini aina chimtaamaNi anugrahamu walana nEnu ii panulanu chEyagaligaanu." ani cheppaaDu. imkEmunnadi? guNawardhanuniki laalasa puTTimdi.  "araNyawaasiwi, niikemduku? aa maNini naaku iwwu." annaaDu. "jamadagni muni wadda kaamadhEnuwunu kaartawiiryuDu aDiginamduwalana, paristhitulu atalaakutalam ainawi. ippuDu aTlaamTi widhwamsaaniki niiwu muulakaarakuDiwi awawaddu raajakumaaraa!" ani kapilamini Sishyulu, tOTi ASramawaasulu hitawu palikaaru. kaanii abhijittu kumaaruDaina "guNawardhanuDu "sasEmiraa!" amdari maaTlanu peDachewini peTTADu. daurjanyamgaa chimtaamaNini laakkuni, weLLabOyADu. gatyamtaram kaanaraaka, kapiluDu "wighnawinaayakuni" praardhimchinaaDu. bhaktuni wEdana winagaanE gajawadanuDu pratyakshamainaaDu. raajakumaaruni ODimchinaaDu. aatani tamDri abhijittu "maharshii! I maNini swiikarimchamDi." ani kapilamauniki tirigi iwwabOyADu. kaanii aa jaDadhaari sunnitamgaa tiraskarimchaaDu. 
"prabhU! inni kallOlaalaku kaaraNamainadi sampada. kaawuna naaku waladu. aitE naadoka winnapam. tamaru gajaananuniki puujaawidhulanu ErpATlu chEyimchamDi. amtE naaku chaalu." 
akkaDa kadamba wRkshamu krimda winaayaka swaami welisi unnaaDu. paarwatii paramESwarula muddula tanayuDu gaNAdhipati welasina uuru pEru "dEwUr", puuanaa samiipamuna dEwUru unnadi. "chimtaamaNi gaNapati" prajalaku pratyakshadaiwamu.   guNawatiidEwi 

mahaaraashTralO - ashTa widha winaayakulu koluwutiiri unnaaru.
******************************;

అఖిలవనిత
Pageview chart 30350 pageviews - 778 posts, last published on Feb 23, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56722 pageviews - 1014 posts, last published on Feb 21, 2015 - 6 followers

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...