13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

హొయసల మూలసంస్థాన శ్రీక్షేత్ర అంగడి


చిక్కమగళూరు' - అనగానే కర్ణాటకలోని ఒక గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రత్యేకత మనస్సులో కదలాడుతుంది.సరే! ఆనాటి ఎన్నికల సంరంభాన్ని పక్కనబెట్టి, ఆ పల్లె వివరములను పరికిద్దాము."అంగడి" అంటే కొట్టు, షాపు అనే అర్ధాలు ఉన్నవి. తెలుగునాట, జోడీ దశాబ్దము క్రితం - కొన్ని జిల్లాలలో 'అంగడి' అని వాడుకలో ఉన్నది. 
'అంగడి సరుకులు '; అంగడిబొమ్మ - ఎట్సెట్రా పదాలు వాడుకలో ఉన్న మాటలు.వ్యవహృతాలు.
బసడి :- అనునది పాలీ భాష పదము. బసడి - అంటే "వసతి" అని అర్ధం.   
"నేమినాధ బసడి" అని రెండింటిలోనూ- పెద్దదైన జినాలయాలము పేరు. 
ఇందు ముగ్గురి విగ్రహాలు ఉన్నవి, 
అవి - నేమినాధ, చంద్రనాధ, గోమఠేశ్వర ; ముడిగెరె తాలూకాలో కుగ్రామం 'అంగడి ', 
ఐదు  ఆలయముల పురాతనత్వము, చారిత్రక ప్రాధాన్య దృష్ట్యా వార్తలలో చేరింది.   
అంగడి పల్లెయొక్క అసలు పేరు "శశకపుర"/ "సొసెవూర్".
{Mudigere taluk.\;"Sasakapura or Sosevur" by the Hoysalas, }

ఈ "అంగడి పల్లెతోపాటు హొయసల రాజ్యం, హొయసల- అనే పేరు రావడానికి ప్రధాన హేతువు, 
అంగడి  గ్రామ, స్థానికుల దేవి "వసంతిక మాత" - ఈ మూడు విశేషాలు ముప్పేటగా అల్లుకున్న ముత్యాలపేట వలె మురిపిస్తున్నవి.
***************;
కోవెలలో కొలువై ఉన్న "వాసంతికా దేవి" - ప్రాభవమైన హొయసలా సామ్రాజ్య స్థాపకుడైన వీరునికి 
బిరుదనామం కలుగుటకు పునాది స్తంభముగా వెలసినది.
***************;
వాసంతికా దేవి :-- ఊరి దేవత. 
'యోగేంద్ర సుదత్త' అను జైనగురువు కారడవిలోని వాసంతికా దేవిని రోజూ పూజిస్తుండేవాడు.  
యోగేంద్ర సుదత్త ఒకనాడు - వసంతిక దేవి ని పూజించుటకై వెళ్తుండగా గాండ్రిస్తూన్న పులి ఎదురైంది. 
ఒక లోహపు కడ్డీని శిష్యుడైన సాలునికి ఇచ్చాడు. "పొయ్! సాలా!" ("కొట్టు, సాలా!")అని జినుడు ఆదేశించగా, గురువు విసిరిన లోహశలాకను అందుకున్నాడు సాలుడు. గురువు ఆజ్ఞపై "సాలుడు" ఆ వ్యాఘ్రమును పరిమార్చాడు. 
యోగేంద్ర సుదత్త వాక్యాలు రత్నఖచితములైనవి. తద్వారా - ఆ సీమకు  హొయసల అని పేరు వచ్చినది.  
హొయసల- వంశనామ మూల కథ, కొద్దిభేదాలతో చాలా చోట్ల ఉన్నది. సాలుని గాధ, తామ్ర పళ్ళాలు, 
నాణెములు, ఆలయాలలో ఉన్నది. రాగిరేకులపై, ముద్రలపై, ఆలయ కుడ్యాలపై- శిల్ప, లేఖనాదులు - లోహ కమ్మీ, పులి వద్ద వీర సాలుడు - సాక్షాత్కరిస్తూ, హొయసల - మూలపురుషుడైన సాలుని పరాక్రమానికి నిదర్శనములైనవి.
***************;
వాసంతికా దేవి కొలువైన  అంగడి గ్రామమునందు - ఐదు ప్రాచీన దేవాలయాలు ఉన్నవి. 
(జీర్ణావస్థలో ఉన్న పంచ కోవెలలను తిరిగి - పునరుద్ధరణ చేయుటకై విజ్ఞులు ప్రయత్నాలు చేస్తున్నారు.) అంగడి కోవెలలు రెండు - "జైన బసడి" (జైన వసతి) లు అని గుర్తింపు పొందినవి. 
 "నేమినాధ బసడి" అని రెండింటిలోనూ- పెద్దదైన జినాలయాలము పేరు. ఇందు ముగ్గురి విగ్రహాలు ఉన్నవి, అవి - నేమినాధ, చంద్రనాధ, గోమఠేశ్వర. 
10 వ శతాబ్ద కాలమునాటివి జైనబసడీలు. 'మాణిక పొయ్ సలాచారి'
("Makara Jinalaya," built by Manika Poysalachari.) నిర్మించిన జైనబసడీకి "మకర జినాలయము" అని పేరు. 
అక్కడ ఆసీనభంగిమలో ఉన్నట్టి "శాంతినాధ" విగ్రహము శిల్పుల ప్రతిభకు ఆనవాలు.  తక్కిన కోవెలలు మూడు :- కేశవ, పాటల రుద్రేశ్వర, మల్లికార్జున ఆలయాలు. **********; 
వాసంతికా దేవిని స్థానికులు "వసంతమ్మ" అని పిలుస్తారు.  వాసంతికా దేవి కోవెలలోని మకుటములు ధరించిన సప్తమాతృకలు దర్శనం భక్తులు అనుసరిస్తారు. ఏడు మాతల ప్రతిమలు, సున్నము మొదలగు వస్తునిర్మితములు( అనగా ఏడు బొమ్మలు రాతిలో చెక్కినవి కావు, అవి సున్నము, మట్టి, పీచు వంటి సంభారములను అనుభవ నైపుణ్యాలతో, సరైన నిష్పత్తి, దామాషాలలో మేళనం చేసి నెలకొల్పిన ఆలయ నిర్మాతల నిర్మాణములు)   
***************;
వాసంతికా దేవి, పంచ కోవెలలు, జైన బసడిలు :- అంగడి గ్రామం యొక్క కలిమి, హొయసలప్రాభవమునకు మచ్చుతునక.
టూరిజ్మ్ అభివృద్ధి చెందితే, స్థానికప్రజలకు జీవనోపాధి లభిస్తుంది.
మీదుమిక్కిలి అద్భుత ప్రాచీన శిల్పకళావారసత్వము తమ ఊరికి గర్వకారణం కూడా కదా!?
కనుకనే ఔత్సాహికులు జీర్ణోద్ధరణా ప్రయత్నాలను ఉత్సాహభరితులై కొనసాగిస్తున్నారు.
***************;
color pieces in AIR 












వాసంతికా దేవి; హొయసల మూలసంస్థాన శ్రీక్షేత్ర అంగడి 
58278 ;

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ఌఉ 

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56290 pageviews - 1008 posts, last published on Feb 12, 2015 - 6 followers
అఖిలవనిత
Pageview chart 29947 pageviews - 768 posts, last published on Feb 11, 2015

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...