8, నవంబర్ 2012, గురువారం

బోదురు కప్ప రాయి

అనేక మంది రాజపుత్రులకు జన్మస్థానము “గోముఖ్”. 
ఇది శివ  క్షేత్రము, 
నందిశుని నివాసము. 
ఇక్కడ మూడు ఎద్దుల శిల్పాలు ప్రత్యేకముగా కానవస్తూంటాయి.
తొలి పొద్దు వీక్షణము- సందర్శనీయ సంభ్రమాకర్షణ.  
ఊరికి పశ్చిమ భాగమున  sunset point ఉన్నది. 
 క్రింప్సన్ యెల్లో ( చేమంతి పసుపు రంగు/ crimson yellow) వన్నెలను 
ఆకాశము వెదజల్లుతుంది. 
థార్ ఎడారి (Thar Desert) ఇసుక తిన్నెల మీదుగా ఈ సీను నేత్రపర్వమే!  
విస్తారముగా ఇసక మేటల మీదుగా – దిగంతరేఖల దాకా ……..  
కరుగుతూన్న ద్రవము గల పాత్ర వలె గోచరిస్తుంది. 


గోముఖాలయ "(Gomukh temple ) ప్రత్యేకమైనది. 
ఇక్కడ మూడు ఆవుల శిల్పాలు కానవస్తున్నవి.
ఇక్కడ “ మండూక శిల” ఉన్నది. 
ఇది “కప్ప ఆకారము”లో ఉండడము వలన దీనికి ఆ పేరు వచ్చింది. 
ఆచలఘర్ వద్ద సాయం సంధ్యా దృశ్యాన్ని చూసితీరాల్సిందే గాని, 
వర్ణించడానికి మాటలు చాలవు. 
ఆ కొండపైన “కప్ప రాయి” (Toad rock/ frog rock)*1 పై ఎక్కి కూర్చుని, 
సాయంత్ర సూర్య ప్రకాశములను  తిలకించవచ్చును.
 (*1 బోదురు కప్ప/ మండూకము)

*******************;


నక్కీ సరస్సు= నఖములు= గోళ్ళు; గోళ్ళతో తవ్వబడిన మానవ నిర్మాణము, 
సతత హరితారణ్యములకు ఇది ఆధారము.  జలపాతాలు, నీటి అలల సోయగాలు గొప్పవి.

*******************;14 వ శతాబ్దములో ప్రతిష్టించిన “శ్రీ రఘు నాధ్ జీ గుడి”  సందర్శనీయ స్థలము. 
(శ్రీ రఘు నాధ్ జీ ప్రబోధకుడు హిందూ సాధువు) 
అలాగే హనీ మూన్ పాయింటు (Honey moon point) కూడా!  
"అనార్ద్ర పాయింటు" ( Anardra point) ప్రేమజంటలతొ సందడిగా ఉంటుంది.
ఈ విశేషాలు అన్నీ రాజస్థాన్ లోని మౌంట్ అబూ వద్ద ఉన్నవి.

*******************;
Tags:-
{माउंट आबू: नक्की झील: नक्की (नख या नाखून); 
  कार्तिक पूर्णिमा को लोग स्नान }

!!!!!!!!!!!!!  !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!  !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!  


ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...