14, నవంబర్ 2012, బుధవారం

బద్‍కమ్మాహ్, బద్‍కమ్మాహ్ - హిందీ సినిమాల్లో బతుకమ్మ పాటలు


రాజ్ కుమార్, వహీదా ప్రభృతులు నటించిన మూవీ, 
షత్రంజ్ ( Shatranj ) 1969 లలో విడుదల ఐనది. 
ఎస్.వాసన్ దర్శకత్వంలో 1969 లో వచ్చిన హిందీ చలనచిత్రం “షత్రంజ్”
(రాజేంద్ర కుమార్, వహీదా రెహెమాన్ ) 
ఈ సినిమాలో ఒక పాట ఉన్నది. 
ఆ పాటకు చెప్పుకోదగిన అనేక విశేషాలు ఉన్నవి. 
ఈ హిందీ మూవీలో తెలుగు పదాల అల్లరి చిలిపి పాట ఉన్నది. 
మహమూద్, హెలెన్ ల జోడీ ఈ పాటకు డ్యాన్సు చేసారు. 
:
“బతుకమ్మ! బతుకమ్మ!బతుకమ్మ!
  ఎక్కడ పోతావ్ రా?ఎక్కడ పోతావ్ రా? 
  ఇక్కడ్ ఇక్కడ్ రా! ......... ”
:
  గలగలల ఈ గీతము - దీని అర్ధము 
"where can you go, badkmmA........" 

(దక్షిణ భారతీయ భాషలలో – చక్కని పదాలు 
“అక్కడ, ఇక్కడ, ఎక్కడ” “అంగె, ఇంగె, ఎంగె” - అని :- తమిళ భాషా పదాలు. 
“అవ్విడ, ఇవ్విడ, ఎవ్విడ ” అని మలయాళ మనోహర మాటలు )

మహమూద్, హెలెన్ ల ఆ కేబరే డాన్సు 
ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 
అసలు సంగతి ఏమిటంటే – 
ఈ గీతిక  పల్లవిలోని మొదటి పదాలు 
(తెలుగు మాటలు) విరివిగా మనకు కిత కితలు పెడతూంటవి. 
అదీ విశేషమన్న మాట.

హెలెనీయ బ్రేక్ డాన్సు సరదా సరదాగా క్లబ్ లో సాగుతుంది. 
ఎంకన్న (= వెంకన్న), బత్కమ్మ- లుగా 
helen, mehamud లు వెండి తెర పైన నర్తించినారు. 

{Badkamma Ekad Boto Ra - Mehmood, Helen, Shatranj Song ...
► 5:10► 5:10 (Link):- 
www.youtube.com/watch?v=aAJ4asMYepc }

**********************

మరో ముచ్చట:- ఈ గీత గాయని “శారద”. 
ఈమె – అనేక పురస్కారాలను అందుకున్నది. 
“జీవిత చక్రం” cinema లోని (ఎన్.టి. రామా రావు, వాణిశ్రీ తారాగణం) 


“కంటి చూపు చెబుతోంది,; 
 కొంటె నవ్వు చెబుతోంది; 
 మూగ మనసులో మాట ఓ బావా: …”


అనే పాటను శారద గానం చేసింది.

**********************

1964 లో రిలీజ్ ఐన మరో హిందీ చిత్రం 
"రాజ్ కుమార్" లో కూడా 
"బతకమ్మ" - పాట ఉన్నది. 


"నాచ్ రే మన్ బద్ కమ్మా ....... " "Nach Re Man Badkamma")  

(గానము:- లతామంగేష్కర్, ఆశా భోంస్లే). 
ఈ "రాజ్ కుమార్" సినిమాలో 
షమ్మీ కపూర్, సాధన, టున్ టున్ , పృధ్వీ రాజ్ కపూర్
మున్నగు వారు ముఖ్య తారాగణం.

;


కంగారు పడకండి! 
హిందీ యాసలో కాస్తా "బద్ కమ్మహ్"  ఐకూర్చున్నది. 
So, "బద్ కమ్మహ్ హో, బద్ కమ్మహ్ హో" 

**********************;


ప్రఖ్యాత సంగీత దర్శక జంట శంకర్ జైకిషన్ లు.
ఈ హిందీ బతుకమ్మ పాటలు రెండూ వారి జోడీ రూపకల్పన చేసిన మ్యూజిక్ బాణీలు!
వీరిలో శంకర్ హైదరాబాద్ లో పెరిగాడు. 
శంకర్ బాణీలో మరో సూపర్ హిట్ హిందీ సాంగ్, 
(రాజ్ కపూర్, నర్గీస్ లు హీరో హీరోయిన్ లు) 
శ్రీ చార్ సౌ బీస్= శ్రీ 420 - లోని ఒక పాటకు 
పల్లవి తేనెల మాటల తెలుగులోనివే!

"రామయ్యా వస్తావయా? 
  రామయ్యా వస్తావయా? 
  మైనె దిల్ తుఝ్ కొ దియా

  మైనె దిల్ తుఝ్ కొ దియా

.”  

"Sri 420":- 1955 లో రిలీజ్ ఐన మంచి సినిమా ఇది. 

("raamayyaa! wastaawayyaa!
   maine dil tujh ko diyaa........"
(= “ O raamayyaa! Will you come here?
        I gave my heart to you!......" ”)

raamayyaa! wastaawayyaa! (Link web magazine )



బద్‍కమ్మాహ్, బద్‍కమ్మాహ్ - హిందీ సినిమాల్లో బతుకమ్మ పాటలు
(Essay:- Newaavakaaya)
User Rating: / 1
Member Categories - మాయాబజార్
Written by kusuma
Saturday, 27 October 2012 12:28
;

2 కామెంట్‌లు:

Kottapali చెప్పారు...

Very interesting.

అజ్ఞాత చెప్పారు...

దిల్ ఖుష్ అయినాది.
బతకమ్మని నేషనల్ డాన్స్‌గా ప్రకటించాలి. సీమాంధ్రోళ్ళతో బతుకమ్మ ఆడించాలి. గిది నా ఆఖరీ ఖ్వాబ్, మస్తుందిలే?! :))

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...