ఈ పుణ్య క్షేత్రములో శ్రీ రంగ నాథ స్వామి కోవెల ఉన్నది.2. తమిళ నాడు పుణ్య క్షేత్రముల నిలయము.
తమిళనాడులోని 'తిరుప్పుల్లాని" పాండ్య నాడుగా ప్రసిద్ధి కెక్కినది. ఇది రామనాథ పురము దగ్గర ఉన్నది.
శ్రీ రాముడు సముద్రము పైన వానరుల సహాయముతో వారధిని కట్టాడు.అప్పుడు ఇచ్చట రామ చంద్రులు విశ్రాంతి తీసుకున్నారు.
శ్రీ రాముడు సముద్రము పైన వానరుల సహాయముతో వారధిని కట్టాడు.అప్పుడు ఇచ్చట రామ చంద్రులు విశ్రాంతి తీసుకున్నారు.
ప్రసిద్ధి ఐన ఈ పుణ్య క్షేత్రములో మూలవరులు కళ్యాణ జగన్నాధన్ (Kadaladaitta Perumaal) మరియు అమ్మవారు పద్మాసన అయినట్టి కళ్యాణ వల్లి.
తిరుప్పుల్లాని కోవెలలో వట పత్రశాయి ఐన శ్రీ మహా విష్ణు మూర్తి ,భక్తులకు "శ్రీ శేష శయన మూర్తి"గా
తిరుప్పుల్లాని కోవెలలో వట పత్రశాయి ఐన శ్రీ మహా విష్ణు మూర్తి ,భక్తులకు "శ్రీ శేష శయన మూర్తి"గా
దర్శనము ఒసగి, నయన పర్వము చేస్తున్నారు.
ప్రాచీన తమిళ సంగం ఆధారముగా (ఆకనానూరు) ఈ దివ్య క్షేత్రము విశిష్టంగా ఉగ్గడించ బడినది.
ప్రాచీన తమిళ సంగం ఆధారముగా (ఆకనానూరు) ఈ దివ్య క్షేత్రము విశిష్టంగా ఉగ్గడించ బడినది.
తిరు మంగై ఆళ్వార్ పాశురము ద్వారా అనేక విశేషములు బోధపడుతున్నాయి.
జానకీ నాధుడు యుద్ధ సన్నాహములు చేసేటప్పుడు,పరమేశ లింగమును ప్రతిష్ఠించి,
వారం రోజులు ఉపవాస దీక్షతో,పూజా వ్రతమును కొన సాగించాడు.
దివ్య దేశములలో ఒకటైన ఈ తిరుప్పుల్లాని దర్భశయనముగా పేరు కాంచినది.
"పుల్ల"గ్రామము వద్ద ఈ సంఘటనము తటస్థించినది. మహా సాగరముపైన శ్రీ లంక వఱకు నిర్మించ బడినట్టి సేతు వారధి ఆరంభమైన చోటు అగుటచే చిన్న పల్లె అయినప్పటికీ,"పుల్ల"గ్రామము ధన్యమైనది.
ఇక్కడ హేమ తీర్థము, దగ్గరలో దేవీ పట్టణము వద్ద దశరధ నందనుడు పూజించిన "నవ పాషాణములు",
పాంబన్ బ్రిడ్జి, palk strait, rochy wave,తలై మన్నార్ ప్రయాణీకులను ఆకర్షించే అంశాలలోనివి.
ఈ అత్యంత ముఖ్యమైన విశేషముల వలన తిరుప్పుల్లాణి సదా మాననీయమైనది.
( తిరుప్పుల్లాని - దర్భశయనము By kadambari piduri
)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి