3, డిసెంబర్ 2009, గురువారం

తమిళ హాస్య నటి మనోరమ - జిప్సీ పాత్ర


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

Tit Bits ;

నక్కలవాళ్ళు స్త్రీ పాత్ర ;

మన తెలుగు చలన చిత్ర ప్రపంచములో బ్రహ్మానందం ఎలాగో అలాగే - తమిళ హాస్య నటి- మనోరమ అంతర్జాతీయంగా అరవ వాళ్ళ వెండి తెరకు వన్నెలను తెచ్చింది .
"తమిళ సినీ ఉలగం" సుప్రసిద్ధ హాస్య నటి మనోరమ .
సినీ రంగంలో బ్రహ్మానందం వలెనే మనోరమ కూడా గిన్నిస్ బుక్ రికార్డు కెక్కినది. 'కలైమా మణి ', 'పద్మశ్రీ'ఇత్యాదిగా అనేక బిరుదులు పొందినది ఆమె.
దాదాపు 1300 తమిళ సినిమాలలోనూ, 100 కి పైన తెలుగు సినిమాలలోనూ నటించిన మనోరమ, ఇతర భాషలను సైతము నేర్చుకుని, డబ్బింగు తనది తనే చెప్పేది .
1958 లో గీత రచయిత ఐన, కన్నదాసన్ నిర్మించిన
"మాలై ఇత మాగై " ఆమె తొలి చిత్రము.
టి.వి.సీరియల్ "సకల కళా భవన్"లో ఆమె జిప్సీ పాత్రను ధరించినది. ఆ పాత్ర కొండ జాతి స్త్రీ . నరికొరవలు తెగల వాళ్ళు నక్కలను వేటాడుతారు. బుట్టల అల్లిక , చీపుళ్ళు , రోళ్ళు , రుబ్బుడు పొత్రాలనూ అమ్ముతూ జీవితాలు గడిపే సంచార జాతి . సోది చెప్పే వృత్తి అదనం.మనోరమ నారి కొరవల వాడుక భాషను చులాగ్గా నేర్చుకుని సీరియలులో "శభాష్" అనిపించుకున్నది. ఐతే ఇలాంటి పాత్రను పోషించడం ఆమెకు కొత్త కాదు. రెండు దశాబ్దాల క్రితము - ఎ.పి. నాగరాజన్ తీసిన సినిమా "కణ్ కాట్చి" లో నటించిన కురవ వనిత పాత్రను ఆమె పోషించింది.తిరుపతి ప్రాంతాల నుండి మనకు కురవలు కనిపిస్తారు. కర్నాటక, తమిళనాడు, కేరళలలో విస్తరించారు. నారీ కురవలు - నక్కలనూ, కురివికారర్లు పిచ్చుకలనూ వేటాడి, పిట్టలను అమ్మి ఉపాధి సాగిస్తారు.

వీరి భాష "కుత్రాళ కురవంజి సాహిత్యము"గా రూపొందినది. తంజావూరు నాయకుల కాలములో యక్షగానాలు , కురవంజి రూపకములను రాజులు అభిమానించి అభివృద్ధి పరిచారు.

సోది చెప్పే కురతి మహిళలు జానపద హృదయాలకు సన్నిహితులు. శ్రీ లక్ష్మీదేవి శ్రీనివాస కళ్యాణమును జరిపించిన గాధ ప్రజలకు సుపరిచితమే! "కుర్తాళం జలపాతములు" ప్రజల వేసవి విడిది ఆహ్లాదకరమైనదే కదా !
( By ++++++++
kadambari piduri )



కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...