30, సెప్టెంబర్ 2009, బుధవారం

టెంకాయ చిప్ప

వావిలి కొలను సుబ్బారావు గారు గొప్ప రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి " బిరుదాంకితులు అయ్యారు.
సహజ కవి పోతన భాగవతము వెలసిన సీమ ఐన ఒంటిమిట్ట లోని
కోదండ రామాలయమును పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ఆయనది వజ్ర సంకల్పమే! అలనాడు రామదాసుగా ప్రజల మానస పద్మములందు నెలకొనిన కంచర్ల గోపన్నను ఆదర్శముగా తీసుకున్నారు , ఈ " వాసుదాసు ". విరాళాలను పోగు చేశారు,
అయితే అందుకు ఆయన అనుసరించిన పద్ధతి విభిన్నముగా ఉండి , జనుల మన్ననలను అందుకున్నది.
సంచులూ, హుండీలు వంటి వాటిని పట్టుకోలేదు వావిలికొలను సుబ్బారావు. కేవలం ఒక కొబ్బరి చిప్ప ను బిక్షా పాత్రగా గైకొన్నారు. ప్రజానీకం ఇచ్చిన విరాళాలతో , కోదండ రామాలయ పునర్నిర్మాణము దిగ్విజయముగా పూర్తి చేయ గలిగారు వాసు దాసు.
తన బుజ్జి బిక్షా పాత్రపై ఎన లేని ప్రేమతో ఒక శతకమునే రచించారు. అది -

" ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి
రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి
దమ్మిడైనను వాని , లో దాచుకొనక
ధరణి జాపతి కర్పించి, ధన్యవైతివి కదా
కమ్రగుణముల కుప్ప ! టెంకాయ చిప్ప!





ఫిలిప్పీన్సులో మగ లతిక్ నాట్యము(magalatik Dance ) ప్రదర్శిస్తూంటారు.ప్రజలు
అభిమానించే ఈ డాన్సులో ఒక ప్రత్యేకత ఉన్నది.అది, శరీరముపైన - కొబ్బరి చిప్పలను కట్టుకుంటారు.ఆ నారికేళ డిప్పల పైన లయ బద్ధముగా ,మన కోలాటము వలె -కొడుతూ, చిందులు వేస్తారు.ఈ నాట్యము యుద్ధ సమయాలలో ,యోధులను ఉత్సాహ పరిచే గానముతో, నాట్యముతో కూర్చబడిఉంటుంది.స్పెయిన్ పాలనలో ఉన్నప్పుడు, ఇది రూపు దిద్దుకున్నది. స్థానికముగా నివసించే మోరోలు,అనే తెగ వారు, విదేశీయులతో (Moros ) పోరు సలప వలసి వచ్చినది బినాన్, లగునా వారు చేసిన "పోరు చిత్రణ"యే ఈ నర్తన కళగా ప్రదర్శన అయ్యింది.
(Binan, Laguna as a mock-war dance)

ఆ నగరము స్వేచ్ఛ ప్రదర్శన కొరకై పోరాడిన (Town’s patron saint, San Isidro Labrador.)సైంట్ శాన్ ఇసిడ్రో లాబ్రేడర్ అనే యోధుని స్మరిస్తూ, మెగా లతిక్ నాట్యములలో అధికముగా కొనసాగుతూంటాయి.
ఈ నాట్యములో వేసే అడుగులను క్రమమైన పద్ధతితో,లెక్క ప్రకారము జరుగుతూంటాయి.

All dancers are male; with harnesses of coconut shells
attached on their chests, backs, thighs and hips.

Here are the steps of maglalatik dance:
_______________________________________

1. 6 8-counts jogging to get to place -

2. 4 steps forward while pounding chest

3. 4 basic clap cycles in place -
4. 4 basic clap cycles to get to two rows

5. 8 quick clap cycles to do the ripple effect - 6. 8 quick clap cycles to circle around partner- 7. CIRCLE UP

2 8-counts + 1 4-count for first clap - cp after 1 8-count 3X- - Finishing clap - 8. 8 high-low clap cycles to move to position -
9. 8 cycles of 6 hit clapping - 10. 16 counts for tricks with clapping in the background

11. 4 basic to get to two sides - 12. 8 quick clap cycles for the battle -
13. 4 quick clap cycles to get to end

after last clap POSE


---*Note:*---

-----*Learning "maglalatik" Dance is quiet hard for me, but ofcourse, we can learn something. It's a nice dance!*-----

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...