14, సెప్టెంబర్ 2009, సోమవారం

కల కలము రేపిన వారి బంధము

ఛాన్సు ఇవ్వకుండానే..! ::::::
పార్లమెంటు ఉభయ సభలలో వాదోపవాదాలు , వాడిగా- వేడిగా సాగుతూండేవి.నియంత" గా ప్రసిద్ధి కెక్కిన రష్యా దేశ నేత స్టాలిన్ .ఆ నిరంకుశ నాయకుని కుమార్తె స్వెత్లానా ( Stalin’s daughter Svetlana ) ఆమె ఒక భారతీయుని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నది. ఆ ప్రేమ వివాహము సహజంగానే, రష్యాలో స్వకుటుంబీకుల నుండి వ్యతిరేకత ఎదురైనది.అందుచేత ఆ ప్రేమ జంటకు మన దేశములో "రాజకీయ ఆశ్రయము ( asylum ) లభించినది".ఈ విషయములో, డాక్టర్ రామ మనోహర్ లోహియా , వారిరువురికీ( Dr. Ram Manohar Lohia ) ఎంతో చేయూతను ఇచ్చారు.రష్యా తో మన దేశమునకు గల రాజకీయ స్నేహము వలన స్వెత్లానా పరిణయమును సపోర్టు చేసే వారు, వ్యతిరేకించేవారు ఉండే వారు.ఉభయ సభలలో దీనిపై వివాదాలు చెల రేగేవి.
లోహియా తో , తారకేశ్వరి వాగ్యుద్ధం చేయ సాగినది."పెళ్ళి పెటాకులూ తెలియని రామ మనోహరు లోహియా గారికి పరిణయము , దానికి సంబంధించిన సమస్యలు ఎలా అర్ధమౌతాయి."
ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ,వెంఠనే లోహియా అనేసారు ఇలా,
"తారకేశ్వరీజీ! మీరేమైనా నాకు (ప్రణయము - పరిణయము )నాకు అలాంటి ఛాన్సును ఎప్పుడూ ఇవ్వనే లేదు కదా!?!"లోక్‌సభ యావత్తు నవ్వుల సందడే సందడి .
By ; By kadambari piduri, ) ___________________________________________________

రష్యన్ నేత స్టాలిన్ నిరంకుశుడూ ,కర్కశుడు - అని పేరు పడ్డాడు.స్టాలిన్ కుమార్తె అల్లిలూయా స్వెత్లానా ట్రాన్స్ లేటరు వృత్తిని చేపట్టినది.

1965 లో భారతీయుడైన "బ్రజేష్ సింగు తో పరిచయం ఏర్పడినది.

బ్లాక్ సీ వద్ద ఉన్న "సోచి "వద్ద వారి స్నేహము అనుబంధముగా మారినది.తరువాత వ్రజేష్ అనారోగ్యముతో మరణించాడు. ఆతని చివరి కోరిక ,' పవిత్ర గంగా నదీ జలాలలో ఆతని చితా భస్మాన్ని కలుపుటకై , ఆమె ఎంతో శ్రమించినది.
ఏప్రిల్ 16వ తేదీ 1967 లో ,అష్ట కష్టాలు పడి , భారత దేశమునకు వచ్చినది. వ్రజేష్ సింగు అస్థికలను , చిత భస్మాన్నీ , పావన నదీ వాహినిలో కలిపినది.ఆమెకు రాజకీయ ఆశ్రయము మన దేశములో లభించ లేదు.అమెరికా , యూరపు మున్నగు దేశములను స్వెత్లానా తిరుగుతూ , ఎన్నో ఇడుములకు లో నైనది. - కష్టాలకు ఎదురీది ,నిలిచిన ధీర వనిత ఆమె.రష్యాతో ఇండియా స్నేహము భంగమౌతుందనే భీతితో అప్పటి ఇండియా గవర్నమెంటు ,ఆమెకు పొలిటికల్ అస్సైలం ను ఇవ్వడానికి నరాకరించినది. సామాజిక పరిస్థితులే కాదు , దేశాల రాజకీయ పరిస్థితులు కూడా , మనుష్యుల వివాహ సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చేసి, ఫలితాలను నిర్ణయిస్తాయనడానికి , స్వెత్లానా జీవిత చరిత్రయే సాక్ష్యము .

__________________________________________________________________________________

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...