15, సెప్టెంబర్ 2009, మంగళవారం

' చంద మామ ' చక్రపాణి కదా!

చక్రపాణి కదా! చక్ర పాణి , నాగి రెడ్డి (విజయ వాహినీ బ్యానరులో,(డిస్ట్రిబ్యూటర్లు) నిర్మించి, 1957 న విడుదల చేసిన "మాయా బజార్ " సినిమా అత్యద్భుత విజయం సాధించినది.బి.ఎన్.రెడ్డి ,చక్రపాణి ల జంట నిర్మించిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి కూడా !.అయితే చక్ర పాణి ఆ అపజయాలను కూడా, 'జీవితంలో ఒక భాగంగానే గ్రహించే వారు. 'విధి లీలలు' అనే భావనతో, స్పోర్టివ్ గానే తీసుకునేవారు.వారం రోజులలోనే, ఫిల్ము రీళ్ళ డబ్బాలను వెనక్కు వచ్చేసిన ప్పుడు,చక్రపాణి వాల్ పోస్టర్ లను ,తిరిగి కొత్త వాటిని ముద్రింపించి, గోడల మీదకు కులాసాగా వదిలారు.ఆ గోడ బొమ్మలలో ఇలా రాసి ఉన్నవి 'సరి కొత్త - డైలాగులు కాని డైలాగులు!'ఆ ట్యాగ్ లు ఇలాగ ............. "నూరు రోజులు ఆడిన చలన చిత్రము 93 రోజుల క్రిందట విడుదల అయి ఉంటే! " మొదటి వాక్యము బోల్డు లెటర్సులో, పెద్దవిగానూ, ఆ'93 రోజులు...." అనే సెంటెన్సు ,(నూర్రోజులు .. )క్రిందనే, చిన్న అక్షరాలతో రాయించారు. ఓటమిని కూడా హాస్య స్ఫూర్తితో గై కొన్న ధీరోదాత్తుడు ఆయన.

By kadambari piduri

3 కామెంట్‌లు:

Shiva Bandaru చెప్పారు...

బావుంది :)

Anil Piduri చెప్పారు...

Thank you for your suggetion, Ram gaarU!
I will try .

Anil Piduri చెప్పారు...

Thank you , bandaru shiva gaaruu!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...