17, సెప్టెంబర్ 2008, బుధవారం

పన్నీటి జల్లులు ....3

౧)తరి గొండ వెంగమాంబ,ప్రసిద్ధ రచయిత్రి.మరి , 'తరి గొండ' అంటే అర్ధము తెలుసా?
తరి గొండ =మందర పర్వతము .
౨)" పూరి "(ఒరిస్సాలోని) పుణ్య క్షేత్రము . ఇచ్చట, జగన్నాధ క్షేత్రములోని రధమును
తయారు చేసిన వడ్రంగి , "తక్షకుడు" .
౩)జగన్నాధ రధాన్ని చెక్కి నన్నాళ్ళు, తక్షకుడు, ఒక పూట మాత్రమే భోజనము చేస్తాడు .బ్రహ్మచర్యము, భూశ యనము ,నియమ నిష్ఠ లను పాటి స్తాడు.
౪)శిల్పి'తక్షకుని'కి అమిత గౌరవము లభిస్తుంది.
"బడా దండ"(రాజ వీధి పేరు) నుండి ప్రజలుమేళ తాళాలతో వెళ్లి శిల్పికి సత్కారములు
చేసి, స్వాగతము పలుకుదురు.
౫)వరాహ మిహిరుడు >>>ఋ తుపవనముల రాకను ,వాతా వరణ విశేషాలను తెలుసు కొనుటకై అద్భు త సిద్ధాం తములను రూపొందించిన ఉద్గ్రం దము
"బృహత్సంహిత".
౬)అనంతామాత్యుడు రచియిం ఛిన పుస్తకములో వ్యవసాయము ,మెలకువలు ఎన్నో
వివరించెను. ఆ గ్రంధము పేరు " సస్యానందము".
౭)"మహా భారతము" ను పర్షియన్ భాష లోనికి చేసిన అనువాదము కలదు.
"రాజీ నామా" అని దాని పేరు.
౮)బుద్ధునికి , రావి చెట్టు క్రింద ౪౦ (నలభై )రోజులు తపస్సు చేసి ,జ్ఞానోదయము అయ్యినది .


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...