11, జులై 2017, మంగళవారం

రెటమతం- పొలం proverbs - 1

1] ఏడు ఎండల విత్తనాలు ఎంత వరపుకైనా ఆగుతవి ;-   

( పరిశోధనలలో - ఇది వాస్తవం - నిజమే - అని తెలుసుకున్నారు.  )
2] చిత్త చిత్తగించి, స్వాతి దయ చూసి, విశాఖ విసరికొట్టకుంటే, 
   అనూరాధలో అడిగినంత పండుతాను - అన్నది జొన్న చేను. ;
3] చిత్తజల్లు - స్వాతి వాన ;

4] చంద్ర పరివేషం - వర్షయోగం ;
============================= ;
=
1] EDu emDala wittanaalu emta warapukainaa aagutawi ;-   
pariSOdhanalalO - idi waastawam - nijamE - 
ani telusukunnaaru.
2] citta cittagimci, swaati daya cuusi, 
wiSAKa wisarikoTTakumTE, 
anuuraadhalO aDiginamta pamDutaanu - 
annadi jonna cEnu. ;
3] cittajallu - swaati waana ;
4] camdra pariwEsham - warshayOgam ;
;

[ uuru, polam #proverbs  # ;
;

[ ఊరు, పొలం proverbs , సామెతలు ] ;;
***************************************;

రెట్ట మతం / రెటమతం = మొండి ఘటం ; 
         పెడర్ధం మనిషి ; పెడకట్టె ; చండి మొండి = 

 ఎవరి మాటలు విననని వ్యక్తి యొక్క స్వభావం ; 
reTTamatam / reTamatam = momDi ghaTam ; peDardham manishi ; peDakaTTe ; camDi momDi = 
= ewari maaTalu winanani wyakti yokka swabhaawam ; 
;
**************************************;
;
రెట్ట మత శాస్త్రము , వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు ;-
వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు 
అనేక విషయములను పద్య రూపములో అమర్చి,
తమకు భవిష్యత్ తరాల వారికి అందించిన 
అద్భుత విజ్ఞాన కృషి సంపద ఇది.
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''
"పరగ నశోకంబు, బ్రహ్మ మేడియు పూచి : 
కాచిన సస్యసం - ఘము ఫలించు :
కపురంపు టనటులు - కాచ నల్లవిసె పై : 
రాదిగా కృష్ణ ధా-న్యములు ప్రబలు :
బాగు మీఱగ చింత- పాలయు కరి వేము : 
కాచిన వ్రీహి వ-ర్గంబు మించు :
వింతగా తుమికి చె-ట్టంతయు కాచిన :
యవ నాళ సమృద్ధి - యగును మిగుల :
;
నెలమి ములు మోదుగలు కాయ నలరు గొఱ్ఱ :
మొల్ల పూచిన ఆవాలు మొల్ల మగును :
రావి గాచిన జనుమును, ప్రత్తి వొడము :

సత్యమింతయు వేంకట క్ష్మాతలేంద్ర."

;-  నేదునూరి గంగాధరం మొదలగు ఆర్ష సాహితీ జిజ్ఞాసువులు
ఈ ప్రాచీన సంపత్తిని, పాఠకులకు అందించుటకై ఎంతో కృషి చేసారు. ;

;************************************************************;
రెట్ట మత శాస్త్రము , వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు ; - LINK ;
Labels: ప్రాచీన రత్న మాల ; సూక్తి మణి ;  పొలం proverbs - 1 ;
పౌరాణిక సామెతలు, proverbs - 2, 3 +  ;  
పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ;
లోకోక్తి , ఔచిత్యము  [ link ] ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...