11, జులై 2017, మంగళవారం

సార్ధక నామధేయుడు

శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు ;-మహాప్రస్థానం - కలిగించిన సంచలనం  అంతా ఇంతా కదు. తెలుగు కవితా శైలిలో పెను పరిణామాలను తెచ్చింది. యుగకర్త , వైతాళికుడు - ఇట్లాగ కీర్తించబడ్డాడు శ్రీశ్రీ. 
యశస్సు ఎంతో ఉన్న చోట అంతే ఎత్తులో విమర్శకులు, వ్యతిరేక వర్గం వాళ్ళు ఉంటూనే ఉంటారు. 
శ్రీశ్రీ మసిలే ప్రతి చోట, సాహిత్య జిజ్ఞాస కల వ్యక్తులు చేరడం సహజమే కదా! 
అందరూ అవీ ఇవీ మాట్లాడుతున్నారు. 
సాహిత్య విశేషాలతో ఆ సంభాషణలు, 
వాతావరణంలో ఆహ్లాదాన్ని నింపుతూ ఉన్నాయి.
ఇంతలో అక్కడికి ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. 
ఒక రోజు శ్రీశ్రీ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు.  
ఆ పిల్లాడిని మహాప్రస్థాన కర్త - కనుసైగ చేస్తూ, కూర్చోమని 
మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు. 
"నాయనా! నీ పేరేమిటి?" 
శ్రీశ్రీ ప్రశ్నకు బదులు వచ్చింది, "నా పేరు పిచ్చిరెడ్డి." 
;
శ్రీరంగం శ్రీనివాస రావు యొక్క విప్లవాత్మక ధోరణి పట్ల విముఖత ఉన్న విద్యార్ధి అతను. 
మహాకవిశ్రీశ్రీ దగ్గరికి వచ్చి, అతడు తృణీకారంగా, తిరస్కారంగా,
ఆపకుండా మాట్లాడుతున్నాడు.  
అతని వదరుబోతుతనాన్ని తతిమ్మా వాళ్ళు విస్తుబోతూ వీక్షిస్తున్నారు.
ఆతని వైఖరికి పక్కన కూర్చున్న మనుషులు ఖిన్నులై, 
చూస్తూ ఉన్నారు. 
విద్యార్ధి పిచ్చిరెడ్డి అన్నాడు 
"శ్రీశ్రీ! ఇంక మీ మహాప్రస్థానంను ఎవరూ చదవనక్కరలేదు." 
చాలా సేపటి దాకా ఓపిక పట్టి ఉన్న శ్రీశ్రీ,
క్లుప్తంగా చిలికిన పలుకులు - 
కొస మెరుపులు ఔతూ, పరిసరాలలో నవ్వులను వెదజల్లినాయి. 

"ఇదిగో చూడు పిచ్చిరెడ్డీ! సార్ధక నామధేయుడివి నువ్వు." 
;
==================================
;
1] శ్రీ mahaaprasthaanam - kaligimcina samcalanam  amtaa imtaa kadu. telugu kawitaa SaililO penupari Naamaalanu teccimdi. yugakarta , waitaaLikuDu iTlaaga keertimcabaDDaaDu శ్రీశ్రీ. yaSassu emtO unna cOTa amtE ettulO wimarSakulu, wyatirEka wargam waaLLu umTuunE umTaaru. 
2] శ్రీశ్రీ masilE prati cOTa, wEsE prati D saahitya jij~naasa kala wyaktulu cEraDam sahajamE kadaa! amdaruu awee iwee 
mATlaaDutunnaaru. saahitya wiSEshaala tO A sambhaashaNalu, waataawaraNamlO aahlaadaanni nimputuu unnAyi.
3} imtalO akkaDiki oka kotta abbaayi waccADu. "nAyanaa! nee pErEmiTi?" శ్రీశ్రీ praSaku badulu waccimdi, "naa pEru piccireDDi."
] oka rOju oka sTUDemT శ్రీశ్రీ daggarik waccADu. A pillaaDini mahaaprasthaana karta - kanusaiga cEstuu, kuurcOmani 'maryAdapuurwakamgaa aahwaanimcADu.  
3, 4 ] శ్రీశ్రీ yokka wiplawaatmaka dhOraNi paTla wimukhata unna widyaardhi atanu. }}}}  mahaakawi daggariki wacci, అతడు tRNIkaaramgaa, tiraskaaramgaa,ApakumDaa  maaTlADutunnaaDu.
4, 5 ] piccireDDi anE widyaardhi Sree SreetO annaaDu "imka mahaaprasthaanam nu ewaruu cadawanakkara lEdu." 
3, 4] "saardhaka naamadhEyuDiwi nuwwu." ani maaTala curakalu wEsaaru Sree Sree jawaabugaa. 
5} aatani waikhariki pakkana kuurcunna manushulu khinnulai, cuustuu unnaaru. ;
caalA sEpaTi dAkaa Opika paTTi unna శ్రీశ్రీ kluptamgaa cilikina palukulu - kosa merupulu autuu, parisaraalalO nawwulanu wedajallinaayi.
;
************************,
;
సాహిత్య ;- శుక్రవారం 16-06-2017 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...