5, మే 2011, గురువారం

పేదలకు బ్రతుకు తెఱువు దొరికినది కదా!
కోటయ్య అనే సాధువు స్వామికి వస్తూన్న 
కీర్తి సంపదలను గని, కినిసి, ఈర్ష్య పడ సాగాడు.
శ్రీ మలయాళ స్వామిని దూషిస్తూ 
కొన్ని పద్యాలు రాసాడు. వాటిని అచ్చు వేసి, 
స్వామిని వ్యతిరేకిస్తూ ఏర్పరచిన సభల్లో పాడాడు.
స్వామి శిష్యుడైన రాజయ్య – స్వామికి ఆ సంగతిని చెప్పాడు.
స్వామి ఇలా వక్కాణించారు 
“రాజయ్యా!మనలను ఎందరో ప్రశంసించారు, 
 పొగడుతూ కరపత్రములను (pamphlet ) కూడా వేయించారు. 
పుస్తకములనూ ప్రచురించారు. 
అప్పుడు మనకు లేనిది వచ్చినదా? ఉన్నది పోయినదా? 
ఇప్పుడు ఒకరు మనలను దూషించినందు వలన మనకు కలిగిన నష్టమేమి?”
“అట్లు కాదు స్వామీ! ఆ దుర్మార్గుడు ఆ పద్యాలను అచ్చు కూడ వేయించాడు.”
“అచ్చు వేసిన నేమి? దాని వలన ప్రెస్స్ పని వారికి,
 కొందరు పేదలకు  బ్రతుకు తెఱువు దొరికినది కదా! 
మన తప్పులను వెదకి చూపుచు, 
మనలను నిందించు వారు మనకు ఎంతో అవసరమై ఉన్నారు. 
అట్టి వారు ఉన్నపుడే కదా మనము తప్పులు చేయకుండా జాగ్రత్త వహింతుము.”
కవి రాజు, నాస్తిక వాదులు యజ్ఞ శాలకు నిప్పు అంటించారు. 
ఇట్టి అనేక దుష్కృత్యాలను స్వామి సహించారు.
చివరికి సభలోని మహిళా వర్గము వారు సహింప లేక పోయారు. 
తిరుపతమ్మ అనే వనిత నాయకత్వములో, 
ఆ రిపు వర్గం వాళ్ళతో వాగ్యుద్ధము చేసారు. 
పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని – 
గ్రహించిన కవి రాజు -     ఆ సభ నుండి నిష్క్రమించారు. 
( అనంతర కాలములో కవి రాజు గారికి స్వామి పట్ల గౌరవము కలిగినది - పేజీ236)
స్తుతి నిందలలో సమ భావము కల వాడే జ్ఞాని – అనే 
సత్యాన్ని తన జీవితము ద్వారా నిరూపించిన మహనీయుడు స్వామి.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...