19, మే 2011, గురువారం

మనుమడి చమత్కార వివరణ


          డాక్టర్ గిడుగు వేంకట సీతాపతి 
సంస్కృత భాషలోనికి –అనువదించినట్టి  
అనగా సంస్కృతీకరణ చేయబడిన
తెలుగులో రచించబడిన కావ్య, ప్రబంధాలలో 
అనేక మేలి రతనాలు ఉన్నవి.
వాటిని –“ కవితోదయ చంద్రిక “గా వెలువరించారు.
"నాహం సంస్కృత పండితః, న చ కవిః
కింత్వేష యత్నః కృతః
విజ్ఞాతుం బహుమాని తాంధ్ర కవితా
మాధుర్య మాంధ్రేతరే
కాంక్షంతీతి భ్రంశం విచింత్య కతిచి
త్పద్యాని గేయా న్యహం
ప్రీత్యా సంస్కృత భాష యా వ్యర చయం
మా మాద్రి యాంతాం చుదాః.”
అంటూ సవినయంగా మనవి చేసుకున్న నిగర్వి గిడుగు సీతాపతి.
గిడుగు సీతాపతి భీముని పట్నంలో 
 
1885 జనవరి 28 వతేదీన జన్మించారు.
ఆతని తండ్రి వేంకట రామ మూర్తి గారిది  పర్లాకిమిడిలో మాస్టారు గిరీ.
కావున  గిడుగు సీతాపతి బాల్యం పర్లాకిమిడిలో గడిచింది.
నాయనమ్మ ఈ మనవడిని,
చిన్నారి బుడుగు లాంటి  గిడుగు సీతాపతిని,
 
ఒళ్ళో కూర్చుండ బెట్టుకుని,
తనకు వచ్చిన పద్యాలూ, పాటలూ చెబుతూండేది.
ఒకసారి ఆవిడ ఒక పద్దెం (poem) చెప్పింది.
“చింతా మణి యను బ్రాహ్మడు;
పంతానికి గోడ మీద షట్ మని వ్రాసెన్;
అంతట వర్షము కురిసెను;
కంటి మీద కాకర పూసెన్.”
ఆమె కుమారుడు వేంకట రామమూర్తి,అనగా గిడుగు తండ్రి
“ తలా తోకా లేని ఇలాంటి పద్యాలేమిటి?! ” 
 
అంటూ విసుక్కునే వారు.
అప్పుడు చిన్నారి గిడుగు సీతాపతి ఇలా వివరణ చేసారు.
“ అలా కాదు నాన్నారూ!
గోడ మీద కాంతా మణి పటం మీద వాన పడింది.
అప్పుడేమో ఆ బొమ్మ కన్ను తడిసింది.
అందులో నీటి చుక్క ఒకటేమో కాకర పువ్వు ఐనదన్న మాట! ”
అంటూ ఆ టీకా టిప్పణి తో పితామహిని సమర్ధించాడు.
మనవడి అర్ధ తాత్పర్యాలూ,
ఆ చిన్నారి పాండిత్య ప్రతిభకు దర్పణం అవడంతో
ఆమె ఉప్పొంగిపోయిందని వేరే చెప్పాలా!
                { యువభారతి ప్రచురణలు  1975
                             తిరుమల రామ చంద్ర “మరపురాని మనీషి” }
               

            మనుమడి చమత్కార వివరణ (తెలుగురత్న)కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...