18, ఏప్రిల్ 2011, సోమవారం

ఆ క్షణాలు అపురూపమైనవే కదా!

నార= జ్ఞానము; ద= ఇచ్చుట   జగతికి అద్వితీయ సంగీత సేవలను అందించిన మహోన్నత ముని నారద మహర్షి సార్ధక నామ ధేయుడు ఐనాడు. త్రిలోక సంచారి, సంగీత రహస్యాలను విశ్వానికి అందించిన మహా సంఘ సేవా జీవి నారద ముని.  నారద రచనలు ప్రపంచ సంగీతమునకు అమూల్య నిధులు."నారద భక్తి సూత్రములు"  వంటి అద్భుత గ్రంధ రత్నములు నారద ముని కృషి ఫలితముగా వెలువడినవి.  "నాస్తితేషు - జాతి,విద్యా,రూప,                కుల, ధన క్రియాది భేదః..." నారద భక్తి సూత్రములు,సర్వ కాల సమాన సమ సమాజ జీవనమును ప్రతిపాదిస్తూ,  భక్తులకు వర దానములైనవి. ముని చెప్పగా,  సంగీత రహస్యాలను అందుకున్న వ్యక్తి కాకర్ల త్యాగయ్య.త్యాగ రాజుకు -  బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు సంగీత శృతి జ్ఞాన రహస్యాలను కరతలామలకము చేస్తూ ఒక  అద్భుత గ్రంధాన్ని ఇచ్చాడు.ఆ పరామానంద సంఘటనతో పులకిత గాత్రుడైన త్యాగ రాజు"పంచ రత్నాలను"  ఆశువుగా గానం చేసారు
1.జగదానంద కారక (నట)2.దుడుకు గల నిన్నే3.సాధించెనే మనసా!4.కనక రుచిర కనక వసన 5.ఎందరో మహానుభావులు 
"పంచక రాగములు" గా ప్రసిద్ధి గాంచినవి - ఈ గీతములు సంకూర్చబడిన బాణీలు"నట, గౌళ,ఆరభి, వరాళి, శ్రీ రాగములు "ఇరువురు ఉద్ధత పండితులు, నిష్కామ శీల పూర్ణ విలసితులూఋషితుల్యులూ మన కర్ణాటక సంగీత ప్రపంచానికి కర్ణపేయమైన సంగీత కృతులను అందించిన ఆ క్షణాలు అపురూపమైనవే కదా!
               నారద భక్తి సూత్రములు  (Link)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...