ఆంధ్ర వాస్తు శిల్పులను అనుసరించిన ప్రభువులు,
ఉత్తరభారతదేశములో చేసిన కట్టడములు ఉన్నవి, తెలుసునా!!!!?
మధ్యప్రదేశ్ లోని ధార్ ప్రాంతం పారమార్ రాజుల పాలనలో
చారిత్రక ప్రసిద్ధి గాంచినది.
ప్రాచీన ధార్ [धार ] ఉపరితలమును గమనించి,
తదనుసారంగా - రాజ్యపాలకులు నగరనిర్మాణానికి పూనుకున్నారు.
భూమిలో చీలికలు, పల్లపుప్రాంతాలను గుర్తించి
అనుసరించిన ప్రభువులు, పుర రూపురేఖలను తీర్చిదిద్దారు.
నీటి నిల్వలను ఉంచగల ప్రదేశాలను ఎంచుకున్నారు.
ఆ మీదట ఏలికలు - పశ్చిమ, దక్షిణ దిశలకు నగర విస్తరణను నిర్దేశించారు.
19వ శతాబ్ద ఆరంభమున ఈ చారిత్రక సంఘటన జరిగినది.
# [ series of tanks and moats. #]
ప్రజాసంక్షేమానికై, నిత్యావసర సామగ్రి,
అందులో 'నీరు ' యొక్క ప్రాముఖ్యతను గమనించిన -
పారమారుల దూరదృష్టికి నిదర్శనం
ధార్ చక్రవర్తులు కోటను, ప్రహరీగోడలు, కందకములను నిర్మించారు.
దుర్గ నిర్మాణాలను పటిష్ఠంగా నిర్మించారు.
సరే! ఇంతకీ మనం ప్రత్యేకంగా గమనించదగిన అంశం
ఇక్కడ ఒకటి ఉన్నది.
పారమార చక్రవర్తులు దుర్గ నిర్మాణాలకై ఒక శైలిని అనుసరించారు.
అది ఏమిటంటే -
దక్కన్ ప్రాంతమునందు నెలకొని ఉన్న
"ఓరుగల్లు పుర" నిర్మాణతా రీతులను నమూనాగా స్వీకరించారు.
ధార్ పుర ఆకారం - నాటి ఓరుగల్లు [= వరంగల్ టౌన్] పద్ధతిని పోలి ఉండడం,
దక్షిణాది శిల్పుల ప్రతిభా నైపుణ్యతలకు లభించిన గుర్తు కదా!
@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి