14, ఆగస్టు 2015, శుక్రవారం

లోకకళ్యాణం

లోకకళ్యాణం జనఆదర్శం 
ఉన్నతలక్ష్యం సమోన్నత లక్ష్యం
అందుకనే మనమందరము 
             సాగిద్దాము మన పయనం - || || 
ఆత్మస్థైర్యం ఘనమౌ ధనము
       ఘన మౌలిక పెన్నిధి
చేపట్టుదము వెలుగుల జ్యోత;
           విజ్ఞానజ్యోతి  
అందుకనే మనమందరము  
             సాగిద్దాము మన పయనం - || || 
ప్రపంచశాంతి ఉన్నతధ్యేయం   - 
             హిమ శృంగ ధ్యేయం  
సమతాభావన  ఎల్లరి గమ్యం - 
             సమోన్నత గమ్యం  
అందుకనే మనమందరము 
             సాగిద్దాము మన పయనం - || || 

"వందే మాతరం!" మధు నినాదము!
          మన ముందంజకు గగనమార్గము!   
నిత్యప్రగతీ మధుర ఫలములను
         మాతృభూమికి భక్తితొ ఒసగే
చక్కని ఫలితం, తెలుయుము నేస్తం
        అందుకనే మనమందరము 
              సాగిద్దాము మన పయనం - || || 

========================

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 60745 pageviews - 1023 posts, last published on Aug 14, 2015 - 7 followers
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...