అష్టచాప్ కవులు, శ్రీనాధ్ జీ సంప్రదాయం - అంటే ఏమిటో తెలుసా?
నేడు కూడా కొనసాగుతూన్న ఆలయసాంప్రదాయాలలో ఇది ఒకటి.
దివ్య ప్రేరణ: స్వామి సాక్షాత్ దర్శనము; దివ్యత్వం; భగవత్ భావనతో మమైకత్వ భావనలు - ఈ దివ్యసంగీతమునకి పునాదులు.
అమందానందము,అలౌకికపారవశ్యతలతో భక్తి మార్గముద్వారా- మన సాంప్రదాయిక సంగీతము సుసంపన్నమైనది.
@@@@@@@@@@@@@@@@@@@@
కృష్ణ వల్లభుడు బిరుదు కలిగిన క్రిష్ణ భక్తుడు వల్లభాచార్యులు :-
భక్తి గాన సంప్రదాయాలను పుష్కలంగా ఆచరణలోనికి తెచ్చినట్టి ఆధ్యాత్మిక గురువు వల్లభాచార్యులు [945 A.D.] - కృష్ణ భక్తిని వ్యాప్తిలోనికి తెచ్చిన వ్యక్తి వల్లభాచార్యులు.
మీరాబాయి, సూరదాసు భజనలు, కీర్తనలు ప్రసిద్ధి. వీరి బోధ గురువు వల్లభాచార్యులు .
విశేషముగా చెప్పుకోవలసినది వల్లభాచార్యులు మన తెలుగువాడు.
@@@@@@@@@@
అష్టచాప్ కవులు :-శ్రీ గుషైన్ జీ ; బాలకృష్ణుని స్నేహితులు ఎనిమిదిమంది :- క్రిష్ణయ్యకు 8 అంకె అంటే ఇష్టం కాబోలు,
స్వామివారికి ఎనిమిదిమంది భార్యలు (అష్ట భార్యలు) ;-
5000 వేల సంవత్సరముల క్రితం క్రిష్ణునితో కూడి, ఆట పాటలతో నాటి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేసారు. క్రిష్ణయ్యకు ప్రియమిత్రులు 8 మంది.
మురళీధరుని స్నేహితుల పేర్లు ఇవిగో! :-
సుదామ = కుచేలుడు);
రిషభ,
అర్జున,
భోజ,
తోక్,
విశాల,
సుబల,
శ్రీధామ ;
@@@@@@@@@@@@@@@@@@@@
ఈ ఎనిమిదిమందీ దాల్చిన "అవతారములు" ఉన్నవి,
అవి ఏమిటో, వారు ఎవరో తెలుసా?:-
సంత్ సూరదాస్ ;
కుంభన్ దాస్;
పరనంద్ దాస్,
ఛత్రభుజ్ దాస్,
క్రిష్ణదాస్,
నందదాసు;/నందదాస్; =
క్షేత్ర్ స్వామి, (Chettar swaami);
గోవింద్ దాస్) :-
ఈ ఎనిమిదిమంది మధురలోని శ్రీలీలా కీర్తనకారులు ఐనట్టి అష్టచాప కవులు.
@@@@@@@@@@@@@@@@@@@@
16 వ శతాబ్దంలో హవేలీ సంగీతమును అభివృద్ధి గాంచింది.
నాలుగుసార్లు ఈ భజన రాగాలాపనలు జరుగును.
క్రిష్ణస్వామిని నాలుగుసార్లు కీర్తించు వేదికయే "పుష్టి మార్గ్".
వేకువఝామున మంగళ, శృంగార్, గ్వాల్, రాజ్ భోగ్ (ప్రసాద
నైవేద్యాదులు) సమర్పణలు, శిఖిపింఛధారికి సమర్పిస్తారు.
సాయంకాలం సందెవేళకు ఉత్థాపన్, సంధ్యా ఆరతి, శయన్ సేవలను
వివిధరాగాలాపనలతో శ్రోతలను అలరిస్తూంటాయి.
రాజస్థాన్ లోని ఉదయపూర్ వద్ద రాధావల్లభ ఆలయంలో, బృందావన్,
నంద్ గావ్, బర్సానా లోని రాధారాణి గుడి - మున్నగు కోవెలలలో
ఈ భక్తిసంగీత సంప్రదాయాన్ని అమలుచేస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని అనేక వేణుగోపాల ఆలయాలలో హవేలీ సంగీతంపుష్ఠిమార్గ్ లను భజన సంకీర్తనా ఆచారములలో పాటిస్తున్నారు.
శ్రీకృష్ణస్వామిని కీర్తిస్తూ, వివిధరాగాలను ఎంచుకుని పాడుతారు, నిర్దిష్టరాగాలాపనలు ఆయా రోజులలో పాటిస్తూంటారు.
జానపద ఫణితి ఎక్కువ శాతం అనుసరణ ఔతూంటుంది. భావ నృత్య, భజన సంగీతాదులకు, ధృపద్/ ధ్రుపద్, హవేలీ సంగీత్ -
హిందూస్థానీ సంగీతాదులను 8 musctions గాయకులు అనుసరిస్తూంటారు.
తబలా, హార్మోనియం, బాంసురీ, సారంగి, పఖ్వజ్, సుర్ పేటి, మజీరాజాంఝ్
(Surpeti; Majeera jhanjh)మొదలగు వాయిద్యాలను ఉపయోగిస్తారు.
సూరదాసు, కుంభన్ దాసు, పరనంద్ దాసు, ఛత్రభుజ్ దాసు, క్రిష్ణ దాసు, నందదాసు; = క్షేత్ర స్వామి, (Chettar swaami) గోవింద దాసు) :-
నేటికీ వారి వారసులు - అనుయాయులు - 8 మంది, సంగీత భజన సాంప్రదాయాన్ని నిర్విఘ్నంగా పాటిస్తున్నారు.
శ్రీనాధ్ జీ సంప్రదాయ ఆచరణ :-
తోలారామ్ జీ ; క్రిష్ణదాస్ జీ; శ్యామ్ జీ, ప్రమోద్ :- హార్మోనియం వాదకులు;
నవీన్ చంద్ర - కీర్తనకారులు ; అమృత్ లాల్ జీ - సారంగ్ వాదక్;
భన్వర్ లాల్ జీ, బ్రజేష్ జీ, చంద్రకాంత్ జీ -
శ్రీజీ 'లాలి పాట'ను వీణావాద్య వాదన ద్వారా వినిపిస్తూ ఉంటారు.
హవేలీ సంగీతము, పుష్ఠిమార్గ్ సంగీతములు మన శాస్త్రీయసంగీతమునకు సిరిసంపదలు, అమూల్య నిధులు అందించినవి అనడం అతిశయోక్తి కాదు.
ఆ దివ్యభక్తి తత్వమునకు మనమెంతో ఋణపడిఉన్నాము కదూ!!!!!!!
@@@@@@@@@@ @@@@@@@@@@
అష్టచాప్ కవులు; శ్రీ కృష్ణ చైతన్య సేవా సత్సంగ కమిటీ [F. B.] [LINK ]
@@@@@@@@@@@@@@@@@@@@ @@@@@@@@@@
[ 59911 - konamanini ]
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 61159 pageviews - 1025 posts, last published on Aug 17, 2015 -