24, జూన్ 2015, బుధవారం

వెయ్యినూటపదహార్లు

నా మానసపుత్రిక కోణమానిని బ్లాగు
పోస్టులు 1016 పూర్తి ఐనవి.
అక్షరాలా వెయ్యిన్నూటపదహార్లు ; 
నా మాతృభాష తెలుగు పట్ల ఆపేక్ష, 
నా వ్యాస, గీతాది రచనలతో 
ఈ సాహితీ లతలను ఎగబ్రాకేలా చేసినవి.

గూగుల్ వంటి ఇంటర్ నెట్ వారు కల్పించిన సదుపాయాలు, 
లేఖిని వంటి  ఉపకరణాలు, ఇందుకు ప్రోద్బలములైనవి. 
కూడలి, బ్లాగిల్లు, జల్లెడ, మాలిక ;  
నా రచనలను ప్రచురించి, ప్రోత్సహిస్తున్న వెబ్ పత్రికలు-
న్యూఆవకాయ, పుస్తకం. నెట్, జాబిల్లి, కిడ్స్ ఫర్ కిడ్స్.ఇన్ 

మున్నగు పత్రికలకు కృతజ్ఞతా పుష్పాంజలి. 

ఇక చాలని అనుకోకుండా, ఇకపై చాలించాలని చతికిలపడకుండా - 
వీలైతే మళ్ళీ కొత్త బ్లాగు ద్వారా 
ఈ సాహితీ ఆరాధనను కొనసాగించాలని నా తలపు. 

అంతర్జాల ఆంధ్రభాష పరిపుష్ఠి గాంచుటకు వెబ్ పత్రికలు,   
అగ్రెగేటర్లు, విజ్ఞాన సంధాయినులు ఎందరి నిష్కామకృషి ఉన్నదో కదా!
చదువరులకు, సాహితీ అభిమానులకు, యావత్ సారస్వత బంధు మిత్రులకు, 
నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తూన్న నా కుటుంబసభ్యులకు ధన్యవాదాలతో - 
ఏప్రిల్ 2015 చైత్రమాసం, -  
                 కాదంబరి / కుసుమాంబ (1955) 

===================================












naa maanasaputrika kONamaanini blaagu
pOsTulu 1016 puurti ainawi.
aksharaalaa weyyinnuuTapadahaarlu ; 
naa maatRBAsha telugu paTla aapEksha, 
naa wyaasa, giitaadi rachanalatO 
naa saahitii latalanu egabraakElaa chEsinawi.
guugul wamTi imTar neT waaru kalpimchina sadupaayaalu, 
lEKini wamTi  upakaraNAlu, imduku prOdbalamulainawi. 

kuuDali, blaagillu, jalleDa, maalika ;  
naa rachanalanu prachurimchi, prOtsahistunna web patrikalu-

nyuuaawakaaya, pustakam. neT, jaabilli, kiDs phar kiDs.in munnagu   patrikalaku kRtaj~natA pushpaamjali.

ika chaalani anukOkumDA, ikapai chaalimchaalani chatikilapaDakumDA - wiilaitE maLLI kotta blaagu dwaaraa ii saahitii aaraadhananu konasaagimchaalani naa talapu. 
amtarjaala aamdhrabhaasha paripushThi gaamchuTaku web patrikalu,   agregETarlu, wij~naana samdhaayinulu emdari nishkaamakRshi unnadO kadaa!
chaduwarulaku, saahitii abhimaanulaku, 
yaawat saaraswata bamdhu mitrulaku, nannu aDugaDugunaa prOtsahistuunna naa kuTumbasabhyulaku dhanyawaadaalatO - 
Epril 2015 chaitramaasam, - 
             kaadambari / kusumaamba (1955) 

2 కామెంట్‌లు:

Surya Mahavrata చెప్పారు...

వెయ్యిన్నూటపదహారంటే 1116 కదండీ :)

dewi Waijayamti చెప్పారు...

correct surya gaaruu

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...