రుక్మాంగద రాయలు "సక్రేత పట్టణము"నకు ప్రధాన పాలకుడు.
శఖ్యత, మైత్రీ బంధాలకు మారుపేరుగా ( Sakrepatna )
అతని ఏలుబడిలో రూపుదిద్దుకున్నది.
అతనికి ఇద్దరు తనూజలు. వారికి రెండు పట్టణాలను
పరిణయ వేళల కానుకగా ఇచ్చాడు.
అవే చిక్కమగళూరు, హీరేమగళూరు.
రుక్మాంగదుడు "అయ్యన్ కెరె జలాశయాన్ని" కట్టించినాడు.
ప్రజలకు నేటికీ అధిక ఉపయోగము ఔతూన్నది.
*******************;
ఇందిరా గాంధి ఈ చిక్ మగలూర్ నుండి పోటీ చేసారు.
1978 లో ఎన్నికలలో నిలబడ్డా
ఆమె - ఇండియ, పార్లమెంటు , లోక్ సభ స్థానాన్ని గెలిచారు.
అందుచేత వార్తలలో పతాకశీర్షికలను తుమ్కూరు దగ్గరలో ఉన్న
ఈ ఊరు అలంకరించినది.
*******************;
“ చిక్ మగలూర్/ చిక్కమగళ్ ఊరు”/ Chikmagalur City
(“చిక్క మగల్ ఊరు” = ) కు అర్ధము
“చిన కుమార్తె ఊరు” అని.
ఆ పట్టణమునకు 5 కి.మీ. దూరములో వేరొక భాగాన్ని పెద్ద కూతురుకు ఇచ్చారు.
దాని పేరు “హీరేమగలూర్”.
'Chikmagalur (ಚಿಕ್ಕಮಗಳೂರು) కర్ణాటకలో చారిత్రక సంపదను కలిగిన గొప్ప డిస్ట్రిక్టు.
ఈ జిల్లాలోనే “అమృత పుర” వద్ద -హొయసల కోవెలల సముదాయాలు
కలగడానికి కారణము ఉంది.
పెద్ద కుమార్తెకు భరణముగా ఒసగబడిన “హీరేమగలూర్" సంస్కృతీ విలక్షణప్రదమై,
చారిత్రక పరిశోధకుల శోధనలకు అనువైన (ఒకప్పుడు) అగ్రహారము- అని పేర్కొనవచ్చును.
*******************;
కన్నడ భాషలోనే అర్చనలు అక్కడ మంత్రాలు పూజలూ:-
ఈ Hiremagalur ఊళ్ళో కోదండరామాలయము కలదు.
సీతా దేవి ఈ గుడిలో శ్రీరామచంద్రులకు కుడిపక్కన ఉన్నది.
సీతారామలక్ష్మణులు సమాన్యముగా నిలిచే స్థానములకు ఈ పద్ధతి కొంత విరుద్ధము.
సాధారణముగా "భార్య తన భర్తకు ఎడమ వైపు - నిలబడుతుంది.
పూజా పునస్కారాది సమయాలలో - ఆచరణలో ఉన్న
హిందూ సాంప్రదాయములకు విభిన్నతను చేకూర్చినది
ఈ కోవెలలో ప్రతిష్ఠితమైన జానకీ, లక్ష్మణ సమేత శ్రీ రామ చంద్రుడు.
అంతే కాదు!
ఆలయములలో దేవభాష ఐన సంస్కృతములో మంత్రోచ్ఛారణలు జరుగుతూంటాయి.
కానీ “హీరేమగలూర్ లో గీర్వాణభాషలో అర్చనలు కాకుండా,
స్వచ్ఛమైన కన్నడ భాషలో నుడువులు కొనసాగుతూ అర్చనలు జరుగుతూంటాయి.
ఇదీ ఈ ఊరి ప్రత్యేకత.
*******************;
;
Sri Kodanda Rama kOwela |
;
;photo link (Karnataka state)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి