15, నవంబర్ 2012, గురువారం

లొట్టలేయించే పాటలు


తెలుగు వారికి భోజన రుచులు మెండు. 
ఒడయ నంబి విలాసములో ఆంధ్ర దేశములోని  అందచందాలతో పాటు
షడ్రసోఏత భోజనాలలోని, రక రకాల ఐటమ్ సుని,  
సాదకాలనూ, పిండివంటలనూ వివరించిన ఈ పద్యాన్ని చదివేస్తారా!?    

"క్రొత్త బియ్యము, కాయగూరల్ బొబ్బట్లు-  దంపు బూరెలు, పంచదార,   యావ; వడలు  నల్లంబు, మీగడలు తియ్యని పెర్గు| కమ్మని సిరి వాలు గసగసాలు చిఱు సెన పప్పును తఱచు వీడ్యంబులుకంబళ్ళు, నంబళ్ళు, కంచుకములుఇంగువ, జీలకర్ర నెనసిన మిరియంబుమదము వాసన నెయ్యి- మాట దురుసు| లనుచు- సిరుల చెలగ నయ్యాంధ్ర| దేశంబు చెలువు గాంచి. చిఱు సెనగపప్పు, నూనెయుగరము తీపైన పెరుగు, కడు సైదముతోదొరసిన ఖజ్జము లల్లముగురుతరముగ గుడించి రపుడు ఘూర్జరభూమిన్||" ; (ఒడయ నంబి విలాసము)  

గుజరాత్ లోని ఖర్జూరముల వాడుకకూడా ప్రస్తావనలోనికి వచ్చినది.  


"భోజనమ్ దేహి రాజన్!; ఘృత సూప సమన్వితం:   శరత్ చంద్ర చంద్రికా ధవళం చ!"

"Bho'janaమ్ dEhi raajan!; GRta suupa samanwitam: 
 Sarat chaMdra chaMdrikaa dhawaLaM cha!"

ఇలాటి శ్లోక, పద్య, కావ్య రచనలెన్నో,  పురాతన కాలము నుండీ మన ఇండియాలోని -
ప్రజలకు అనేక వంటలను వండుకోవడము- చేతనైన సంగతికి ప్రత్యక్ష ఉదాహరణలు!!!!! 
ఇండియన్స్ వంట గదులు అద్భుతమైన రుచుల లోగిళ్ళు.
అతి చిన్న భేదాలను కూడా గుర్తిస్తూ, అన్నం తింటారు. 
సుప్రసిద్ధ రచయిత, మాల్గుడీ పట్టణ సృష్టికర్త. 
ఆర్.కె.నారాయణ్ అన్న ప్రకారం; 
"గడ్డ పెరుగు, కంచము లోని అన్నం రాశిపై వేస్తూన్నప్పుడు- 
వచ్చే ఆ సవ్వడి- ఉన్నది చూసారూ, ఆహా! వీనుల విందే కదూ!"
.........
అదన్న మాట! నల, భీమ పాకాలకు నెలవుగా ఉన్న ఈ నేల  మీద, 
సూక్ష్మ అవగాహనకు ఇదే ఉదాహరణ. 

Rasipuram Krishnaswami Iyer Narayanaswami/ 
R. K. Narayan (10 October 1906 – 13 May 2001), 
(=Rasipuram Krishnaswami Iyer Narayanaswami)



**********************;

సరే!
సుప్రసిద్ధ గీతము, పింగళి వారి కలము వేసిన చిందులు
తెనుగువాళ్ళ  అచ్చమైన ఆహారపదార్ధాల పట్టిక- గుర్తుకు వచ్చేసింది కదూ!
అదేనండీ! మాయా బజార్సినిమాలోని పాట
ఈ నాటికీ వింటూంటే నోట్లో లాలాజలములు ఊరుతూంటాయి.
ఆ చలనచిత్ర కథా వస్తు, గీతమాయ అదే మరి!    

**********************;

తెలుగులో మాధవపెద్ది సత్యం గంభీర గాత్రము 
ఈ నాటికీ శ్రోతలు హృదయాలలో కడలి అలల నాదములా ప్రతిధ్వనిస్తూనే ఉంటూన్నది. 
తమిళ వర్షన్ లో ఇదే సంగీత బాణీలో ఉన్న గీతము ఇది: 
చూడండి !!!!!!!!!!!

తమిళ song :- 
( తిరుచి లోకనాథన్: తమిళములో పాట
"...... కౌరవ ప్రసాదం" By:- ( Trichi Loganathan )):- 

అహహ్హ హాహ్హ హా!!!!!  కల్యణ సమయల్ సాధం
అహహహహ
కల్యణ సమయల్ సాధం
కాఇ కరిగళుం ప్రమాధం
అంధ కౌరవ ప్రసాదం
ఇధువే ఎన్నక్కు పోధుం ||
కల్యణ సమయల్ సాధం
కాఇ కరిగళుం ప్రమాధం
అంధ కౌరవ ప్రసాదం
ఇధువే ఎన్నక్కు పోధుం::
;అంధార బజ్జి అంగే
సున్సార సొజ్జి ఎంగే
అంధార బజ్జి అంగే
సున్సార సొజ్జి ఎంగే
సంధొషం మీరి పొంగ
అహ్హహహహహహ
ఇధువే ఎన్నక్కు థింగ!!!!!  
;అహహ్హహ హహహ్హ:: అహహ్హహ హహహ్హ::  అహహ్హహహ్హహా!::       
;కల్యణ సమయల్ సాధం
కాఇ కరిగళుం ప్రమాధం
అంధ కౌరవ ప్రసాదం
ఇధువే ఎన్నక్కు పోధుం
;
;అహహ్హహ హహహ్హ:: అహహ్హహ హహహ్హ::  అహహ్హహహ్హహా!::       
            ;
పుళియొథరైయిన్ సోరు
వెగు పొరుథమాఇ సంబారు
పుళియొథరైయిన్ సోరు
వెగు పొరుథమాఇ సంబారు
పురి కిజ్హంఘు పారు   
అహహ్హహ హహహ్హ::అహహ్హహ హహహ్హ:: అహహ్హహహ్హహా!::           
;ఇధువే ఎన్నక్కు జొరు
కల్యణ సమయల్ సాధం
కాఇ కరిగళుం ప్రమాధం
అంధ కౌరవ ప్రసాదం
ఇధువే ఎన్నక్కు పోధుం   
 అహహ్హహ హహహ్హ:: అహహ్హహ హహహ్హ::  అహహ్హహహ్హహా!::      

**********************;
;
ahhahhahahhahhahhaa.
ahhahhahahhahhahhaa
ahhahhahahhahaaa........ .  

kalyaNa samayal saadham ahahahaha 
kalyaNa samayal saadham 
kaai karigaLum pramaadham 
andha kaurava prasaadam 
idhuvae ennakku pOdhum 
;

kalyaNa samayal saadham 
kaai karigaLum pramaadham 
andha kaurava prasaadam 
idhuvae ennakku pOdhum    
ahhahahahahaha... 


andhaara bajji angae 
sunsaara sojji engae 
andhaara bajji angae 
sunsaara sojji engae 
sandhosham meeri ponga 
ahhahahahahaha 

idhuvae ennakku thinga 
kalyaNa samayal saadham 
kaai karigaLum pramaadham 
andha kaurava prasaadam 
idhuvae ennakku pOdhum   
ahhahahahahaha....  

puLiyotharaiyin sOru 
vegu poruthamaai sambaaru 
puLiyotharaiyin sOru 
vegu poruthamaai sambaaru 
puri kizhanghu paaru   
ahhahahahahaha  
idhuvae ennakku joru 
kalyaNa samayal saadham 
kaai karigaLum pramaadham 
andha kaurava prasaadam 
idhuvae ennakku pOdhum   
ahhahahahahaha.... 

**********************;
ఇటు తెలుగులోనూ
అటు అరవ భాషలోని పాటలోనూ
రెండింటిలోని భోజనపదార్ధాల  లిస్టులను పరికిద్దామా!?               
తమిళ సాంగులోని లిస్త్ లోనికి ముందు జంప్ చేద్దాము!!!!!!!!!!! :- 

               +++++++++++++++++++ 

1) బజ్జి, సొజ్జి
2) పులిహార
3) పూరీ, దుంప కూరలు
4) పేణీ లడ్డు/ పూస లడ్డు 
5) పులిహోర/ పులిహార అన్నము; సొజ్జి: దుంపకూర
6) సీని పుట్టు 

దక్షిణ భారతీయుల టిఫిన్ సెక్షన్ లో జంట స్తంభాలు  
(Twin pillors) బజ్జి, సొజ్జి లు                       
సొజ్జి" అంటే "రవ్వ కేసరి". 
list:- bajji ,sojji, puliyotharaiyin:-  Puliyodharai Mix / Puli Sadam (Tamarind rice)  
puri- kizhanghu: paeni laddu: SIni puTTu


శీని పుట్టు:- కు, తట్టి మురుక్కు, నిప్పెట్టు, తట్టు, మురుకులు/ చక్కిలాలు- అని 
వివిధ స్థానిక సీమలలోని పేర్లు. 

ఇతర వంటలు:-  సాంబారు, పూరీ, దుంప కూరలు, రసము
పరమాన్నము, క్షీరాన్నము ఇత్యాదులు.
ఈ భోజనావళి 
తమిళనాడులో చిత్రం గా ఉంటుంది ఎలా అంటే:

కుష్బూ ఇడ్లీలు -మదురై లో 1990 లలో ఉండేవి ఇప్పుడున్నాయో లేవో తెలియదు - 
బొద్దుగా ఉంటాయి కనుక ఆ పేరు పెట్టేసారు. 
[ఖుష్బూ ఇడ్లీల కుప్పపై   
శాఖాహారులు మొదట సాంబారు పోసి 
చుట్టూ రెండు మూడు పొడులు, రెండు చట్నీలు వేసుకొని 
అద్దుకుని తింటారు, లేదా పిసికి తినడం - 
ఇది వెజిటేరియన్సు భోజన విధి.
           Information: (Link) ] 
ఇక మాంసాహారులైతే అవే ఇడ్లీలపై కోళి కుళంబు(కోడి పులుసు),

కర్రీ (మేక మాంసం కూరా), మీను కుళంబు, నండి (పీటలు)

ముట్టై (గుడ్లు ) వేసుకొని బాగా పిసికి కలిపి తింటారు .
కొంగునాడు ప్ర్రాంతం (సేలం నుండి కోవై (కోయంబత్తూర్) వరకూ ఉన్న ప్రాంతం) లో 

ఈ విధమైన భోజన విధి ఉంటుంది.



++++++++++++++++++ 
;


1957 లో విడుదల ఐన "మాయా బజార్" 
ఆబాలగోపాలాన్నీ అలరించిన సినిమా.
తెలుగు పాట:-

అహహ్హహహ్హహ్హ వివాహ భోజనంబు! ఆహ్హ- హా.!
వివాహ భోజనంబు: వింతైన వంటకంబు:
వియ్యాల వారి విందు:  ఒహొహ్హొ! (/అహహ్హ!)నాకె ముందు ||
చరణము _1 _
ఔరౌర గారెలెల్ల! అయ్యారె! బూరెలిల్ల!
ఒహ్వోరె! అరిసెలెల్లా! 
అహహ్హహ హ్హ
అహహ్హహ హహ్హ 
అహహ్హహ్హహా!........
ఇవెల నాకె చెల్లు ||వివాహ||
చరణము _ 2 _
భళీరె! లడ్డులందు: వహ్ ఫేణి పోళిలిందు:
భలే జిలేబి ముందు: ఇవెల్ల నాకె విందు ||వివాహ||
చరణము _ 3  _
మఝారె అప్ప డాలు, పులిహోర! ధప్పళాలు :
మఝారె అప్పడాలు, పులిహోర! ధప్పళాలు:
వహ్వారె పాయసాలు! అహహ్హ హహ్హ హా:
ఇవెల్ల నాకె చాలు  ||వివాహ||

****************************;

సరే! ఇక ఈ తెనుంగు నుడికారాల విస్తరిలో 
వడ్డించిన ఫుడ్డు పదార్ధాలను వీక్షిద్దామా!?

గారెలు, బూరెలు, అరిసెలు:  లడ్డూలు
ఫేణీలు, పోళిగలు (= బొబ్బట్లు), జిలేబీలు: : 
అప్పడాలు, పులిహోర, ధప్పళములు: పాయసాలు: 
ఇవీ మన ఖాద్య పదార్ధాల పట్టికలో చోటు చేసుకున్నవి.   

ఆ రోజుల్లో మాధవపెద్ది, పిఠాపురం గాయకుల స్వరాలు 
ఎక్కువగా కమేడియన్సు లకై పరిచితమైనవి.  
ఈ పాట మాధవపెద్ది సత్యం గానమునకు మారుపేరు ఐ, మచ్చు తునకగా 
సినీ స్వరాంజలిగా సుస్థిర ఖ్యాతిని ఆర్జించింది.

సావిత్రి కథానాయికగా ద్విపాత్రాభినయాలు- అంటే 
శశిరేఖగా, మాయా శశిరేఖగా/ ఘటోత్కచునిగానూ వేసినప్పుడు 
ఆమె నటన "న భూతో న భవిష్యతి!!"
తమిళములో ఆమె పేరు "వత్సల". 
(ఎందువలన ఈ పేరును ఎన్నుకున్నారో....... ?) 

               +++++++++++++++++++ 

ఘటోత్కచుడు అనగానే "ఎస్.వి.రంగారావు మన కన్నులలో సాక్షాత్కరిస్తారూ అంటే 
ఆయన నటనావైదుష్యానికి వేరే మాటల అక్కర లేదు కదా!!!  
ఒకేసారి తమిళ ఆంధ్ర భాషలలో నిర్మించారు. 
వీటిలో తెలుగు చిత్రము- కన్నడ భాషలోనికి డబ్బింగు ఐనది.
1957 లో విడుదలైన ఈ సినిమా- సినీ రెఫరెన్సు! 
రిలీజ్ ఐనదంటే ఈ నాటికీ విజయ ఢంకాను మోగిస్తూనే ఉన్నది.
నాగేశ్వరరావు తెలుగులోనూ
జెమినీ గణేశన్ అరవంలోనూ అభిమన్యునిగా నటించారు. 

               +++++++++++++++++++ 

మాయా బజారు విపణివీధులలో ఇన్నిన్ని వంటకాలను చూసాము కదా! 
మరి దీపావళి పండుగ సందర్భము ఇది. 
ఈ ఐదు రోజులూ ఇలాంటి ప్రాచీన ఆంధ్ర అభిరుచులను లొట్టలు వేసుకుంటూ తినాలి కదా! 
(ఆధునిక వనితలకు ఆట్టే ఇబ్బంది లేదు లెండి! 
ఓపిక ఉంటే బొబ్బట్లు, సొజ్జప్పాలు ఎట్సెట్రాలను 
గృహములోని రసోయీ ఘర్ లో గరిట తిప్పండి
కాకుంటే ఇంచక్కా "స్వగృహ ఫుడ్స్ సెంటర్" లలో కొనేసి
అందరితో కలిసి కూర్చుని, రుచులను ఆస్వాదించండి.

               +++++++++++++++++++   

kalyaNa samayal saadham  (Link:- Tamilsongshosur)

Member Categories - మాయాబజార్
Written by kusuma   
Thursday, 15 November 2012 14:29

;

14, నవంబర్ 2012, బుధవారం

బద్‍కమ్మాహ్, బద్‍కమ్మాహ్ - హిందీ సినిమాల్లో బతుకమ్మ పాటలు


రాజ్ కుమార్, వహీదా ప్రభృతులు నటించిన మూవీ, 
షత్రంజ్ ( Shatranj ) 1969 లలో విడుదల ఐనది. 
ఎస్.వాసన్ దర్శకత్వంలో 1969 లో వచ్చిన హిందీ చలనచిత్రం “షత్రంజ్”
(రాజేంద్ర కుమార్, వహీదా రెహెమాన్ ) 
ఈ సినిమాలో ఒక పాట ఉన్నది. 
ఆ పాటకు చెప్పుకోదగిన అనేక విశేషాలు ఉన్నవి. 
ఈ హిందీ మూవీలో తెలుగు పదాల అల్లరి చిలిపి పాట ఉన్నది. 
మహమూద్, హెలెన్ ల జోడీ ఈ పాటకు డ్యాన్సు చేసారు. 
:
“బతుకమ్మ! బతుకమ్మ!బతుకమ్మ!
  ఎక్కడ పోతావ్ రా?ఎక్కడ పోతావ్ రా? 
  ఇక్కడ్ ఇక్కడ్ రా! ......... ”
:
  గలగలల ఈ గీతము - దీని అర్ధము 
"where can you go, badkmmA........" 

(దక్షిణ భారతీయ భాషలలో – చక్కని పదాలు 
“అక్కడ, ఇక్కడ, ఎక్కడ” “అంగె, ఇంగె, ఎంగె” - అని :- తమిళ భాషా పదాలు. 
“అవ్విడ, ఇవ్విడ, ఎవ్విడ ” అని మలయాళ మనోహర మాటలు )

మహమూద్, హెలెన్ ల ఆ కేబరే డాన్సు 
ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 
అసలు సంగతి ఏమిటంటే – 
ఈ గీతిక  పల్లవిలోని మొదటి పదాలు 
(తెలుగు మాటలు) విరివిగా మనకు కిత కితలు పెడతూంటవి. 
అదీ విశేషమన్న మాట.

హెలెనీయ బ్రేక్ డాన్సు సరదా సరదాగా క్లబ్ లో సాగుతుంది. 
ఎంకన్న (= వెంకన్న), బత్కమ్మ- లుగా 
helen, mehamud లు వెండి తెర పైన నర్తించినారు. 

{Badkamma Ekad Boto Ra - Mehmood, Helen, Shatranj Song ...
► 5:10► 5:10 (Link):- 
www.youtube.com/watch?v=aAJ4asMYepc }

**********************

మరో ముచ్చట:- ఈ గీత గాయని “శారద”. 
ఈమె – అనేక పురస్కారాలను అందుకున్నది. 
“జీవిత చక్రం” cinema లోని (ఎన్.టి. రామా రావు, వాణిశ్రీ తారాగణం) 


“కంటి చూపు చెబుతోంది,; 
 కొంటె నవ్వు చెబుతోంది; 
 మూగ మనసులో మాట ఓ బావా: …”


అనే పాటను శారద గానం చేసింది.

**********************

1964 లో రిలీజ్ ఐన మరో హిందీ చిత్రం 
"రాజ్ కుమార్" లో కూడా 
"బతకమ్మ" - పాట ఉన్నది. 


"నాచ్ రే మన్ బద్ కమ్మా ....... " "Nach Re Man Badkamma")  

(గానము:- లతామంగేష్కర్, ఆశా భోంస్లే). 
ఈ "రాజ్ కుమార్" సినిమాలో 
షమ్మీ కపూర్, సాధన, టున్ టున్ , పృధ్వీ రాజ్ కపూర్
మున్నగు వారు ముఖ్య తారాగణం.

;


కంగారు పడకండి! 
హిందీ యాసలో కాస్తా "బద్ కమ్మహ్"  ఐకూర్చున్నది. 
So, "బద్ కమ్మహ్ హో, బద్ కమ్మహ్ హో" 

**********************;


ప్రఖ్యాత సంగీత దర్శక జంట శంకర్ జైకిషన్ లు.
ఈ హిందీ బతుకమ్మ పాటలు రెండూ వారి జోడీ రూపకల్పన చేసిన మ్యూజిక్ బాణీలు!
వీరిలో శంకర్ హైదరాబాద్ లో పెరిగాడు. 
శంకర్ బాణీలో మరో సూపర్ హిట్ హిందీ సాంగ్, 
(రాజ్ కపూర్, నర్గీస్ లు హీరో హీరోయిన్ లు) 
శ్రీ చార్ సౌ బీస్= శ్రీ 420 - లోని ఒక పాటకు 
పల్లవి తేనెల మాటల తెలుగులోనివే!

"రామయ్యా వస్తావయా? 
  రామయ్యా వస్తావయా? 
  మైనె దిల్ తుఝ్ కొ దియా

  మైనె దిల్ తుఝ్ కొ దియా

.”  

"Sri 420":- 1955 లో రిలీజ్ ఐన మంచి సినిమా ఇది. 

("raamayyaa! wastaawayyaa!
   maine dil tujh ko diyaa........"
(= “ O raamayyaa! Will you come here?
        I gave my heart to you!......" ”)

raamayyaa! wastaawayyaa! (Link web magazine )



బద్‍కమ్మాహ్, బద్‍కమ్మాహ్ - హిందీ సినిమాల్లో బతుకమ్మ పాటలు
(Essay:- Newaavakaaya)
User Rating: / 1
Member Categories - మాయాబజార్
Written by kusuma
Saturday, 27 October 2012 12:28
;

8, నవంబర్ 2012, గురువారం

బోదురు కప్ప రాయి

అనేక మంది రాజపుత్రులకు జన్మస్థానము “గోముఖ్”. 
ఇది శివ  క్షేత్రము, 
నందిశుని నివాసము. 
ఇక్కడ మూడు ఎద్దుల శిల్పాలు ప్రత్యేకముగా కానవస్తూంటాయి.
తొలి పొద్దు వీక్షణము- సందర్శనీయ సంభ్రమాకర్షణ.  
ఊరికి పశ్చిమ భాగమున  sunset point ఉన్నది. 
 క్రింప్సన్ యెల్లో ( చేమంతి పసుపు రంగు/ crimson yellow) వన్నెలను 
ఆకాశము వెదజల్లుతుంది. 
థార్ ఎడారి (Thar Desert) ఇసుక తిన్నెల మీదుగా ఈ సీను నేత్రపర్వమే!  
విస్తారముగా ఇసక మేటల మీదుగా – దిగంతరేఖల దాకా ……..  
కరుగుతూన్న ద్రవము గల పాత్ర వలె గోచరిస్తుంది. 


గోముఖాలయ "(Gomukh temple ) ప్రత్యేకమైనది. 
ఇక్కడ మూడు ఆవుల శిల్పాలు కానవస్తున్నవి.
ఇక్కడ “ మండూక శిల” ఉన్నది. 
ఇది “కప్ప ఆకారము”లో ఉండడము వలన దీనికి ఆ పేరు వచ్చింది. 
ఆచలఘర్ వద్ద సాయం సంధ్యా దృశ్యాన్ని చూసితీరాల్సిందే గాని, 
వర్ణించడానికి మాటలు చాలవు. 
ఆ కొండపైన “కప్ప రాయి” (Toad rock/ frog rock)*1 పై ఎక్కి కూర్చుని, 
సాయంత్ర సూర్య ప్రకాశములను  తిలకించవచ్చును.
 (*1 బోదురు కప్ప/ మండూకము)

*******************;


నక్కీ సరస్సు= నఖములు= గోళ్ళు; గోళ్ళతో తవ్వబడిన మానవ నిర్మాణము, 
సతత హరితారణ్యములకు ఇది ఆధారము.  జలపాతాలు, నీటి అలల సోయగాలు గొప్పవి.

*******************;



14 వ శతాబ్దములో ప్రతిష్టించిన “శ్రీ రఘు నాధ్ జీ గుడి”  సందర్శనీయ స్థలము. 
(శ్రీ రఘు నాధ్ జీ ప్రబోధకుడు హిందూ సాధువు) 
అలాగే హనీ మూన్ పాయింటు (Honey moon point) కూడా!  
"అనార్ద్ర పాయింటు" ( Anardra point) ప్రేమజంటలతొ సందడిగా ఉంటుంది.
ఈ విశేషాలు అన్నీ రాజస్థాన్ లోని మౌంట్ అబూ వద్ద ఉన్నవి.

*******************;
Tags:-
{माउंट आबू: नक्की झील: नक्की (नख या नाखून); 
  कार्तिक पूर्णिमा को लोग स्नान }

!!!!!!!!!!!!!  !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!  !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!  


ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...