N.T.రామారావు ఆంధ్రుల అభిమాన నటుడే కాక
తెలుగుదేశం పార్టీ స్థాపనతో ప్రపంచానికి తెలుగు వెలుగును చాటిన మేటి నాయకుడు కూడా.
అందువలననే, ఆయన ప్రతి చర్యా ఆంధ్రుల హృదయ గ్రంధాలలో నిక్షిప్తమౌతూనే ఉంటుంది.
రామారావు బాల్యం నిమ్మకూరులో గడిచింది.
విజయవాడలో S.R.R.C.V.R. College లో ఇంటర్మిడియెట్ లో చేరారు.
ఆ కాలేజులో తెలుగు శాఖ అధిపతిగా శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఉండేవారు.
విశ్వనాధ "రాచమల్లు దౌత్యము" అనే నాటకాన్ని విద్యార్ధుల చేత ప్రదర్శింపజేశారు.
అందులో నాగమ్మ పాత్రను తారక రామారావును ధరించమన్నారు. రామారావు అందుకు అంగీకరించారు. ఐతే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది.
నాగమ్మ పాత్ర కోసమని మీసాలు తీసేయమన్నారు గురువు గారు.
నూనూగు మీసాల నూత్న యవ్వనంలో అడుగిడుతూన్న రామారావు అందుకు ఒప్పుకోలేదు.
చివరికి చేసేది లేక "అలాగే!నీ ఇష్ట ప్రకారమే చేయి" అన్నారు.
అలా మీసాలతోనే స్టేజీ మీద నటించి,
ప్రైజు కూడా కొట్టేసాడు మన హీరో.
*****************;
ఆ కాలేజీలో "మీసాల నాగమ్మ" అనే నిక్ నేమ్ ను కూడా సంపాదించాడు రామారావు.
*****************;
ఆశ్చర్యకరంగా సినీ హీరోగా స్థిరపడిన తరువాత
పల్నాటి యుద్ధం సినిమాలో నాగమ్మ ప్రతిద్వంద్వి -
ఐన బ్రహ్మన్న పాత్రను
అద్భుతంగా పోషించారు రామారావు.
*****************;
శ్రీనాధ మహాకవి "పల్నాటి వీర చరిత్ర" ను రచించాడు.
తెలుగునాట నిజముగా జరిగిన చారిత్రక గాధ ఇది.
;
కోడి పందాలు ( = Cock Fight) దాయాదుల పోరు-
బాలచంద్రుని సాహసాలు;
ఇన్నీ కలిసి - తెలుగు నాట ఉర్రూతలూగించిన
అద్భుత గాధ ఇది.
చిత్రమేమిటనగా మొత్తము కథ - మహా భారతము-కు
మక్కీకి మక్కీగా గోచరిస్తుంది.
శ్రీ నాధుడు (1365–1441) చాటు పద్యములు ప్రసిద్ధి కెక్కిన కవివరేణ్యుడు.
శ్రీ నాధుడు ప్రౌఢ కవి- రచన "
పల్నాటి వీర చరిత్ర
" .
ఇది తెలుగు భాషలో మొట్టమొదటి చారిత్రక వీర ద్విపద కావ్య రాజము.
తెలుగులో రెండుసార్లు (
1947,
1
966
)- పల్నాటి కథ - సినిమాగా వచ్చింది.
.
పసుపులేటి కన్నాంబ; అక్కినేని నాగేశ్వరరావు, గోవింద రాజుల సుబ్బా రావు ప్రభృతులు
2. భానుమతి, అంజలీ దేవి, హరనాధ్, వాసంతి, N.T. R
a
m
a R
ao
మున్నగువారు)
నాయకురాలు నాగమ్మ ;
"నాయకురాలి మాయ కదనంబున, మా పలనాటి పౌరుష
శ్రీ యడుగంటె? గడ్డి మొలిచెం బులిచారల గద్దె మీద; గెం
జాయ మొగాన గ్రమ్మ జలజ ప్రమదామణి నాగులేటిపై
వాయుచున్న దిప్పటికి బాలుని శౌర్య కథా ప్రబంధముల్ "
(By: గుర్రం జాషువా)
నాగులేరు- కెరటాల ఘోషలో -
పలనాటి ఆవేష కావేషాల రణదుందుభివినబడుతూంటుంది.
అందుకే శ్రీ నాధుడు- మాచర్ల చెన్నకేశవ స్వామికి అంకితము ఇచ్చిన ఈ కావ్యము-
ఆ బాల గోపాలమూ చదువ వలసిన గ్రంధ రత్నము ఇది.
మీసాల నాగమ్మ (Newwky: Web)
Member Categories - మాయాబజార్
Written by kusuma
Tuesday, 11 September 2012 11:24
;
2 కామెంట్‌లు:
బాగుంది కోణమానినిగారు.
ఒక్కసారి ఇటో లుక్కెయ్యండి
http://kottapali.blogspot.com/2009/01/blog-post_22.html
baagundanDi :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి