17, సెప్టెంబర్ 2012, సోమవారం

అక్షరము పవిత్రమైన కోవెల


అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు
లక్షలాదిగ భావమ్ము లలరు నందు
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు

దానికిని సాటి కానమీధరణి యందు.
;
ఊహలును జీవ కోటికి ఉండునెన్నొ
మూగ జీవులే అన్నియు పుడమి నందు
ధ్వనికి రూపమ్ము నొసగును మనిషి యొకడె
వెలువరించినప్పుడె వాని విలువ గలదు.
;
అక్షర మొక దేవాలయమ్మరయగాను
మనసు లందలి
కలలు,కల్పనల కెలమి
నదియె స్వాగత ద్వారము
ఆశ లెల్ల వెలుగు చూడగ,
సర్వ విద్యలకు గూడ.
;
జీవి మనసున కదలాడు భావములకు
స్థిరముగా నుండు పీట మేర్పరచు కొరకు
సాధనలు చేసి కను గొన్న సత్ఫలమ్ము
అదియె, రూపొంది, ఉదయించె నక్షరముగ.
;
భాష, "లిపి" యను అరదము పైన నెక్కి
ముదము లొప్పార సంచారములును చేసె
వసుధ యందలి కోట్లాది వాక్కులకును
"ధ్వని", "లిపు"లె మూల కారణాధారమయ్యె.
;
ఆశలును, అభిలాషలు, ఆశయములు
కల్పితమ్మక్షరము నందె
కావ్యములకు, గాధలకును,చరితలకు,
కథల వాస్త వముల చిత్రించు వాక్య దేవాలయమ్ము.
;
ఘంటమ్ము, పెన్ను, పెన్సిళులుగా-
బలపమ్ము, సుద్ద ముక్క, కుంచె- 
చాక్ పీసుగాను, 
వచ్చితివి మౌనముగ, మాదు భాగ్య మనగ .
;
ఓసి కలమ!నీకు కలిగిన మహిమ కలిమిని
ఎన్ని వర్ణనల ఋజువు సేయగలను?
నీవు లేకున్న తెల తెల్ల బోవు చుండు
తెల్ల తెల్లని పేపరు, ఖచ్చితముగ;
;
సవ్వడికి మారు బింబమౌ "శక్తి" నీవు
అయ్యారె! అంతులేని పరమాద్భుతమ్ముల నెరపగలవు
ధరణి నీ సాటి ఎవరు, అరసి చూడ;
అందు కొనుమమ్మ! జోతల అక్షరమ్మ!
;

శ్రీ అక్షరము (Andhra Folks)                               Link ( 1 )
Posted On 9/1/2008 @6:32:53 AM 
;

                   

శ్రీ అక్షరము:-


అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు 
లక్షలాదిగ భావమ్ము లలరు నందు 
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు 
దానికిని సాటి కానమీ ధరణి యందు

;
అఖిలవనిత:శ్రీ అక్షరము;Monday, April 20 2009
 तरति (tarati)
అచ్చులు: 16


 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ  

   ఏ ఎ ఐ ఒ ఓ ఔ అం అః


హల్లులు: 38 

క ఖ్ గ ఘ ఙ్  
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...