14, మార్చి 2012, బుధవారం

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి!!


;
ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
 ||ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి||


మేఘాలకు ఆర్ద్రత్వం ఇస్తుంది
వర్ష ధారలను
ధాత్రికి 
దత్తత ఇచ్చేస్తుంది!

నింగిలోని హరివిల్లులకు
"మీకున్నవి ఏడేగా! 
అదనపు రంగులను బహూకరిస్తాము
అలంకరించుకోవడాన్ని నేర్పిస్తాము"  


ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; 
నీలి గొడుగు నింగికి
విస్తారంగా విప్పార్చుకొనేలా చేస్తాము


ఇంత చిన్న వస్తువు; అరచేతిలో ఇమిడిపోయి;
చందమామను- 
నిత్య పున్నమిగా ఉంచుతాము


ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
గ్రహ గోళాల చలనాలను- 
మానవాళి శాంతంగా మనుగడ సాగించేలా చేస్తాము; 


అనంత విశ్వపు కొలతల దృశ్యాలను 
మన కన్నులలో నిలిపి ఉంచి; 
విజ్ఞానపు కేతనమై రెప రెపలాడేస్తూ; 


ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి;
ఈ రిమోట్ కంట్రోలర్!
ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి!!


above photo (link to see) 
"Uncle Milton Animal Planet Remote Control Snake "


children song  ; (Web: New Awakai)
Member Categories - బాల
Written by kadambari piduri  
Sunday, 11 March 2012 12:43
Add new comment Hits: 102
;

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...