మన దేశంలో విక్రమార్క మహారాజు పేరు బాలలకు సుపరిచితమే!
విక్రమార్క మహారాజు ఉజ్జయినిని పరిపాలించాడు.
“పట్టు వదలని విక్రమార్కుడు” గా ఆబాలగోపాలమునూ
”చందమామ కథలలో” అలరించాడు.
“సింద్ బాద్ అద్భుత యాత్రలు”లో పాదుషా అబూ హసన్ ఎలాగో,
భారతీయ కథలలో విక్రమార్కుడు కూడా అలాటి వాడు.
ఈతని సోదరుని పేరు భట్టి.
“భట్టి విక్రమార్కులు” గా ఆ అన్నదమ్ములు,
వారి కథ సుప్రసిద్ధమైనదే!
(“భట్టి విక్రమార్క” అనే సినిమా కూడా 1960 (=౧౯౬౦) లో వచ్చింది)
క్రీస్తు శకము 58 లో “విక్రమార్క శకము” ప్రారంభమైనది.
విక్రమాదిత్యుడు ఈ “”విక్రమ శకము”నకు అంకురార్పణ చేసాడు.
“విక్రమార్కశకము”ను సంవత్ శకము” అని కూడా అంటారు.
వైశాఖమాసము మొదటి నెల, ఫాల్గుణ, చైత్ర మాసములతో సంవత్సర చక్రము పూర్తి ఔతున్నది.
మనము ఇప్పుడు రోజూ చూస్తున్న కేలండర్ క్రీస్తు శకము 2011-2012 (2011 CE) ,
విక్రమార్క సంవత్సరమును BS/ VS- అని సూచిస్తున్నారు.
నేడు 2011 సంవత్సరము అనగా
Nepali calendar-2068 BS అని అర్ధము అన్న మాట.
**********************************************************;
ఫాల్గుణ పౌర్ణిమ నాటితో “విక్రమార్క శకము- లోని
ఒక సంవత్సరము పూర్తి ఔతున్నది.
నేపాల్ లో విక్రమార్క కాల మానము- చంద్రమానమును వాడుతారు.
అంటే ఇండియాలో, చాంద్రమాన పంచాంగము వలె అన్న మాట.
నేపాల్ లో విక్రమార్కసంవత్ – కేలండర్ ను ఆధారంగా విశేషాంశాలను పరిశీలిస్తారు.
శకులు- పై విక్రమాదిత్యుడు సాధించిన విజయ జైత్ర యాత్రకు- నిలిచిన
మైలు రాయి ఈ విక్రమార్కసంవత్ శకము.
“vikram Samwat Era” కు మూలపురుషుడైన
చక్రవర్తి విక్రమాదిత్యుని సాహస జానపద కథలు ఎప్పటికీ రసగుళికలే కదూ!
***********************************************************;
విక్రమార్కసంవత్ – కేలండర్ (Link; Forkids, Web)
Published On Friday, February 10, 2012
By ADMIN. Under: విజ్ఞానం, వ్యాసాలు.
రచన : కాదంబరి పిదూరి