ఒరిస్సా రాష్ట్రములోని పూరీ పుణ్య క్షేత్రమునకు దగ్గరలోని రఘు రాజ్ పూర్ లో "పాట చిత్ర కళా సాంప్రదాయనకు కేంద్రముగా నిల దొక్కుకుని ఉన్నది. "చిత్ర కార"అని వీరికి పేరు .పూరీ పుణ్య క్షేత్రములోని 45 అడుగుల ఎత్తు ఉన్న జగన్నాధ స్వామి ,"పాట చిత్ర కళా వైభవానికి" తార్కాణము.(sandalwood festival) చందన ఉత్సవము సందర్భములో నరేంద్ర రిజర్వాయర్ వద్ద ఉన్న చిన్న దేవళమునకు వీరు రంగులు అలంకరిస్తారు.పాట చిత్ర కారుల నైపుణ్యము "పూరీ"లోని జగన్నాధ దేవాలయములో ప్రత్యక్షమౌతూనే ఉన్నది.జగన్నాధ స్వామి రథము పేరు " నంది ఘోష".45 అడుగుల ఎత్తున్న ఈ తేరు చక్రములు 14 ;ఒక్కొక్కటీ 7 మీటర్ల వ్యాసార్ధము ; ఎరుపు,పసుపు రంగుల వలువలతో నీండుగా అవి అలంకరించ బడుతాయి.బల భద్రుని రథము ( chariot)44అడుగులు( 44 feet), 14 చక్రములను కలిగి ఉంటుంది.నీలి రంగు వస్త్రము చుట్ట బడును.ప్రతి యుగములోని 14 మన్వంతరములకు ఇది ప్రతీక.సుభద్ర యొక్క chariotది నల్ల రంగు ;12 నెలలకు గుర్తుగా, 12 wheels కలిగినది.మొదట కాటన్ పేజీల షీట్ ల పైన బొమ్మలకు రూప కల్పన చేస్తారు.భూమి పైన చేనేత - కాటన్ వస్త్రాన్ని పరుస్తారు. చింత పండు పిక్కలు( = గింజలు) నుండి తయారు చేసిన జిగురు పదార్ధాన్ని పై పూతగా ఒక సారి పూస్తారు.దీని పైన మరొక గుడ్డను పెట్టి,ఇంకొక లేపనముగా చింత గింజల బంకను అలదుతారు.వాటిని ఎండలో ఎండ బెడతారు.దాని పైన , తాము మలిచిన బొమ్మలను కావలసిన సైజులలోనూ, కావాల్సిన పద్ధతిలోనూ కత్తిరించుకుని , వివిధ రసాయనాలతో, రంగులతో, వర్ణ సమ్మేళనములతో తీర్చి దిద్దుతారు.ఆ "పట వస్త్రము" ఎండిన తర్వాత, బొమ్మలకు ఫైనల్ టచెస్సును ఇస్తారు.గంగ ,సూర్య్త వంశ చక్రవర్తులు ఈ కళకు బీజం వేసారు.కూర గాయలు, ఆకు పసరులు, రాళ్ళు,లోహాదులు, మొదలైన ప్రాకృతిక వనరుల నుండి రంగులను చేసి, వాడుట సాంప్రదాయము!నేడు ఇతర ఆధునిక paintsని కూడా ఉపయోగిస్తున్నారు.చిత్ర లేఖనము పూర్తి ఐన తర్వాత,a coat of lacquer తో కవరు చేస్తారు.బ్యాక్ గ్రౌండు కలరుగా, సాధారణంగా ఎర్ర రంగు వాడుకలో ఉన్నది.1990 సం||ల నుండి, తెలుపు,ఆకు పచ్చ, గులాబీ పింక్ - మున్నగునవి కూడా యూజ్ అవుతున్నాయి.దేవతా మూర్తులకుకొన్ని విశ్వాసాలను సాంప్రదాయానుసారంగా పాటిస్తూ , నిర్దేశించ బడిన కలర్లు వాడుతూన్న్నారు.నీలం వన్నె(blue colour) - శ్రీ కృష్ణతెల్ల రంగు/శ్వేత వర్ణము (white) _ బల రముడుపసుపు పచ్చ వన్నె _ రాధ దేహ ఛాయ,గోపికలుఆకు పచ్చ వర్ణము - శ్రీ రామ చంద్రుడు*************************************
21, జులై 2010, బుధవారం
నంది ఘోష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి