ఆర్.కె.నారాయణ్ “మాల్గుడి డేస్ ” రచయిత. ఆయన pet name” కుంజప్ప.కుంజప్ప ఉరఫ్ R.K.Narayan స్ట్రాంగ్ కాఫీని like చేస్తారు,ప్రత్యేక రుచితో స్పెషల్ గా ఉంటేనే తాగగలుగుతారు.ఆర్.కె. ఫ్రెండు - నట్వర్ సింగ్ చెప్పిన సంఘటన, U.N.లో ఎదురైన విశేషం ఇది;ఒకసారి విందులో నారాయణన్ పాల్గొన్నారు.Lunch పూర్తి ఐంది.కాఫీ ప్రియుడైన ఆర్.కె.“a cup of coffee! కావాలని” అన్నారు.ఆయన కోరిక మేరకు,కాఫీ ఏర్పాట్లకై ప్రయత్నాలు జరుగుతున్నాయి.సర్వర్ వచ్చాడు.ఆ waiter వినయంగా అడిగాడు"Black or white, sir?"భారతీయ పౌరుడైన మన కుంజప్ప చాలా పొలైట్ గా ఇచ్చిన సమాధానం“ బ్రౌన్ (=brown coffee) ”పాశ్చాత్య దేశాలలో black Tea , black coffee లను ఇష్టంగా సేవిస్తారు.మన దేశంలో డికాషన్ లో పాలు, చక్కెరలను మిక్స్ చేసి తాగుతాము;అందువలన నారాయణ్ “ నిజాయితీగా , సీరియస్ గా “ వెలి బుచ్చిన కోరికను విని,అర్ధం కాక ఆ సర్వరు వాడు బుర్ర గోక్కున్నాడు;ఆనక అతనికి బోధ పరచి, ఎలాగో తిప్పలు పడి,స్ట్రాంగైన, special BROWN Coffee ని చేయించి తెచ్చి ఇచ్చారనుకోండి.
Pramukhula Haasyam
By kadambari piduri,
Jul 8 2010 7:54PM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి