24, జనవరి 2018, బుధవారం

సంపూర్ణ వసంతసేన నాటకము ; part - 1

[కుశావతి, ఉజ్జయిని - పొలంలో పని చేస్తున్నారు. 
పాటను అందుకుని పాడుతున్నారు స్త్రీలు. 
పొలం గట్టున రేభిల్లుని గాత్రం - జతగా కొనసాగుతున్నది.] 
మార్గుడు ;- రేభిల్లుడా, నీ గాత్ర మాధుర్యానికి ప్రకృతి పరవశిస్తున్నది. 
నీ అక్క చెల్లెళ్ళ రేల పాటలు - రైతులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నవి.
రేభిల్ల ;- క్రిందటి ఏడాది - ఎడ్ల బండి పందాలు జరిగాయి కదా. 
మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరుగుతున్నవా?
మార్గ్ ;- అప్పటి బళ్ళ పోటీలలో తుందిలుడు, నేను గెలిచాం  కదా. 
పరుగుపందాలలో రేభిల్లా! 
నీ గానం మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది.
రేభిల్ ;-  తుందిలుడు పురంలో - వసంతసేన వద్ద పనికి కుదిరాడు. 
యజమానుల అనుమతి తీసుకుని పండగ కోసం వచ్చాడు.
మార్గ్ ;- ఇంకేం, ఈ పర్యాయం కూడా బళ్ళ బాట కళ కళలాడుతుంది.
& [ బళ్ళ పోటీలు - రేభిల్ల గానం, మార్గ, తుందిలులు - సై సై - అంటూ గెలిచారు. ]
;
*******************************; ;
;
1] ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు ; 2] రోహణుడు son of చారుదత్త ;
3] వసంత రేఖ నాట్య ఉత్సవ్ ; 4] కోవెలలో నర్తకి ; 5] కుశావతి -శర్విలకుడు , వసంతసేన ;

6] సంవాహకుడు - శర్విలకుడు ; 7] ధన్వంతరి వాక్కు, నేర్పు ;
;
ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు ; అధ్యాయ శాఖ - 1 ;;
ఆర్యకుడు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. వర్తమాన విషయాలు, సంఘంలోని ప్రజల ఈతిబాధలు -
వివిధ విషయాల పైన చర్చలు చేసుకుంటున్నారు.
అసమర్ధ రాజు, దుష్టుడైన రాజు యొక్క బావమరది ఆగడాలు, పన్నుల భారంతో 
ప్రజలు విలవిల - సంభాషణలలో సాగుతూండగా - రాజభటులు, శకారుడు వచ్చారు. 
పల్లీయుడు -1 ;- యువరాణి - పెంపుడు పిల్లి పుట్టిన రోజు - కనుక పన్నులు కట్టండి. అన్నారు. విడ్డూరపు సుంకాలు వేస్తున్నారు. 
ప్రజలపై పన్నుల భారం, రాజా వారి బొక్కసం నింపడానికే కదూ. 
ఆర్యకుడు, ఇతరులు - "క్రిందటి వారమే - ఇంట్లో స్త్రీల నగలు , అమ్మి మరీ మీకు - సుంకం చెల్లించాము. మా వల్ల కాదు.
శకారుడు ;- [ఆగ్రహంతో] "ఆర్యకుడా! నిన్ను చెరసాలలో వేసి, కొరడా దెబ్బలు కొట్టిస్తాను." [అంటూ వెళ్ళిపోయాడు. ]
పల్లీయుడు - 2 ;- రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా - అని పెద్దలు అన్నారు, ఇందుకే.
ఆర్యకుడు ;- సంవాహకా! మూట ముల్లె సర్దుకుని, ఎక్కడికి వెళ్తున్నావు?" అడిగాడు .
సంవాహకు ;- మా మేనమామలు పాటలీ పుత్రంలో ఉన్నారు. 
వీలైతే పాటలికి వెళ్తాను. మన పల్లెలో భుక్తి లేదు. 
ఆర్యకుడు ;- ఐతే భుక్తి ముక్తి కోసం పట్నం వెళ్తున్నావన్న మాట. ఐనా చెడి చుట్టాల 
దరికి చేరకూడదు. 
[ రచ్చబండ మీద కూర్చున్న వారిలో నుండి లేచి, నిలబడ్డాడు శర్విలకుడు ] 
శర్విలకుడు ;- ఆగు, సంవాహకా! నేను కూడా వస్తున్నాను. 
పనీ పాటా లేకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావని - 
ఇంటా బయటా నన్ను  - అందరూ ఆడిపోసుకుంటున్నారు. 
అక్కడైతే ఏదో ఒక పని దొరికితే, నా తిప్పలేవో నేను పడతాను. [అందరూ నిర్ఘాంత పోతారు]
మిత్రులందరూ  ;- అరె, శర్విలకా! ఎంతైనా మనం పుట్టిన గడ్డ ఇది, ఈ నేల మన కన్నతల్లి. 
పురిటి గడ్డని విడిచి పోవచ్చునా!?  ఆగు, శర్విలకుడా, నిలు నిలు, సంవాహకుడా!
సంవాహక ;- ఇక్కడే ఉండి పస్తులు ఉండమంటున్నారే!? భలే వాళ్ళే!
[ ఇద్దరూ ఎడ్ల బండిని ఎక్కారు. వారితో పల్లీయులు కొందరు కూడా ఎక్కేసారు.
బండి చక్రాలు తిరుగుతూ ఉన్నవి.] 
; ;
**********************************************************; ;
 ;  ©   ®     ™  Ω Ω Ω Ohm  ;  ©   ®     ™  Ω Ω Ω Ohm sign ; 

**********************************************************; ;
;
[ రోహణుడు son of చారుదత్త ; ఇంకో చిన్న *CART WHEEL కనబడుతున్నది -  
అది బాలుడైన రోహణుడు ఆడుకుంటున్న **బొమ్మ బండి. ; రోహణుడు చారుదత్తుని కొడుకు.]
చారుదత్త ;- కుమారా, రోహణా! ఉత్సవానికి వెళ్తున్నాను. నువ్వూ వస్తావా!?
రోహణుడు ;- నేను రాను, నాన్నగారూ! బండి ఆట ఆడుకుంటున్నాను కదా!
ధూతాంబ ;- తండ్రి గారితో అట్లాగ మాట్లాడ వచ్చునా, తప్పు కదూ?? లెంపలు వేసుకో కుమారా!
రోహణుడు ;- క్షమించు అమ్మా! ఇదిగో, గుంజీలు కూడా తీస్తున్నాను సరేనా!!
చారుదత్తుడు ;- అయ్యో, నా చిన్ని తండ్రి చెంపలు ఎంత వాచిపోయాయో. 
ధూతమాంబా, పసివానికి ఇన్ని దండనలా, హన్నా! [నవ్వుతూ చెప్పాడు] 
ధూతమాంబ ;- ఇప్పటి నుంచీ దండనకు, శిక్షణలకు దేహం అలవాటు పడడం మంచిదే, 
పెద్దవాడు ఐనాక - జీవితంలో ఢక్కా మొక్కీలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. 
మైత్రేయా! రదనికా! బండిలో పూజా సామగ్రి అంతా సర్దారా!?         
రదనిక ;- సామాను అంతా పెట్టాము, అమ్మా! .... రోహణ బాబూ! రండి.  ... 
అరె, ఈ ఆట బండి - మన తోటి ఎందుకు?" ఇంటి లోపల పెడ్దాము. [అంటూ తీసుకున్నది రదనిక ]
రోహణుడు ;-  వద్దు. బొమ్మ బండి - లేకుండా నేను రాను. రానంటే రాను, అంతే!
మైత్రేయుడు ;- ఈ మైత్రేయుని మాట శిలా శాసనం. 
మనం మీ బుల్లి బండితోనే బయలు  దేరుతున్నాం, సరేనా బాబూ! మైత్రేయ మిత్రుని వాక్కు వేద వాక్కు , 
పదండి. ఆలస్యం చేస్తే - రాహుకాలం వస్తుంది.  అదిగో సందడి, ఉత్సవం మొదలైనది. ; 

; *******************************************:
;
కోవెలలో నర్తకి ;-  & వసంత రేఖ నాట్య ఉత్సవ్ ;-
వసంతసేన నాలుగు కాళ్ళ మండపంలో - నృత్యం చేస్తున్నది.
ఆమె కాలి గజ్జెలలోని ఒక మువ్వ జారి, దొర్లుతూ కింద పడింది.
రోహణుడు ;- మీ మువ్వ  [ అంటూ -తన ముందు పడిన మువ్వను ఇచ్చాడు రోహణుడు ]
వసంతసేన - చమత్కారంగా  - నాట్య రూపకంలో సంభాషణను మలిచి, కలిపేస్తూ 
వసంతసేన  ;- ఆర్యుల నామధేయములు తెలుసుకొనవచ్చునా!? ...... 
ఆ ప్రశ్నకు బాల రోహణుడు సమాధానం ఇచ్చాడు.
రోహణుడు ;- నా పేరు రోహణుడు, ఆర్య చారుదత్తుల కుమారుడిని,
మా జనని నామం ధూతమాంబ.
నవ్వుతూ అటు చూసిన వసంతసేనకు చారుదత్తుడు కనిపించాడు. -
వసంతసేన  ;- ఆహా, ఎంత రూపసి. ధూతా దేవి ఎంత భాగ్యశాలి. [అనుకున్నది ]
వసంతసేన నాట్యం పూర్తి ఐనది. వసంతసేన పై వ్యామోహం కలవారు ముందుకు వస్తున్నారు.
వసంతసేన తల్లి ;- [ వారిని నిలుపుతూ ] కన్నెరిక శుల్కం ఎవరు ఎక్కువ కట్టగలరో తెలుపండి.
రాబోయే శ్రావణ మాసం, పౌర్ణమి నాడు ఏర్పాటు చేస్తున్నాము ....... 
 వేలం పాటను, 12 లక్షల వరహాలు చెల్లించగల వారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి రావొచ్చును.
; [ఆ ప్రకటన విని అందరు జారుకున్నారు. & శకారుడు, మరి కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటూ నిలబడ్డారు. &
వసంతసేన కళ్ళు మాత్రం -అక్కడి నుండి వెళ్ళి పోయిన చారుదత్తుని కోసం అన్వేషిస్తున్నవి]
 కుశావతి ;- అమ్మా వసంతా దేవీ, చారుదత్తులు, కుటుంబం వెళ్ళిపోయి, చాలాసేపు ఐంది.
వసంత సేన ;- ఆ, నువ్వు అసాధ్యవు.
కుశావతి ;-  నెచ్చెలిని, ఈ దాసీకి - మీ మనసును కనిపెట్టేయడం వెన్నతో పెట్టిన విద్య. 
[ కిసుక్కున నవ్వుతుంది]
వసంత ;- నాపై కరుణ చూపు, మా జననికి తెలియనీకు.
కుశావతి ;- వేరే చెప్పాలా అమ్మా. సుందరేశులు, 

చారుదత్తులు - మీ జత - స్వర్ణంలో పొదిగిన కౌస్తుభ మణి కదూ.  

**************************************;
;
[వసంత రేఖ నాట్య ఉత్సవ్ ;- కుశావతి ;- next ;- ] ;-
;
**************************************; 
కుశావతి -శర్విలకుడు , వసంతసేన ;-
కిటికీలో నుండి కోకిల పాట వినిపిస్తుంది. కుశావతి అటు వెళ్ళబోతుంది. 
వసంతసేన ;- కుశావతీ! ..... [ యజమానురాలి కంఠధ్వని వినీ వినగానే, 
పరిచారిక కుశావతి లో తత్తరపాటు; ]
వసంతసేన ;- మదనికా! వేళ గాని వేళలలో - ఋతువు గాని ఋతువులలో - 
ఈ పిక గానం ఏమిటి?, తరచుగా వినిపిస్తూన్నది!?
[నవ్వుతూ ప్రశ్నించింది వసంతసేన. కుశావతి  ఉలిక్కిపడి ఆగింది]
కుశావతి  ;- అబ్బె, ఏం లేదమ్మా! ......... 
మన ఆవరణలో మామిడి చెట్లు చిగురులు వేశాయి.
ఉజ్జయినిలో అందానికి తలమానికం ఐన ఈ మా వసంతసేన ప్రతి రోజూ - 
ఆ చెట్టును నిమురుతూ ఉన్నారు కదా , 
ఆ ఆకులతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా! 
ఇంత దోహదం లభిస్తున్నది కాబట్టే ఆ ఆమ్ర తరువు పల్లవిస్తున్నది.

చిగురులు వేసిన కొమ్మల గుబురులలో కోకిలలు దాక్కోవడం సహజమే కదమ్మా!
వసంతసేన ;- ఏమో అనుకున్నాను. భలే చమత్కారివే.
కుశావతి  ;- ఈ వసంతసేన గారికి ఇష్ట దాసి కదా ఈ కుశావతి , 
అంత తావిలో ఇంత, గోరంత తావి అంటుకున్నది, - నాపై విరజిమ్మింది మరి.   
వసంతసేన ;- సరే నేను మిద్దె పై గదికి వెళ్తున్నాను.
[ఓరగా కిటికీ బైట వంగి దాక్కుంటూ నిలబడిన మనిషిని గమనిస్తూ, 
మెట్లు ఎక్కసాగింది వసంతసేన ]
"హుష్, నీకు  బుద్ధి లేదు శర్విలకా!"
మెట్ల మీది వసంతసేన ;- ఓహో, ఈతని పేరు శర్విలకుడన్న మాట.
కుశావతి  ;- ఈ కుశావతిని తెగ ఇరకాటంలో పెడ్తున్నావు శర్విలకా! 
ఇట్లాగ - మాటి మాటికీ - దొంగతనంగా కలుసుకోవడం కుదరదు.
యజమాని వసంతసేన మనల్ని పసికట్టినట్లు ఉన్నారు."
శర్విలకుడు ;- మరెట్లాగ, ఇట్లాగ తప్పడం లేదు మరి!? 
నిన్ను విడిపించాలంటే పరిహారం చెల్లించాలి కదా.
ఆ శుల్కం పెద్ద మొత్తం ఆయిరి, నువ్వు చెప్పినట్లు ఇక నేను దొంగతనాలు చేయాల్సిందే!
కుశావతి  ;- మీ ఊరు నుండి ఇంత దూరం వచ్చింది, చోరునిగా మారడానికా,
అదిన్నీ ఈ కుశావతి  కోసం. నా మూలాన్న ఒక పల్లెటూరి బైతు -  అమాయక చక్రవర్తి - 
చోరునిగా మారితే, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, పైగా మాకు అప్రదిష్ట కూడానూ.
[వసంతసేన తల్లి అందర్నీ పిలుస్తూ వచ్చింది]
వసంతసేన తల్లి ;- వసంతసేనా! ఎక్కడున్నావు? కుశావతీ, కుశావతీ! ఎవరూ కనబడరేం, 
సమయానికి దాసీలు - ఒక్కరూ అందుబాటులో ఉండరు కదా!? 
కుశావతి ;- అమ్మో, దొడ్డ యజమాని వస్తున్నట్లు ఉన్నారు, వెళ్తున్నాను. ----- 
శర్విలకుడు ;- ఈ కుశావతి మహారాణి గారి మళ్ళీ పునర్దర్శనం - ఎప్పుడో ఏమో!?

కుశావతి ;- ఎవరో వస్తున్నారు. సద్దు సద్దు, ఇక మరలిపో!
*************************************************************; ;
 ;  ©   ®     ™  Ω Ω Ω Ohm  ;  ©   ®     ™  Ω Ω Ω Ohm sign ; 

*************************************************************;
సంవాహకుడు - శర్విలకుడు ;;  అధ్యాయ శాఖ ;- 6 + ;-
;                           సంవాహకుడు - శర్విలకుడు ;-
;
శర్విలకుడు ;- సరే, ఇక సెలవు, మళ్ళీ పున్నమికి 
కుశావతి, శర్విలకుల సమావేశం. సరేనా!?"
[ బయట వ్యక్తి కేకలు ] ; 
సంవాహకుడు ;- ఒళ్ళు మర్దన చేస్తాం. మీ మేనికి మిసమిస, ఒళ్ళు మర్దన చేస్తాం.
[ వీధిలో అరుస్తూ చెబుతూ, వెళుతున్నాడు సంవాహకుడు ]
శర్విలకుడు ;- ఓ సంవాహకుడా ....... నేను శర్విలకుడిని. సంవాహకుడా! బాగున్నావా, 
మన పల్లెలో అందరూ  కుశలమా, త్వరగా చెప్పు చెప్పు."
సంవాహకుడు ;-  ఇంకా మన పల్లెసీమ గురించి తలుచుకుంటూనే ఉన్నావా,
నేను మళ్ళీ వెనకకు వెళ్ళనే లేదు కదా.
"ఔరా, ఐతే మనకు పుట్టిన నేలకూ ఋణం తీరినట్లేనా [నిట్టూర్చాడు శర్విలకుడు] 
శర్విలకుడు ;- అది సరేగాని, సంవాహకుడా! 
మర్దన క్రియలు - ఈ కొత్త పనిని ఎప్పుడు నేర్చుకున్నావు!?"
సంవాహకుడు ;-  చారుదత్తుల దగ్గర చేస్తుండే వాడిని. ఆయన చాలా మంచివారు.
గొప్ప దాత. దాన ధర్మాలు చేసి, నిర్ధనులైనారు.
ఇక నాకు గత్యంతరం ఏమున్నది, ఇదిగో - పొట్ట చేత పట్టుకుని,
వీధులలో పడ్డాను. నీకు ఒళ్ళు పట్టమంటావా!?
[నవ్వుతూ అడిగాడు సంవాహకుడు ]
శర్విలకుడు ;- జోగీ జోగీ రాసుకున్నట్లున్నది. ఎర్ర ఏగాణీ లేని వాణ్ణి అడుగుతున్నావు.
నాకు శుశ్రూష చేస్తే నీకు ఏమివ్వగలను, శూన్యహస్తాలు .....
సంవాహకుడు ;- ఫర్వా లేదులే. మిత్ర శర్విలకుని నుండి ప్రతిఫలం అక్కర లేదులే. 
హాయిగా మన చిన్ననాటి ముచ్చట్లు అన్నీ నెమరేసుకుందాం. 
అవే మన ఉభయులకు ప్రస్తుత పారితోషిక నిధులు. ఏమంటావు!?
శర్విలకుడు ;- అంతకంటేనా, ఇన్నాళ్ళకి నా మనసు సేద దీరున్నది.
సంవాహకుడు ;- అది సరే గాని మిత్రమా, శర్విలకా, 
ప్రఖ్యాత నర్తకి వసంతసేన ఇంటి నుండి వస్తున్నావు, 
ఏదైనా రహస్యం గానీ ఉన్నదా!?
శర్విలకుడు ;- మదనిక వసంతసేన వద్ద ఉన్నది.
ఆమె పరిచారిక కుశావతి, చాలా మంచి కన్యక,
బహు ఓరిమి కలిగిన పడుచు. ........... "
సంవాహకుడు ;-  బోధపడింది, ఈ సంవాహకుడు - 
ఇక నుండీ  నీకు బోధ గురువు నీకు అండ దండ .....
శర్విలకుడు ;- ఐతే నాకిక బెదురు, బెరుకు లేవు. ఇంత మంచి స్నేహితుడు 
కుడి భుజంగా ఉన్నపుడు నాకిక  ఎదురేమున్నది ..... 
[ అనేసి నవ్వాడు ఇద్దరూ  ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నారు.]
 ;
**************************************; 
ధన్వంతరి వాక్కు, నేర్పు ;- ధన్వంతరి వాక్కు, నేర్పు ;-
వసంత సేన తల్లి  ;- వసంత సేనా, మొన్న ఉత్సవంలో నీ నాట్య కళ మసకబారింది, 
మొదట్లో బాగానే చేసావు,  అదేంటోగాని, ఆఖర్న అస్తవ్యస్తంగా చేసేసావు.
అప్పటికీ శత పోరుతూనే ఉన్నాను కదా, ఈ తూరి బాగా చెయ్యాలి సేనా - అంటూ.
ఆలాంటిలాంటి వాళ్ళు కాదు, హేమాహేమీలు నీకు కన్నెరికం చేయాలీ అని. ...... 
[తల్లి ధోరణి సాగి పోతూనే ఉన్నది. వసంత సేన మాత్రం పరధ్యానంగా ఉన్నది.]
వసంత సేన తల్లి  ;- హూ, ఏదో గాలి సోకింది. లేకుంటే ఏమిటీ పిల్ల, 
వైద్యునికి కబురంపాను, అరుగో, రానే వచ్చారు, ......
దయ చేయండి ధన్వంతరి మహాశయా! 
మొన్న ఉత్సవంలో నాట్య ప్రదర్శన ఇచ్చింది, అప్పటి నుండీ ....... 
ధన్వంతరి ;- [నాడి చూస్తూ] తెలుసు తెలుసు, నాకన్నీ తెలుసు. 
ముందు మంచి నీళ్ళను సావకాశంగా మరిగించి, తీసుకు రండి ...... [ తల్లి లోనికి వెళ్ళింది ]
ధన్వంతరి ;- వసంత మణీ! ఆ రోజు నువ్వు ప్రేక్షక జనంలో ఉన్న 
చారుదత్తుని ప్రేమిస్తున్నావు, ఔనా. [ తెల్లబోయింది వసంత సేన]
వసంత సేన ;-మీకు తెలుసా, తెలిసిందా!?
ధన్వంతరి ;- "ఈ ధన్వంతరివి నాడిని పసికట్టడమే నా విధి కదా. పసికట్టాను. ........ "
 వసంత సేన ;- ప్రస్తుతానికి ఇది రహస్యంగా ఉంచండి, ముఖ్యంగా మా అమ్మ దగ్గర.
[ సిగలోని నగను ఇచ్చింది. ]
ధన్వంతరి ;- సరే సరే [అంటూ, మందుల పెట్టెలో - అడుగున దాచాడు. &
తల్లి, కుశావతి - వేణ్ణీళ్ళ గిన్నె పట్టుకుని వచ్చారు]
ధన్వంతరి వైద్యుడు ;- అమ్మాయీ మణిగారికి ఈ చూర్ణం ఉష్ణ జలంలో కలపండి, 
బాగా కాపడం పెట్టండి, ఉష్ణం ఉష్ణేన శీతలం - అన్నారు పెద్దలు."  
[ నర్మగర్భంగా నవ్వుతూ అన్నాడు ; వసంత సేన సైగను అర్ధం చేసుకున్నాడు వైద్యుడు ]
ధన్వంతరి ;- అమ్మా! మీ పెరట్లో తమలపాకులు ఉన్నాయా!? 
తల్లి ;- మా పెరటి తోటలో లేవు. ఊరి బైట ఉద్యానంలో ఉన్నవి.
వాటినే విపణి వీధిలో అందరూ కొంటారు. ఐనా, మాకు కొనే దుర్గతి ఏమీ పట్ట లేదు...... 
ధన్వంతరి ;-  [గతుక్కుమని] ఔనౌను, మరిచాను కదండి. 
అందరూ - మీకు దండిగా ధనం, స్వర్ణం - 
అన్నింటినీ - తాంబూలంలో పెట్టి మరీ ఇస్తూంటారు కదా!
తల్లి ;-ఈ మోహిని లోగిలి స్థాన మహత్మ్యం ఘనత అదే!
ధన్వంతరి ;- తమాల పత్రములను - అదేనండీ, తమలపాకులకు 
పిసరంత తైలం రాయండి,  కుంపటి రాజేసి, 
కొంచెం వెచ్చ జేసి తీసుకు వస్తారూ!?
[వాళ్ళు అటు కేసి వెళ్ళాక, వసంత సేన అడిగింది]
వసంత సేన ;- చారుదత్తుడు నిష్ఠాగరిష్ఠుడట. 
ఏదైనా మందు, వశీకరణం ఔషధం - ఇవ్వ గలరా!?
ధన్వంతరి ;- నా వృత్తి అదే కదా! ..... 
[ అతని చూపుల అర్ధాన్ని గ్రహించింది వసంతసేన ]
వసంత సేన ;- మీ మేలు మరిచి పోను, ప్రతిఫలం భారీగానే ఇస్తాను లెండి.
[వాడ్చిన తమలపాకులు తెచ్చారు తల్లి, కుశావతి]
ధన్వంతరి ;- వీలు కలిగినప్పుడల్లా, అంటే అమ్మాయి అడిగినప్పుడు - 
ఈ ఆకులను మేనుపై వేస్తూండండి. మళ్ళీ రేపు ఈ ఝాముకు వస్తాను .
ధన్వంతరి ;- [వెళుతూ] వశీకరణం మందు తెచ్చి ఇస్తాను. [అని వసంత సేనకు సైగ చేసి, నిష్క్రమించాడు]
**********************************************************
 ;  ©   ®     ™  Ω Ω Ω Ohm  ;  ©   ®     ™  Ω Ω Ω Ohm sign ; 

**********************************************************
 8] మీ గృహమున మా నగలు మీ భద్రం ;; 9] అక్కడే దోబూచి ;; 
10]  తప్పించుకుందిరా తాబేటి దవ్వ! ; 11] దౌర్జన్య శకార ;; 12] సారధి - ఊరి వాళ్ళతో యోచన ;-

♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ;
సారధి - ఊరి వాళ్ళతో యోచన ;-
;
మేడమీద కిటికీలో నుండి - మామిడి చెట్టు కనిపిస్తున్నది. వసంత సేన 
వసంత సేన  ;- మదనికా! పిక గానం బాగుంది కదూ!
కుశావతి ;- చారుదత్తుల వారి ఇంటిలో గానం చేసి, 
ఆ కోకిల ఇక్కడికి వచ్చినట్లుంది దొరసానీ! 
అందుకే దాని పాట బహు బాగున్నది." [ నవ్వింది] 
"ష్! అమ్మ వింటుంది." 
కుశావతి ;- చిత్తం. [ముసిముసి నవ్వులతో 
కిటికీ తోరణాల దుమ్ము దులుపుతున్నది కుశావతి, &
ఇద్దరికీ గతం గుర్తుకు వచ్చింది.]
&
నెల రోజుల క్రిందట జరిగింది ................ 
; FLASH BACK = నేపథ్యం :- పౌర్ణమి నాట్యం చేయుటకై వసంత సేన ;ఉద్యానవనములోనికి పరిచారిక మదనికతో వెళ్ళినది.
బైట నిలబడి ఉన్నది వసంత సేన బండి.  ఆ బండిని తోలే వాని పేరు తుందిలుడు.  &
ఇంతలో సారధికి కోలాహలం కనిపించింది. –
వ్యక్తి  1 ;- మన గ్రామంలో ప్రజలందర్నీ రాజ భటులు కొట్టారు. ఇట్లాగ ఎన్నాళ్ళని, ఈ హింసలను భరిస్తాం?
వ్యక్తి   2 ;- ఆర్యకుని బంధించారు, హింసలు పెడ్తూ, తీసుకెళ్ళారు, చెరసాలలో వేసారు. 
మన రాజ్యంలో -  నిజం మాట్లాడితే తప్పు, న్యాయం కోసం ప్రశ్నిస్తే ఆ దండన ఒక్కటే .. అందరికీ తెలిసిందే!
తుందిలుడు ;- ఏమిటీ, మన ఆర్యకుని చెరసాలలో వేసారా!?"
వ్యక్తి   1 ;- నువ్వెవరవు?
తుందిలుడు ;- నేను తుందిలుణ్ణి. మన ఊరు నుండి పట్టణం చేరాను. ఇక్కడ ఒకరి వద్ద - శకట సారధిని. యజమానులకు చెప్పి వస్తాను. మన ఊరి ప్రజలు చాలామందిని ఆ శకారుడు - ఈ రీతిగా చెప్ప నలవి కాని రీతులలో బాధిస్తున్నాడు. పేనుకు పెత్తనం ఇచ్చాడు - అసమర్ధ ప్రభువు. రాజా వారి బావమరది ఐనంత మాత్రాన విచక్షణ మరచిపోవాలా? స్థాన బలమె కాని తన బలము కాదయా - అని పెద్దలు అన్నారు అందుకే!
వ్యక్తి   2 ;- తుందిలా, ఇప్పుడేం చేయగలం?
తుందిలుడు ;- మనం అందరం సమైక్యతతో ఉండాలి. కష్ట కాలంలో - ఐకమత్యమే మన బలం - 
కలిసి ముందుకు కదులుదాం. ................  
తుందిలుడు  ;-నా స్నేహితుడు చెరసాలలో కాపలా కాస్తాడు. 
కోటలో వెనుక మూల చీకటి కొట్టు ఉన్నది. బందీలను అక్కడ ఉంచుతారు.
అక్కడికి చేరే ఉపాయాన్ని అలోచన చేద్దాం.
రాత్రికి మనం ఊరి శివార్ల వద్దగుడిలో కలుద్దాము. మంచి ప్రణాళికను ఆలోచిద్దాం.
వ్యక్తి   3 ;- సరే తుందిలుడా, అందర్మూ ఈ బాట వద్ద ఇట్లాగే గుమిగూడి కనిపిస్తే తంటాలు.
అడుగో, శకారుడు వస్తున్నాడు. సెలవు.
వ్యక్తి   4 ;- సంతోషంగా ఉంది. అనుకోకుండా మాకు - నీ వంటి ధీరుని సహకారం లభించింది. 
మళ్ళీ మాకు పైనున్న ఆ  భగవంతుని పై నమ్మకం పాదుకొంటున్నది.
; అటుగా బౌద్ధ సన్యాసులు కొందరు వెళ్తున్నారు.  ;
"బుద్ధం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి,                                                                           
ధర్మం శరణం గచ్ఛామి||
[ బౌద్ధ బిక్షువులు వెళ్ళేదాకా అందరూ కాస్సేపు ఆగారు.  
ఊరి వాళ్ళు  తుందిలునికి వీడ్కోలు చెబుతూ, వేగంగా వెళ్ళి పోయారు.  
తక్కిన వాళ్ళు వేరే దిశగా వెళ్ళగా, 

తుందిలుడు కూడా తోట దగ్గరికి బయలుదేరాడు. ]
; REF : తుందిలుడు, ఊరి వాళ్ళతో యోచన ; 
అధ్యాయ శాఖ ;- 8 ;- సారధి - ఊరి వాళ్ళతో యోచన  ;

♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
;
దౌర్జన్య శకార ; అధ్యాయ శాఖ ;- 9 ; ;- [FLASH BACK = నేపథ్యం :-  
క్రిందటి మాసంలో జరిగింది ....... పౌర్ణమి  చేయుటకై వసంతసేన తన దాసి కుశావతితో వెళ్ళింది.   ] ;
కుశావతి  ;- అమ్మా! ఇవాళ సరసు ఒడ్డున మీరు నాట్యం అద్భుతంగా చేసారు.
వసంతసేన ;- ప్రతి పౌర్ణమి కదూ - అక్కడ ఉన్న సరస్వతీ దేవి ప్రతిమ ఎదుట నేను నర్తించాలి.
కుశావతి  ;- అవును కదండీ, మీ జన్మ నక్షత్రం ప్రకారం - 
ప్రతి పున్నమి రాత్రికి ఈ నర్తన కార్యక్రమం దొడ్డమ్మ గారు, 
మీకు విధించిన నియమం కదా!
[ ఉద్యానవనములో పున్నమి నాట్యం పూర్తి ఐనది.
నాట్య అభినయ సంపూర్ణం తర్వాత ......... 
తోట నుండి వసంతసేన, కుశావతిలు వస్తున్నారు.
; నందనం ముంగిలి  వద్ద భామలు ఇద్దరు ఆగారు.
ఆగి, నిలబడి, తమ శకటం కోసం చుట్టూ చూసారు.
నలు వైపులా పరకాయిస్తూ అన్నది వసంతసేన. ]
వసంతసేన ;- అరె, మన శకటం ఏది, తుందిలుడు ఏడి, ఎక్కడ?
కుశావతి ;- అమ్మా, ఆ అలికిడి, శకారుడు వస్తున్నాడు, పదమ్మా! 
స్త్రీలు కంటబడితే వదలని కామాంధుడు. వేగం, వేగం.
; [ఇద్దరిదీ పరుగు వంటి నడక. శీఘ్ర గమనంసాగిస్తున్నారు. 
ఇంతలో శకారుడు వారిని చూడనే చూసాడు. ]
శకారుడు ;- భళీ, ఆమె వసంత సేన లా ఉన్నది." 
శకారుడి అనుయాయి విటుడు -
వినయంగా తల ఊపుతూ అన్నాడు.
విటుడు ;- ఔనౌను దేవరా! ఆమె వసంత సేనయే." 
శకారుడు ;- భళీ, ఇవాళ మన పంట పండింది. 
ఓహో వసంత సేనా! నిలు నిలు.
[ ధాష్ఠికంగా అన్నాడు శకారుడు. ]
విరటుడు ;- ఆ జంట ఆగకుండా పరిగెడుతున్నారు, దేవరా.
[తాన అంటే తందాన అనే రకం మనిషి విరటుడు. ]
శకారుడు ;- ఇద్దరూ స్త్రీలే ఐనప్పుడు, జంట - అనరు, 
ఒక మగ, ఒక ఆడ ఐతేనే అట్లాగ పిలుస్తారు. నీకేమీ తెలీదు. 
ఉత్తి మట్టి బుర్ర నీది! అనుసరిద్దాం పద! ఓ వసంతసేనా! నిలు నిలు .
[ అప్పటికే సంజె చీకటి పడుతున్నది. భీతితో ఉక్కిరిబిక్కిరి ఔతూ, ఇరువురు వనితలు

మసక చీకటిలో - తాము ఎటు పరిగెడుతున్నారో తెలీని అయోమయ అవస్థలో దౌడు తీస్తున్నారు. ] 
;
**************************************; 
; ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   
 అధ్యాయ శాఖ ;- 10 ;- తప్పించుకుందిరా తాబేటి దవ్వ! ;-
[+ అప్పటికే సంజె చీకటి పడుతున్నది.   భీతితో ఉక్కిరిబిక్కిరి ఔతూ, ఇరువురు వనితలు
మసక చీకటిలో - తాము ఎటు పరిగెడుతున్నారో  తెలీని అయోమయ అవస్థలో దౌడు తీస్తున్నారు. ] 
కుశావతి   ;- వసంతమ్మా! ఆ ఇంటి ఆ ముందరి - లఘు ద్వారం తెరచి ఉన్నది. 
పదండి.  తోటలో పొదలు ఉన్నవి. పొదల మాటున దాక్కోగలుగుతాం. శీఘ్రం.
[ ఆ జవ్వనులు లోనికి ఉరికి, ఒక పొద మాటున వంగి, కూర్చున్నారు.  ]
శకారు ;- ఎక్కడ? ఎక్కడ? వసంతసేనా! ఎక్కడ?
ఎక్కడికి పోయినా నిన్ను వదలను, వసంతా! 
ఈ శకారుని బారి నుండి వేళ తప్పించుకున్నావు, సరే చూసుకో, 
మళ్ళీ నిన్ను దొరక బుచ్చుకుంటాను. ...... 
విరటుడు ;- ;- తప్పించుకుందిరా తాబేటి దవ్వ! హమ్మయ్య, ఇప్పటికి ఆమె క్షేమం.
శకారుడు  ;- విటూ, అక్కడి జూద మండపంలోనికి దూరుదాం, పద!
విరటుడు ;- ;- దేవరా! ఆ జూదశాల యజమాని విసుక్కుంటున్నాడు.
శకారుడు ;- ఏం, ఎందుకంట, ఏం తీపరమట!?  ………… 
విరటుడు ;- ;- ఏం తీపరం - అని మీరు అడిగితే ఏం చెప్పగలను? 
మీరు అసలు పైకం కట్టనే కట్టరనిన్నీ, దండగ బోణీ హస్తం తమదనీ, ఆ...... చిత్తం .... ఆ ..... 
శకారు ;- ఆ! రాజా వారికి స్వయానా బావ మరదిని. నన్నే శుల్కం అడుగుతున్నాడా, 
వాడికి మన రాజ్యంలో మంచి నీళ్ళు పుట్టకుండా చేస్తాను, చూస్తుండు.
విరటుడు ;- ;- ఇక్కడ ఉప్పు నీళ్ళు, తాగడానికి పనికి రావంట. 
పొరుగు సీమలో ఐతే - అమృత తుల్య జలం లభిస్తున్నది ...... అని ..... 
శకారు ;- ఆ, దుష్టుడు, అంత కావరమా,  వాడి జుట్టు పట్టుకుని, గుమ్మానికి వేలాడ దీస్తాను. పద.
విరటుడు ;- ;- ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగనే -  ఎవరి ముఖం చూసాడో, పాపం! ఆ జూదశాలుడు. పదండి దేవరా!
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣  ;
అధ్యాయ శాఖ ;- 11 ;- అక్కడే దోబూచి  ;-  11, అక్టోబర్ 2017, బుధవారం ;
; [వసంతసేన, కుశావతిలు గుబురు చెట్టు వెనక - నక్కి ఉన్నారు, గజగజా వణుకుతూ. 
చారుదత్తుడు అప్పటికే తోటలో పని చేస్తున్నాడు. అతను తమ ఆవరణలోకి - వసంతసేనా ద్వయం - ప్రవేశించడం - గమనించ లేదు.
వసంతసేన చారుదత్తుడిని చూస్తూ, సంతోషంలో మునిగిపోయింది.]
;  కుశావతి ;- అమ్మా! ఇవాళ మీకు అదృష్ట యోగం పట్టింది. 
మరీ అంత తన్మయంలో మైమరచి పోకండి.
వెదక బోయిన తీగ కాలికి తగిలింది.
చారుదత్తు ;- రోహణా! ;- [ చారుదత్తుడి పిలుపును ఆలకించి, అతని సుపుత్రుడు బైటికి వస్తున్నాడు. ]
రోహణ ;- వస్తున్నా, నాన్నగారూ!
చారుదత్తు ;- ఉసిరిక చెట్లకు పాదులు చేయండి. వచ్చే కార్తీక మాసంలో వన భోజనాలు చేయాలి కదా.
అందరూ హుషారుగా "హాయ్ హాయ్" అంటూ నవ్వారు.]
చారుదత్తు ;- వర్ధమానకుడు, మైత్రేయుడు గొప్పులు తవ్వుతున్నారు కదా, 
నీళ్ళు సరిగ్గా పారేటట్లు చూడు రోహణా!
రోహణ ;- సరే, నాన్నగారూ!  [ ధూతాదేవి అక్కడికి - రదనికతో వచ్చింది.]
ధూతా దేవి ;- వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తూనే ఉన్నాను, 
మీరు కాస్త సేదదీరండి. బడలిక తగ్గుతుంది, ముందీ పానీయాలను అందరూ త్రాగండి.
రదనిక ;- తేనె, నిమ్మ రసం కలిపి తయారు చేసాను. తీసుకోండి,యజమానీ!...  
ఓహో, పని దొంగల్లారా!
వర్ధమాన ;- ఎవర్నీ, మమ్మల్నే!
రదనిక ;-  ఆహా, మిమ్మల్నే. తీరుబడి లేనంత పని చేస్తున్నట్లుగా నటించడంలో బహు నిపుణులు.
వర్ధమానుడు ;- ఇక్కడికి వచ్చి ఇవ్వవచ్చునుగా.
రదనిక  ;- మరే, పాపం. నోటికి అందివ్వమని ఆజ్ఞాపించ లేదు. 
ఇక్కడ పెట్టేసాను, వేం చేసి గ్రోలండి.
[ ఆ గ్లాసులను చెట్టు వెనక దాక్కుని ఉన్న వసంతసేన, చెలికత్తె కుశావతి  - 
జాగ్రత్తగా తీసేసుకున్నారు, గుట్టుగా త్రాగేసారు. 
అప్పటికే దాహంతో వాళ్ళ గొంతులు తడారి పోయి ఉన్నవి. 
నెమ్మదిగా తాగి, దాహం తీర్చుకున్నారు. ]
మైత్రేయా ;- వర్ధమానుడా! రదనిక పానీయ చషకములు ఏవీ? 
రదనిక ఇక్కడే పెట్టానన్నది.
వర్ధమాన ;- సరిగా చూడు మైత్రేయా!
మైత్రేయ ;- ఈ మైత్రేయునికి చత్వారం రాలేదులే. 
నువ్వు కూడా వచ్చి, శ్రద్ధగా పరికించు, పరిశీలించు.
ఏమైపోయాయబ్బా! ఇది మయసభ కాదు కదా. 
కనికట్టు మటుమాయం అవడానికి.
చారుదత్తు ;- రదనిక పరాకున ఇంట్లోకి తీసుకుపోయి ఉంటుంది, గానీ - 
ఇంక పని ఆపి, మీరూ వెళ్ళండి. కాస్త విశ్రాంతి తీసుకుని, భోజనాలు చేద్దాం.
[ అందరూ గృహంలోనికి వెళ్ళారు. గృహస్తు చారుదత్తుడు - కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాడు.   
లోనికి వెళ్ళబోతూన్న చారుదత్తుడు - ]
 చారుదత్తుడు  ;- ఏదో అలికిడి. [అనుకుంటూ పరిశీలనగా చూస్తుండగా - 
అతనికి కనిపించారు, అక్కడే ఉన్న వనితలు.]
 చారుదత్తుడు  ;- ఎవరు మీరు? [ఆశ్చర్యంతో అడిగాడు.]
కుశావతి  ;- మా యజమానిని, ప్రఖ్యాత నర్తకీమణి వసంతసేన.
[ కుశావతి బెరుకుగానే పరిచయం చేసింది.]
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣    ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣    ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣    
31, అక్టోబర్ 2017, మంగళవారం ;- మీ గృహమున మా నగలు మీ భద్రం ;- 
;
[ చెట్ట వెనక నుండి చారుదత్తుని ఎదట 
బిడియపడుతూ నిలిచారు వసంతసేన, కుశావతి. ]
చారుదత్తు ;- ధూతాంబా! [ భర్త పిలుపు విని ఇంట్లో నుండి బైటకు వచ్చింది భార్య.]
ధూతాంబ ;- సందె దీపం గూట్లో పెట్టి వస్తాను. [ చెప్పింది ఆమె. ]
చారుదత్తు ;- ఇవాళ వీరిద్దరు మన అతిథులు.
ధూతాంబ ;- అరె, దుస్తులు మాసినవి. రండి. అలసట తీర్చుకుందురు గాని.
రదనికా! మన ఇంటికి కొత్తవారు వచ్చారు. 
వీరి స్నానపానాదులకు తగిన ఏర్పాట్లు చేద్దాం.
[ ఇంటి లోపలి నుండి వచ్చిన రదనిక - ]
రదనిక ;- అమ్మా, దయ చేయండి.
ధూతాంబ ;- అటు వెనుక వేపు స్నానశాల ఉన్నది.
వేణ్ణీళ్ళు ఉంచాము. రదనికా! వీరి అభ్యంగనం పూర్తి ఐనాక
ఈ కొత్త దుస్తులను ఇవ్వి. ఈ లోపు నా వంట పూర్తి ఔతుంది.
కుశావతి ; - చెల్లీ! రదనికా! మా అమ్మగారి పరిచర్యలు 
నేను చూస్తాను గానీ - నీవు వంట గదిలో మీ అమ్మగారికి సాయం చేయి. సరేనా!?
రదనిక ;- సరే, అట్లాగే! [రదనిక వెళ్ళింది.]
కుశావతి ;- వసంతసేనమ్మా! ఎదురు చూడని అదృష్ట యోగం. 
మీ నగలను 'భద్రపరచండి,'అని మీ స్వామికి ఇవ్వండి.
వసంతసేన ;- కానీ వారి భార్యకు కోపం వసుందేమో!?
కుశావతి ;- మీ మనోహరుని మళ్ళీ కలిసి, మీ మనసు విప్పి చెప్పాలంటే, మనకు వీలౌతుందా!? 
మీరు ధూతమ్మ గారికి  సోదరి గానీ, వారి చుట్టం కానీ కాదు కదా. 
మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం మీకు కలగదు కదా,
ఇప్పటికి నాకు తోచింది ఇదే మరి!
వసంతసేన ;- ఔనౌను, నీ యోచన కూడా బాగున్నట్లే ఉన్నది.
కుశావతి ;- మీ తర్వాత నేను చేస్తాను లెండి. మీ కురులు ముడి వేస్తాను.
వసంత సేన  ;- కుశావతీ, మా జాతి స్త్రీలకు ప్రేమ భావాలు ఉండదంటావా!?
కుశావతి ;- ఏమోనమ్మా, అవన్నీ పెద్ద వాళ్ళు ఎప్పుడో చేసిన నియమాలు కదా. 
ఏం చేయగలం. కొత్త దారి వేయాలంటే మన బోటి వాళ్ళకు సాధ్యమా!?
రదనిక ;- [వచ్చి] స్నానాదులు ఐతే వేగిరం రండి. విందులు సిద్ధం.
& **************************;
ధూతాంబ ;- మా వంట మీకు రుచించిందా? లోపం ఏమీ పొరపాటున - జరుగలేదు కదా.
అన్నట్లు మీ నామధేయములు తెలుసుకొనవచ్చునా? ...........
అట్లాగ తటపటాయిస్తున్నారు. చెప్పకూడనుకుంటే చెప్పకండి.    
కుశావతి ;- అబ్బే, అదేం లేదు, రదనికా! మా స్వామిని పేరు వసంతసేన, 
నేను కుశావతి.
చారుదత్తుడు ;- వర్ధమానుడా! వీరిద్దరినీ క్షేమంగా - వారి గృహమునకు చేర్చు.
ధూత ;- ఆర్యా! చిన్న మనవి. ఈ కారుచీకటిలో - 
విలువైన ఆభరణములతో ....ప్రయాణించడమంటున్నారా!?
చారుదత్త ;- ఔను, అదీ నిజమే. నా భార్య కూడా సంశయాన్ని వెలిబుచ్చుతున్నది. 
సరే, మరి ఏమి చేయాలి?
మైత్రేయ ;- కిం కర్తవ్యం, మిత్రమా!
కుశావతి ;- మా అమ్మగారి నగలను మీ వద్ద దాచిపెట్టి, ఉంచండి దేవరా!
వీలు చూసుకుని, మేమే వచ్చి, తీసుకుని వెళ్తాం.
శకారుని వలన మాకు ముప్పు పొంచిఉన్నది. పరిస్థితులు చక్కబడిన తర్వాత - తీసుకుంటాము. 
అంతవరకూ- కరుణతో ఈ భూషణములను మీ వద్ద భద్రపరుస్తారా!? 
మైత్రేయ ;- ఔనౌను, అదీ సత్యమే. ఈ వనితల ఉవాచ కూడా నిజమే అనిపిస్తున్నది.
చారుదత్తుడు ;-మైత్రేయా! రత్నాభరణములను మూట కట్టండి. 
ఈ మణిభూషణముల మూటను
పగలు వర్ధమానుడు, రాత్రి నువ్వు వేయి కన్నులతో కాపాడవలెను!
వసంతసేన ;- అమ్మయ్య, నాకు ఇంక నిశ్చింత, కుశావతీ!  
కుశావతి ;- స్వామి ఇంట గృహమున మన నగలు మీ పదిలం కదా!
ధూతాంబ ;- రదనికా! బండి వానిని పిలువు.
రదనిక ;- మార్గా! ఓ మార్గుడూ! వేగిరం బండి కట్టు.
మార్గుడు ;- చిత్తం, అమ్మా, బయలుదేరండి. "
;
**************************************; ;
వసంతసేన వసంత సేన కోణమానిని, ప్రాచీన రత్న మాల, నాటకం తెలుగు, Drama,  

♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣    ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣  

23, జనవరి 2018, మంగళవారం

వసంతసేన - ఎందుకు రాసాను?

వసంతసేన ;- 1. ఎందుకు రాసాను?  ; 
2. వసంత సేన రాసేటప్పుడు నా feelings, అనుభూతి ;
3- వసంతసేన – శైలి ;  
4. వసంతసేన – శూద్రకుని మూల రచనకు నేను చేసిన మార్పులు ;
;
వసంతసేన ;- 1. ఎందుకు రాసాను?  ;- 
వసంతసేన – నేను రాయాలని ఎంతమాత్రమూ అనుకోలేదు. 
2. Googul, Internet అనుకోకుండా నేర్చేసాను.
3. అటు తర్వాత దాదాపు పుష్కర కాలం తర్వాత Face Book లోకి అడుగు పెట్టాను.
Face buk = స్నేహ కూడలి ఇది కదా, FB Groups లో 'సమ అభిరుచులు కల బృందాలతో 
మన హాబీలను, ఆలోచనలనలను కలబోసుకోవడం మొదలైంది.

నాకు నచ్చిన తెలుగు సినిమా పాటలను FB Groups   లో పోస్ట్ చేస్తూ, 
ఇతర నేస్తాల నుండి – కొత్త అంశాలను తెలుసుకోసాగాను.
&
* పరిలి [ పరిచయ+కూడలి = ఫేస్ బుక్ -> పరి కూడలి -> పరిలి] - 
ఈ క్రమంలో నాకు ఇష్టమైన సినిమాల గురించి అభిప్రాయాలను, సలహాలను - 
పరిలి మిత్ర బృందంతో పంచుకోసాగాను.  - 
పద్మిని, అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమా వసంతసేన. 
వసంతసేన - సినిమా అంటే నాకు ఇష్టం. 
అందులోని పాటలన్నీ చాలా చాలా బాగుంటాయి. 
మధురాతి మధురం  super hit ఐన ఆ గీతాలను ఫేస్ బుక్ గ్రూప్స్ లో కానీ - 
Only Audio, not Vedio సినిమా వీడియో – పాటల దృశ్యాలు -
ఎంత వస్త్రగాలితం పట్టినా లభించ లేదు. – 
అంత మంచి సినిమా ఫెయిల్ అయింది – ఇది నాకు ఎంతో వ్యధను కలిగించేది. 

ఎప్పుడూ ఈ విషయం మనసులో మెలిపడుతూనే ఉన్నది. 
FB లో తారట్లాడేటప్పుడు -  Internet & FB  పుణ్యమా అని -  
వసంతసేన నాటకం, కథా అంశం పౌనః పున్యం - ;
ఈ సబ్జెక్ట్ మీద పూర్తి ధ్యాస, ధ్యానం – ఎందుకిలా!?

నాకు డిగ్రీ లో మృచ్ఛకటికం – తెలుగు నాటకం ఒక సబ్జెక్ట్.
కమ్యూనిస్టుల అభిమాన పాత్రమైన ప్రాచీన నాటకం వసంతసేన.  
వసంతసేన ని గూగుల్ లో చదువుదాం, అనుకుంటూ నిశ్చింతగా ఉన్నాను.
తాపీగా గాలించాను – కానీ నా శ్రమ వృధా,  
'ఇంత మంచి సినిమా లో లేకపోవడం ఏమిటి?' అని -
ఎంతో బాధ, ఆశ్చర్యాది భావనలతో ఉక్కిరిబిక్కిరి ఐనాను.

సరే, వేరే దారి లేక, నేనే గుర్తుకు తెచ్చుకుంటూ రాయాలని అనుకున్నాను.
గత్యంతరం లేక, గతంలో చదివిన నాటకమే కనుక, 
ఒక వ్యాసంగా రాసేద్దాం – అని, మొదలు పెట్టాను.
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ; 
అంత మంచి కథ – వెండి తెరపైన చేరి, ఘోరంగా ఎందుకు ఫెయిల్ ఐనవి?
ఉత్సవ్ [హిందీ – శశికపూర్, రేఖ] తెలుగు సినిమా] & వసంతసేన [ సినిమాలు 
బాక్సాఫీస్ వద్ద చతికిల పడినాయి,
ఏ ఏ మార్పులు చేస్తే - ఈ కథ ప్రేక్షక లోకంలో తళుక్కుమంటుంది? 
ఇదే ఆలోచన నా ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టేలా చేసింది.

ఇంక రాయడం మొదలు పెట్టాక – అనేక ఆలోచనలు, అభిప్రాయాలు – 
అనేక మలుపులను తీసుకుంటూ  – నా రచన కొనసాగింది.
ఏదో ఒక వ్యాసం, లేదా – చిన్న కథానిక రాస్తాను – అనుకున్నానా – 
ఊహు …… 
క్రమంగా నాటకంగా, రూపు తీసుకున్నది. 
క్లుప్తంగా పూర్తి చేసేద్దా అంటే - ఐతే కదా, 
ఏదో ఒకటి, రెండు రోజులలో టైపింగ్  చేసేయగలను - అనుకున్నాను, 
వీలైతే కదా -  
ఊపిరి సలపనీయని - ఏకబిగిని చదివించే సత్తా ఉన్న డ్రామా ఆయిరి ......
ఫలితం నా రచనాకాలం - కొన్ని వారాలకు మెట్లు ఎక్కీ ఎక్కీ - 
గిరి శృంగం చేరగలిగింది ...... హమ్మయ్య ........ 
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
అనేక పాత్రలు – అద్భుత కథా సంవిధానం, శూద్రకుడు మహా రచయిత –
పట్ల నాకు భక్తి భావం పెరిగింది.
మహాభారతం లాగా అనేకానేక పాత్రలు ……. 
ఏ పాత్రను విడిచిపెట్టినా – సంపూర్ణత లోపిస్తుంది. 
కనుకనే చిటికెలో అవుతుంది - అనుకున్న ఈ రాత కార్యం కాస్తా .....

బాలకృష్ణుడు చిటికెన వేలి మీద మోసిన గోవర్ధన గిరి అంత అయింది.

శూద్రక మాహాశయా, నమో నమః. 
మహా భారత, మృచ్ఛకటికమ్ - వంటి అద్భుత సంఘటనా సముచ్చయాన్ని
మనకు అందించిన ఘంటములకు శతకోటి కృతజ్ఞతా పుష్ప హారములు. 
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
కథనం కోసం నేను ఎన్నుకున్న కోవలు కొన్ని – 
1. ఆర్యకునితో కథను ఆరంభించాను.
2. రాబోయే అంకంలోని పాత్రలను – 
ముందు CANTO లోనే సూచనప్రాయంగా పరిచయం చేయడం.
3. పాత్రల పేర్లు – మార్పులు ;
&
1. ఆర్యకునితో కథ ఆరంభం ;- 
శూద్రకుని ఘంటం – చారుదత్తుని – కథానాయకునిగా నిలిపింది.
నేను ఆర్యకునితో ప్రారంభం చేసాను కదా, 
ఇక రచనా శైలి – నా అదుపులో లేదు ......... 
కథా ప్రాధాన్యాలే నా 'సిరా చిత్రణల – “బండి” ని లాక్కుని వెళ్ళాయి.
3. పాత్రల పేర్లు – మార్పులు ; 
2. రాబోయే అంకంలోని పాత్రలను – ముందు CANTO లోనే 
సూచనప్రాయంగా పరిచయం చేయడం. 
ఈ రెండూ ఒకదానికొకటి అనుసంధానం ఐనాయి.
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ 
అంతటి మహా రచయిత శూద్రకుని పాత్రలు కొన్నిటి పేర్లను మార్చడం ఏమిటి? – 
నాకు నేనే విస్మయ సంభ్రమచకితనౌతూ, కొన్ని మార్చాను కూడా.

దీనితో కొత్త పుంతలు తొక్కుతూ – ఆ ప్రాచీన నాటక భాగస్వామినిని ఐనాను.
;
1] రోహసేనుడు - వసంత సేన – ఈ రెండు పేర్లు – పరిశోధనలకు పుష్కల పుష్కరిణులు.
శూద్రకుడు - రచయిత పేరు – చారిత్రక కోణ ఆవిష్కరణకు ఆలంబనం ఔతున్నది.
అ] శూద్రకుడు హరిజనుడు ఐ ఉండాలి, 
నా ఈ అభిప్రాయం నిజం ఐతే - హరిజనుల ప్రపంచానికి గర్వ కారణం శూద్రకుడు.
ఆ] సేనాధిపతి పదవిని చేపట్టి ఉండాలి శూద్రకుడు. 
కనుకనే నామకరణాలలో ఆ మమకార ఛాయలు మెరిసాయి.                                                                            మన పురాణాలలో 'దేవసేన' అనే పేరు మాత్రమే స్త్రీ నామధేయం ఉన్నది.  
శూద్రకుడు – కథానాయికకు - 
స్త్రీ లింగం ఐనప్పటికీ పుంలింగ సూచకమైన - సేన - ను జత పరిచి - 
వసంతసేన – పేరు ఇచ్చి, మరీ కథానాయికను చేసాడు శూద్రకుడు.
&
కథానాయకుడు చారుదత్తుడు – వర్తకం చేసి, విఫలుడైన వ్యాపారి  - 
ఇతని కుమారుని పేరు రోహసేనుడు ; 
రోహసేనుడు – క్షత్రియులు పెట్టుకునే పేర్లు – యుద్ధ, వీర సంకేతాలు ఐ ఉంటాయి.
వైశ్య కులం – లేదా – వాణిజ్యంలో దివాలా ఐన 
దాన ధర్మ ప్రవృత్తి కల బ్రాహ్మణ వ్యక్తి చారుదత్తుని ఇంట్లో 
‘సేన’ – అనే పిలుపు సమంజసంగా నాకు అనిపించ లేదు. 

అందుకని -, రోహసేనుడు name ని – రోహణ – అని మార్చాను 
[శూద్రక మహాశయులకు క్షమార్పణలతో].
వసంత సేన – నామధేయాన్ని మాత్రం - మార్చలేకపోయాను, ఏమార్చలేకపోయాను – 
ఏ మార్పును చేయక అట్లాగే ఉంచాను – అంత అందమైన పేరు కదా మరి – 

వసంత సేన నాకు కూడా ఎంతో ఇష్టమైన పేరు కదా.
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣     
Change of NAMES ;- రదనిక, మదనిక – కొన్ని Episodes దాకా ఇవే కొనసాగాయి.
ధ్వని ఒకేలాగా ఉన్నవి, చదువరులకు [ అదృష్టం బాగుండి – నా ఈ రచన 
చలన చిత్రం ఐతే] – ప్రేక్షకులకు కొంత కన్ ఫ్యూజన్ కలిగిస్తున్నవి.
అయోమయాన్ని కలిగంచే ఆస్కారం ఉన్న నామ ద్వయం అనిపించి, 
మదనిక పేరును సులువుగా మార్చాను.
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣     
కొన్ని సంఘాలలో కుమార్తె పెళ్ళి చేసిన తర్వాత -
అత్తవారింటి సంప్రదాయానుసారం - పెళ్ళికూతురి పేరును మారుస్తారు.
వెరసి - అట్లాగే - ఇందు గల 
మదనిక కాస్తా = కుశావతి గా నూతన నామధేయ ఆవిష్కరణను పొందింది. ;-

కుశావతి [new name - of మదనిక ]. 
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
Internet లో అన్వేషణ – క్రమంగా మృచ్ఛకటికం – గురించి కొన్ని రచనలు దొరికాయి. 
సాహితీ ప్రియులలో -  మృచ్ఛకటికం అభిమానించే వ్యక్తులు ఉన్నారని అర్ధమై – 
నాకు ఎంతో సంతోషం కలిగింది.  
వీలును  బట్టి ఆయా వ్యాసాదులలోని అంశాలను follow అవాలని  TRY చేసాను.
కథా ప్రాంతం ఏది? – ఒక్కొక్కరి సమీక్షలో ఒక్కక్క రకంగా ఉన్నది. 
ఉజ్జయిని, పాటలీపుత్రం, కుశావతి – ఇత్యాది .
విభిన్న ఊళ్ళ పేర్లు విన సొంపుగా ఉన్నవి, 
ఇంకేం ..........  
వేరే పేర్లను వెతికే అవసరం లేకుండా – 

ఆ ప్రాంతాల పేర్లే పాత్రల పేర్లు ఐనవి. “అమరావతి” అనే పేరు – 
నాకు ఇష్టం – కుదర్లేదు మరి. :) :) :) 
[మళ్ళీ రాసే ఓపిక వస్తే - ఏదో ఒక పాత్రను - అమరావతి - చేస్తాను. :) :) ]
;
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ 

ఆర్యకుడు – తెర ఎత్తగానే కనిపించాడు ;  అంతటితో అతని పాత్ర చాలు, 
క్లైమాక్స్ లోనే ప్రత్యక్షం ఔతాడు –
అనుకున్నాను. ఊహు ఊహూ .. నా శక్తికి  మించిన పని ఐనది – అనడం కంటే ……..
అసలు నా అదుపులో లేకుండా నడిచిన పాత్ర – అనేది సత్యం.
ప్రతి పాత్ర అతని వైపు నడిచింది.  
ఈ క్రమంలో నాకు మూల రచనలోని అనేక అంశాల పట్ల గమనిక కలిగింది.
శూద్రకుడు మేధావి ఐన రచయిత – అనే అవగాహన – కలుగుతూ, 
శూద్రకుని పట్ల నాకు భక్తి పెరిగింది.
నా బ్లాగులో పేజీలకు పేజీలు - నాటక రంగవల్లికా రధం - గమనం ఆపలేక ...... 
ఓహ్, పరిమిత అంకములలో అంత గంగా జలాన్నీ పుడిసి పట్టి - 
కమండలంలో పట్టి మనకు అందించిన 
శూద్రకుని రచనా నిగ్రహ శక్తి అమోఘం అమోఘం. 


♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ 

ఆర్యకుడు హీరోగా అనుకోకుండా స్థిర పడటంతో చారుదత్తునికి ద్వితీయ స్థానం అయింది.
భాగ్యవశాత్తూ వసంతసేన – ప్రాముఖ్యత కథలో తగ్గకుండా – అదే రీతిలో నిలచింది.
క్లైమాక్స్ లో ఇది – నా కలానికి [ = కీ బోర్డ్ –టైపింగ్ -కి ] అనుభవానికి వచ్చింది.
చారుదత్తుని భార్య, వసంతసేనలు పతాక సన్నివేశాలలో పై సోపానాలలో నిలిచారు.
ఇంతింతై వటుడంత ఐ ….. అన్నట్లుగా – మహిళల ప్రాధాన్యతలు పెరిగాయి-
నాకు గాభరా …… సన్నివేశంలో - చారుదత్తునికి డైలాగులు వచ్చేలా చేయడానికి – 

నేను ఎక్కువ శ్రమ పడ్డాను – అంటే అతిశయోక్తి కాదు. 
♣♣♣♣♣♣ 
అతను  మహారచయిత ;- సారస్వత విమర్శకులు – 
నాటక నామ సామంజస్య ప్రస్తావనలు చేసారు.
శూద్రకుడు – బాలుని బొమ్మ బండి కథకు కీలకం – 
కాబట్టి “మృచ్ఛకటికం” = మట్టి బండి –
అని నాటకానికి పెట్టేసాడు – అని లోకాభిప్రాయం.
కానీ – ఆమూలాగ్రం డ్రామాను అనేక బళ్ళు నడిపించాయి.
శకారుని బండి రోడ్డు పైన రద్దీలో చిక్కుకుపోయింది, 
అక్కడ మనుషుల వివాదాలు,  scenes .......... 
చారుదత్తుని నిద్వంద్వంగా హంతకుడు – అని నిరూపించడానికి హేతువులు ఐనవి.
గూడు బండి అవడం వలన – వసంతసేనకు మారుగా ఆర్యకుడు  ఎక్కాడు. 
అట్లా ఎక్కిన పొరపాటు వలన – ఆర్యకుడు భద్రంగా దాక్కో గలిగాడు. 
అడుగడుగునా వాహనాలను నాటకానికి కేంద్ర బిందువులుగా మలిచిన శూద్రకుని , 
కథా కల్పనా చాతుర్యానికి శతకోటి వందనాలు నావి, 
బహుశా చదువరులు అందరివిన్నీ.  
♣♣♣ ♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
;
*  [ paricaya+kUDali = phEs buk -> pari kUDali -> parili ] 
♣♣♣ ♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
వసంతసేన వసంత సేన కోణమానిని, Drama, నాటకం తెలుగు, Telugu Essay, అవీ ఇవీ, 

2, జనవరి 2018, మంగళవారం

జయ జయ జయహో

[ బౌద్ధారామము ]  ;-
వసంతసేన ;- లేఖకులు పరుగెత్తుతూ వస్తున్నారు.
లేఖక్ 1 ;- అమ్మా వసంతసేనా! వైద్య సేవిక వలన కాకతాళీయంగా మాకు తెలిసింది, 
మీరు ఇక్కడ ఉన్నారని. స్వామీ, మీరే ఆపద్బాంధవులు.
 లేఖక్  2;- చారుదత్తులను శివారు బండ వద్దకు భటులు తీసుకెళ్తున్నారు. 
దారిలో అన్నీ చెబుతాము, వేగిరం రండి.
లేఖక్  1 ;- మీ జననికి, మైత్రేయులకు కబురు పంపాము. 
ధూతా దేవి అగ్నిప్రవేశం ప్రయత్నం నుండి విరమింప జేయడానికి.
వసంత ;- శివారు బండ ఏమిటి, ఎవరికి నిర్దాక్షిణ్య శిక్షను అమలు చేస్తున్నారు?
లేఖక్  2 ; - ఆర్య చారుదత్తులకు .......... 
బౌద్ధ ;-  దారిలో బండి దొరికితే మీరు ఎక్కవచ్చును.
వసంత ;- అయ్యయ్యో - బండి వద్దులెండి, త్వరగా .................
బౌద్ధ ;- కొండ దిగువన వెలుగు .... 
వసంత ;- బాల రోహణుని కంఠ ధ్వని అది, ఏడుస్తు న్నాడు. .... 
అడుగో  - నాయనా, రోహణా!
ధూతా ;- వసంతసేన .... కల కాదు కదా
వసంత సేన యొక్క తల్లి ;- నా బంగారు తల్లి, నా భాగ్య రాశీ, 
నువు జీవించి ఉన్నావా, ముందు మీరు ఆ కొండ కొమ్ముకు సత్వరం చేరండి. 
ధూతాంబా, ఈ అగ్గి మీద వాన కురవనీ ; 
ఎందరు చెప్పినా మిమ్మల్ని ప్రాయోప వేశం నుండి విరమింప జేయ లేక పోయారు. 
ఆ భగవంతుడే మిమ్మల్ని, 
మీ  ..... కుమారుని కాపాడాడు. మైత్రేయా ........ ఏడీ? 
[ నవ్వి] పరుగు పోటీలో ప్రధమస్థుడు. 
''''''''''''''''''''';
వసంత ;- ఆగండి, ఆ కత్తుల్ని దించండి. నేనే వసంత సేనను.
శకార్ ;- వసంత సేన పిశాచి - దయ్యం - హమ్మయ్యో.
వసంత సేన ;- నోరు ముయ్యి. నీచుడు ఇతను. 
ఈ శకారుడే నా గొంతు నులిమి, చంపబోయాడు.  
బౌద్ధ సంవాకుడు నన్ను రక్షించాడు. [ప్రజలు శకారుని కొట్టసాగారు] ;
చారుదత్తు ;- నాకు సుదినం. వసంత సేన ఆగమనం 
నన్ను జీవితాన్ని ప్రసాదించింది.
ధూతాంబ ;- వసంత సేన రాక, నాకు దేవుని అనుగ్రహం. 

నా పూజాఫలం - నాకు ఆమె వరమొసగిన నిండు బ్రతుకు. 
లేఖకుడు ;- అదిగో కొత్త జెండా;
వసంత సేన ;- నవ్య పతాకం రెపరెపలాడుతున్నది.
తల్లి ;- చారుదత్తులు భార్యా పిల్లలను కలిసారు. 
వసంత సేనా, ఇక మన గూటికి మన వెళ్దామా!?
ధూత ;- వసంత సేనా, నాకు మాంగల్యభాగ్యం - ప్రసాదించిన దేవత నీవు. నాదొక విన్నపం. 
నాకు సోదరివి ఔతావా!?
వసంత సేన ;- అంటే? ...
ధూత ;- నా భర్తను వివాహం చేసుకొనమని నాఅభ్యర్ధన.
తల్లి ;- మహద్ భాగ్యం ఇస్తుంటే కాదనే వెఱ్ఱివాళ్ళు లోకంలో ఉండరు. 
నా కుమార్తెకు కులకాంత గౌరవ స్థానం - ఆనంద భాష్పాలు నిండుతున్నవి 
నా కళ్ళల్లోనూ, నా గుండెల్లోనూ ..... ;
ధూతాంబ ;- రోహణా, ఇక నుండి ఈమె నీకు పిన్ని కాదు, 
అమ్మ - అమ్మా అని పిలువు.
రోహణ్ ;-  కొత్త అమ్మా! [ అందరూ నవ్వారు]
ఆర్యక్ ;- చారుదత్తా, సత్యమేవ జయతే.
చారు ;- దైవం అందరినీ కాపాడింది.ధర్మం జయం.
 మైత్రేయ ;- సాహసివి ఆర్యకా, నీ పరివారం అగణితంగా కనిపిస్తున్నారు.
ఆర్య ;- ధర్మ పరిరక్షణకై అవిశ్రాంతంగా పరిశ్రమించిన ఎల్లరికీ సుస్వాగతం. 
చారుదత్తా, విపత్తుకు వెరవక నన్ను - ఆనాడు కాపాడారు. 
మీరు నాకు ముఖ్య సలహాదారులు.
చారు ;- వీరందరిని - వారి వారి వర్గాలకు - అధిపతులుగా 
నియమించుట సమంజసం కదా.
ఆర్యక్ ;- అవశ్యం, మీ యోచనను అమలు చేస్తున్నాము.
రదనిక ;- ఇదిగో మంగళసూత్రం.  
ప్రజలందరి ఆశీస్సుల తొలకరి జల్లులు కురిపించండి.
బౌద్ధ పరివ్రాజక ;- నేదు నవ శకానికి నాంది. 
నవీన పరిణామాలకు సుముహూర్తం. 
రోహణుడు ;- జయహో జయ జయ జయహో .......... .
;

*************** ; 
అధ్యాయ శాఖ ;- 31 ;- జయ జయ జయహో ; 2, జనవరి 2018, మంగళవారం ;
previos posts ;- అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;;
అధ్యాయ శాఖ ;- 30 B ;-  చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు  ;   

                           2, జనవరి 2018, మంగళవారం ;

తాటాకుల కవిలె కట్ట సేకరణ

లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!? 
లేఖక్ 2 ;- ఎవరో చారుదత్తుడట - అతని బండి వద్ద చందనకునితో వీరకుని లడాయి, 
ఉగ్రంగా - మన న్యాయ శాలకు వెళ్తున్నాడు .... 
లేఖక్ 1 ;- ముందు  మన వస్తువుల సేకరణ, ముందు పని అది, 
'తాటాకుల - కవిలె కట్ట సిద్ధం చేసారా? - 
అని పై అధికారులు మనల్ని రొక్కిస్తారు. పద, ఆ బుద్ధ విహారంలో పరివ్రాజకుడు, 
అడగగానే కరుణతో ఆప్యాయంగా ఇస్తున్నారు. పద,తెచ్చుకుందాం ; 
లేఖక్ 2 ;- వైద్య సేవిక [= నర్సు] రోజూ విహారానికి వెళ్తున్నది, ఎవరికైనా సుస్తీ చేసి ఉంటుంది, 
లేఖక్ 1 ;- మాటలలో పడి మనం వచ్చిన పని మరుస్తాము, నడు.
లేఖక్ 2 ;- స్వామీ, శ్రమణక స్వామీ!
[ బౌద్ధ సంవాహకుడు బైటికి వచ్చాడు]
లేఖకుడు ;- స్వామీ, నేను లేఖకుడిని, కొంచెం సుద్ద రాయి ఇస్తారా!? 
బౌద్ధ సంవాహక ;- ఇదిగో నాయనా, సుద్ద బలపం, తీసుకో, 
ఆ రావి చెట్టు వెనుక తాటాకులు ఉన్నవి, 
జాగ్రత్తగా కట్టి తీసుకుని వెళ్ళు.
వసంత సేన ;- వెళ్ళిన ఆ ఇరువురు - వాళ్ళెవరు?? 
బౌద్ధ సంవాహక ;-  అధికరణ మండపంలో లేఖకులు. 
న్యాయస్థానంలో నేరముల గురించి శోధిస్తారు. 
న్యాయ పరిశోధకుల చర్చోపచర్చలు, వాదోప వాదములు, 
ముఖ్యాంశాలను వీరిద్దరు లిఖిస్తారు. 
ముందుగా నేల మీద బలపం రాయితో వ్రాస్తారు. 
వేగంగా రాసే ఆ చిత్తు రాతల నుండి, 
ప్రధానాంశములను - రెండవ వ్యక్తి - తాళ పత్రములలో వ్రాస్తాడు. 
ఈ లేఖనములను పునఃశ్చరణ - చేసి, న్యాయాధికార గణం తీర్పును వెలువరిస్తారు. 
వైద్య సేవిక - ఔషధాదులను మీకు సవ్యంగా ఇస్తున్నది కదా.
వసంతసేన ;- ఆమె శ్రద్ధగా వైద్యం చేస్తున్నారు. నా గాయాలు- త్వరగా తగ్గుతున్నవి. 
శరణాగతులకు ఇంత గొప్ప ఆశ్రయం దొరుకుతున్నది. ఇది ఊహించని నా అదృష్టం.
 ;
[ తాటాకుల కవిలె కట్ట సేకరణ ]
*************************************************** ;
అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;;
అధ్యాయ శాఖ ;- 30 B ;-  చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు  ;   
                                                 2, జనవరి 2018, మంగళవారం ;

previos posts ;- అధ్యాయ శాఖ ;- 29 - ఆమెకు బుద్ధ పరిరక్షణ ;

చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు

లేఖక్ 1 ;- న్యాయశాలకు అందరూ వచ్చారు. ధర్మాధిపతి, ధర్మాసనంలో ఉపవిష్ఠులైనారు. 
న్యాయ హెచ్చరికల ఉద్యోగులు - ఆరుగురు వచ్చారు.
లేకక్ - 2 ;- శ్రేష్ఠి, కాయస్థులు, విషయ లేఖకులం మనము, 
నేర అభియోగదారులు, ఇంతమందితో - మన అధికరణ మండపము నిత్య కోలాహలము.
శోధనకుడు ;- శోధనకుడు ఎలుగెత్తి చెబుతున్నాడు - నిశ్శబ్దం, నిశ్శబ్దం ;
న్యాయాధిపతి ;- ఈ రోజు ఏ కక్షిదారుల అంశములు - పరిశీలన చేయవలెను!?
శోధనకుడు ;- వారం దినముల నుండి నడుస్తున్నది వీరక, చందనకుల తగాదా. 
అంతే గాక, రాజ బంధు శకారుల వ్యాజ్యం అనివార్యం. 
శ్రేష్ఠి ;-  కాయస్థుల వారూ! శకారుడు - అడుగు పెట్టాడంటే - ఎవరికో మూడిందన్న మాట.
కాయస్థులు ;- ఎందరో మంచివాళ్ళను, నిర్దోషులను శిక్షల పాలు చేసాడు, ఈ శకారుడు. 
శోధనకుడు ;- శోధనక్ ఉవాచ, నిశ్శబ్దం, నిశ్శబ్దం. 
అమ్మా, వసంతసేన తల్లిగారూ, మీకు పిలుపు వచ్చేదాకా - ఇటు పక్కన కూర్చోండి.
న్యాయాధిపతి  ;- అధికరణ మండపంలో కొత్త వ్యక్తి, తమరెవరు?
చారు ;- చారుదత్తుడు మమ నామధేయం.
న్యాయాధిపతి ;- [లేచి నిలబడి] తమకు నమస్సులు. 
దానధర్మములకు మారు పేరు - నేడు మీ ప్రత్యక్ష దర్శన భాగ్యం లభించింది, ధన్యుడినై తిని.
[ గదిలో అందరూ నిలబడి - నమస్కరించారు ]
శకార ;- ఇతనికి బహు మర్యాదలు చేస్తున్నారే - ఇతగాడే నేరస్థుడు, 
ఈతనికి అనుకూలంగా తీర్పును ముందే నిశ్చయించుకున్నారు కదూ.
కాయస్థు ;- పొరబాటు, న్యాయ పరిశీలకులం - ఐదుగురం - 
నిశితం మా దృష్టి - నిష్పక్షపాతం మా తీర్పు.
శకార ;- కళ్ళకు కట్టినట్లు - కనబడుతూనే ఉన్నది [ హుంకరించి, కూర్చున్నాడు]
చారు ;- కొత్త వ్యాపారం కోసం - పనుల మీద - పాటలీపుత్రం వెళ్ళాను. వారం తర్వాత వచ్చాను.
నా ఇంటికి వచ్చాను. నా భార్య ధూత, నా కుమారుడు రోహణుడు - 
ప్రహరీ ద్వారం వద్దకు వచ్చి. సంతోషంగా నన్ను పలకరిస్తున్నారు. 
ఇంతలో అదాటున రాజ భటులు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చారు. 
ఏ వివరములు చెప్పకుండానే తెచ్చారు నన్ను ;
న్యాయ ;- క్షంతవ్యులం, మేము నిమిత్తమాత్రులం. 
శకారుల అభియోగం మీరు వసంతసేన అనే వేశ్యను - హత్య చేసారని.
చారు ;- క్రిష్ణ క్రిష్ణా! అంత అభాండం నా మీదనా!?
శకారుడు ;- ముమ్మాటికీ నిజం. సాక్షులను తెచ్చుకున్నాను. 
ఈ వీరకుడు, చందనకులు - నీ శకటంలో శివార్ల తోటకు వచ్చింది - వీరు చూసారు.
చందనకు ;- ఔను, లోపలికి తొంగి చూడ లేదు, గానీ - ఆర్యకుని కోసం గాలిస్తున్నాము - వీరి బండి - 
సారధి - లోపల వసంతసేన ఉన్నారని చెప్పాడు.
వీరక్ ;- ఈ చందనకుడు చారుదత్తుని పేరు వినగానే వదిలేసాడు, దక్షిణాది మ్లేచ్ఛుడు ....
చందనక్ ;- చూస్తునారు కదా అందరూ, వదరుబోతు తనం ఇక్కడ ఎవరిదో ....
చారుదత్ ;- ఆ రోజు ఆమెను తీసుకురావడానికి - నా బండిని పంపాను. 
కానీ ఆమె రాలేదు, వేరొకరు ఉన్నారు.
న్యాయ ;- ఆమె ఎవరు?
చారుదత్ ;- ఆమె కాదు, అతను - [తటపటాయిస్తూ] ఆర్యకుడు ....
శకార్ ;- ఐతే ఇద్దరిని, వసంత - ఆర్యకునికి కల్పించావన్న మాట 'శకట భద్రత'. 
ఐతే ఇతగాడు రాజద్రోహి కూడా - తక్షణమే శిక్షించండి, 
చారుదత్ ;- శివ శివా, 
భటులు ;- నగల మూటతో పట్టుకున్నాము, ఇతని పేరు మైత్రేయుడు.
మైత్రేయుడు ;- చారుదత్త స్వామీ - మీరు ఇక్కడ ఉన్నారెందుకు? 
వసంతమ్మ ఆభరణాలను ఆమెకు తిరిగి ఇవ్వమని మీరు ఇచ్చినవి. 
వసంత సేన గృహమునకు - నగలను ఇవ్వడానికి - 
నేను వెళుతుండగా - మార్గ మధ్యంలో భటులు అటకాయించారు, 
నిష్కారణంగా పట్టుకున్నారు.
న్యాయ ;- శకారా, వసంతసేన తల్లిని పిలిపించాము.
ఆమె వచ్చింది. అమ్మా, ఈ నగలు మీ కుమార్తెవేనా?
తల్లి ;- వీరకుడు తోటలో కుమార్తె దేహాన్ని చూపించాడు. దుఃఖంలో మునిగిపోయాను. 
ఆ ... ఇవి నా వసంత సేనవే. 
న్యాయ ;- ఐతే శకారుని ప్రకారం, నీ తనూజ హత్య - 
చారు దత్తుడు చేసాడని మీరు అనుకుంటున్నారా?
తల్లి ;- మునుపు నా వసంత ఇతని వద్ద తన నగలను దాచింది. 
ఈ శకారునికి భయపడిన కారణాన ఆమె పారిపోతూ - 
చారుదత్తుని ఇంట్లో ఆభరణాలను దాచింది. 
కానీ వారి ఇంట దొంగ పడి, వసంత ఆభరణాలను దొంగిలించాడు. 
ఐతే ఆ చోరుడు,  అనుకోకుండా  దోచిన సొత్తును - తిరిగి మా వద్దకు తెచ్చాడు. 
న్యాయ ;- ఐతే నగలు పోగొట్టిన చారుదత్తులు చర్య?
తల్లి ;- అవకతవక పనుల మైత్రేయుడు ఇతనే, ఆ రోజు మా ఇంటికి వచ్చాడు - 
చారుదత్తుల భార్య ధూతమ్మ. ఆమె తన ఒంటి మీద నగలను వలిచి ఇచ్చారట. 
భార్యా భర్తలు ఇద్దరూ నిజాయితీపరులు. 
ఇంటి మర్యాద కాపాడుకోవడం కోసం సర్వం ఇచ్చే త్యాగధనులు. 
చాలా ఎక్కువ విలువనే మింజు - మింజుధనం గా మాకు అప్పజెప్పిన 
త్యాగమూర్తులు ఇద్దరున్నూ.  [= మింజు శుల్కం ]  ;   
శకార ;- దేశంలోని వజ్ర వైఢూర్యాలన్నీ మీ ఇళ్ళలోనే ఉంటాయి. 
ఈ సారి - వేశ్యా వర్గాలకు కొత్త పన్నులను విధిస్తాం. 
మా బావకు మంచి రాబడి, నవ్య సుంకం.
న్యాయ ;- శకటంలో వసంతసేన ప్రయాణం, ఈ నగలు, తోటలో స్త్రీ దేహం, 
అన్ని మీకు వ్యతిరేకంగా సాక్ష్యీభూతాలై నిలిచాయి - 
ఆర్యా, మమ్మల్ని క్షమిచు. ఇతనికి అంత్య శిక్షను విధించుట 
జరిగినది. భటులారా, ఎల్లుండి శిక్ష అమలు వరకూ, చెరసాలలో చారుదత్తుల వారిని ఉంచండి. 
తల్లి ;- చారుదత్త దేవా, మిమ్మల్ని ప్రధమంగా చూస్తున్నాను. 
ఇంత అద్భుత సౌందర్య, సౌజన్య మూర్తిని, ఉదారవర్తనుని 
నా వసంతసేన ప్రేమించి, ధన్యురాలైనది. 
చారు ;- నేను నిర్దోషిని అమ్మా.
తల్లి ;- మీరు క్రూర హంతకులంటే - అంగుళిమాలుడు సైతం నమ్మడు. 
సమయం ఇంకా ఉన్నది కదా, మిమ్మల్ని రక్షించే ప్రయత్నాలను విరమించము. 
మైత్రేయా, త్వరగా నడవండి, ముందు ధూతమ్మను సముదాయించి, కర్తవ్యం ఆలోచిద్దాం.
మైత్రేయ ;- ఆర్యకుని సహాయం అన్వేషిద్దామ్మా?
తల్లి ;- అదే ప్రయత్నం, నీ నోట్లో 'నువ్వుగింజ' నానదు కదా, మౌనం విభూషణం. 
;
*************************; ;
అధ్యాయ శాఖ ;- 30 ;-  చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు  ;
previos posts ;- అధ్యాయ శాఖ ;- 29 - ఆమెకు బుద్ధ పరిరక్షణ ;
30, డిసెంబర్ 2017, శనివారం ; ఆమెకు బుద్ధ పరిరక్షణ ;-
;

30, డిసెంబర్ 2017, శనివారం

ఆమెకు బుద్ధ పరిరక్షణ

[శకారుని బండి ఉద్యానవనానికి చేరింది.] ;
వసంతసేన ;- పుష్ప పరిమళాలు ... తోటకు చేరాము, అంబా, భగవతీ, 
ఆర్య చారుదత్తులు ఇప్పటికిప్పుడు ఈ పుష్ప కరండకంలోనే ఉండేటట్లు అనుగ్రహించు. 
శకార్ ;- హీనుడైన నీతో పిచ్చాపాటీ మాట్లాడీ మాట్లాడీ నాకు దప్పిక వేస్తున్నది. 
అడుగో, బౌద్ధ శ్రమణకుడు, ఒరేయ్, ఇటు రారా - 
నాకు దాహం వేస్తున్నది, అత్యవసరంగా జలం పట్టుకురా.
బౌద్ధ [సంవాహకుడు] ;- సరే. [ తామరాకులలో తెచ్చి, ఇచ్చాడు]
శకార్ ;- అకులోనా, ఈ శకారునికి బంగారు గిన్నెలో నీళ్ళు ఇవాలని తెలీదూ.
విరటు ;- అతను సన్యాసి, బీదరికాన్ని స్వచ్ఛందంగా స్వీకరించిన  పరివ్రాజకుడు. 
ఈ పర్యాయం నేను స్వర్ణ, రజత పాత్రలను తెచ్చి - అట్టి పెడతాను 
[ విరటు చేతితో సన్యాసికి సైగ చేసాడు -  సన్యాసి జారుకున్నాడు]
శకారుడు ;- రేయ్, స్థావరకుడా, నీకు ఒళ్ళు బలిసిందిరా. ఇంత ఆలస్యంగా వచ్చావు.
స్థావరక్ ;- మహాప్రభూ, బాటలన్నీ బహు రద్దీ, 
చాలదన్నట్లు బండి కాస్తా బురదలో కూరుకుపోయె, చాలదన్నట్లు - 
వీరకుడు ఆపాడు, చాలదన్నట్లు పాదచారులతోటీ, ప్రయాణీకులతోటీ పోట్లాటలు ....
 ' ఇది స్థావరకుని బండి - జాగ్రత్త - ' అన్నాను. 
మీ పేరు చెప్పగానే తలలు పాతాళానికి దించుకుని వైదొలిగారు అనుకోండి .....
విటుడు ;- స్థావర భట్రాజు - మాటలలో మేటి. ఎవరినైనా మాటలతో బోల్తా కొట్టిస్తాడు.
శకార్ ;- నా పేరు చెబితే హడల్. [మీసం మెలి దిప్పబోయి] 
అరె, నా మీసం ఏదీ, ఎక్కడ మర్చిపోయాను?
విరటుడు ;- అందం ద్విగుణీకృతం ఔంతుందని - 
రెండు రోజుల క్రితమే - తమరు మీసాలు, గడ్డాలు - గొరిగించుకున్నారు కదా.
శకార్ ;- ఔనుస్మీ. నిలబడి, నిలబడీ కాళ్ళు నెప్పి పుడ్తున్నాయి. 
విరటూ, బండిలో పరుపును దులిపి, సర్ది పెట్టు.
విర :- [లోనికి తొంగి చూసి] వసంతసేనా, గణిక బుద్ధి - నీవు - 
చారుదత్తునికి కట్టుబడి ఉన్నానని చెప్పిన మాటలన్నీ -
వట్టి నీటిమూటలు, ధనం కోసం ఈ శకారుని వద్దకు వస్తున్నావే ....
వసంతసేన ;- చారుదత్తుల కొరకు వచ్చాను. పొరపాటున ఇందులో ఇరుక్కున్నాను. రక్షించు.
విర ;-[ఇవతలికి తిరిగి చూస్తూ ] శకారా, ఈ వేళ చల్లగాలి మైమరపిస్తున్నది. 
కులాసాగా, నడుస్తూ వెళదాము.
శకారుడు ;- రాజ శ్యాలక శకారునికి చరణ ధూళి అంటడం అసంభవం. 
ఇంత పెద్ద తోటకు ఆసామిని, దర్జాగా బండి - బండి నెక్కి వెడతాను, అంతే. 
[శకారుడు ఎక్కబోయి] బావా, లోపల దయ్యం ఉన్నది.
విరటు ;- ఆ, ఆ, పిశాచి ఉన్నది, అందుకే నడక అన్నాను.శకారుడు 
శకారుడు ;- ఊహు, కమ్మని వాసన - పిశాచి - అంటే ఆడదెయ్యం - 
[మళ్ళీ  తొంగి చూసి] లోన వసంతసేన ... ఆహా  ఆహాహా ,
విర ;- వసంతసేన, చిత్తం - ఆమె చిత్తం మీ పైన - కనుకనే ఆమె ఈ రాక - మీకు కానుక 
[ మనసులో ] - ఇంక ఈమెను ఆ దేవుడే కాపాడాలి.
వసంతసేన ;- ఇంక దిగక తప్పదు. 'నీకు తగని ధైర్యం - ఎక్కువ ' అని -
మా అమ్మ మెచ్చుకుంటూ ఉంటుంది. 
దేవీ, ధైర్యలక్ష్మీ, నాకు ఇప్పుడు ధైర్యం, ఆత్మ స్థైర్యాలను ప్రసాదించు. [ దిగింది]
శకార్;- నీ అమూల్య రత్నాభరణాల ధగధగలు, కిణకిణలు - 
వసంత సేనా, ఆకాశం నుండి నా కోసం నువ్వే దిగివచ్చావా.
విర ;- ఔను, మిమ్మల్నే వెదుకుతూ వచ్చింది ఆమె. 
వసంతసేన ;- కాదు, ఆర్య చారుదత్తుల కోసమే వచ్చాను.
శకార్; ఏమిటి, ఏమి కూసావు, చాతురుదత్తుడే నీకు ఎక్కువా!? 
ధనవంతుడు, భాగ్యవంతుడు ఈ శకారుని కాదని, దరిద్ర చారుని కోరుతున్నావా!? 
వాడికి అభిసారికవై, సారె సారెకూ వెళ్తున్నావు --- 
విర ;- వేశ్యలకు మాట చాతుర్యం నిధులు అంటారు. 
ఇదేమిటి, ఈ వసంత సేన  ఆపదలను కొని తెచ్చుకుంటున్నది, 
విపత్తులను కోరి మీద వేసుకుంటున్నది,
ఈ 'చారుదత్తుల ప్రేమిక'కు రక్షణ ఎక్కడ ఉన్నట్లు!? ........ ,  

శకార్ ;- స్థావరా, ఈ నికృష్ట వసంత సేనను చంపు.  &&&&&&&&&&
స్థావరక ;- ముందు జన్మలో ఏదో పాపం చేసి, వెట్టి చాకిరీ వాడినైనాను. 
ఈమెను ఇక్కడికి తెచ్చాను, పాపం మూట కట్టుకున్నాను, 
చాలు దొరా, అబలను చంపడమా, నేను చెయ్యను.
శకార్ ;- విటూ - విరటూ, దీన్ని నీ ఉత్తరీయంతో గొంతుకు ఉచ్చు బిగించి, చంపు. 
విర ;- నన్ను పూర్తి పేరు పెట్టి, :) :) పిలుస్తున్నారు. 
ఐనా సరే, స్థావరకుని సమాధానమే నా సమాధానం.
స్థావరక్ ;- మీరు కూడా ఈ పాపం పని చేయకండి, నేను ఊరుకోను.
విర ;- ఈ పాపం చేస్తానంటే నేను మాత్రం ఊరుకే - ఎట్లాగ ఊరకుంటాను!?
శకార్ ;- [లోన] వీళ్ళిద్దరూ ఎదురుతిరిగారు - సరే మెరమెచ్చు మాటలను చెబ్తాను ; & 
అరె, మీ స్వామిభక్తి ఎంతున్నదో అని పరీక్షించాను. ఈమెను సరస సల్లాపాలతో బులిపించి, 
దారికి తెచ్చుకుంటాను.మీ ఎదుట వీలవదు కదా
విర ;- అదీ నిజమే, మేమిద్దరం - కొంతసేపు అవతలకు వెళ్ళి ఉంటాము, పద, స్థావరకా. ; 
శకార్ ;- వీళ్ళిద్దరు నాపై అనుమానంతో ఇటు పక్కనే దాక్కున్నారు. 
కానీ చూద్దాం. ఓహో సేనా, నీవు - నువ్వు - ఈ వసంత ఋతువుకే గొప్ప శోభవు - 
విరట్ ;- ఇతని మనసు మారింది, ఆమెకు హాని చేయడు,  
పద, స్థావరకా, చెరువు గట్టున కూర్చుందాం. 
స్థావ ;- ఆ చెరువులో తన బట్టలు ఉతుక్కుంటున్నాడు,
 ఆ సన్యాసితో ముచ్చట్లు చెప్పుకుందాం. పదండి విరటూ. [ వెళ్ళారు] 
శకార్ ;- వసంత సేనా, నన్ను ప్రేమిస్తావా లేదా ;
 [ ఆమె తిరస్కార సూచకంగా - పెదవి విరిచి, తల అడ్డంగా ఊపి, 
తోట నలు దిక్కులా - చారుదత్తునికై చూడసాగింది ] 
వసంత సేన ;- చారుదత్తా, ఎక్కడ ఉన్నారు? ; 
శకార్ ;- ఐతే నువ్వు చారుదత్తుని అభిసారికవై వచ్చావు, 
వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడన్న మాట.
వసంతసేన ;- కలకాలం సుగుణవంతులు 
చారుదత్తుల వనితగా కట్టుబడి ఉంటాను. 
[ శకారుడు వేగంగా దూకి, ఆమె పీక పట్టుకున్నాడు - విలవిలలాడుతూ పడిపోయింది &
ఇంతలో విరట, స్థావరకులు వస్తున్నారు.]
స్థావర ;- విరాటయ్యా, ఆ సన్యాసికి కాషాయ వస్త్రాలను ఉతుక్కోవడం - మనమే నేర్పాలి .....   
విర ;- స్థావరకా, కొత్తగా సన్యాసం స్వీకరించినట్లున్నాడు, 
అతని కావి గుడ్డలు కొత్తవి, అంత మురికి పట్ట లేదు, తెలుసుకో - 
అక్కడ మాధురుడు - మనకు కొత్త మిత్రుడు అయ్యాడు. 
ఆర్యకుని గురించి - మనకు కొత్త సంగతులు అనేకం తెలిసినవి. 
స్థావరక ;- వసంతమ్మ - పడి ఉన్నదేమిటి? శకారయ్యా, చంపేసావా?
విర ;- ఐతే అన్నంత పని చేసేసావా!?
విరటుడు ;- అయ్యో, అయ్యో అయ్యో - సుగుణవతివి, దయామతివి, 
నీవు లేక ఇంక మా నగర శోభ మసకబారింది. 
వచ్చే జన్మలో కుల వధువు జన్మను భగవంతుడు ప్రసాదించాలని ఇదే నా ప్రార్ధన. 
శకార్ ;- వసంత సేనను నువూ చంపావని ఒప్పుకో, నీకు వెయ్యి దీనారాలు ఇస్తాను.
స్థావరక ;- ఈ పాపం ఫలితం నాకు అంటగడుతున్నారు, గడుసువారే దొరగారు.
శకార్ ;- విరటూ, నీకైతే - ఇన్నూరు మణుగుల స్వర్ణం కార్షపణాలు --- 
నా - ఈ నందన వనం కూడా ఇస్తాను. 
విరటుడు ;- తోటనే కాదు, సామ్రాజ్యం ఇచ్చినా - తిరస్కారమే నా సమాధానం. 
స్థావరకుడు నా కన్నా మేలు, నిర్భయంగా ఎదిరించాడు.
విరటుడు ;- అబలా హత్య - నికృష్ట అపరాధం - 
ఛీ. శకారుని వంటి దుర్మార్గులకు అధికారం అయాచితంగా లభిస్తున్నది, 
ధర్మదేవతపైన కాళ్ళూనుతున్నారు. 
ఇది విధి విలాసమా, దేవుని నిర్లిపత కారణమా!? 
శకార్ ;- విటూ, నువ్వు, నేను మిట్టమధ్యాహ్నం నుండి ఇక్కడే ఉన్నాం. 
చాలామంది చూసారు. 
నువ్వే ఈమెను పై లోకాలకి పంపావని అభియోగం వేస్తాను.
విరటుడు ;- ఎట్లాగూ చేయని నేరం మీద పడుతున్నది కదా, 
నిన్నే చంపి - భటులకు లొంగి పోతాను 
శకార్ ;- వద్దు వద్దులే ;
విరటు ;- వీని ఆశ్రయంలో ఉంటే - ఖాండవ వనంలో ఉన్నట్లే. 
శర్విలకుడు, చందనకులు ఆర్యకుని దళంలో చేరారు. 
నేను కూడా వారి అనుయాయిని ఔతాను.ఒరేయ్ స్థావరకా, 
ఇది నీ ఎడ్ల కొరడా, ఇక్కడ పెట్టి ఉంచి, 
నువ్వే ఈ హత్య చేసావని నిరూపిస్తాను.
శకార్ ;- విరటుడు వెళ్ళి పోయాడు. స్థావరకా, 
కొంతమంది గుంపుగా వచ్చి, దీన్ని చంపారని - అధికరణ మండపంలో నేను చెబుతాను.
నువ్వు నాకు వత్తాసుగా పలుకు, సరేనని చెప్పాల్సిన సాక్షి నీవే. 
స్థావరక ;- అంగీకరించకపోతే - వీడు నన్ను ఈ నేరంలో ఇరికిస్తాడు. 
ఇప్పటికి ఒప్పుకోక తప్పదు. ----- అట్లాగే దొరా.
శకారుడు ;- సరే, ఇదిగో, నా బంగారు మురుగులు, నీకు బహుమతి. 
నా ఇంటికి వెళ్ళి అక్కడే ఉండు. -------
స్థావరకుడు, విటుడు వెళ్ళి పోయారు. స్థావరకుని నా మిద్దె పైన మూల గదిలో బంధిస్తాను. 
వసంత సేన శవాన్ని మాయం చేస్తాను. నా ఉత్తరీయాన్ని కప్పుతాను ..... 
ఊహు, కూడదు, దీన్నిబట్టి నేరగాడు ఈ శకారుడే అని గుర్తులు ఇచ్చినవాణ్ణి ఔతాను. 
ఎప్పుడూ శుభ్రం చేయని తోట ఇది, ఎండు ఆకులు దండిగా ఉన్నవి. 
ఈ శీర్ణ పత్రాలతో కప్పుతాను. 
బౌద్ధ ;- బుద్ధం శరణం, బోధిసత్వునికి శరణం శరణం  .........
శకారుడు ;- శ్రమణకుడు వస్తున్నాడు, వీణ్ణి నా చేతికి దొరికినప్పుడల్లా కొట్టాను, 
హింసించి, ఆనందించాను. ఇప్పుడు నన్ను పసికడితే - 
నన్ను ఖైదు చేయించి తీరుతాడు, కనుక మెల్ల మెల్లగా తప్పుకుంటాను. 
ప్రస్తుతానికి - నాకు అదే క్షేమం.మెల్ల మెల్లగా తప్పుకుంటాను. 
[ శకారుడు దొంగ చూపులు చూసుకుంటూ వెళ్ళి పోయాడు ]
&
బౌద్ధ సంవాహకుడు ;- ఈ పూలు కోసి, బుద్ధదేవుని- పూజ కోసం బయలుదేరుతాను. ..... 
పూలబుట్ట నిండింది. ఇంక నా పంచె, ఉత్తరీయాలను ఆరబెట్టి, నగరిలోకి వెళతాను.
ఎంత పిండినా తడి  వస్త్రాలు, నీళ్ళు కారుతున్నవి.
కోతులు - వలువలు, చెట్ల కాయలు ......
వానరమూక అన్నింటినీ చిందరవందర చేస్తున్నవి.

వలువలను నేలపైన ఈ ఎండుటాకుల పైన ఆరేస్తాను.
ఆరామంలో అర్చనలు చేసిన పిదప, బిక్షాటన నిత్య విధి.
జీవునికి తిండి తిప్పలను తప్పనిసరి అవసరంగా - నిర్దేశించాడు ఆ దేవుడు - 
ఎంత పిండినా తడి  వస్త్రాలు, నీళ్ళు కారుతున్నవి. 
వస్త్రములను ఈ ఆకుల పైన ఆరేస్తాను. ...... 
హమ్మయ్య, ఆరేయడం పూర్తి ఐనది. 
ఇంక ఊళ్ళోకి నా గమనం ....... 
ఊ  ....... , ఆకులు కదులుతున్నవి ..... 
వెలుపలికి చేయి కనబడుతున్నది .... బైటికి - పైకి చాచి, పిలుస్తూ .... 
అది స్త్రీ హస్తం - ..... ఎండిన ఆకులను తొలగిస్తాను ...
వసంత సేన ;- [మూలుగుతున్నది] ఎవరమ్మా, మీరు వసంతమ్మ కదూ, ఇక్కడ, 
ఇట్లాగ - భూమిలో - మిమ్మల్ని - ఎవరి అకృత్యం ఇది? 
నెమ్మది నెమ్మది, నిమ్మళంగా మెల్లగా లేవండి. 
వసంత సేన ;- దుర్మార్గ శకారుడు నన్ను చంపాలని యత్నించాడు. 
శకారుడు నా గొంతు నులిమాడు,  చచ్చిపోయాను ..... అనుకుని ....... 
వదిలి పెట్టి, పోయినట్లుగా ఉన్నాడు.
హు ... నేను ఉంటేనేం , పోతేనేం ..... 
బౌద్ధ సంవాహకుడు ;- వైరాగ్యం వలదమ్మా, నన్ను ఆనవాలు పట్టారా, 
మీ ఉపకారం వలన  ఋణవిముక్తుడిని ఐనాను.
వసంత సేన;- నీవు ... మీరు .... !?
బౌద్ధ సంవాహకుడు ;- జూదంలో ఓడి, పారిపోయి, మీ ఇంటిలో దాక్కున్నాను.
అప్పుడు జూదం పందెంలో చెల్లించాల్సిన- నా - శుల్కాన్ని చెల్లించి, 
ఋణవిముక్తుణ్ణి చేసారు. నన్ను గుర్తు పట్టారా!? 
వసంత ;- ఔను, చారుదత్తుల ఇంటి నుండి తెచ్చిన వెండి పాత్రను అమ్మజూపావు ...... 
బౌద్ధ సంవాహకుడు ;- నాడు సంవాహకుడిని, నేను మారాను తల్లీ, 
వసంతసేన;- ఈ తీరుగ సన్యసించావా!

బౌద్ధ సంవాహకుడు ;- శరణాగత రక్షణం - బౌద్ధ విహారం - ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. 
మీ గాయాలు నయమై, తేరుకునే దాకా అక్కడ ఉందురు గాని.
వసంత సేన ;- భగవత్ కృప.
;  [ఇద్దరు వెళ్తున్నారు.] 
******************************:
; అధ్యాయ శాఖ ;- 29 - ఆమెకు బుద్ధ పరిరక్షణ 
previos posts ;- 
అధ్యాయ శాఖ ;- 28 ;-  బాట అదే - బండి మారింది ; 25, డిసెంబర్ 2017, సోమవారం  ;
అధ్యాయ శాఖ ;- 27 ;- సంకెళ్ళ చప్పుడు - గాజుల సవ్వడి
అధ్యాయ శాఖ ;- 26 ;- నగరంలో గజం ;  
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...