11, అక్టోబర్ 2017, బుధవారం

తప్పించుకుందిరా తాబేటి దవ్వ!

[+ అప్పటికే సంజె చీకటి పడుతున్నది. 
భీతితో ఉక్కిరిబిక్కిరి ఔతూ, ఇరువురు వనితలు
మసక చీకటిలో - తాము ఎటు పరిగెడుతున్నారో 
తెలీని అయోమయ అవస్థలో దౌడు తీస్తున్నారు. ]
;
"వసంతమ్మా! ఆ ఇంటి ఆ ముందరి - లఘు ద్వారం తెరచి ఉన్నది. 
పదండి.  తోటలో పొదలు ఉన్నవి. 
పొదల మాటున దాక్కోగలుగుతాం. శీఘ్రం." 
ఆ జవ్వనులు లోనికి ఉరికి, ఒక పొద మాటున వంగి,కూర్చున్నారు. 
;
*************************************************;
;
"ఎక్కడ? ఎక్కడ? వసంతసేనా! ఎక్కడ?
ఎక్కడికి పోయినా నిన్ను వదలను, వసంతా! 
ఈ శకారుని బారి నుండి వేళ తప్పించుకున్నావు, సరే చూసుకో, 
మళ్ళీ నిన్ను దొరక బుచ్చుకుంటాను. ...... 
"తప్పించుకుందిరా తాబేటి దవ్వ! హమ్మయ్య, ఇప్పటికి ఆమె క్షేమం."
"విటూ, అక్కడి జూద మండపంలోనికి దూరుదాం, పద!"
"దేవరా! ఆ జూదశాల యజమాని విసుక్కుంటున్నాడు." 
"ఏం, ఎందుకంట, ఏం తీపరమట!?" '''''''''''' 
"ఏం తీపరం - అని మీరు అడిగితే ఏం చెప్పగలను? 
మీరు అసలు పైకం కట్టనే కట్టరనిన్నీ, 
దండగ బోణీ హస్తం తమదనీ, ఆ...... చిత్తం .... ఆ ..... "
"ఆ! రాజా వారికి స్వయానా బావ మరదిని. నన్నే శుల్కం అడుగుతున్నాడా, 
వాడికి మన రాజ్యంలో మంచి నీళ్ళు పుట్టకుండా చేస్తాను, చూస్తుండు"
"ఇక్కడ ఉప్పు నీళ్ళు, తాగడానికి పనికి రావంట. 
పొరుగు సీమలో ఐతే - అమృత తుల్య జలం లభిస్తున్నది ...... అని ..... "
"ఆ, దుష్టుడు, అంత కావరమా, 
వాడి జుట్టు పట్టుకుని, గుమ్మానికి వేలాడ దీస్తాను. పద."
"ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగనే - 
ఎవరి ముఖం చూసాడో, పాపం! ఆ జూదశాలుడు. పదండి దేవరా!"
;
************************************************;
;
 అధ్యాయ శాఖ ;- 10 ;- తప్పించుకుందిరా తాబేటి దవ్వ!
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...