13, జనవరి 2015, మంగళవారం

సంక్రాంతి సంగీతము

కులుకుల తళుకుల 
పాల్కడలి పుత్రికా! రావమ్మ సత్వరమె || 

సిరులతల్లి మందగమనమున వచ్చి
సంక్రాంతి వీణియకు శృతి కూర్చుచున్నాది;  
పర్వదిన ఉత్సాహ గమకమిది మది మెచ్చు  || 
పాల్కడలి పుత్రికా! రావమ్మ సత్వరమె ||

శ్రీలక్ష్మి, విలసిల్లు  
నీ మకర తోరణ స్వర్ణ కాంతులు 
మహిపైని - ప్రసరించు చుండగా; 
మేదినికి శోభలు సమకూర్చునమ్మా! ||

సప్తాశ్వ రధమున 
భాస్కరుడు విచ్చేయ; 
ప్రత్యూష కాంతుల - పుప్పొడుల రాసుల 
పూవయ్యె ప్రాగ్దిశ , నడుమ ఇల మురిపాలు ॥ 

**************************,
[పౌష్యలక్ష్మి ఆగమనం]
 సంక్రాంతి శుభాకాంక్షలు 

అఖిలవనిత
Pageview chart 29300 pageviews - 751 posts, last published on Jan 10, 2015
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం  [  58003 - 58020 ]
Pageview chart 55648 pageviews - 1004 posts, last published on Dec 25, 2014 - 3 followers
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 3928 pageviews - 125 posts, last published on Nov 30, 2014

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...