27, జనవరి 2015, మంగళవారం

కె సెరా సెరా పాట - మన భానుమతి

"కే సెరా సెరా...." అనే ఒక ఇంగ్లీషు పాట మన తెలుగు సినిమాలో ఉంది తెలుసా?
"అత్తగారి కథలు" రచయిత్రి, విదుషీమణి, గాయని, మన తెలుగింటి మణిదీపం నటీమణి, 
సకల కళాభినేత్రి శ్రీమతి పి.భానుమతి. ఖంగుమనే ఆమె గొంతులో స్వరాలు వయ్యారాలు పోతాయి. 
“తోడూ  నీడా” సినిమాలో చిన్నపాపను సముదాయించడానికి ప్రయాసపడే ఇల్లాలిపాత్రలో "శభాష్" అనిపించుకున్నది ఆమె. 
ఆ క్రమంలో అప్పుడు భానుమతి ఒక ఇంగ్లీష్ సాంగ్ నీ సింగింది "కే సెరా సెరా" అంటూ.
దానికి చిన్నారి "ఛి ఛీ బాలేదు" అంటుంది. వెంటనే అన్నమయ్య కృతి "జో అచ్యుతానంద జోజో ముకుందా! లాలి పరమానంద రామ గోవిందా!" ని ఆలపించింది.ప్రస్తుతం "కె సెరా సెరా" అంటూ సాగే ఆ ఆంగ్లగీతం వైపు దృష్టి సారిద్దాము. 
కాకతాలీయ సినీ వింత ఇక్కడ, అదేమిటంటే -  తెలుగులోనూ అటు ఇంగ్లీషులోనూ - హీరోయిన్లు నటన + ప్లస్ గాత్రదానం చేసిన చలనచిత్ర ' గీతాలు ఇవి. కనుకనే ఈ దృశ్యం వెండితెర పాలిటి స్వర్ణవరం.
    
*********

ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అనగానే  సస్పెన్స్ సినిమాలకు మారుపేరు అని స్ఫురణకు వస్తుంది. హిచ్ కాక్ 
సారధ్య, నిర్వహణలో - సస్పెన్సు మిళాయించిన హారర్ ఫిల్మ్ The Man Who Knew Too Much. ఇది ఇంటెర్నేషనల్ కుట్రలో ఇరుక్కున్న దంపతుల కథ.
"కే సెరా సెరా" - ఈ పాటను కథానాయిక 'డోరిస్ డే' ఒక విశాలమైన పెద్ద హాలులో పియానోని వాయిస్తూ  పాడింది. క్రిక్కిరిసి ఉన్న అతిధుల సమక్షములో ఆమె పాట పాడుతుంది.  ఒక్క డైలాగు లేకుండా సాగే ఆ సన్నివేశములో 127 కెమేరాలతో ఒకేసారి షాటును తీసారు.  ఏకబిగిన అంత పెద్ద దృశ్యాన్ని చిత్రీకరించడం దర్శక ప్రతిభకు మచ్చుతునక.

************

ఇక మన పాట సంగతికి వద్దాము. 1954లో విడుదల ఐన "ది మ్యాన్ హూ న్యూ టూ మచ్"  లోని 
"కే సెరా సెరా" (Que Sera, Sera)  పాట ఎందరికో వీనులవిందు చేసినది. ఈ  ఇటాలియన్ వాక్యానికి ఇంగ్లీషులోకి అనువదిస్తే "వాటెవర్ విల్ బి, విల్ బి" అంటూ (whatewer will be, will be) అనే అర్థం వస్తుంది.

************

సౌందర్యరాశి ఐన నటీమణితో పాటు బాణీకర్త, అతని సైదోడు ఐన రచయిత "క్వ సరా సరా " పాట  సంచలన విజయాల నమోదులో  ప్రధాన సూత్రధారులు ఐనారు. గీత, సంగీత రచన కర్తల గురించి క్లుప్తంగా చూద్దాము.

Jay Livingston (March 28, 1915 – October 17, 2001) :-

అమెరికాలోని  'జ్యూ' (Jewish), పెన్సిల్వేనియా రాష్ట్రమందు పిట్స్ బర్గ్ టౌనులో పియానో అభ్యసించాడు. (ఈ పిట్స్‍బర్గ్ లోనే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవళము ఉన్నది, ఈ కోవెల "అమెరికాలోని తిరుపతి ' గా ప్రఖ్యాతి పొందినది.) 
ఆతని మ్యూజిక్ విద్యాప్రజ్ఞ పునాదిగా అచిరకాలంలోనే నిల దొక్కు కునాడు. ఎన్నో సినీ గీతాలు, ప్రైవేట్ ఆల్బములకు బాణీలను కూర్చాడు. ఇవాన్స్ రాసిన గీతాలకు జే లివింగ్ స్టోన్ బాణీలను సమకూర్చాడు. 
ఇవాన్స్ & జే లివింగ్‍స్టోన్ - వీరు ఇద్దరి జంట నేతృత్వం లో వెలువడిన సాంగ్స్ ఎన్నో అనేక అవార్డులను గెలుచుకున్నవి, ప్రపంచ సంగీతమునకు కొత్త సంగీత వరుసలను అందించి, కొత్త పుంతలను తొక్కేలా చేసినవి. 'కే సెరా సెరా ' బెర్నార్డ్ హెర్ మ్యాన్ (Bernard Hermann) నిర్వహించిన ఆర్కెస్ట్రా అత్యద్భుతమైనది.

*********

ఈ 'Que Sera, Sera' పాట ఏమిటి? ఇందులోని మాటలు ఏమిటి?:-

అనేక అవార్దులను పొందిన  Que Sera, Sera లో మొదటి లైనులోని పదాలు అసలు ఇంగ్లీషు పదాలు కావు. ఆంగ్లేతర పదాలు అవడం తో సహజంగానే ఆ మాటల పుట్టుపూర్వోత్తరాల పట్ల సహజంగానే జిజ్ఞాసులకు అమితాసక్తి కలిగింది. ఇవి ఇటాలియన్ మూలంతో ఉన్న పదాలని కొందరి నిర్ణయం.  1525 లో పవియా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి నినాదపూర్వక వాక్యాన్ని రాసుకున్నాడు.  ఈ పాట మోటో లిఖితరూపాన లభించింది. 1559 లో స్పానిష్ భాషలో సైంట్ నికొలస్ చర్చిలో అగుపించింది.మొదట ఇటలీ స్పెలింగ్ ప్రకారం సి, హెచ్“c, h :- "che sara sara” అని రాసేవారు. 1954 లో జయ్ లివింగ్ స్టన్ అనే మ్యుజీషియన్, ఆ తర్వాత గేయరచయిత ఐన రే ఇవాన్స్ ఇవే మాటలను స్పెయిన్  భాషీకరణతో అందించారు. ఆ సందర్భంలో వారు “ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ భాషలో మాట్లాడే ప్రజలు అనేకులు ఉన్నారు, కాబట్టి స్పానిష్ స్పెలింగ్ ను ప్రవేశపెట్టాము.” అని చెప్పారు.

************

మళ్ళీ హిచ్‍కాక్ చిత్రానికి వస్తే The Man Who Knew Too Much సినిమాలో ఈ పాటను పాడినది కథానాయిక పాత్రధారిణి ఐన డోరిస్ డే. ఆ చిత్రం విడుదల తర్వాత “కే సెరా సెరా” అనగానే ప్రేక్షకుల మదిలో డోరిస్ డే తటిల్లతలా మెరుస్తుంది. శ్రోతల హృదయసీమలలో ఆమె గళం మధువుల సోనలను గ్రుమ్మరించుతుంది. అదీ ఈ పాట మహిమ.

************

మరి మనం క్వా జరా జరా - గీత వివరణలను తెలుసుకున్నాక ఆ హిట్  సాంగుతో చెవి కలిపి,  కాస్సేపు  విహరిద్దామా?

*************************

'When I was just a little girl
I asked my mother,
What will I be, will be?

Will I be pretty, will I be rich?
Here's what she said to me ;
When I was just a little girl.
I asked my mother, what will I be?

Will I be pretty, will I be rich?
Here's what she said to me:
"Que Sera, Sera Whatever will be
When I was just a little girl
I asked my mother,
"What will I be, will be? ;

Will I be pretty? Will I be rich?"
Here's what she said to me;
"Que sera, sera
- Whatever will be, will be;
The future's not ours to see;

When I grew up and fell in love ;
I asked my sweetheart,
"What lies ahead?
Will we have rainbows day after day?";
Here's what my sweetheart said ;

Que sera, sera;
Whatever will be, will be
The future's not ours to see ;

Now I have children of my own ;
They ask their mother, "What will I be?" ; 

Will I be handsome? Will I be rich?" ;
I tell them tenderly
Que sera, sera ;  Whatever will be, will be;
The future's not ours to see ;
Que sera, sera ; What will be, will be
Que Sera, Sera!
                @@@@@
(karpagam (K.R. Vijaya, Tamil movie 1963) )

************

కె సెరా సెరా పాట - మన సై దోడు భానుమతి 
-  (LINK- NewAwakAya)   
ఆణిముత్యాలు, గీతాలు.బ్లాగు (LINK)
Email User Rating:  / 2 
Member Categories - మాయాబజార్
Written by kadambari piduri
Monday, 19 January 2015 1 2:33
Hits: 216
*****************

అఖిలవనిత
Pageview chart 29606 pageviews - 761 posts, last published on Jan 26, 2015
Telugu Ratna Malika
Pageview chart 3957 pageviews - 126 posts, last published on Jan 14, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 55890 pageviews - 1005 posts, last published on Jan 13, 2015 - 

http://gamgaraawichettu.blogspot.com/ 
http://sakalakalars.blogspot.com/ 
[ కుసుమాంబ1955 ]

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...