14, నవంబర్ 2011, సోమవారం

బలరాముని “ద్వాదశ వర్ష వ్రతము”, తీర్థయాత్రలు


జైమినీ ముని కొన్ని సందేహాలను పక్షులను అడిగాడు. 
“మద్య పానము పాపము కదా! 
ఎవరైనా అలాటి పని చేస్తే, 
ఆ పాపమునకు విరుగుడు ఉన్నదా? 
పాప పరిహారము ఏమిటి? ” 
ఆ “ధర్మ పక్షులు” 
ఆ ఋషికి కలిగిన doubtsను 
కథా పద్ధతిలో ఇలాగ తీర్చినవి.


శ్రీకృష్ణుని అన్న “బలరాముడు”. 
శ్రీ కృష్ణుడు, పాండవుల వద్దకు వెళ్ళిఉన్నాడు. 
బలరాముడు ” రాజ్య వ్యవహారములను తమ్మునికి అప్పజెప్పి, 
కొన్నాళ్ళపాటు అలాగ – తీర్ధ యాత్రలు చేసి వస్తాను.” అని తలిచాడు. 
తమ్ముడు “హస్తినాపురమునుండి మరలివచ్చాక, 
ఈ విషయాన్ని చెప్పాలి. 
ద్వారవతి(= ద్వారక)కి తిరిగి వచ్చిన పిమ్మట 
రాజ్యభారాన్ని కన్నయ్యకు అప్పజెప్పి, 
విలాసముగా దేశసంచారము చేయాలి” 
ఇలాగ యోచించిన బలరాముడు- సోదరుని రాకకై వేచిఉన్నాడు.


***************************\\\\\\\ 


బలరాముడు ఒకసారి తన పరిజనముతో రైవతాద్రికి వెళ్ళాడు. 
ఆ గిరి సానువును చేరి, అందరితో కలిసి, వసంత శోభను
హాయి హాయిగా తిలకిస్తూన్నాడు – 
బలరాముడు. 
రైవత గిరి శిఖరముపై, 
కాంతాజన పరివేష్ఠితుడై, 
అతడు షడ్రసోపేత భోజనాలను ఆరగించాడు. 
ఐతే చిన్న పొరపాటు!….. 
విందుభోజనములతోపాటుగా- 
బలరాముడు మధువును కూడా త్రాగాడు. 
లోకములో త్రాగుబోతులకు మతి స్థిరము తప్పుట – 
అందరికీ తెలిసిన సంగతే కదా! 
ఇంకేమున్నది, 
బలరాముడు మధుపాన మత్తుడై, 
విపరీతంగా ప్రవర్తించసాగాడు. 
భార్య, బంధువులు వారించినప్పటికీ వినే స్థితిలో లేడు. 


**********************************||||||


పండిత, పౌరాణిక ప్రజ్ఞా శీలురైన 
అనేకమంది మహా ఋషులకు నెలవు ఐనట్టి 
ఆ అరణ్యము యొక్క నామము- “నైమిశారణ్యము”. 
ఆ అడవిలో సూతమునీశ్వరుడు తన శిష్యులకు- 
పురాణ కథలను బోధిస్తూన్నాడు.


బలరాముడు ఆ ప్రాంతమంతటా వినోదంగా షికార్లు చేస్తూన్నాడు. 
బలరాముడు సూతముని కుటీర సీమలకు చేరాడు. 
తూలుతూ ఉన్న ఆ పానలోలుని చూస్తూ భయపడ్డారు శిష్యులు.
భీతితోనే వాళ్ళు, బలరామునికి ఆతిథ్యం ఇచ్చారు. 
కృష్ణాజినముపైన కూర్చున్న సూతమునీంద్రుడు – 
గురుపీఠమును అధివసించి ఉన్న హేతువుచే- 
ఆసనమును దిగలేదు. 
“పద్మాసనము వేసుకుని, 
నన్ను చూసి కూడా కదలక మెదలక కూర్చుని ఉన్నాడు”అని 
క్రుద్ధుడైనాడు బలరాముడు.


క్రోధావేశాలతో తాను ఏమి చేస్తున్నాడో – 
తనకే తెల్యనేరనివాడైనాడు. 
చేతిలో ఉన్న ‘గిదియతో’ ముని శిరస్సుపైన మోదాడు. 
బలంగా కొట్టడంతో; సూతమహర్షి తలకు తగిలిన గాయంవలన మర్ణించాడు. 
“బ్రహ్మపదము నందిన సూతమునిని” సంఘటనతో 
అక్కడ హాహాకారాలు చెలరేగాయి. 
బలరాముడు ఎంతో పశ్చాత్తాపం పొందాడు. 
పశ్చాత్త్ప్తుడైన బలరాముడు ఆస్థాన పండిత, పురోహితులను 
“ఇప్పుడు నేను ఈ పాపము తొలగుటకు ఏమి చేయాలో నిర్దేశించండి” అని కోరాడు. 
వారు “ద్వాదశ వర్ష వ్రతము ఆచరిస్తే బాగుంటుంది”అని చెప్పారు. 
ప్రాజ్ఞుల అభిప్రాయములను అనుసరించాడు బలరాముడు.


అర్ధాంగి రేవతికీ, పుత్రులకు, పుత్రికలకు, 
బంధు మిత్ర పరివారములు యావన్మందికీ వీడ్కోలు తెలిపి, 
దేశాటనమునకై బయలుదేరాడు. 
తీర్థయాత్రలలో అనేక విశేషాలనూ, 
ప్రజల సాధక బాధకములను తెలుసుకోగలిగాడు. 
అలాగ 12 సంవత్సరములు పుణ్య యాత్రలు చేసి, 
స్వదేశానికి మరలి వచ్చాడు బలరాముడు. 
విధ్యుక్తప్రకారము – ప్రతిలోమముగా – 
సరస్వతీ నదిలో స్నానమాడటంతో 
“ద్వాదశ వర్ష వ్రతము”ను పూర్తి చేసుకుని, 
బలరాముడు పునీతుడైనాడు.


**********************************\\\\


శల్య పర్వములో ఒక (పైన రాసిన) నీతి కథ ఉన్నది. 
మద్య పానము మహా  పాపము! 
మద్యపానము నిషేధ అవసరమును చెప్పే నీతి కథ ఇది. 
మహాభారతములోని 
అంతర్గత సుభాషిత గాథ ఇది. 
మహాభారతము యొక్క అసలు పేరు:- जयम/ జయం


*****************************************************
బలరాముని “ద్వాదశ వర్ష వ్రతము”, తీర్థయాత్రలు;
Published On Thursday, October 27, 2011 By ADMIN. 
Under: కథలు, పురాణ కథలు.   
రచన : కాదంబరి పిదూరి
Forkids (magazine Web)
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...