26, ఫిబ్రవరి 2011, శనివారం

" మొదటి వ్యక్తి మీరే రాధా క్రిష్ణన్ !"

రష్యా నేత జోసెఫ్ స్టాలిన్
కమ్యూనిస్టు దేశాన్ని శాసించ గలిగిన నియంత( Dictater).
ఆ Comunist రూప శిల్పిని క్రెమ్లిన్ లో మీట్
వడం తటస్థ పడింది.
అప్పుడు స్టాలిన్ తన మనసులోని అనేక భావాలను
క్రమంగా రాధాక్రిష్ణన్ కు క్రెమ్ లిన్ meetingలో వెల్లడించగలిగారు.
అలాంటి పారదర్శక వ్యక్తిత్వం రాధాక్రిష్ణన్ ది.
“రక్తపాతం ద్వారా అతను విజేత అయి,
ఆ తర్వాత పశ్చాత్తాపంతో,
సన్యాసత్వం స్వీకరించిన మహా చక్రవర్తి,
మా భారత దేశంలో ఉన్నాడు.
ఎవరు చెప్పగలరు?
మీ దేశంలో కూడా అలాంటి సంఘటన జరుగుతుందేమో?
మీకు కూడా అలా సంభవించవచ్చునేమో, ఎవరు చెప్పగలరు?"

India president,
Sarvepalli Radha Krishnan
పలుకులకు స్పందించారు ఆ నియంత.
అందుకు కొంచెం ఆలోచిస్తూ
స్టాలిన్ అన్నారు
" నిజమే! కొన్ని సార్లు,
అలాంటి miracles కూడా జరుగ వచ్చు,
నేను 5 సంవత్సరాల నుండి
theological seminary లలో
పాల్గొంటూన్నాను."
(theological seminary for five years!)
మన శ్శాంతికై అన్వేషణా పథంలో
కొన సాగుతూన్న ఆ రష్యా నేత -
వేదాంత ప్రాముఖ్యతను అప్పుడప్పుడే గుర్తిస్తూ అన్నాడు.

[ భారత దేశంలో ఒక చక్రవర్తి జీవితం గొప్ప మలుపు తిరిగింది.
రక్తపాతం ద్వారా అతను విజేత అయ్యాడు.
కానీ తాను సృష్టించిన భీభత్సం ఆతనిని కలవరపరిచింది.
రుధిర విజయం అతనిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది.
అంతటితో bloody victory కి స్వస్తి చెప్పాడు,
బౌద్ధ మతాన్ని స్వీకరించాడు.
బౌద్ధ సన్యాసిగా మారిన అతనే 'మహా సామ్రాట్ అశోక చక్రవర్తి .]
రాధాక్రిష్ణన్ స్ఫటిక స్వచ్ఛదనం కల భావనా పూర్ణ హృదయుడు,
అందు చేతనే స్టాలిన్
క్రమంగా భారత దేశ రాష్ట్రపతి వద్ద
ఆత్మీయతను పంచుకోగలిగారు.
స్టాలిన్ తన మనసు ,ఆర్ద్రతతో నిండి పోగా,
రాధాక్రిష్ణన్ తో ఇలా చెప్పాడు
"నన్ను ఒక మానవునిగా,
క్రూరునిగా కాక
తోటి మనిషిగా గుర్తించిన మొదటి వ్యక్తి మీరే రాధా క్రిష్ణన్ జీ!"
("You are the first person
to treat me
as a human being
and not as a monster.)
అన్నాడు ఆ రష్యా అధినేత.

&&&&&&&&&&&&&&&&&&&
( See - Additional essay here ! )
Stalin's Daughter Svetlana ;కష్టాలకు ఎదురీది ,
నిలిచిన ధీర వనిత ఆమె.
రష్యాతో ఇండియా స్నేహము భంగమౌతుందనే భీతితో
అప్పటి ఇండియా గవర్నమెంటు ,
ఆమెకు పొలిటికల్ అస్సైలం ను ఇవ్వడానికి నిరాకరించినది.
సామాజిక పరిస్థితులే కాదు , దేశాల రాజకీయ పరిస్థితులు కూడా ,
మనుష్యుల వివాహ సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చేసి,
ఫలితాలను నిర్ణయిస్తాయనడానికి , స్వెత్లానా జీవిత చరిత్రయే సాక్ష్యము .

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...