1, ఫిబ్రవరి 2011, మంగళవారం

సింధూరం , త- థ - ద- ధ - న

ఇప్పుడు దూర దర్శన్ చానెళ్ళు అనేకం, అగణితము, మరియున్-
అశేష సీరియళ్ళూ, అవిశ్రాంత వార్తా వాహినులూ
ప్రేక్షక మేధస్సుల కంచాలలో చోటు లేనంత ఎక్కువగా వడ్డనలు చేస్తున్నారు,
ఆయా ఛానళ్ళ కృషికి నిజంగా జోహార్లు .
సరే!
ఈ విషయం నుండి కొంచెం సైడు ట్రాక్ .....
ఒక ఛానెల్లో సీరియల్ వస్తూన్నది, ఐతే ఏంటంట?
చాలా చాలా వస్తూనే ఉన్నాయి కదా! - అనుకుంటూన్నారా?
అది కాదు లెండి,
ఒక దాని పేరు "సిందూరం" అని టైటిలు.
ఫస్టు ఫస్టునే , ముద్రా రాక్షసం మీద మన అవలోకనం;
ఏం చేద్దాం, మరీ తెలుగు సాహిత్య ఆరాధన ఎక్కువై,
నాకు అలా అనిపిస్తూన్నదేమో?-
అనుకుని ఊరుకున్నా!
అటు తర్వాత, ఆ నిర్మాతలు, సదరు సాంకేతిక నిపుణులూ వగైరాలు,
అద్దానిని చూస్తారేమో అనుకున్నాను.
కనీసం ఈ సరికి తత్సంబంధీకుల స్నేహితులూ, హితులూ
"ఇదేమిటబ్బా! spelling mistake" siMdUramu కాదు,
సింధూరము - అని రాయాలి కదా!" అంటూ హెచ్చరిస్తారేమో,
సదరు టెక్నికల్ నిపుణులు - అచ్చు తప్పుని సరి దిద్దుతారేమో?"
అని వేచి చూసాను.
ఊహూ! అలాంటిదేమీ జరగలేదు.
గ్రాఫిక్సు, మాజిక్కుల మీద ఉన్న శ్రద్ధ , తెలుగు వర్ణమాల మీద లేదు వారికి, ఔరా !
సరే! ఈ సందేహాన్ని క్లియర్ చేసుకుందామనిన్ని,
ఒకవేళ నేనే పొరబడ్తున్నానేమో,
ముళ్ళపూడి వారు వక్కాణించినట్లు,
"అప్పు తచ్చుల భ్రమ" లో దొర్లి పడ్డానేమో- అని
ఇదిగో, ఇవాళ కాస్త తీరిక దొరికించుకుని గవేషణ ఆరంభించాను.
గిలేష్ణ( Google+ అన్వేషణ)లో గాలింపు;
మళ్ళీ ఇప్పుడే మన మేధస్సులో సరి కొత్త డౌటు -
ద- కు బొడ్డులో చుక్క ఉన్నదేమో.....
అంటే - త - థ -,
త - తర్వాతి థ - అన్న మాట!
( ఇలా వరస పెట్టి అనుమానాలపైన హనుమానాలు వస్తూంటే - ఎలా వేగాలి? ప్చ్!!!)
సింధూరము; ఆంగ్ల, ఆంధ్ర భాషలలో, పదమును వేసాను;
హ్హు! మొట్టమొదట నా బ్లాగులో రాసిన "బొట్టు కథా కమామిషూ" వచ్చి కూర్చుంది.
హడల్!
నా వ్యాసమే నాకు ప్రత్యక్షమైతే ఎలా?
ఆ " అప్పు తచ్చు " సంశయమును తీర్చడానికి,
ఏ వాల్మీకిని, "లవకుశ" సినిమా నుండి, నాగయ్య గారి రూపంలో
దిగి రమ్మనాలి?
next అమ్మయ్య!
"వికీ"లో దొరికింది,
సింధూరము" అని రాయడమే కరెక్టు.
" ద - కు వత్తు ఇస్తే ధ - ధకు కొమ్ము ఇస్తే ...... "
" ఏ కొమ్ములు మమ్మీ! జింక కొమ్ములా, గేదె కొమ్ముల్నా?"
"ధకార ఊకారముల ధూ" .......
యాంకర్ ల ఉచ్ఛారణా సౌరభాలను ఆస్వాదించీ, ఆస్వాదించీ -
శ్రవణేంద్రియాలకు Doubts కూడా రావడం మానేసాయి.
అదన్న మాట సంగతి.
"ఎనీ డౌట్స్?"
(Any doubts?)
ధ - కు దూరమైన సింధూరం ;

"సిందూరం" అని, సంఘవి హీరోయిన్ గా ఒక సినిమా వచ్చింది,

ఈ వాల్ పోస్టర్ లో
దూ' - నా /' ధూ '- నా రాసారు?
నా లఘు దృష్టి దోషమేమో,
నాకైతే ఎంత సేపటికీ అర్ధం బోధ పడలేదు.
>>>>>>>>>>>>>>






బాలు, చిత్ర గానంలో ని పాట (1988 లలో విడుదలైన హిట్)
అనువాద చిత్రంలోని పాట గుర్తుకు వస్తూన్నది.
పల్లవి:
సింధూర పువ్వా తేనె చిందించరావా;
చిన్నారి గాలి సిరులే అందించరావా;
కలలే విరిసేనే కథలే పాడేనే......
సింథూరము ---? సిందూరము ........? సింధూరము ................?
అన్నట్టు, ఎందుకైనా మంచిదని, మన తెలుగుకు సోదరీ భాష -
కన్నడ లిపి లో కూడా ఓ వీక్షణం వేసాను,
ఫలితంగ్ఫా ఈ పదం కనపడింది.
ఇదిగో ఆ కస్తూరి - ಸಿಂಧೂರ ತಿಲಕ

( ధ - కు దూరమైన సింధూరం )

9 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చాలాసార్లు ఆ చానల్‍వారికి తప్పుగురించి తెలియజేయాలనుకున్నాను కానీ ఆ పని చేయలేదు.

అజ్ఞాత చెప్పారు...

అది చూడలేకనే నేను దానికి చాలా 'దూరం'గా ఉన్నా!

Indian Minerva చెప్పారు...

ఇప్పుడు నాకోప్రశ్న అది "కధా" లేక "కథా"? అలాగే కధాకలి కూడానూ. కొంచెం ఆలోచిస్తే "సిందూరమే" ముద్దుగా వుంది :)

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు కొత్తగా "డమరుకం" అట! హథవిదీ!!

Anil Piduri చెప్పారు...

చిలమకూరు విజయమోహన్ గారూ!
" టి.వి. ; పత్రికలు నేడు ప్రజల చేతులలో/ అందుబాటులో ఉన్న సమాచార మాధ్యమాలు;
ఇక్కడ - కేవలం వార్తలకు పరిమితం కాకుండా,అనుకోకుండా,అవి భాషా వ్యాప్తికి కూడా వారధులు ఐనాయి - అనేది విస్మరించ కూడదు.
" దృశ్య, శ్రవ్య మాధ్యమాలు" ప్రజల భాష విషయంలో ఆంతర్యంలో / సిక్స్త్ సెన్సె లో పని చేస్తూనే ఉంటాయి ;
అందువలన - అచ్చట - చిన్న అచ్చు తప్పు కూడా పరిగణనలోనికి తీసుకోవలసి వస్తూన్నది.
కనీసం - హెడ్డింగ్సు, పతాక శీర్షికలనైనా ముద్రా రాక్షసాలు లేకుండా పరిశీలించాలి అని - అంగిక భాషా
నేను అనుకుంటున్నాను.

Anil Piduri చెప్పారు...

వత్తులు, దీర్ఘాలూ, "స" "న" "సున్న" ( 0 ) ; వీటి ఉచ్ఛారణలు, వాటిలోని స్వల్ప భేదాలను కూడా కనిపెట్టి, పాణిని వంటి మహనీయులు మనకు మహత్తర వ్యాకరణ అంశాలుగా అందించారు.
ఎక్కువగా వాడే పదాలను ఆనవాళ్ళుగా పెట్టుకుంటే, వీటిని తేలికగానే గుర్తించ వచ్చును.
ఐతే, భాషా శాస్త్రం చాలా ఎక్కువ విస్తృతి కలిగి ఉన్నది.
కాబట్టి, ఇప్పటికే , అనేకానేక subjucts చదువుతో అలసి పోతూన్న నేటి విద్యార్ధుల పైన నేడు ఆ భారాన్ని ఎంత వఱకు అందించ గలము? అనేది మన ముందు ఉన్న ప్రశ్న అజ్ఞాత గారూ!

kusuma చెప్పారు...

Indian Minerva గారూ!
నిత్య పరిచిత పాదాలను ఒక డజను చొప్పున గుర్తు పెట్టుకుంటే చాలు, కొని చిట్కాలు దొరుకుతాయి;
ఓపిక ఉంటే, సిద్ధాంతములు రూపొందిస్తూ, వ్యాకరణీకరించ వచ్చును.
సింధూ నదీ నాగరికత, గాంధీ; అతిథి; ఇలాగ అన్న మాటా!
ఆ దకార, వత్తులకు ముందూ వెనకా ఉన్న అస్కరాలను పరికిస్తూ ముందుకు సాగాలి,
లేఖా విస్తర సందేహముతో, ఇంతటితో 'కామా' పెడ్తున్నాను

Anil Piduri చెప్పారు...

ధ్వని సంబంధమైన పదాలను, ఒత్తులు ఉంచడమే
కొన్ని సార్లు సమంజసంగా అగుపిస్తూంటుంది.
ఢమ ఢమ -ధ్వానము -
కాబట్టి మనం "ఢమరుకము" అని పిలవ వచ్చును;
కానీ, "డమరువు" అని గ్రంధస్థముగా ఉన్నది,
కాబట్టి అదిన్నీ కరెక్టే!అజ్ఞాత గారూ!

kusuma చెప్పారు...

Thank you, all of you.
మీ అమూల్య అభిప్రాయాలను చెప్పినందుకు
మీ అందరికీ ధన్యవాదాలు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...