25, జులై 2010, ఆదివారం

వేద వ్యాస అక్షరాభ్యాసము

















ఎక్కిరాల వేద వ్యాస I.A.S. ,USCEFI సంస్థను స్థాపించిన వ్యక్తి;
నిష్కల్మష సిద్ధాంతాలతో తన జీవన పథమును నిర్మించుకుని, పయనించిన ధీర శాంతుడు.
వేద వ్యాసకు తండ్రి అనంతాచార్యులు
“The King’s Reader” అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని కొన్నారు.
మంచి ఖరీదైన book, ఫారిన్ నుండి తెప్పించిన ఆ పొత్తము అందమైన బొమ్మలతో ఆకర్షణీయ పద్ధతిలో ఉన్నది.
ఒక నెలలో ఆట పాటలతో చిన్నారి వేద వ్యాస పూర్తి చేసేసాడు.
“నాన్నా! మీరు కొని ఇచ్చిన బొమ్మల పుస్తకం అయి పోయింది.”
“అయి పోవడమేమిటిరా? ఒకటో తరగతి వరకూ
నీ చదువులకు ఇదే వాచకము కదా!!??”
చివరి పేజీ. అట్ట మాత్రమే మిగిలిన ఆ ఆంగ్ల పుస్తకాన్ని చూపించగానే,
పితృ దేవులు ఉలిక్కి పడ్డారు.
“తతిమ్మా పేజీలన్నీ ఏవిరా? ఏమైనాయి?”
“అవన్నీ ఐ పోయాయి కదా...... పాత pagesను చించేసాను.”
ఆయుర్వేద వైద్యులైన జనకులు,
patients కి మందులను అమ్మి, ఆ బిల్లును చించి, వాళ్ళకు ఇచ్చే వారు.

బాల వేద వ్యాస కూడా “అదే పంథా”ను అనుసరించాడు.
తాను చదవగానే, English book లోని ఆ పుటలను కాస్తా చించేసి,
గాలి పటంకి మల్లే గాలిలోకి ఎగిరేసే వాడు”అయి పోయిందీ!” అంటూ.
“బంగారం లాంటి పుస్తకాన్ని హూనం చేసావు, ఇప్పుడెలాగ ఆ పాఠాలు నీకు వస్తాయిరా???”
“అన్నీ వచ్చేసాయి,నాన్నా!కావాలంటే చూసుకోండీ!” అంటూ
మొదటి పాఠం నుండి కొస వరకూ అన్నీ కంఠతా పట్టినట్లుగా, గడ గడా అప్ప జెప్పేసాడు.
“ఐతే నీకింకో వాచకం కొని పెడతా!పద!బజారుకెళదాం!” అన్నారు పితృ దేవులు
పుత్రుని బుగ్గలు పుణికి, ముద్దుగా చూస్తూ.
నేరుగా విజయ వాడ రైల్వే స్టేషన్ కు వెళ్ళారు.
Higgin badam’s book shopలో
2,3,4 వ తరగతి వరకూ పుస్తకముల సెట్టును కుమారునికి కొని పెట్టారు.
“ఇందులో పేజీలు చించ కూడదు, తెలిసిందా!
పుస్తకం పూర్తి చేసే దాకాఆ అన్ని పేజీలూ ఉండాలి,గుర్తుంచుకో!”
3 నెలలలో ఇంగ్లీషు 5 - వ ఫారం(= 9 class) దాకా చదివేసాడు.
అనంతాచార్యులు ‘తన కొడుకు ఒక్క ఏడాదిలో మెట్రిక్యులేషన్ పరీక్షకు తయారు అవ గలడ'ని ధీమాతో అనుకునారు.
దాంతో కాశీ కృష్ణమాచార్యుల వారి సంస్కృత వాచకములను జనకుడు ఇచ్చారు;
అంచెలంచెలుగా పఠించడమూ పూర్తి ఐ పోయింది.
ఆ క్రమంలో చిన్న చిన్న వాక్యాలతో గీర్వాణ భాషలో మాట్లాడడం కూడా ఒచ్చేసింది.ఆ తర్వాత “మను స్మృతి”లో నుండీ పాతిక శ్లోకాలు, బాల రామాయణము లోని 60 శ్లోకాలు, భగవద్గీతలోని 18 అధ్యాయాలు – 10 నెలలలోనే వ్యాస పూర్తి చేసేసాడు.
అప్పటి దాకా వేద వ్యాస కు కలం పట్టి, పేపరుపై
ఒక్క అక్షరం ముక్క కూడా రాయడం చేత కాదు.
ఎక్కిరాల వేదవ్యాస విద్యాభ్యాసము 1947 లోమొదలైనది.
పలక పైన సుద్ద ముక్కతో రాయించారు.
ముందే పఠనము, తదుపరి లేఖనము .........
ఇలాటి తిరకాసు ఆచరణతో , కలిగిన తికమలూ.... కొన్ని విచిత్ర అనుభవాలు సంభవించాయి.
వేద వ్యాసకు భాషా భేదం తెలిసేది కాదు.
ఫలితంగా ఒక వాక్యం రాసేటప్పుడు
అందులోని అక్షరములను కలగా పులగంగా రాసే వాడు.
అంటే ఇంగ్లీషువీ, సంస్కృతంవీ,తెలుగువీ అన్నిటినీ కలగలుపుగా రాసే వాడు.
ఒక నాడు అనంతాచార్యులు డిక్టేషన్ చెప్పారు.
“ పిల్లి” అని తండ్రి చెప్పగా, వేద వ్యాస ,
”Pల్లి” అంటూ పలకపై రాసాడు.
అలాగే అన్ని పదాలూ, పంచ కూళ్ళ కషాయంగా అవతరించాయి.
Bడి (= బీడి)
ఈ పద్ధతిలో కనపడిన అక్షర చిత్ర ప్రసూనములను చూడగానే, తండ్రి అదిరి పడ్డారు.
“ఇదేమిటిరా ఇలా రాసావు?”
“అన్నీ ఒక్కటే కదా అని రాసేసాను నాన్నారూ!”
చిన్నారుల మనస్సులలో ఆ యా శబ్దాలూ, ఆకారాలూ మాత్రమే రికార్డు అవుతూంటాయి.
వారి జ్ఞాపక శక్తిలో అన్ని అక్షరముల వర్ణ క్రమమూ,
విడి విడిగా బోధించనందు చేత, కలగలుపుగా నిక్షిప్తమైన విపర్యాస ప్రహసనాలు ఇట్లాంటివే!!!!!
వేద వ్యాసకు రాళ్ళూ, బియ్యమూ విడ దీసినట్టు ఏరుకోవడానికే
ఎక్కువ సమయం, అనగా ఏడాది పట్టింది.
అన్ని పాఠాలూ వాక్కుతో, కంఠస్థం చేయడం అత్యంత స్వల్ప వ్యవధిలో జరిగింది;
కానీ రాత, లిపి వ్యవహారం మాత్రం చాలా వ్యవధిని తీసుకోవడం గమనార్హమైన ముఖ్య విశేషమే!
టీచర్లు, అధ్యాపకులు దృష్టిలో ప్రధాన కోణంలో పరిశీలించి అవగాహనతో
పిల్లలకు బోధన చేయడానికి ఈ అంశాలు ఉపకరిస్తాయి కదూ!!!!!

2 కామెంట్‌లు:

A K Sastry చెప్పారు...

ఈయనేననుకుంటా......1999 యుగాంతం వ్రాసింది!

kusuma చెప్పారు...

ఔనండీ; కృష్ణశ్రీ గారు!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...