1, మార్చి 2010, సోమవారం

వారణాసిలో మహాత్మా గాంధి


దేవళములను శుభ్రంగా ఉంచాలి. అలాగే భక్తులు, ఆలయ సిబ్బంది కూడా పరిశుభ్రతను పాటించాలి.
కోవెలల ధర్మకర్తలకు, అధికారులకు ఇందు నిమిత్తమై ఖచ్చితంగా ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండాలి.
అక్కడి పరిసరాలు కళకళలాడుతూ ఉంటేనే, వచ్చిన వారికి మనశ్శాంతి లభ్యమౌతుంది. లేకున్నచో ప్రశాంతతను కొరకు గుడికి వచ్చిన ప్రజల హృదయాలు వికలమౌతాయి.

గాంధీజీ ఆత్మకథలో తనకు తటస్థపడిన ఇలాటి అనుభవాన్ని రాశారు. 1891 లో బొంబాయిలో బారిష్టరుగా ఉన్న రోజులలో ప్రార్ధనా సమాజ్ హాలులో "ఫిల్గ్రిమగె తొ ఖషి" అనే అంశముతో ఉపన్యసించారు. ఆ తర్వాత దైవమును దర్శించుకోవడానికై, ఒక పర్యాయం కాశీకి వెళ్ళారు. స్టేషన్ లో దిగగానే "పండాలు" (పురోహితులు) చుట్టుముట్టారు.
వారిలో శుచిగా శుభ్రంగా కనిపించిన ఒక బ్రాహ్మణునితో,
ఆతని గృహానికి గాంధీ వెళ్ళారు.
"గంగా స్నానానంతరమే నేను భోజనం చేస్తాను." అని చెప్పారు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.
"రూపాయి పావలా మాత్రమే ఇవ్వగలను; అందుకు తగ్గట్లే పూజా పునస్కారాల ఏర్పాట్లు చేయండి." అంటూ, తన స్థోమతను గూర్చి వక్కాణించారు.
" తీర్థ యాత్రికులు భాగ్యవంతులైనా, బీదవాళ్ళైనా మేము కార్యాలను ఒకేలాగ చేస్తాము. చేసే క్రతువులో భేదం ఉండదు. యాత్రికుల శక్తిని బట్టీ, బుద్ధిని బట్టీ, వాళ్ళకు తోచినంత దక్షిణ ఇస్తూంటారు. అంతే!" అన్నాడు పండా.
మధ్యాహ్నం 12 గంటల వరకూ క్రియా విధులను, ఆసాంతం చక్కగా నిర్వర్తింపజేసాడు పండా.
గంగా నది దగ్గరి నుండి కాశీ పురిలోని కాశీ అన్నపూర్ణా దేవిని, విశ్వేశ్వర స్వామి వార్లను దర్శించుకోవాలని బయలు దేరాడు గాంధీ.

సన్నటి ఇరుకు సందు, పాచి పట్టి జర్రు బుర్రుగా ఉన్న దారి!
ఈగలు ముసురుతూ, మురికి మయంగా ఉన్న వాతావరణమూ;
"జ్ఞాన వాపి"( " well of knowledge ")వద్ద అపరిశుభ్రతకు నిలయంగా ఉన్నది.
గాంధీజీకి తాను బొంబాయిలో పవిత్ర భక్తి భావనలతో ఇచ్చిన లెక్చరు గుర్తుకు వచ్చి, మనస్సు కలుక్కుమన్నది.
గాంధీ అక్కడ ఒక పైసాను వేసారు;
ఆ బావి దగ్గర ఉన్న వేరే పండాకు చాలా ఆగ్రహం వచ్చింది.
"నువ్వు లోభివి, నరకానికి పోతావు" అని అరిచాడు.

గాంధీజీ నిగ్రహంతో "మహరాజ్! నా నొసట రాసి ఉన్నదేదో అదే జరుగుతుంది. కానీ మీ వంటి సత్పురుషుల నోట రావలసిన మాటలు కావు ఇవి. కావలిస్తే తీసుకోండి, లేకుంటే ఫరవా లేదు లెండి."

"వెళ్ళు! నీ దమ్మిడీ అక్కర్లేదులే!"

గాంధీ కిందపడిన ఆ పైసాని తీసుకుని నడవసాగారు.

ఆ రోజులలో దమ్మిడీలు, కాణీలు ఎంతో ద్రవ్య విలువను కలిగి ఉన్నాయి. పండాకు విడువ బుద్ధికాక, వెనుకనే వచ్చి అన్నాడు;
"ఆ ఇటు ఇవ్వండి! నేను గ్రహించకున్నచో, మీకు పాపం చుట్టు కుంటుంది" అంటూ, పైసాను తీసుకున్నాడు.

జాతి పిత మహాత్మా గాంధీజీ తన "ఆత్మ కథ "మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ " లో తన ఫీలింగ్సును విపులముగా చెప్పారు.
"ఆ తర్వాత రెండు సార్లు కాశీకి వెళ్ళి వచ్చాను, కానీ ఆనాటికి "మహాత్ముడు"గా ప్రజలలో గుర్తింపు పొందాను. ఇక నన్ను చూడవచ్చే జనులకు దర్శనం ఇవ్వడానికే ప్రొద్దు సరిపోయేది కాదు. మహాత్మునికి కలిగే ఇబ్బందులు తతిమ్మా వారికి బోధపడతాయా?!"
అంటూ తన అనుభవాల పరంపరలను రచనలో పొందుపరిచారు జాతిపిత మహాత్మా గాంధీ.
(The Story of My Experiments with Truth (Gujarātī "સત્યના પ્રયોગો અથવા આત્મકથા") is the autobiography of Mohandas Karamchand Gandhi )

"100 Most Important Spiritual Books of the 20th Century" అని HarperCollins publishers బాపూజీ రచన ఐన " సత్యముతో నా ప్రయోగములు" ని ప్రశంసించారు

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


Share My Feelings

వారణాసిలో మహాత్మా గాంధి ;

By kadambari piduri, Feb 18 2010 9:37AM

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...