22, ఫిబ్రవరి 2009, ఆదివారం

శ్రీ ఇష్ట కామేశ్వరి దేవీ కోవెల

1)శ్రీ శైలము ,మల్లి కార్జున శిఖరమునకు 11 కిలో మీటర్ల గూరంలో

నెక్కంటి - పాలుట్ల మార్గములో , నెలకొని ఉన్నది

"పరంఏశునికై తపస్సు చేయుచున్న పార్వతీదేవి అవతారమైన "శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవీ కోవెల".

2)శ్రీ శైలము దేవ స్థానములోని పూజారులే , నిత్యమూ ఇచ్చటకు

ఉదయము వచ్చి ,పూజలు నిర్వహిస్తున్నారు.

3)క్వార్ట్జ్ రాతిలో చెక్కిన ఈ మూర్తి , 8-9 శతాబ్దముల నాటిది.

4)కుడి చేతిలో రుద్రాక్ష మాలను, ఎడమ చేత శివ లింగమును ,

వెనుకవైపున్న ఇరు హస్తములలో కలువ మొగ్గలను ధరియించిన చతుర్భుజాలు కల దేవత ఈమె.

పాన పట్టము వంటి పీఠముపైన ,ముకుళిత నయనములతో ,

ఈమె కిరీట ధారిణిగా కొలువై ఉన్నది.

"విష్ణు ధర్మోత్తర పురాణము"లో ఇట్టి సౌందర్య విశేషాలతో అమ్మ వారు వర్ణించ బడి ఉన్నారు.

5)శ్రీశైల క్షేత్రానికి తూర్పు దిక్కుగా 24 కిలో మీటర్ల దూరంలో ఉన్నారు "ఇష్ట కామేశ్వరీ అమ్మ వారు".

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...