24, జులై 2015, శుక్రవారం

కేరళ, 3 temples

ఎటు చూసినా, పుష్కరముల సంబరములు, 
గోదావరిలో స్నానం చేసిన రోజునే కృష్ణానదిలో కూడా చేయవలెను -  
ఈ మంచి సంప్రదాయాన్ని చాలామంది పాటిస్తున్నారు. 
ఈ విశ్వాసాన్ని పాటించి, క్రితం పుష్కరములు - అంటే 
క్రిష్ణపుష్కరములప్పుడుక్రిష్ణానదిలో పవిత్రస్నానాలు చేసాము, 
వెంటనే విజయవాడ నుండి మేము రాజమండ్రికి వెళ్ళాము. 
రాజమహేంద్రి వద్ద - గోదావరీ ఝరిని స్నానాలు చేసాము, భక్తిపరవశులమైనాము.  
*****************************************,

ఒకే పరుగున కొన్ని పుణ్యక్షేత్రములను దర్శించుకోవాలనే ఆచారం, హుషారును కలిగిస్తుంది. 
ఈ కోవలోనివే కేరళలోని ముచ్చటగా నెలకొన్న మూడు శైవ ఆలయాలు.  
1] వైకోం ; 2] కడతుర్తి ; 3] ఎట్టుమన్నార్. 

ఖరుడు అనే రాక్షసుడు చిదంబరం లో ఉన్న 'మాల్యవంతుని' వద్దకు వెళ్ళాడు. 
మాల్యవాన్ వద్ద విద్యలు నేర్చుకున్నాడు. 
అనంతరం ఖరాసురుడు తపస్సు చేసి, మూడు శివలింగములను వరములుగా పొందాడు. 
( రామాయణము లో ఖరుడు ) హిమాలయాలలోని తన రాజ్యానికి పయనమైనాడు ఆ దానవుడు.  
 రెండు చేతులలో రెండు లింగాలను, మెడలో ఒక లింగమును పెట్టుకున్నా డు. 
గృహోన్ముఖుడు ఐన ఖరుడు మార్గాయాసముతో త్రిలింగములను 
భూమిపై ఉంచి, కునుకు తీసాడు. మేలుకునిన తర్వాత 
ఆ మూడు సదాశివ లింగములను  తీయబోగా, అవి ఎంతకీ ఊడి రాలేదు. 
శివుని ఆజ్ఞ - అని వానిని ఆ సీమలలోనే ప్రతిష్ట చేసి పూజించసాగాడు ఖరుడు. 
=========

ఆ త్రిలింగాలు కేరళలో పుణ్యక్షేత్రములుగా వెలిసినవి.
అవి - 1] వైకోం ; 2] కడతుర్తి ; 3] ఎట్టుమన్నార్.
========= 

ఖరుని గళమున పట్టుకున్న ఈశుని లింగము - "కడతురుతి" ; 
దానవుని ఎడమ చేతిలోని లింగము - "ఎట్టుమనూర్" ;   
కుడి చేత లింగము - "వైకోమ్" కోవెలలు వెలిసినవి. 
"వైకోమ్ మహదేవ ఆలయ కళ" , పేరెన్నిక కలిగినది.
కేరళలో పెద్ద గుడి, 8 ఎకరములలో ఉన్న గుడి వైకోమ్  కోవెల ఉన్నది. 
=========

కడల్ తురుత్ = అనగా "సముద్రము నుండి వెలువడినది" 
అని అర్ధం.
(Kadal thuruth , meaning near to the beach)
అరేబియా కడలి నుండి ఉబికి వచ్చిన నేల - అని భావం.
పరశురాముడు, వ్యాఘ్రపాద మహర్షి - ఈ సీమ వెలయడానికి కారణము ఐనారు. 
కడతురుత్తి స్థలగాథలు ఈ ఇరువురి మునులతో ముడిపడినవి. 
ఈ మూడు కోవెలలను ఒకే పర్యాయాన దర్శించుకొనుట పుణ్యప్రదమని - భక్తుల విశ్వాసం.
అందువలన భక్తులు వీలైనంతవరకు ఒక్క రోజే ఈ త్రి దేవాలయాలను దర్శించు ప్రయత్నాలు చేస్తారు. 

********************************************, 

eTu chuusinaa, pushkaramula sambaramulu,   
gOdaawarilO snaanam chEsina rOjunE 
kRshNA nadilO kUDA chEyawalenu - 
I mamchi sampradaayaanni chaalaamamdi pATistunnaaru.
ii wiSwaasaanni pATimchi, kritam pushkaramulu - amTE 
krishNapushkaramulappuDu mEmu kUDA krishNAnadilO 
pawitrasnaanaalu chEsaamu, wemTanE wijayawaaaea numdi 
mEmu raajamamDriki weLLAmu.
raajamahEmdri wadda - gOdaawarii jharini snaanaalu chEsaamu, 
bhaktiparawaSulamainaamu. 
okE paruguna konni puNyakshEtramulanu darSimchukOwaalanE aachaaram, 
hushaarunu kaligistumdi. ii kOwalOniwE kEraLalOni 
muchchaTagaa nelakonna muuDu Saiwa aalayaalu. 

******************

1] waikOm ; 2] kaDaturti ; 3] eTTumannAr. 
 kharuDu anE rAkshasuDu tapassu chEsi, 
mUDu Siwalimgamulanu waramulugaa 
pomdaaDu. remDu chEtulalO remDu limgaalanu, 
meDalO oka limgamunu peTTukunnaa Du. 
maargaayaasamutO waanini aayaa siimalamdu umchaaDu.
aa trilimgaalu kEaLalO puNyakshEtramulugaa welisinawi.
awi - 1] waikOm ; 2] kaDaturti ; 3] eTTumannAr.
kharuni gaLamuna paTTukunna ISuni limgamu - "kaDaturuti" ; 
daanawuni eDama chEtilOni limgamu - "eTTumanUr" ;   
kuDi chEta limgamu - "waikOmm mahadEwa aalaya kaLa" 
pErennika kaliginadi.
kEraLalO pedda guDi, 8 ekaramulalO unna guDi waikOmm kOwela.

ii muuDu kOwelalanu okE paryaayaana darSimchukonuTa 
puNyapradamani - bhaktula wiSwAsam.
amduwalana bhaktulu wiilainamtawaraku okka rOjE tri dEwaalayaalanu 
darSimchu prayatnaalu chEstaaru. 

అఖిలవనిత
Pageview chart 32125 pageviews - 790 posts, last published on Jul 23, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59946 pageviews - 1019 posts, last published on Jun 29, 2015 - 7 followers

Telugu Ratna Malika
Pageview chart 4501 pageviews - 127 posts, last published on Jun 22, 2015

29, జూన్ 2015, సోమవారం

అదిగో ద్వారక! ఆలమందలవిగో!

తిరుపతి వేంకటకవులు"అష్టావధానప్రక్రియ”కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి 
అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు.
చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ “జతగా చేరి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను” ప్రోత్సహించారు. 
చిత్రమేమిటంటే ఆ ఇద్దరు ఒకే ఊరివారు కారు. ఒకరిది ఆ నాడు ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న యానాం
ఇంకొకరిది భీమవరం వద్ద ఎండగండి అనే కుగ్రామము. 
ఈ కవిద్వయం ఆశుపద్యోక్తులలో అద్వితీయ ఛందోవిన్యాసాలను చేసారు, హాస్య దామినీ ఝటిత్ చమక్కులను మెరిపించారు. నాటకములకు వీరి పద్యములు ఆచంద్రతారార్కం నిలిచే ‘కొటేషన్ లుగా స్థిరపడినవి అంటే అతిశయోక్తి కాదు. 
దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి- తెనుగు అక్షర గోదావరీ దరిని విహరించే రీతిగా దోహదము చేసిన వ్యక్తి చర్లబ్రహ్మయ్యశాస్త్రి. ఆ కవిద్వయానికి కోమలమైన కవితల అల్లికలను నేర్పారు. 
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తొలుత “పద్య రచన, గోణము కట్టుట, పద్యాలను” చెప్పగలిగారు.
అటు తర్వాత చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తనకు కవితాప్రయాణములో జంటగా ఉండగలిగిన దివాకర్ల తిరుపతి శాస్త్రికి ఛందోబద్ధ పద్య, కావ్య రచనలను సాధన చేయించారు. 
కనుకనే “చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి నాకు గురుతుల్యులు” అని పేర్కొని, దివాకర్ల తిరుపతి శాస్త్రి, తన గురుస్థానములో చెళ్ళపిళ్ళ గారిని ఉంచుకుని, ఆరాధనా భావంతో మెలిగారు.
- - - - -

పౌరాణిక నాటకముల ప్రదర్శనలకై అనేక నాటకసంఘములూ, థియేటర్లు వెలిసినవి అంటే అప్పట్లో పౌరాణిక నాటకములు పట్టిన రాజ యోగము ఎంతటి శిఖరాగ్రాలను అధిరోహించినవో- వేరే చెప్పనవసరం లేదు.
అప్పుడే మూకీలు, తర్వాత టాకీలూ వచ్చినవి. ప్రదర్శనారంగములు సాహితీ అక్షయపాత్రలనుండి పౌరాణిక నాటకములు, ప్రాచీన ఇతిహాస, జానపద కథలు- సునాయాసంగా గైకొన్నవి.
- - - - -
“పాండవోద్యోగ విజయాలు” ప్రభావం సంఘంలో సహస్రకిరణతేజములైనవి. అప్పటిదాకా పండితుల జ్ఞానశాలలకు మాత్రమే పరిమితమైన పద్య, సంస్కృత భాషాపదసుధా వర్షధారలు విద్యాగంధం లేని పామరుల దోసిళ్ళలో కురిసింది. నిత్యజీవితంలో- వాడుకునే జాతీయాల ఓలె వీరి పద్దెములు మారినవి.
“అదిగో ద్వారక! ఆలమందలవిగో…”
“వచ్చినవాడు అర్జునుడు, అవశ్యము గెల్తుమనంగరాదు..”
“బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ …………"
"బావా! ఎక్కడనుండి రాక ఇటకు? ఎల్లరున్ సుఖులే కదా?........."
“జెండాపై కపిరాజు ……”
“అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు……”
“అన్నమాట జవదాటని……”
ఇలాగ, ఒకటేమిటి? వీరి “శ్రీకృష్ణ రాయబార (పాండవోద్యోగ విజయములు; – పడక సీను)  ఒక్కమాటలో చెప్పాలంటే "సినిమాలకు లభించిన ఆదిబిక్ష వీరి నాటకరచనలు. 
సినిమాలకు మొదటి నటీనటులు, విదూషకులు సంభాషణలకూ, పాటలకూ, పద్య గాన, సంగీతబాణీలకూ 
శ్రీకారం చుట్టినవానిలో తిరుపతి వేంకట కవుల రచనలకు ప్రధమ తాంబూలం దక్కుతుంది.

"జంటకవులు" అనే పదానికి నిఘంటువులో చేర్చవలసిన పదమౌక్తికముగా మార్చినవారు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. 
చర్ల బ్రహ్మయ్యశాస్త్రి శిష్యులైన తిరుపతి వేంకట కవులు రాయబారమునకు వెళ్ళిన కృష్ణుని సంభాషణలు ఇలాగే ఉంటాయి- అనిపించేలా వెదజల్లిన పన్నీటిఅత్తరు అక్షరముల గురుమూర్తులు.

- - - - -

తమ రచనలలో చిరంజీవులైన తిరుపతి వేంకటకవులు ఆశువుగా అనేక కవితలు చెప్పారు. అనేక అష్టావధానములు, శతావధానములు జరిగినవి. వీరి ప్రతి ప్రదర్శనా సభికులకు పదేపదే చెప్పుకునే మంచి సంఘటనలుగా మారుతూండేవి. ఒకసారి ఒక సాహితీ సభలో తటస్థ పడిన విశేషం ఇది!

- - - - -

కిమ్ కవీంద్ర ఘటా పంచానన:

తిరుపతి వేంకట కవులకి “కిమ్ కవీంద్ర ఘటా పంచానన “ అనే బిరుదు ఉన్నది. ఒక సమావేశములో అష్టావధానముప్రదర్శనలో ఒకతను వింత ప్రశ్నను, జవాబునూ సృజించాడు.
ప్రక్రియ:  దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, అప్రస్తుతప్రసంగము (అడిగే వాడికి చెప్పే వాడు లోకువ- ఇక్కడ పృచ్ఛకుడు తమాషాప్రశ్నలు వేసి, అవధానీ ఖంగు తినిపించాలని ప్రయత్నిస్తూంటాడు), గంటల లెక్కను విని చెప్పుట, వ్యస్త అక్షరి, అనే 8 విభాగములు ఒండే సాహితీ క్రీడ. ఎనిమిది అంశములు కాస్త భేదములతో ఉంచి నిర్వహిస్తారు.

పృచ్ఛకుడు, రవంత గేలిచేస్తూ “కిమ్ కవీంద్ర ఘటా పంచానన”- అంటే. “ అంటూ అక్షరాక్షరాన్నీ విడగొట్టి, భావాన్ని చించేసి- ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించాడు.

“కిమ్ కవీంద్ర= జల విహంగాలలో గొప్పవి ఐనట్టి: ఘటా = పెద్ద గుంపు; పంచ =బాగా వెడల్పు ఐన; అవననము = ముఖము కలిగిన: అనగా ఈ బిరుదార్ధమును “పెద్ద కొంగలు” అని వివరణను చెప్పుకోగలము.

“కిమ్ కవీంద్ర= జల విహంగాలలో గొప్పవి ఐనట్టి: ఘటా = పెద్ద గుంపు; పంచ =బాగా వెడల్పు ఐన; అవననము = వదనము (ఫచె) కలిగిన: అనగా ఈ బిరుదార్ధమును “పెద్ద కొంగలు” అని వివరణను చెప్పుకోగలము.” కాశీనాధుని వక్రభాష్యం విని సభికులు అవాక్కయ్యారు.

చెళ్ళపిళ్ళ చటుక్కున ఇలాగ అన్నారు “ యదార్ధవాక్కులు వీరివి. కాశీనాధులు గారు సెలవిచ్చినట్లు మా బిరుదుకు అర్ధం ‘ఘన బకములే!’ ఇక మరో అంశం సైతం మన నుడువులలో చోటు చేసుకోవడం సముచితము. అదేమిటనగా-కాశీనాధ నామధేయానికి కూడా విలక్షణత ఉన్నది. “కా” = నీళ్ళు; “అశి”= తిరుగాడునట: పదార్ధము ఏమనగా- ‘ పెద్ద చేపలు ’. అందుచేత ప్రస్తుత ప్రసంగమున వారి పాలిట పెద్ద కొంగలం మేమే!”

కిమ్ మత్స్యం గప్ చుప్! ఇక కాశీనాధులు కిమిన్నాస్తి.

- - - - -

{ఆచార్యులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి - సెప్టెంబర్ 5 వ తేదీ 2013 న “టీచర్స్ డే” – ని పురస్కరింఛి )

***********************************************;

కిమ్ కవీంద్ర ఘటా పంచానన - కాశీనాధులు కిమిన్నాస్తి 
newaavakaaya  {LINK web patrika} :- 
 User Rating:  / 4 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma kumari
Monday, 23 September 2013 15:22
Hits: 652
***********************************************;

అఖిలవనిత
Pageview chart 31718 pageviews - 788 posts, last published on Jun 28, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59169 pageviews - 1018 posts, last published on Jun 24, 2015 - 7 followers

Telugu Ratna Malika
Pageview chart 4430 pageviews - 127 posts, last published on Jun 22, 2015

24, జూన్ 2015, బుధవారం

వెయ్యినూటపదహార్లు

నా మానసపుత్రిక కోణమానిని బ్లాగు
పోస్టులు 1016 పూర్తి ఐనవి.
అక్షరాలా వెయ్యిన్నూటపదహార్లు ; 
నా మాతృభాష తెలుగు పట్ల ఆపేక్ష, 
నా వ్యాస, గీతాది రచనలతో 
ఈ సాహితీ లతలను ఎగబ్రాకేలా చేసినవి.

గూగుల్ వంటి ఇంటర్ నెట్ వారు కల్పించిన సదుపాయాలు, 
లేఖిని వంటి  ఉపకరణాలు, ఇందుకు ప్రోద్బలములైనవి. 
కూడలి, బ్లాగిల్లు, జల్లెడ, మాలిక ;  
నా రచనలను ప్రచురించి, ప్రోత్సహిస్తున్న వెబ్ పత్రికలు-
న్యూఆవకాయ, పుస్తకం. నెట్, జాబిల్లి, కిడ్స్ ఫర్ కిడ్స్.ఇన్ 

మున్నగు పత్రికలకు కృతజ్ఞతా పుష్పాంజలి. 

ఇక చాలని అనుకోకుండా, ఇకపై చాలించాలని చతికిలపడకుండా - 
వీలైతే మళ్ళీ కొత్త బ్లాగు ద్వారా 
ఈ సాహితీ ఆరాధనను కొనసాగించాలని నా తలపు. 

అంతర్జాల ఆంధ్రభాష పరిపుష్ఠి గాంచుటకు వెబ్ పత్రికలు,   
అగ్రెగేటర్లు, విజ్ఞాన సంధాయినులు ఎందరి నిష్కామకృషి ఉన్నదో కదా!
చదువరులకు, సాహితీ అభిమానులకు, యావత్ సారస్వత బంధు మిత్రులకు, 
నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తూన్న నా కుటుంబసభ్యులకు ధన్యవాదాలతో - 
ఏప్రిల్ 2015 చైత్రమాసం, -  
                 కాదంబరి / కుసుమాంబ (1955) 

===================================












naa maanasaputrika kONamaanini blaagu
pOsTulu 1016 puurti ainawi.
aksharaalaa weyyinnuuTapadahaarlu ; 
naa maatRBAsha telugu paTla aapEksha, 
naa wyaasa, giitaadi rachanalatO 
naa saahitii latalanu egabraakElaa chEsinawi.
guugul wamTi imTar neT waaru kalpimchina sadupaayaalu, 
lEKini wamTi  upakaraNAlu, imduku prOdbalamulainawi. 

kuuDali, blaagillu, jalleDa, maalika ;  
naa rachanalanu prachurimchi, prOtsahistunna web patrikalu-

nyuuaawakaaya, pustakam. neT, jaabilli, kiDs phar kiDs.in munnagu   patrikalaku kRtaj~natA pushpaamjali.

ika chaalani anukOkumDA, ikapai chaalimchaalani chatikilapaDakumDA - wiilaitE maLLI kotta blaagu dwaaraa ii saahitii aaraadhananu konasaagimchaalani naa talapu. 
amtarjaala aamdhrabhaasha paripushThi gaamchuTaku web patrikalu,   agregETarlu, wij~naana samdhaayinulu emdari nishkaamakRshi unnadO kadaa!
chaduwarulaku, saahitii abhimaanulaku, 
yaawat saaraswata bamdhu mitrulaku, nannu aDugaDugunaa prOtsahistuunna naa kuTumbasabhyulaku dhanyawaadaalatO - 
Epril 2015 chaitramaasam, - 
             kaadambari / kusumaamba (1955) 

ఈశ్వర లింగములు ఎన్ని రీతులు?


శివ లింగములు 32 రకములు :- 
1. గంధ లింగము =  four parts of sandal paste, three parts of kumkumam and two parts of musk ; 
2. పుష్ప లింగము ; 
3. గోశక్రు లింగము = గోధుమ రంగు ఆవు/ 
కపిల ధేనువు యొక్క   పేడతో చేసిన లింగము :
4. వాలుకా లింగము :- మెత్తని ఇసుక/; 
             విద్యాధరులు పూజించు గొప్ప ఉనికి; 
5. యవ గోధుమ శాలిజ లింగము ; 
6. శిత ఖండ లింగము = శర్కర / చక్కెర;
7. లవణ లింగము = (salt mixed with the powder of Hartal -  and Trikatukala); 
8. తిలపిష్ఠ లింగము ; 
9. భస్మ లింగము ; 
10. గుడా లింగము = బెల్లం / శర్కర ; 
11. వంశాంకుర లింగము = వెదురు ఆకులు ; 
12. పిష్ఠ లింగము = బియ్యప్పిండి
13. దధి దుగ్ధ లింగము = 
       నీళ్ళు వడకట్టిన పెరుగు,పెరుగు, పాలు ; 
14. ఫల లింగము =  పండ్లు ; 
15.ధాత్రీ లింగము = రాచ ఉసిరిక ; 
      (acid fruit – phyllanthus Emblica and bestows liberation) 
16. నవనీత లింగము = వెన్న ; 
17. దూర్వాకదజ లింగము / గరిక లింగము = 
(kind of grass – agrostis linaries) ; 
18.  కర్పూర లింగము ; 
19. అయస్కాంత లింగము ; 
20. మౌక్తిక లింగము ; 
21. సువర్ణ లింగము ;  
22. రజత లింగము ; 
23. పిట్ఠల లింగము/ కాంస్య లింగము = 
(an alloy of brass and bell metal ) 
24. త్రపు లింగము (తగరము లింగము) ; 
25. ఆయస లింగము = మైలతుత్తం/ (vitroil of sulphate); 
26. సీస లింగము = lead ; 
27. అష్టధాతు లింగము = minerals 
28. అష్టలోహ లింగము = metals 
29. స్ఫటిక లింగము = crystal 
30. పాదర లింగము (పాదరము = mercury) ; 
31. వైఢూర్య లింగము = lapis ;    
32. ధాన్య లింగము ; 
ఇవీ మహాదేవుని 32 విధములైన లింగములు 
 ===============================================

Siwa limgamulu 32 rakamulu :- 

1. gamdha limgamu ; 2. pushpa limgamu ; 3. gOSakru limgamu ;
4. vaalukaa limgamu ; 5. yawa gOdhuma SAlija limgamu ; 6. Sita khamDa limgamu ;
7. lawaNa limgamu ; 8. tilaka pishTha limgamu ; 9 bhasma limgamu ; 10. guDA limgamu ; 11. wamSAmkura limgamu ; 12. pishTha 
limgamu ; 
13. dadhi dugdha limgamu ;  14. phala limgamu ; 15.dhaatrii limgamu ; 16. nawaniita limgamu ; 17.
duurwaakadaja limgamu / garika limgamu ; 18.  karpuura limgamu ; 
19. ayaskaamta limgamu ; 20. mauktika limgamu ; 21. suwarNa 
limgamu ;  
22. rajata limgamu ; 23. piTThala limgamu/ kaamsya limgamu ; 24. trapu limgamu 
 25. aayasa limgamu  ; 26. siisa 
limgamu ; 27. ashTadhAtu limgamu ; 
28. ashTalOha limgamu ; 29. phaTika limgamu ; 
30. paadara limgamu ; 31. 
dhaanya limgamu ; 32. 
dhaat
r
i ;  
         iwii mahaadEwuni 32 widhamulaina limgamulu :- 

 ****************************,

అఖిలవనిత
Pageview chart 31567 pageviews - 786 posts, last published on Jun 16, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం ;  59275 
Pageview chart 58930 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers 

Telugu Ratna Malika
Pageview chart 4414 pageviews - 127 posts, last published on Jun 22, 2015


2, మే 2015, శనివారం

యాళీ స్థంబాల కథ కమామీషు

దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. 
శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను "యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు. గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు -  ఇత్యాది నివాసములకు, దూలము, స్తంభాలు ఆధారములు. 
గుళ్ళు, గోపురముల స్తంభములను బోసిగా ఉంచకుండా, శిల్పములతో నింపి,  స్తంభములను చూపరులను అచ్చెరువు పొందేలా చేసేలాగా మలిచిన ప్రక్రియ, మన దక్షిణాదిన ఊపందుకున్నది. ఫలితంగా లక్షలాది చేతులు  శిల్పకళలను, జీవనోపాధిగా పొందినవి.
యాలీ సంస్కృతపదం "వ్యాల" నుండి పుట్టింది. 
ప్రతిమా శాస్త్రమునకు మేలిమిమలుపులు ఈ "యాళీ స్తంభముల శిల్పకళలు". 
నిజానికి యాలీ శిల్పం కొన్ని జంతు స్వరూప సమ్మేళనము. సింహం తల, ఏనుగు దంతాలు,  పాము తోక - ఇత్యాదుల మిశ్రమ రూపం యాలీ. ఒకరకంగా ఇవి త్రి డైమెన్షన్ విగ్రహాలని చెప్పవచ్చు.
సింహ వ్యాల, గజ వ్యాల, అశ్వ వ్యాల (గుర్రము వదనం), శ్వాన వ్యాల (కుక్క ముఖము) ; ఎలుక ముఖం ఇత్యాది ఆవిష్కృతులు అగుపడుతున్నవి. ఇదే మాదిరిగా ఇతర జంతువుల ముఖములు సైతం కలిగినవి. వాటి నడుములు సన్నగా, నాజూకుగా ఉంటాయి. దుష్ట శక్తులను నిలువరించే యక్షిణీ దేవతలు, శక్తులు, ప్రతీకలుగా యాలీ కళాభినివేశం అభివృద్ధి గాంచింది.
యాలీ ప్రతిమా కళలలకు ప్రోత్సాహం లభించినది.అత్యధిక శాతం తమిళ నాడులోని, సేలం జిల్లాలోని "తరమంగళం"  ఇందుకు నిదర్శనం. శిల్పనైపుణ్య శైలికి అత్యధిక ఆస్కారం కలిగించిన రీతి స్తంభములను రూపొందించి విగ్రహములు, ప్రతిమలు, దేవాలయాలలోని అణువు అణువునూ కళా పూర్ణంగా తీర్చిదిద్దిన విధానం, మన భారతదేశములోనే ఒనగూడినది, ఇది మనకు గర్వకారణం.
తరమంగళంలోని ఆలయమే కాకుండా కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో, ఇక్కేరి అఘోరేశ్వర ఆలయం, చిక్కబళ్ళాపూర్ లోని 'భోగ నందీశ్వర ', రంగనాథ కోవెలలు కూడా పేరెన్నికగన్నవి. ప్రవేశద్వారమునకు, గేటుకు ఇరు ప్రక్కలమకరం, మొసలి వలె వెడల్పుగా నిలబడి ఉన్న శిల్పాలు యాలీ కళాప్రతిభను నింపుకుని, సందర్శకులకు స్వాగతం పలుకుతున్నవి.
యాలీ జంతువు  యొక్క తెరిచిన నోటిలో, నోటిని చీలుస్తున్న మనిషి బొమ్మను చెక్కగలిగారు అంటే శిల్పుల చేతిలోని ఉలి శక్తికి కోట్ల ప్రశంసలు. ఉలిలో పరసువేదీ శక్తిని నింపి, పెను శిలలను మలిచి, సుందరమయం చేసినది వారి ప్రతిభ. 
******

ఈ యాలీ విగ్రహాలను ఆలయాల్లోనే కాక ఇతరత్ర కూడా చూడవచ్చు. 
ఉదాహరణకు వీణలను గమనించండి! వీణల కొమ్ములు - హంస, సింహం వంటి జంతువుల బొమ్మలు ఉంటాయి కదా! ఇవి కూడా యాలీ విగ్రహాల కోవకే చెందుతాయి.
పాతాళభైరవి ఇత్యాది సినిమాలలో మాంత్రికులు, మాయలమారాఠీలు పట్టుకున్న మంత్రదండములను గమనిస్తే అవి యాలీ విగ్రహాలనే పోలివుంటాయని అర్ధం ఔతుంది, 
క్రితం శతాబ్దం లో జమీందారులు, భట్రాజులు, వృద్ధులు చేతికర్రలని పట్టుకుని నడిచే వారు. చేతి కర్ర యొక్క పిడి పైన పసిడి, వెండి తొడుగులను పెట్టేవారు. యాలీకళకు అనుసరణ అవి. 
******
అందరూ రోజూ చూసే అంశం, గుళ్ళలో మూలవిరాట్ వెనుక సింహాసనం  మాదిరి, వెండి తోరణం వంటిది - ఉంటున్నది, అది "మకర తోరణం". యాలీ డిజైనుకు అనుసరణ, మొసలి వంటి జంతువును అందంగా చేసిన శిల్ప ఆభరణ ప్రజ్ఞకు నిదర్శనం.
ఓరుగల్లు - అనగా వరంగల్ లోని వేయిస్తంభాల గుడి ప్రవేశద్వారమునకు , పైన, ఇరు వైపులా వయ్యారి భామినుల బొమ్మలు ఉన్నవి. యాలీ జంతువుకు బదులుగా ఇక్కడ - సౌందర్య వనితలను ఉంచారు. నాగిని, /బదనిక,/ మదనిక మున్నగు పేర్లు కలిగినవి. భట్టివిక్రమార్కుని సింహాసనము చేరగల మెట్లు, ఆ సోపానములకు రెండు వైపుల నిలబడిఉన్న "స్థాలభంజికలు" - యాలీ అనుసరణలైనవి, సౌందర్య పార్శ్వం కలిగినవి. 
కర్ణాటకలోని  రంగనాధ దేవాలయాన్ని గురించి ఒకసారి పరిశీలనాంశాలను చూద్దాము. 
కోలారుసీమనందు రంగస్థల శ్రీరంగనాధ స్వామి కోవెలలోని స్తంభాలకు  గొప్ప విశేషాలు వాస్తు, శిల్ప ప్రావీణ్యాలకు ప్రతిబింబములు. ఇక్కడి "యాళీ కంబములు" / "యాలీ స్తంభములు" : శిల్పవిన్యాసాలు సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తున్నవి. 
కర్ణాటకరాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాకు వెళ్దాము. అక్కడ 'నీర్తాడి' లోని కోవెల , యాలీ స్థంభములపై ఆధారమైనవి.
హంపీ నగరము :-
లేపాక్షి మన ఆంధ్రదేశములో ఉన్నది. ఇక్కడి వీరభద్ర ఆలయమునందు ఈ శైలి ఉన్నది.
మేల్ కోటె : చెలువ నారాయణ మందిరము :- "Hyppogryphs" శిల్పరీతి కలిగినవి.
హంపీ మండపము "కుదురె గొంబె" ( "Kudure Gombe") ఆకర్షణీయత గొప్పది.
గుర్రము బొమ్మ ఇది.
******
ఇంతకీ, యాలి  అనే మాట ఎక్కడిది?  
"వ్యాల", "విడల" అని కూడా పిలుస్తారు. రెండు, మూడు జంతువులను, వృత్త లతా, పుష్పముల వలె ఉన్న డిజైన్లు, అందముగా ఉండే రీతిగా చేసినట్టివి. శిల్పి కల్పనాసామర్ధ్యానికి మచ్చుతునకలు.  
దక్షిణభారత ఆలయకళలలో అంతర్భాగములై, చైతన్యభరితములైనవి యాలీ స్తంభములు.
******
చైనా "డ్రాగన్" / "రెక్కల మొసలి"/ "నిప్పుల గుర్రం" ఇటువంటిదే! చీనా, టిబెట్ దేశాలలో ఇటువంటి మాస్కులతోనూ, బొమ్మలతోనూ నాట్యాలు చేస్తూ, వారి పండుగలను కనువిందు గావిస్తున్నారు.
మన దేశంలోని "యాలి కళాబింబము" లని ఆధారం చేసుకుని, 'పండుగల క్రీడా, కళల'ను రసభరితంగా, నేత్రపర్వంగా రూపొందించుకొనవలసిన ఆవశ్యకతను అందరూ గుర్తించుకొని, మన పర్వములను ప్రవృద్ధమానం గావించవలసి ఉన్నది.
@@@@@
Tags :- #tara mangalam, Salem dt. Tamilnadu:::
chikkaballapur, Ikkeri; #

కోణమానిని - పూర్తిగా వెయ్యిన్నూటపదహార్లు posts now
***************************
 యాళీ స్థంబాల కథ కమామీషు User Rating:  / 2
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Tuesday, 31 March 2015 08:26 ; Hits: 272
 1 ఏప్రిల్ 2015 బుధవారం ; 
నేటి - 2 మే  2015- వ్యూస్ 58980 -
@@@@@
link for ESSAY  (web magazine 'newaavakaaya')

1, ఏప్రిల్ 2015, బుధవారం

మోడీ స్క్రిప్ట్

"మోడీ స్క్రిప్ట్" -   అనగా ఏమిటి? 
మోడీ పేరుతో ' లిపి' ఉన్నది, ఇది ఆశ్చర్య జనకమే!
సంభ్రమ హేతువు, ఐనా ఆసక్తికరమైన విశేషమే కదూ ఇది!  
ఈ 'మోడీ లిపి ' అనేది, మరాఠీ భాషలో ఉన్నది. అసలు ఇట్లాంటి స్క్రిప్టు ఉన్నదని కనుగొన్నది ఎవరు? 'హేమాద్రిపంత్' ఈ అంశాన్ని తెలుసుకున్నారు. పంత్ అనేక గ్రంధాలను రచన చేసారు. 
ఆతని పుస్త్కములందు  'వైద్యక్ శాస్త్ర ' మున్నగునవి వాసికెక్కినవి. 
జొన్న బాజ్రా సేద్యాన్ని ప్రోత్సహించారు పంత్.   

%%%%%%%%%%

సింధు దుర్గ్ నివాసి, నాసిక్ ప్రాంత వాసి. పంత్ - ముంబై హైకోర్టు లో 
ఆస్థి పంపకం, వారసత్వం ఇత్యాది విషయ సంబంధి ఐన డాక్యుమెంట్సు ను చదవాల్సివచ్చింది. 
ఆ పత్రాలు 700 ఏళ్ళ క్రితం వి. జస్టిస్ ప్రతిభా ఉపాసని 
'నా బాల్యప్రాయాన నేర్చుకున్నాను. అతి ప్రయత్నం మీద - ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవలసిన సందర్భం ఎదురైంది నాకు." అన్నారు. 
ఇటువంటి సరి కొత్త - పాత లిపిని - న్యాయస్థానాలలో నేర్చుకునే అవసరం కలగడం వలన, "మోడీ లిపి"  అనేది ఒకప్పుడు ఉన్నదని ' ప్రజలందరికి తెలిసివచ్చింది, ఆశ్చర్యచకితులైనారు.
ఔత్సాహికులు, 'తమకు మోడీలిపితో పని లేకున్నప్పటికీ , జిజ్ఞాసతో అభ్యసించసాగారు. 
మహారాష్ట్రలో మోడీ లిపి శిక్షణా కేంద్రములు వెలిసినవి. 
మోడీ లిపి శిక్షణ్ ప్రచారక్ మండళ్ స్థాపన జరిగి మూడు పుష్కరములు, అనగా పాతిక ఏళ్ళు పైన మాటే! 
లాయర్లు వంటి వారు వృత్తికి దోహదపడే అంశం , కనుక కోచింగ్ సెంటర్ లలో చేరసాగారు. 
భాషా తీరుతెన్నుల పట్ల ఆసక్తి కలిగిన వారు అనేకులు మోడీ లిపిని నేర్చుకుంటున్నారు. 
దాదాపు 7వేలమంది Modi Script  ట్యుటోరియల్స్ లో విద్యార్ధులుగా చేరి, ఉత్తీర్ణులైనారు. 
మోడీ లిపికి అనువాదకులు ఉపాధి పొందుతున్నారు. మరాఠ్వాడా జనులు, తమవిసిటింగ్ కార్డు పైన, మోడీ లిపి, మరాఠీ - రండు భాషలనూ ఒకే కార్డు లో ముద్రణ చేయించుకుంటున్నారు.  

మోడీ స్క్రిప్టు 13 వ శతాబ్దం లో హేమాద్రి పంత్ (= పండిత్) ప్రవేశపెట్టాడు. బ్రిటీషు వాళ్ళు ప్రవేశ పెట్టిన భాషను ఆనాడు, అక్కడి ప్రజలు తిరస్కరించారు. 1900 లలోని పత్రాలు ఇంగ్లీషులోనూ, మోడీ అక్షరములలోనూ ఉన్నవి. / కృషితో మోడీ స్క్రిప్టు  విరివిగా ఉపయోగం లో ఉండేది.
మోడీ స్క్రిప్టు :- మరాఠీ, గుజరాతీ ల కదంబమాలిక.  13 వ శతాబ్దములో వలసవచ్చిన గుజరాతీలు, వ్యాపారులు ఈ విధానాన్ని రూపొందించారు.            
హేమదపంతి/ హేమదపంత్ :-  
దేవగిరి పరిపాలన చేసిన శౌన యాదవ వంశీయులకు మంత్రి అయి, సమర్ధతతో యశస్సు నార్జించాడు. 
దేవగిరిని పరిపాలించిన యాదవుల మంత్రి ఇతను.
హేమాద్రి పంత్ అని ఖ్యాతి గాంచెను. 1259 - 1274 C.E.లలో - శ్యూన యాదవుల కొలువులో ఉండెను. మాధవ - ప్రభువు వద్ద ప్రధాన సలహాదారినిగా, ముఖ్యమంత్రిగా ఉద్యోగం చ్ సెను. 
ఈతని ఆధ్వర్యంలో రాజ్యాన - వర్తక వాణిజ్యాలు పెంపొందినవి. ఆర్ధీకభద్రతతో- సామ్రాజ్యాన సుఖశాంతులు నెలకొన్నవి.

వర్తకుల కొరకై - అప్పుడప్పుడూ, రహస్య లావాద్ వీలు, సమాచార ఆదానప్రదానాదుల కై, అవసరమై, కొత్త లిపిని నిర్మించెను, అద్క్ - మోడీ స్క్రిప్టు.  
ఉన్నతోద్యోగి, రామచంద్ర రాజు వద్ద, 'శ్రీకరణాధిప '  పదవీ గౌరవాన్ని పొందాడు . 
"చతుర్వర్గచింతామణి" సంకలనమును రూపకల్పన గావించినాడు. 
సంస్కృత ఎన్సైక్లోపేడియా ఈ ఉద్గ్రంధం. అగణిత శిల్పనిర్మాణములు పంత్ కీర్తిబావుటాను ఎగురవేసినవి. కోవెల నిర్మాణవిధానములందు "హేమదపంతి" ఉన్నతోద్యోగి, రామచంద్ర రాజు వద్ద, 'శ్రీకరణాధిప '  పదవీగౌరవాన్ని పొందాడు.  దేవగిరిని పరిపాలించిన యాదవుల మంత్రి ఇతను.
(Hemadapanti) :- అని ఒక నూతనశైలికి   పేరు వచ్చినది. 
ఇది ఆతని సామర్ధ్యతకు, పాలన,  కళలు, విజ్ఞానము,  విద్యలు, అన్ని కోణాలలో సామ్రాజ్యము సుసంపన్నమైనది.     
 కరణాధిపుని పదవిని నిష్పక్షపాతం గా నిర్వహించెను. 
పండరీపురము భక్తకోటికి పుణ్యయాత్రలకు ఎన్నదగినది. ఈ సుప్రసిద్ధ గుడిలో కొన్ని శిలా శాసనములు, పంత్ గొప్ప దాత, భూరి విరాళములను ఒసగెను, అని పేర్కొని ఉన్నవి.  


(RELATED KEYWORDS:) :-   
  
****************************,
Essay - Modi script :- (NewAvakAya.com)
58071 ; 58797 ;

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 57530 pageviews - 1015 posts, last published on Feb 24, 2015 - 7 followers
Create new postGo to post listView blog
అఖిలవనిత
Pageview chart 30748 pageviews - 781 posts, last published on Feb 23, 2015 - 1 comment awaiting moderation
Create new postGo to post listView blog
Telugu Ratna Malika

Pageview chart 4176 pageviews - 126 posts, last published on Jan 14, 2015


24, ఫిబ్రవరి 2015, మంగళవారం

వారముల పేర్లతో ఊళ్ళు, streets

""వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ": 
హోలీ ఆటపాటల మేలా ఇది.
ఈ మణిపూస అన్నమాచార్య సంకీర్తనా భాండాగారములోనిది.
వాడ - మొదలైన పదగుంఫన విదితమే!   
"వాడల వాడల వెంట వాఁడివో. " అని అన్నమయ్య సంకీర్తన చేసారు.
************************ 

వాడ , అంటే - పేట, వీధి అని అర్ధం. 
ఈ పదానికి మూలం మరాఠీ పదము ఐన "పేట్"/ "పేఠ్" = " పేట", వాడ.
తిరుమాడవీధి - మున్నగు పదాలు ఎరుకలో ఉన్నవే!
పేఠ్ – తెలుగున “పేట” అని ఉచ్ఛారణను పొందిన పదం.
పూనా పట్టణము మహారాష్ట్రలో వాణిజ్యకేంద్రము.
పూనా జనులకు - వారముల పేర్లతో ఉన్న వీధులు అక్కడ వ్యవహారములో ఉండి, సుపరిచితములైనవి.
పూనాలో ఇంచుమించు పద్ధెనిమిది పేటలలోని,
ఏడు  స్ట్రీట్స్ లకు = వీధులకు,వారముల నామములను కలిగి ఉన్నవి.
************************ 
17 – 18 శతాబ్దములలో వర్తకులు, ఆయా వీధులలో నిర్ణీత వారములందు మాత్రమే లావాదేవీలు, వర్తక కార్యకలాపాలను నిర్వర్తించే వారు.
నేడు పాతపట్టణముగా పూనావాసులకు, సంప్రదాయ కూడలిగా సుపరిచితమై ఉన్నది.
************************ 

సరే!  ఇప్పుడు మనం కొన్ని  జాగాలను ఇట్లాంటి వింత  ఉన్న  చూద్దాము.
భౌమ = భూమి సంబంధమైనది, భూమి పుత్ర - సూర్యుడు/ చంద్రుడు అని భావం. 
सार्वभौम - సార్వభౌమ:- సర్వ భూమినీ పరిపలన చేసేవాడు- చక్రవర్తి - అని అర్ధము. 
1] అ) ఆదివారము :- ఆదివారపు పేట –పేరు వినగానే తెలుస్తున్నది కదా!
తూర్పు గోదావరి జిల్లానందు, ద్రాక్షారామమునకు ఉత్తరదిశలో,
శివబాలయోగి దాదాపు పది, పన్నెండేళ్ళు తపస్సు చేసిన చోటు,
 Sunday Market , సంత – అని తాత్పర్యం. ఉన్నది.
2] భౌమ్య వారము:- Bhauma Nagar, Bhubaneswar - Odisha 
ఒరిస్సాలోని భువనేశ్వర్ లో "భౌమ నగర్" ఉన్నది. 
************************ 

 2] సోమవారము :-  
అ):- సోమవార పల్లె: - హుస్సేన్ జిల్లాలో, సులగోడు; ఆర్కల్ గుడ్ – 
 &) సోమవార్ పేట్ =  కొడగు , కర్ణాటక రాష్ట్రము లో ఉన్నది.
ఆ) :- విశాఖట్టణం – విశాఖ జిల్లాలోని, కశిం కోట మండలమున – సోమవారం గ్రామము ఉన్నది.
ఆ) వైరా మండలము లో; ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉన్నది. ఇది తెలంగాణా రాష్ట్రమునందు ఉన్నది.
#(Somavaram is a Village in Wyra Mandal

************************ 

 3] మంగళవారము
మంగళగౌరీ వ్రతము - స్త్రీలకు తెలిసిన నోము. 
మంగళగౌరీ - కోవెల "గయ" లో కలదు.
అ) మంగళవారము:- శ్రీకాకుళం లోని - ఇచ్ఛాపురం మండలమునందు - + ఉన్నది.
 Jammadevi perta village
] 1662 లో పెట్టిన పేరు. “అష్టపుర” అనే పేరు కలిగి ఉన్నది, పిమ్మట 
ఆ] మంగళవార పేట :- రాయచూరు నందు ఉన్నది. 
************************ 

3) బుధవారము:- 
అ) గన్నవరం , అజ్జనపూడి గ్రామం, క్రిష్ణా జిల్లా లో ఉన్నది.
ఆ) మధ్యప్రదేశ్ లో బుర్హాన్ పూర్ ; నేపా నగర్ డిస్ట్రిక్ట్ లో - బుధవార బజార్ ఉన్నది.
ఇ) బుధవారము:- బుధవార్ పేఠ్ . పూనా - నందు కలదు.  
1703 నాటిది. ఔరంగజేబ్ స్థాపించెను.

************************ 
గురువారము /  లక్ష్మీ వారం :-
అని ఆంధ్రప్రదేశ్ లో - కొన్ని జిల్లాలలో వాడుకలో ఉన్నది.
మార్గశిర లక్ష్మివార వ్రతం - లక్ష్మీ పూజకు విశిష్టత కలిగిఉన్నది. 
పుష్యమాసము, మార్గశీర్షమాసములందున - గురువారం చేస్తున్న నోము మార్గశిర లక్ష్మీవార వ్రతము. 
అ) లక్ష్మివారపుపేట -రాజమండ్రి 
ఆ) గురువారపేట - పూనా 
************************ 

శుక్రవరము : - 
శ్రావణ శుక్రవారము, వరలక్ష్మీవ్రతము - ఇంటింటా గృహిణులు చేస్తూన్న వ్రతము.
అ) శుక్రవారమండపం . తూర్పు గోదావరి జిల్లాలోని కపిలేశ్వర పురం - లో ఉన్నది.  
కపిలేశ్వర అంతర్ భాగము, ఐరామ కాల్ (Ayiramkaal mandap) రీతి కలిగి ఉన్నది.
ఆ) paaliya rai shrine నందు కొలువై ఉన్నారు అమ్మవారు.  
"శుక్రవార అమ్మన్" :-
త్రిలోకజనని ఐన అమ్మవారు - పార్వతీదేవి అవతారము.
ఐ) "శుక్రవార అమ్మన్" , అంబాల్, అంబాళ్. 
త్రిపురసుందరి, చొక్కనాయకి, సుందరనాయకి – 
         మొదలైన నామావళితో కీర్తించబడుచున్నది.
************************ 

శనివారము :- 
అ) శనివారవాడ – అను పేరు కలిగిన వీధి పూనా లో ఉన్నది. 
ఇది ఒక రాజభవనము.  ఈ Royal Palace  1746 కట్టడము. 
పీష్వాలు 1838 వరకు పరిపాలించారు/
************************ 

[ వారముల పేర్లతో ఊళ్ళు, పల్లెలు, వీధులు, పేటలు, వాడలు ]
సేకరణా రచన:- కాదంబరికుసుమాంబ 

 Spinx amidst 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...