29, జూన్ 2016, బుధవారం

దశావతార వర్ణనలు

దశావతారముల వర్ణనలతో శోభిల్లిన కృతులు 
మన సారస్వతమున పసిడి పాలబువ్వల గిన్నెలు. 
పురందరదాసు [1484 - 1564 ] గీతాలు 
మృదు లాలిత్య భావముల తేనె సోనలు. 
పురందరదాసు దశావతార కృతి ప్రసిద్ధి ఐనది 
;
దాసు రచన దశావతార గీతం  ;-

"పంకజముఖియ రెల్లరు బందు లక్ష్మీ – 
వెంకటరమణగారతి ఎత్తిరె ;  ||పం||
;
మత్స్యావతారగె ; మందరోద్ధారిగె ;;
ఉత్సాహది భూమి తందవగె ;
వత్సగాగి కంబదిందలి బంద ;  
ఉత్సవ నరసింహగ్రారతి ఎత్తిరె  ||పం|
;
వామన రూపది దాన బేడిదవగె ; 
రామనాగి దశశిరనను కొంద ; 
స్వామి శ్రీకృష్ణ గారతి ఎత్తిరె  ||పం||
;
బత్తలెనింతగె బైద్ధావతారగె ; 
ఉత్తమ అశ్వవనేరిదగె ;
భక్తరసలహువ పురందరవిఠలగె ; 
ముత్తైదెయ రారతి ఎత్తిరె  ||పం||  

**********************************,    
;
 ఈ కీర్తనలో దాసుల వారు 
'ఉత్తమాశ్వము నెక్కిన వానికి హారతి ' - 
అని ప్రతీక మాత్రంగా  చెప్పారు, 
'కలి / కల్కి పురుషుని పేరు'ను చెప్పలేదు.
పురుషోత్తమునికి హారతి ఒసగుతూ 
గానం చేసాడు పురందరదాసు.
'హారతులు ఎత్తుట' అని కన్నడములో - 
'ఎత్తుట’  ప్రత్యయ ప్రయోగం ఉన్నది. 
తెలుగువారు కూడా ' హారతి ఎత్తుట' అని 

కొన్ని స్థానిక ప్రయోగములుగా ఉన్నవి.
] జయదేవుడు "కల్క్యావతారా!" అని చెప్పాడు.  

;
@@@@@@@@@
;
తాళ్ళపాక అన్నమాచార్య కృతి మనకు దక్కిన మేల్బంతి. 

నారాయణ తే నమో! నమో! :-
             49 వ సంపుటి : 32 కృతి 
; @@@@@@

నారాయణ తే నమో! నమో!
నారద సన్నుత నమో నమో!  ||
;
మురహర భవహర ముకుంద మాధవ ; 
గరుడ గమన పంకజనాభ;  
పరమపురుష భవబంధ విమోచన ; 
నరమృగశరీర నమో నమో ||
;
 జలధిశయన రవిచంద్రవిలోచన;  
జలరుహభవనుత చరణయుగ;  
బలిబంధన గోపవధూవల్లభ 
నళినోదరతే నమో! నమో! ||  
;
ఆదిదేవ సకలాగమ పూజిత ; 
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీవేంకటనాయక ; 
నాదప్రియ తే నమో నమో! ||
;
AdidEwa sakalaagama puujita ; 
yaadawakula mOhana ruupa
wEdOddhara SrIwEmkaTanAyaka ; 
naadapriya tE namO namO! || 

@@@@@@
;
అన్నమాచార్యులు "కలౌ వేంకట నాయకా!" భావించారు, 
కనుక తన కృతిలో కలిని వేరేగా  తలచలేదు.  

&&&&&&&&&&&&&&&&&&&&&,

యది హరిస్మరణే శరణం మనో ;
యది విలాస కళా సుకుతూహలం ;
మధుర కోమల కాంత పదావళీం ;
శ్రుణు తద జయదేవ సరస్వతీం ||
;
జయదేవుడు సంస్కృతభాషలో వ్రాసిన అష్టపదులు రసగుళికలు. 
జయదేవుడు మాత్రం స్పష్టంగా కల్కి అవతారుని - నుతించారు. 

] ప్రళయ పయోధి జలే! 
విహిత విహిత్ర చరిత్రమ ఖేదం ; 
కేశావాధృత మీన శరీరా! 
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] క్షితిరతి విపులతరే! తవ తిష్ఠతి పృష్టే!  
ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే!
కేశావాధృత కఛ్చపరూపా! 
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] వసతి దశన శిఖరే, ధరణీ తవలగ్నా:
శశిని కళంక కలేవ నిమగ్నా :
కేశావా ధృత సూకర రూపా!!
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] తవ కర కమలే నఖ మద్భుత శృంగం;
దళిత హిరణ్యకశిపు వర భృంగం . 
కేశావా ..... ధృత నరహరి రూప!
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] ఛలయసి విక్రమణే ;  బలిమాద్భుత వామన;
పద నఖ నీర - జనిత జన పావన ;
కేశవ ... ధృత వామనరూప ;
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] ]క్షత్రియ రుధిరమయే ; జగదప గత పాపం ;
 స్నాపయసి పయసి శమిత భవ తాపం ;
 కేశావాధృత భృగు రూప
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] ] వితరసి దీక్షురణే దిక్ పతి కమనీయం ; 
దశముఖ మౌళి బలిం రమణీయం ; 
కేశావాధృత రామ శరీర ; 
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] వహసి వపుషి విశదే, వసనం జలదాభం ; 
హలహతి భీతి మిళిత  యమునాభం ; 
కేశావాధృత హలధర రూపా!
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] నిందసి యజ్ఞ విధే రహహ శృతిజాతం; 
సదయ హృదయ దర్శిత పశు ఘాతం;  
కేశావాధృత బుద్ధ శరీరా!   
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

] మ్లేచ్ఛ నివహ నిధనే ; కలయసి కరవాలం ;
ధూమకేతు మివ కిమపి కరాళం ;
కేశావాధృతకల్కి శరీరా! 
జయజగదీశ హరే!  జయజగదీశ హరే! ........ 

******************************************,
;
సీతారామ కళ్యాణం [ గీతాంజలి, రామారావు ] super hit cinema లోని 
ఈ నృత్య గీతంలో ఒక తమాషా ఉన్నది, గమనించగలరా!?
;
] జయ గోవింద! మాధవ! దామోదరా! 
జగదానంద కారణ నారాయణా! || 

]కృతులు హరించీ; జలనిధి 
సోమక దానవు ద్రుంచీ ; 
వేదోద్ధరణము చేసిన మీనాకార శరీరా! 
నమో మీనాకార శరీరా!

] పాలసముద్రము బానగ చేసి ; 
మందర శైలము కవ్వము చేసి ; 
వాసుకి కవ్వపు త్రాటిని చేసి ; 
సురదానవులు తరచగా ; 
గిరిని మూపున మోసిన కూర్మ శరీరా! 
నమో! కూర్మ శరీరా!

] పుడమిని బట్టి చాపగ చుట్టి; 
కడలిని దాగిన హిరణ్యాక్షుని కోరను గొట్టీ 
ధారుణి గాచి ; వీర వరాహశరీరా!; 
నమో! వీరవరాహశరీరా!   

] సర్వమయుడవగు నిను నిందించే ; 
హిరణ్యకశిపుని వధియించీ ; ప్రహ్లాదుని  
పరిపాలన చేసిన నరసింహాద్భుత రూపా! 
నమో! నరసింహాద్భుత రూపా!  

] సురల బ్రోవ మూడడుగుగుల నేల ; 
బలిని వేడి ; ఇల నింగిని నిండీ; 
మూడవ పాదము  బలి తల మోపిన ; 
వామన విప్ర కుమారా! 
నమో! వామన విప్ర కుమారా! ! || 

] ధరణీ నాధుల శిరముల గొట్టీ ; 
సురలోకానికి నిచ్చెన కట్టీ ; 
పరశుధరా భృగురామా! 
నమో! పరశుధరా భృగురామా!     || 

*****************************************, 
;
సీతారామకళ్యాణం - సినిమాలోని ఈ పాటలో దశావతారములు ఉండవు. అదీ చమత్కారం! 
శ్రీరామావతామునకు ముందు ఉన్న మీన, కూర్మ, నరసింహ, వామన, పరశురామ అవాతారములు మాత్రమే వర్ణితములైనవి. 

నందమూరి తారక రామారావు సునిశితదృక్కోణంలో సాగిన దర్శకత్వ ప్రతిభ - 
తెలుగు వెండితెరను -  బంగారు తెరగా మార్చిన అద్భుతం 
ఈ పాట, నాట్య, నటన, 
ఫొటోగ్రఫీ, బ్లాక్ అండ్ వైట్ లో ఐనా, 
కలర్  చిత్రాలకన్నా మిన్నగా కనువిందు చేసిన చిత్రణా నైపుణ్యానికి నిలువుటద్దం,  

=======================================,
;
#jaya gOwimda! maadhawa! daamOdaraa! 
jagadaanamda kaaraNa naaraayaNA! || 
;
kRtulu harimchii; jalanidhi 
sOmaka daanawu drumchii ; 
wEdOddharaNamu chEsina 
miinaakaara SariirA! 
namO! miinaakaara SareerA!
;
] paalasamudramu baanaga chEsi ; 
mamdara Sailamu kawwamu chEsi ; 
waasuki kawwapu traaTini chEsi ; 
suradaanawulu tarachagaa ; 
girini muupuna mOsina kuurma 
Sariiraa! namO! kuurma Sariiraa!
;
] puDamini baTTi chaapaga chuTTi; 
kaDalini daagina hiraNyaakshuni, kOranu goTTI 
dhaaruNi gaachi ; weerawaraahaSareeraa!; 
namO! weerawaraahaSareeraa!  || 
;
] sarwamayuDawagu ninu nimdimchE 2;
 hiraNyakaSipuni wadhiyimchii ; prahlaaduni  
paripaalana chEsina narasim haadbhuta ruupA! namO! 
narasim haadbhuta ruupA!  
;
] surala brOwa mUDaDugugula nEla ; 
balini wEDi ; ila nimgini nimDI; 
muuDawa paadamu bali tala mOpina ; 
waamana wipra kumaaraa! 
namO! waamana wipra kumaaraa! ! ||
;
] dharaNI naadhula n Siramula goTTii ; 
suralOkaaniki nichchena kaTTI ; 
paraSudharaa bhRguraamaa! 
namO! paraSudharaa bhRguraamaa!     || 
;
]  siitaaraamakaLyaaNam - sinimaalOni ii paaTalO daSAwataaramulu umDawu. 
Sreeraamaawataamunaku mumdu unna miina, kuurma, narasim ha, waamana, paraSuraama 
awaataaramulu maatramE warNitamulainawi. namdamuuri taaraka raamaaraawu 
suniSitadRkkONamlO saagina darSakatwa pratibha - telugu wemDiteraku bamgaaru 
teragaa maarchina adbhutam ii paaTa, naaTya, naTana, phoTOgraphii, blaak amD 
waiT lO ainaa, kalar  chitraalakannaa minnagaa kanuwimdu chEsina chitraNA 
naipuNyaaniki niluwuTaddam,  
namO! \#

*****************************,
[ - సుమ దళ ]
;
1] జయదేవుడు :- వ్యాసదళ  ; fb;- సాహిత్యం posted ;- 7:54 AM 1/25/2016 ] ;
2] సీతారామ కళ్యాణం posted :- FB ;- 8:51 AM 1/25/2016 ; రాగాలు మేళవింప
3] అఖిలవనిత  ; [Monday, January 11, 2016 ;- 
         దశావతార కృతి;పురందరదాసు ] 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...